అపకారికి ఉపకారము చేయరాదు



ఒకానొక దట్టమైన కీకారణ్యంలో ఒక పాము వుంటుండేది. దానిని చూచి అడవిలోని జంతువులన్నీ ఎంతో భయపడేవి. తనపట్ల జంతువులు చూపుతున్న భయం కేవలం తన గొప్పతనం వల్లనేనని ఆ పాముకెంతో గర్వంగా వుండేది. అందువల్ల అది కన్నుమిన్ను కానకుండా ఆ అడవిలో ఎంతో పొగరుబోతుతనంగా తిరుగుతుండేది. అది వస్తున్న చడి వినిపించేసరికి జంతువులు దాని త్రోవనుండి తప్పుకుపోతుండేవి.

అసలే విష జంతువు అందులోనూ గొప్పదానినన్న గర్వంతో ఎంతో పొగరుగా తిరుగుతున్పట్టిది. తీరా దాని కంటబడితే ఏమి మాట్లాడుతుందో ఏమంటుందో ఆ మాటల దూకుడులో పౌరుషం చెంది కాటువేస్తే, ఆ విషానికి ప్రాణాలు కోల్పోవాలి. ఎందుకొచ్చిన ముప్పు తప్పుకు తిరిగితేనే మంచిదని జంతువులేవీ దాని నరసకు రాకపోవడం వల్ల అది. తిరుగాడే పరిసరాలలో ఒక్క పిట్టయినా ఉండేదికాదు ఒంటరి అయిపోయి పాము తనుమామూలుగా తిరిగే తావులో తనకేమి తోచక ఆ అడవి మార్గాన బయలుదేరి చాలాదూరంప్రయాణం చేసింది. అంతలో ఆకస్మికంగా అది తిరుగుతున్న ప్రాంతంలో మంటలు లేచాయి.

దాన్ని తప్పుకుపోవాలన్న తొందరలో వెనక్కి మరలించి పాము, అంతలో అటు ప్రక్క కూడామంటలు వ్యాపించినాయి క్షణాలలో ఆ పాము చుట్టూవున్న పొదలంటుకుని ఆ మంటలమద్య అది ఇరుక్కు పోయింది.

బయపడేమార్గం తోచలేదు. "నన్ను రక్షించండి.. నన్ను రక్షించండి." అంటూ గట్టిగా కేకలు పెట్టనారంభించింది. ఆ అడవి మార్గాన అటు ప్రక్కగా ప్రక్క గ్రామానికి పోతున్న ఒక రైతు చెవులకా కేకలు వినబడ్డాయి. యెవరో ఆపదలో ఉన్నారని ఆ రైతు ఆ కేకలు వినబడుతున్న దిక్కుగా వెళ్ళాడు. మంటల మధ్య ప్రాణభయంతో తల్లడిల్లిపోతున్న పామును చూచాడు. అది దుష్టజంతువైనా సంకోచించకుండా, ఆ రైతు తన చేతికర్ర కొనకు సంచిని కట్టి మంటల మధ్యకు పెట్టి పట్టుకున్నాడు. బ్రతుకు జీవుడా అనుకుని ఆ పాము ఆ సంచిలో దూరింది. వెంటనే రైతాకర్రను పైకెత్తి చేతి సంచిని, మంటల కావలకు తెచ్చి నేలనుంచేడు.

ఆ సంచిలోనుంచి చర్రున ఈవలకొచ్చింది సాము ప్రాణభిక్ష పెట్టినవాడన్న ఆలోచనయినా ఆలోచించకుండా బుసలు కొడుతూ కస్సున పైకి లేచి ఆ రైతును కాటు వేసింది. పాపం రైతు పాము విషం తలకెక్కి నోట సొంగలు కక్కుతూ నేలబడి ప్రాణాలు వదిలాడు ఉపకారానికి పోయి మరణాన్ని తెచ్చుకున్నాడా రైతు, కనుక ఉపకారమే అయినా సజ్జనులకు చెయ్యాలిగాని దుష్టులకు చెయ్యకూడదు.

అపకారికి ఉపకారము చేయరాదు

మరిన్ని కథల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలివైన నక్క

దురాశ ఫలితం

బ్రాహ్మణుడు, రాక్షసుడు మరియు దొంగ

మాట్లాడే గుహ

ఎలుక బుద్ధి

తాబేలు మరియు కొంగలు

కుందేలు, పావురము మరియు పిల్లి

ఎలుక మరియు పిల్లి

కొంగ మరియు ఎండ్రకాయ

పాము మరియు బ్రాహ్మణుడు

అందని ద్రాక్ష పుల్లన

తీరిన కాకి దాహం

కుందేలుకు గర్వభంగం

బ్రాహ్మణుడు మరియు నల్లమేక

కుక్కపాట్లు

రాజు మరియు కుమ్మరి

పాము మరియు కప్పరాజు

నక్క మరియు తాబేలు

పెరిగిన వాతావరణం

పరోపకారి హంస

ఏనుగు మరియు పిచ్చుకల కథ

తెలివి తక్కువ ఒంటె

జ్ఞానోదయం

మానవ జీవితం

స్వార్ధం

బుద్ధిబలం

ఆత్మ విశ్వాసం

గర్వం

ఎత్తుకు పై ఎత్తులకి

క్రమశిక్షణ

మొదటికే మోసం

పనికిమాలినవాళ్ళు

కష్టార్జితం కానిది...

ఆశపోతు నక్క కథ

తెలివి తక్కువ కోతి

దానధర్మాలు

అంతా మన మంచికే

అత్యాశ

విలువ

ఓర్పే శ్రీరామరక్ష

అద్దం

ప్రదక్షణ

అల్లరి చేసే గాడిద

ముగ్గురు స్నేహితులు

రాజధర్మం

గురుదక్షిణ

పొగరు

శకునం

పుర్రెతో పుట్టిన బుద్ధి

మతి మరుపు

సీతయ్య మందబుద్ధి

పిసినారి

మట్టిబుర్ర

పరమానందయ్యగారి మూడో శిష్యుడు

పిచ్చి

మంత్రపుష్పం

అసూయ

లోభి

జోలి మాలిన పనికి పోరాదు

కోపం తెచ్చే అనర్ధం

సోమరి

మహా బలుడు

అబద్ధం

దురాశ దుఃఖానికి చేటు

బుద్ధి హీనులు

అమాయకుడు

మూర్ఖులు

గొప్పలకు పోరాదు

తనకుమాలిన ధర్మం

ఆలోచనే విజయానికి సోపానం

మూర్ఖుడితో చెలిమి

మనోయజ్ఞం

మోసానికి మోసం

కోరికల చిట్టా

రాజనర్తకి

చెప్పి చేసిన మోసం

జమీందారుగారి పడవవాడు

బహుమతికి కారణం

భగవద్గీత

మెదడులేని సింహం

పిల్లల తెలివి

అనుభవాన్ని మించిన పాఠం లేదు

అహంకారం

కలసి వుంటే కలదు సుఖం

చిలక చాతుర్యం

ఏకాగ్రత

నిదానమే ప్రదానం

గంప కింది కోళ్ళు

జరిగిన పొరపాటు

చత్వారం

చిలుక పలుకు

తేలు కుట్టిన దొంగ

కలవర మనసు

పెద్దల ఎన్నిక

పిచ్చి పుల్లయ్య


మార్పు

మానవత్వం

తెలివి

అనువుగాని చోట

పందెం తెచ్చిన మార్పు

వ్యక్తిత్వం

మంచితనం

దురుసుతనం

Responsive Footer with Logo and Social Media