జోలి మాలిన పనికి పోరాదు


ఓ చాకలివాడు ఓ కుక్కని, ఓ గాడిదని పెంచేవాడు. తను బట్టలు వుతకడానికి గాడిద వీపు మీదపెట్టి చెరవు గట్టుకు పోయేవాడు. రాత్రివేళల్లో కుక్క యజమాని ఇంట్లోకి ఎవ్వరురాకుండా కాపలా కాసేది.

ఇలా జరుగుతుండగా ఒకనాటి రాత్రి ఒక దొంగ చాకలివాడు ఇంట్లోకి వెళ్లి విలువైన వస్తువులన్నీ మూటగట్టాడు, ఇదంతా చూస్తున్న గాడిదకు మనసు మనసులో లేకుండా పోయింది. ఆ సమయంలో తన స్నేహితుడు కుక్క గుర్రుపెట్టి నిద్రపోతుంది. అందువల్ల తనుకూడా చూస్తూ ఊరుకుంటే యజమాని ఇల్లంతా దొంగ దోచుకుంటాడని గ్రహించి గాడిద గట్టిగా ఓండ్ర పెట్టడం మొదలు పెట్టింది. ఈ అలికిడికి దొంగ కాస్తా జారుకున్నాడు.

అలా నిశిరాత్రివేళ గాడిద ఓండ్ర పెట్టడంతో ఆగ్రహించిన చాకలివాడు వెంటనే ఓ దుడ్డుకర్రను తీసుకొని తన నిద్ర పాడు చేసినందుకు గాడిదను విపరీతంగా కొట్టాడు. ఆ దెబ్బలకు గాడిద, గట్టిగా అరుస్తూ చనిపోయింది. జోలిమాలిన పనికి పోరాదనడానికి ఈ కథ ఉదాహరణ ఎవరు చేయాల్సినపని వారే చేయాలన్న ఈ కథ సారాంశం .

Responsive Footer with Logo and Social Media