ఆలోచనే విజయానికి సోపానం
శ్రీనాథుడు తన జీవితకాలమంతా ఎంతో దర్జాగా గడిపిన ఏకైక తెలుగుకవి. ఈ పండితుడు ఏ రాజస్థానాలలోనికి వెళ్లినా, గ్రామాంతరాలకు వెళ్ళినా మరే పనిమీద అవతలకు, వెళ్ళినా సవ్వారిమీద వెళ్ళేవాడు సంపన్నుడు కావటంవల్ల సవ్వారిని మోసేటందుకు కొందరు బోయీలను జీతాలిచ్చి పోషించేవాడు పాడిపంటలకు, సిరిసంపదలకు ఏవిధమైన లోటూ
లేని ఆ మహాకవి ఇంట ఎంతోమంది నౌకర్లుండేవారు. ఆయన జీవితం మహారాజ భోగాలతో
సాగుతుంది.
శ్రీనాధుని పాడి పశువులలోని ఒక ఆవు తప్పిపోయింది అది ఎంతకూ ఇల్లు చేరలేదు. బోయీలు తప్ప నౌకర్లు మరెవ్వరు అప్పుడింటిలో లేరు. అందువల్ల శ్రీనాథుడా బోయీలను పిలిచి "నాయనలారా మన కర్రి ఆవు త్రోవదప్పి ఎక్కడో చిక్కు పడిపోయింది. కనుక మీరు నలుగురు నాలుగుప్రక్కలకూ పోయి దానిని వెదకి తీసుకురండి " అని చెప్పాడు.
అప్పటికి చాలారోజులుగా ఇంటివద్దనే ఊరికే కూర్చుని ఉంటున్న ఆ బోయీలు బద్దకించి, ఆ పని చెయ్యటం తమకు తగిన పని కాదని అభిమానపడి "స్వామీ! మేము బోయీలము కాని పాలేరులము కాము. అది మా పని కాదు సవ్వారి మోయుటయే మా పని మాకు మరొక పని చెప్పుట పాడికాదని పండితులు తమురెరుగరా? దయచేసి మాకాపని చెప్పకండి" అన్నారు. వారి మాటలను విన్న శ్రీనాధుడు సోమరులై వారలా అంటున్నారని గుర్తించి, వారికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు.
"బోయిలూ! మీరన్నమాట నిజమే మీకు మరొకపని చెప్పట అనుచితమే ఇంట పాలేరు లెవ్వరు లేరు . అవును వెతకుకొనుట నాకు తప్పుడు గదా! కనుక నేనే బయలు దేరుతాను. నా సవారిని సిద్ధం చెయ్యండి" అని చెప్పి శ్రీనాధుడు పశువు కొరకు పల్లకీలో బయలుదేరాడు. పాపమా బోయీలు పల్లకీని మోస్తూ ఊరంతా ఎంత తిరగసాగినా ఆవు దొరకలేదు. వీధి కాదని ఆ వీరు ఆ వీధి, కాదని మరో వీధి ఇక్కడకు అక్కడకు అని శ్రీనాధుడు. వెళ్లమంటున్న తావులకల్లా వెళ్ళారు.
ఎంతకూ ఆవు కనబడలేదు పాపము బోయీలు అలసిపోయారు. "స్వామీ! ఇక మేం తిరగలేం" అన్నారు. "అదేమన్న మాటయ్యా నవారి : మొయ్యడానికే కదా మీకు నేను జీతమిస్తున్నది, మరో పనేది మీకు నేను చెప్పలేను కదా! మీ పనిని మీరు చెయ్యనంటే ఎలా?. ఆవు దొరికే పర్యంతం నన్ను మీరు నలుప్రక్కలకు తీసుకు వెళ్లవలసిందే" అన్నాడు.
మరోమాట చెప్పలేక వాళ్లు పల్లకీని మోస్తూనే వున్నారు. శ్రీనాధుడు ఇటు, అటు, వేగంగా అంటూ వాళ్లను తిప్పుతూనే వున్నాడు బోయీలకు ఓసికపోయింది. అడుగు వెయ్యలేక పోతున్నారు. ఆయన వెళ్ళమన్నప్పుడు అవును వెదకడానికి వెడితేనే బాగుండేది. మోత బరువు కూడా పెట్టుకున్నాం అని పశ్చాత్తాపపడ్డారు.
తమ పారపాటును తెలుసుకొన్న బోయీలు "దొరా! సుమ్మన్ని మన్నించండి. తొందర పడి తమతో అవిధేయతగా మాట్లాడాం తిరిగి వెతికితే తిరేదానికి మాటకారి మెడమీదకు బరువు కూడా తెచ్చుకున్నాం. నూకు బుద్ధి వచ్చింది. మేమే తిరిగి వెదకి ఆవును ఇంటికి చేరుస్తాం ఇక ఎప్పుడు మా పని కాదని తప్పించుకోం మమ్మల్ని క్షమించండి" అన్నారు. శ్రీనాదుడు వాళ్ళకు బుద్ధచ్చినందుకు ఆనందించి ఇంటికి చేరుకున్నాడు. బోయీలు సవారీని ఇంటిదగ్గర వదలి ఆవును వెదకేటందుకు నలుగురూ నాలుగు దిక్కులకు బయలుదేరారు వెతకి అవును పట్టుకుని ఇంటికి తెచ్చారు. వారిని చూచి శ్రీనాధుడు "ఇలా సునాయాసంగా తీరేదానికి మరింత బాధను మాటజా రి తెచ్చుకున్నారు. ఇది నా పని, వాడి పని అని వాదులాడుకోవడం కన్నా. ఆ పని యేమిటో ఆలోచించు కుని పని చెయ్యాలి. పని ఎగవెయ్యడానికి కుంటి సాకులు చెబితే తంటా తప్పదు" అని ప్రబోధించాడు.