పరమానందయ్యగారి మూడో శిష్యుడు


పరమానందయ్యగారు మళ్ళీ పుట్టారు. ఈసారి గురుకులంలో విద్యాబోధన కాకుండా ఓ చిన్న పల్లెటూల్లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా చేరి, ఆ ఊర్లోనే చిన్న పెంకుటింట్లో అద్దెకుంటున్నారు.

నందయ్య అనే శిష్యుడు అమ్మగారు, అయ్యగారు చెప్పిన పనులన్నీ చేస్తుండేవాడు. "నందయ్యా! మా నాన్న దగ్గుమందు అయిపోయిందిరా... దగ్గుకి నుందివ్వమని హాస్పిటల్లో అడిగి తీసుకురా!" అని మొదటి పనిని శిష్యుడికే అప్పగించాడు ఖాళీసీసా ఇస్తూ పరమా నందయ్యగారు. శిష్ముడు హాస్పటల్కి వెళ్ళి దగ్గుకి, మందు కావాలన్నాడు. దానికి డాక్టర్ దగ్గుకి మందెందుకు బాబూ ఇంజెక్షన్ ఇస్తాను అన్నాడు. "అలాగే ఇవ్వండి!" అన్నాడు శిష్యుడు, సిరంజినిండా తగు మోతాదు మందు తీసి ఇంజెక్షన్ ఇచ్చి పంపేశాడు డాక్టర్.

ఖాళీసీసాతో శిష్ముడు ఇంట్లో అడుగు పెట్టేసరికి "ఏమైందిరా?" అని అడిగి, విషయం తెలుసుకుని "దగ్గు మా నాన్నకి అయితే నువ్వు ఇంజెక్షన్ తీసుకోవడమేమిట్రా? వెర్రి వెధవా నిజంగానే పరమానందయ్య శిష్ముడవనిపించుకున్నావు. నీలాంటి బడుద్ధాయి శిష్యులతో ఎలాగరా వేగేది" అని చొక్కా చింపుకుని జుట్టు పీక్కున్నాడు పరమానందయ్య .శిష్యుడు పుచ్చుకున్న ఇంజక్షన్ వికటించి ఏ ప్రాణం మీదకొస్తుందో అని శిష్యుడిని తీసుకొని హాస్పటల్ వైపు పరుగులు తీసింది గురువుగారి భార్య.

Responsive Footer with Logo and Social Media