బుద్ధిబలం


ఒకసారి నారదుడు కైలాసానికి ప్రయాణమౌతూ మ౦చి మామిడిపండు కైలాసానికి తెచ్చాడు. అక్కడ ఆడుకుంటున్న గణపతిని, కుమారస్వామిని పిలిచాడు. "ఏమి నారదా!?" అని వచ్చిన గణపతి నారదుని చేతిలోని పండుని చూసి, దాన్ని లాక్కోబోతుండగా కుమారస్వామి వచ్చి ఆ పండు నాదంటే నాదని' ఇద్దరూ పోట్లాడుకోసాగారు. అప్పుడు. నారదుడు "మీ ఇద్దరికీ ఓ పోటీ పెడుతున్నాను.
అందులో ఎవరు గెలిస్తే వారికే ఈ పండు" అని అన్నాడు. ఇంకేముంది కుమారస్వామి నెమలి వాహనంతో వచ్చి "ఏమిటో త్వరగా శెలవియ్యండి స్వామీ!" అని అడిగాడు. ఈ ప్రపంచంలోని భూమంతటినీ ఎవరు చుట్టి వస్తారో వారికే ఈ పండునిస్తాను అన్నాడు నారదుడు.
ఇక కుమారస్వామి నాదే విజయం అని హుషారుగా నెమలిపై ముందు బయల్దేరాడు వినాయకుడు "గౌరీ శంకరా!" అని పిల్చాడు. వెంటనే అక్కడికి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. వారి ఇరువురి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి నమస్కరించడంతో కుమారస్వామి ఎక్కడికెళ్ళనా అతడికన్నా ముందు వినాయకుడు వెళ్తున్నట్లు కన్పించింది. వెంటనే నారదుడు మామిడి పండును వినాయకుడికిచ్చాడు వినాయకుడిది బుద్ధిబలం కుమారస్వామిది శక్తిబలం.
శక్తి బలం కన్నా బుద్ధిబలం ఎంతో గొప్పది.

Responsive Footer with Logo and Social Media