చెప్పి చేసిన మోసం


రాజీవుడనే అతడికి కచేరీలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరిన మొదటి రోజన అక్కడే పనిచేస్తున్న రాఘవ అనే అతను రాజీవుడితో "ఇదిగో చూడు..! ఈ కచేరీలో చాలా జాగ్రత్తగా వుండాలి డబ్బులు కనబడితే చాలు అప్పులు అడుగుతారు. అప్పమాత్రం త్వరగా తీర్చరు!" అని హెచ్చరించాడు.
ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య స్నేహం పెరిగింది. నెలాఖరున అందరికీ జీతాలిచ్చారు. తననెవరైనా అప్పు అడిగితే కుదరదని చెబు దామని రాజీవుడు గట్టిగా నిర్ణయించు కున్నాడు. అయితే రోజులు గడుస్తున్నా తనని ఎవరూ అప్పు అడగలేదు.
ఒకరోజు రాఘవ, రాజీవుడు బజారుకు సరుకులు కొనటానికి బయల్దేరారు. రాఘవ కావాల్సిన సరులు తీసుకుని మొత్తం ఎంతివ్వాలో చెప్పమన్నాడు కొట్టువాడ్ని. కొట్టువాడు చెప్పిన మొత్తానికి అతడి దగ్గర యాభై రూపాయలు తక్కువగా వున్నది.
అప్పుడు రాఘవ. రాజీవుడితో తీసుకున్న సరుకులు ఇచ్చేయడమెందుకు ఓ. యాభై రూపాయలు సర్దు. రేపు కచేరీకి దాగానే ఇస్తాను అన్నాడు. రాజీవుడు సరేనని ఇచ్చాడు.
అయితే ఎన్ని రోజులు గడిచినా రాఘవ తను తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోయేసరికి రాజీవుడు దాని సంగతి అడిగాడు.
వెంటనే రాఘవ "అదేమిటి? నేను ముందే చెప్పాను కదా! ఈ కచేరీలో అప్పులిస్తే అంత త్వరగా వసూలవ్వవని కొన్నాళ్లు ఓపిక పట్టు. నా దగ్గరున్నప్పుడు ఇస్తాను" అన్నాడు.

Responsive Footer with Logo and Social Media