తేలు కుట్టిన దొంగ


కిరణ్ డిగ్రీ విద్యార్థి వాడు తలపెట్టిన పని ముందుగా ఆలోచించి పథకం ప్రకారం చేసి విజయం సాధించేవాడు. దాంతో కిరణ్ తాను చాలా తెలివైనవాడ్ని అని గర్వపడుతూ వుండేవాడు.
కిరణ్ తండ్రి వడ్డీ వ్యాపారి, డబ్బు ఖర్చు విషయంలో చాలా పొదుపరి, ఆయన ప్రతీ సంక్రాంతి పండక్కి కిరణ్ కి ఒక జత బట్టలు కుట్టించుకోవటానికి డబ్బులు ఇచ్చేవాడు. ఈసారి పండక్కి తండ్రి దగ్గర రెండు జతల బట్టలకు డబ్బు వసూలు చేయాలని కిరణ్ పథకం వేశాడు.
కిరణ్ ను చూసి "ఏరా..! బట్టలు కొనలేదా? అని తండ్రి అడిగాడు కిరణ్ దిగులుగా ముఖంపెట్టి తండ్రితో "బజార్లో జేబు దొంగ డబ్బును కాజేశాడు" అని చెప్పాడు. ఆ మాటలకు తండ్రిమండిపడుతూ డబ్బు విషయంలో నీకు బొత్తిగా జాగ్రత్త లేదు అంటూ కిరణ్ ని నానా తిట్లుతిట్టాడు తండ్రి తిట్లకు కిరణ్ మరింత బిక్కముఖం పెట్టాడు. కిరణ్ పరిస్థితి చూసి ఆయన పండగ దగ్గరకొచ్చాక మరో జత బట్టలకు డబ్బులిస్తాన్లే అని కొడుకును సముదాయించాడు.
తాను పన్నిన వలలో తండ్రి పడినందుకు కిరణ్ లోలోపల సంతోషిస్తూ "అలాగే నాన్నా!"అన్నాడు. ఆ తర్వాత కిరణ్ దాచిన డబ్బుతో ఓ జత బట్టలు కొని, వాటిని రహస్యంగా ఇంట్లోనిపాత బట్టల పెట్టెలో దాచాడు. పండగ దగ్గర పడింది. కిరణ్ బట్టల విషయం గుర్తుచేశాడు.
తండ్రికి, ఆయన చిరాగ్గా వ్యాపారం నష్టంలో వుంది. బట్టలు సంగతి తర్వాత చూద్దాం అన్నాడు తండ్రి మొండి మనస్తత్వం తెలిసిన కిరణ్ డబ్బు పోయిందని చెప్పి కొన్ని జత బట్టలతో సరి పెట్టుకోవచ్చులే అని భావించాడు. ఆ మర్నాడు కిరణ్ కాలేజినుండి ఇంటికి తిరిగివచ్చేటప్పటికి వాడికి బల్లపైన ఒక క్రొత్తస్టీలు బిందె కన్పించింది. అదిచూసి కిరణ్ ఈ క్రొత్త స్టైల్ బిందె ఎక్కడిది. అని తల్లిని అడిగాడు.
పాత బట్టలకు స్టీల్ సామాన్లు ఇచ్చేవాడు వస్తే పెట్లో వున్న పాతబట్టలన్ని ఇచ్చి ఈ క్రొత్త స్టిల్బిందె కొన్నానని చెప్పింది. వెంటనే కిరణ్ పాత బట్టలపెట్టె తెరిచి చూశాడు. క్రొత్త బట్టల అత కన్పించలేదు. దాంతో కిరణ్ తాను వేసిన ఎత్తు ఫలించకపోగా అసలుకే ఎసరు వచ్చిందనిబాధపడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తన తెలివితక్కువతనం బయటపడుతుందనికిరణ్ తేలు కుట్టిన దొంగలా కిక్కురుమనలేదు.

Responsive Footer with Logo and Social Media