వ్యక్తిత్వం


ఓ రోజు ఓ అమెరికా దేశపు గొప్ప వ్యాపారస్తుడు ఓడలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. అతడి వద్ద బంగారం గడియారంతోపాటు ఎక్కువ విలువ చేసే వస్తువులున్నాయి.
అతడికివ్వబడిన గదిలో భారతీయ వ్యాపారస్తుడు కూడా వున్నాడు. అతడు బట్టతల బారు మీసాలు,విశాలనేత్రాలతో చూడటానికి గంభీరంగా వున్నాడు అమెరికా వ్యాపారస్తుడికి అతడి ఆకారం నచ్చలేదు. పైగా అతడికి తన గడియారం, విలువైన వస్తువులు భద్రంగా వుండవేమోనన్న అనుమానం కూడా కలిగింది. వాటిని భద్రపర్చటం చాలా ముఖ్యమని భావించాడు.
అమెరికా వ్యాపారస్తుడు ఓడ కెప్టెన్ వద్దకెళ్ళి "సార్ నా వద్ద బంగారపు గడియారంతో పాటు విలువైన వజ్రాలు, నగలు, విలువైన బహుమతులు వున్నవి. నా గదిలో నాతోపాటు
ప్రయాణం చేస్తున్న ఇండియా వ్యాపారస్తునిపట్ల నాకంత నమ్మకం కలగటం లేదు. అయినా అనుమానంతో వుండకూడదని నా విలువైన వస్తువులను మీ సేఫ్ లో వుంచుకుంటే నాకెంతో మేలు చేసిన వారవుతారు!" అని అన్నాడు.
"దాన్దేముంది సార్.. మీరు తప్పకుండా వాటిని మా సేఫ్ లో దాచుకోండి. ఐతే ఇండియా వ్యాపారస్తుడు మీ కన్నా ముందుగా వచ్చి తన నిలువైన సామాన్లని మా సేఫ్ పెట్టాడు. ఐతే అతడు మీపై అనుమానంను ప్రకటించలేదు" అని చెప్పాడు ఓడ కెప్టెన్. దాంతో మనిషి రూపం కాదు .ప్రధానం అని అమెరికా వ్యాపారస్తునికి అర్ధమై సిగ్గుతో తలదించుకున్నాడు. మనిషికి బహ్మరూపం కన్నా అంతర్ వ్యక్తిత్వం చాలా ఉత్తమమైనది.

Responsive Footer with Logo and Social Media