Subscribe

మెదడులేని సింహం


ఒక అడవిలో గుహలో ముసలి సింహం నివశిస్తోంది. ఒకసారి దాని కాలికి గాయమవటంతో నడవలేకపోయింది దాంతో వేటాడి జంతువున్ని తినలేకపోయింది. ఆ సింహానికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. రోజుకొక జంతువుకు మాయ మాటలు చెప్పి తన వద్దకు ఆహారంగా తీసుకురావటానికి తెలివైన మంత్రిని నియమించాలనుకున్నది.
సక్క భావను తన మంత్రిగా నియమించుకుని రోజుకో జంతువును తన వద్దకు తీసుకురమ్మని పురమాయించింది. మొదట గాడిదను తోలుకు రమ్మని ఆదేశించింది. గాడిద మెదడు తినాలని ఎప్పట్నుంచో కోరికగా వున్నట్లు సింహం చెప్పింది. నక్క బావ అడవంతా వెదకి సాయంత్రానికల్లా ఒక గాడిదకి మాయమాటలు చెప్పి సింహం వద్దకు తోలుకుని పోయింది.
గాడిదను చూడగానే సింహం దానిపై పడి -చంపేసి మెదడు తినబోయింది.నక్కబావకు కూడా ఎప్పట్నుంచో గాడిద మెదడు తినాలన్న కోరిక వుందిసింహానికి మాయ మాటలు చెప్పి తన కోరికతీర్చుకోవాలనుకుంది.
సింహం గాడిద తల పగలగొట్టగానే నక్క కలగజేసుకుని "మృగరాజా! నీ ఒంటిపై రక్తం పడింది. స్నానం చేయకుండా ఎలా తింటావు. ప్రక్కనే ఉన్నకొలనులో స్నానం చేసివచ్చి తిను అంది . నక్క "మాటలు విని సింహం కొలనులోకి వెళ్ళింది . అదికొలనులో స్నానం చేసి వచ్చేలోగా నక్కబావ గాడిద మెదడును తినేసింది. సింహం వచ్చి ఎంత వెతికినా మెదడు కన్పించలేదు. "ఎవరైనా ఇటువైపు వచ్చి గాడిద మెదడు తిన్నారా?" అని నక్కను ప్రశ్నించింది.
నక్కబావ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ "మృగరాజా! మీరు చంపిన గాడిద ఒక బుద్ధి హీనమైన జంతువు. బుద్ధి హీనులకు మెదడుండదు. ఆ కారణంగా గాడిదకు మెదడు లేదు" అని చెప్పింది.
సక్కమాటలు విన్న సింహం నిజమేనని నమ్మి గాడిద దేహాన్ని భుజించసాగింది. నిజానికి మెదడులేనిది సింహానికేనని తెలిసి నక్క ముసి ముసిగా నవ్వుకుంటూ మరో జంతువుకు మాయ. మాటలు చెప్పేటందుకు బయల్దేరింది.

Responsive Footer with Logo and Social Media