గంప కింది కోళ్ళు
చిట్టయ్య అనేవాడు చింత బరికె తీసుకొని పదేళ్ళ కొడుకు నీపు మీద కొడుతూ ఉన్నాడు . బాబు కేకలు పెడుతున్నాడు. ఆ దారిన వెళ్తున్న దర్శయ్య అనే వ్యక్తి అదిచూసి చిట్టయ్యను సమీపించి చింతటరికె లాక్కుని, "చిన్న పిల్లవాడ్ని ఎందుకలా కొడుతున్నావ్.?" అని నిలదీశాడు.
"అయ్యా! మీకేం తెలియదు తప్పుకోండి రెండు గంపక్రింది కోళ్లని బయటకి వదలొద్దురా అని ?ఎన్నిసార్లు చెప్పినా వీడు వివడు" అన్నాడు చిట్టయ్య కోపంగా ఊగిపోతూ."పిల్లవాడు గంపక్రింది కోడిని వదిలేస్తే ” ఇప్పుడేమైంది? ఏ గద్దో తన్నుకు పోవ డమో, కుక్క ఏదైనా నోట కరుచుకు
పోవడమో జరిగిందా? అని అడిగాడు ధర్మయ్య. "అలాంటిదేం జరగలేదు బాబూ! చింతటరికె ఇటివ్వండి" అని కొడుకుకేసి గుడ్లురిమి చూశాడు చిట్టయ్య.
ధర్మయ్యకు చిట్టయ్య మాటలు మరీ అసందర్భంగా తోచి 'చిట్టయ్యా! కాస్త శాంతపడు. మేతమేసినా కోళ్ళు నీ ఇంటిని వెతుక్కుంటూ అనే తిరిగివస్తాయి. కదా! మరెందుకీ పిచ్చికోపం?" అన్నాడు.
"అన్నీ ఎలా తిరిగివస్తాయి? వాటిల్లో రెండే నావి , మిగతాని దేని యజమాని ఇంటికి అవి పోతాయి" అన్నాడు చిట్టయ్య.
ఆ జవాబుతో చిట్టయ్య వద్ద అసలు సంగతి తెలుసుకున్న దర్మయ్య "అదా అసలు రహస్యం!. ఈ మధ్య ఊళ్ళో వాళ్ళ కొళ్ళతోపాటు నావి కొన్ని కనబడకుండా పోయాయి. పద గ్రామాధికారి: దగ్గరకు! ఈ చింత బరికె నీ వీపు మీద ఎన్ని దెబ్బలకు విరిగిపోతుందో ఆయనే చూస్తాడు" అంటూ చిట్టయ్యను గ్రామాధికారి వద్దకు లాక్కుపోయాడు.