మూర్ఖుడితో చెలిమి
ఒకప్పుడొక వర్తకుడు తన ప్రక్క గ్రామానికి సరుకులు కొనుక్కోవాలని బయలుదేరాడు. కొండమార్గం కావడం వల్ల ఎక్కువదూరం కావడం వల్ల ఎంత నడిచినా గ్రామం చేరలేకపోయాడు. త్రోవలో అతనికొక బాటసారి తగిలాడు. అతడు అతిమూర్ఖుడు అయినా త్రోవలో తోడుగా ఉంటాడని, వర్తకుడు అతనితో జత కలపి ప్రయాణం చేస్తున్నాడు.
చీకటి పడిపోయిందేగాని వారు చేరవలసిన ఊరు దరిదాపులకైనా చేరలేక పోయారు. అసలే అడవి మార్గం, దొంగల భయం కూడా ఉన్న౦దువల్ల ప్రయాణం ముందుకు సాగించడం మంచిదికాదని నిర్ణయించుకున్నారు. అంతలో. వారికో పాడుబడిన గుడి కనిపించింది. ఇద్దరూ కలసి అక్కడే పడుకుని తెల్లవారుజామున బయలుదేరడానికి నిర్ణయించుకున్నారు.
మూర్ఖుడు మండపంలోనే పడుకున్నాడు. దగ్గర డబ్బున్నందువల్ల భద్రంగా పడుకోవాలని షావుకారు గుడిలోపల నిగ్రహం చాటున పడుకున్నారు.
కొంత రాత్రయ్యేసరికి కొందరు దొంగలాగుడికి వచ్చేరు. దోచుకొచ్చిన సొమ్ము పంచుకునేటందుకు అక్కడకు చేరిన దొంగలకు వరండాలో పడుకున్న మూర్ఖుడు అడ్డుగా కనబడ్డాడు. అందుకు వాళ్ళ విసుక్కొని, వీడెవడో దరిద్రుడు తయారయ్యాడిక్కడ మనకు అడ్డు అని విసుక్కున్నారు. తెలివి గావున్న మూర్ఖుడది విన్నాడు. అతడికి ఎక్కడలేని కోపం వచ్చింది. చివాలున లేచి కూర్చొని "ఏమయ్యా ఎంతోస్తే అంత మాట్లాడెయ్యడమేనా. ఈ రాత్రికి పడుకొని పోయేవాడ్ని మీకేం అడ్డురాను నేనిలా ఈ వారకు జరిగి పడుకుంటాను మీరు మీ చోట్లోనే పడుకోండి. ఎంత మీ చోటయినా అంత ఇది పనికిరాదు. మంచి మర్యాద ఉండాలి. అనవసరంగా తెలిసీ తెలియక మాట్లాడెయ్యడం మీకు ధర్మం కాదు. నేను దరిద్రుడా? వరహారొంటిలో వున్న నేను దరిద్రుడ్నెలా అవుతాను తెలిని తక్కువ మనుషుల్లా ఉన్నారు పోయి పడుకోండి" అన్నాడు.
అతడి ఆశ్రర్యంతో చూస్తున్న దొంగలు అతని దగ్గర వరహా ఉన్నదన్నమాట. వినేసరికి చటాలున అతడ్ని పట్టుకుని ఆ వరహా దోచుకున్నారు. అందులో ఒకడా వరహాను పరిశీలిస్తుంటే, "ఏం పెద్దమనుషులయ్యా మీరు మీ తావులో పడుకున్నానని "నన్ను దరిద్రుడని తిట్టేరా! నేను దరిద్రుడ్ని కాదు, వరహా వున్న సంపన్నుడని అంటే నన్ను ఒక్కడ్ని చేసి మీరు నలుగురూ ఆ డబ్బు దోచుకుంటారా! దోచింది చాలక అది సత్తుడో, మంచిదో అని పరీక్షించి నన్ను అవమానిస్తారా నేను మీ కంటికి దగా మనిషిలా కూడా కనిపిస్తున్నానన్న మాట. నాణెం పరీక్ష చెయ్యడం చేతకాకపోతే విగ్రహం వెనక పడుకున్న షావుకారును లేపి పరీక్ష చేయించుకోండి " అన్నాడు.
వీడుగాక మరొకడు కూడా వున్నాడన్నమాట అని దొంగలు గుళ్ళోకి వెళ్లి షావుకారిని రెక్కలు విడిచి కట్టి తెచ్చి అతని దగ్గరి రొక్కమంతా అపహరించారు. "ఈ మూర్ఖుడితో స్నేహం చేయడం వల్లగదా, నేనెంత జాగ్రత్త పడ్డప్పటికి నాకు ముప్ప తప్పలేదు" అనుకుని షావుకారు ఎంతగానో దుఃఖించారు.