రాజనర్తకి


అవంతి నగరానికి, కునును పురానికి సత్సంబంధాలుండేవి. అవంతి రాజనర్తకి కౌముది. రాజాజ్ఞను పురస్కరించుకుని కుసును పురానికెళ్ళి అక్కడ జరిగిన ఉత్తనాల్లో నాట్యం చేసింది. ఆమె అవంతి నగరానికి తిరిగి వస్తూ మార్గమధ్యంలోని అడవుల్లో వున్న బందిపోట్లకు దొరికిపోయింది. రొముÀ వెంటవున్న సైనికులు, బందిపోట్లను ఎదిరించి పోరాడలేక ఓడిపోయారు.
బందిపోట్లు రాజనర్తకిని ముఠానాయకుడి దగ్గరకు తీసుకెళ్లారు. ఆమె ముఠా నాయకుడితో "నేనెవరనుకున్నావ్? అవంతి రాజనర్తకిని. మీరు నన్ను బంధించారని మహారాజుకు తప్పక తెలుస్తుంది. ఆయన సైన్యాన్ని వంపి మిమ్మల్ని సర్వనాశనం చేస్తారు. అన్నది
బందిపోట్లు ఆమె మాటను నమ్మలేదు. ఏదో సాధారణ నగరవాసి అనుకున్నారు. వారిలో ఒకడు "నువ్వు రాజనర్తకివా? ఇంకా నయం సాక్షాత్తూ మహారాణినే అనలేదు" అన్నాడు.
ఇది విని అందరూ నవ్వారు. బందిపోట్ల ముఠానాయకుడా మెతో "సరే! నువ్వు మా ముందు నాట్యం చేసి రాజనర్తకివని నిరూపించుకో" అన్నాడు. ఇందుకు రాజనర్తకి పట్టడాని కోపంతో 'ఛీ మీలాంటి అడవి మనుషులముందు నాట్యం చేయడమా? నేను నాట్యం చేసేది రాజాస్థానాలలోనే నా ప్రాణం తీసినా సరే. నేనిక్కడ నాట్యం చేయను" అంది.
ఈ జవాబు వింటూనే బందిపోటు ముఠానాయకుడు ఉలిక్కిపడి, "అవును! ఈమె నిస్సందేహంగా రాజనర్తకే. వృత్తివిలువ తెలిసిన నిజమైన కళాకారిణి, ఈమెనూ ఈమె వెంట వచ్చిన వరివారాన్ని నగౌరవంగా అడవిని దాటించండి" అని తన అనుచరుల్ని ఆజ్ఞాపించాడు

Responsive Footer with Logo and Social Media