పేజీ సంఖ్య - 30

ప్రశ్న మరియు ఆర్డర్

ప్రశ్న: "అందరూ ఇష్టపడే ఆర్డర్?"

జ: "మనీ ఆర్డర్."



ప్రశ్న మరియు బుద్దిమంతుడైన భక్తుడు

ప్రశ్న: "బుద్దిమంతుడైన భక్తుడు?"

జ: "తన కోరిక తీర్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పడానికి గుడికి వెళ్ళేవాడు."



ప్రశ్న మరియు స్నేహితుడు

ప్రశ్న: "స్నేహితుడు తెల్లబోయేది ఎపుడు?"

జ: "చిరాయువుగా ఉండాలంటే ఏం చెయాలి అని అడిగితే స్నేహితుడు పాపాలు చేయాలి అని చెప్పినపుడు."



ప్రశ్న మరియు టీవీ పిచ్చోడి

ప్రశ్న: "టీవీ పిచ్చోడి కల?"

జ: "తనకు వచ్చే కల మద్యలో అడ్వర్టైజ్మెంట్లు రావడం."



ప్రశ్న మరియు హీరోయిన్

ప్రశ్న: "హీరోయిన్ తెల్లబోయేది ఎపుడు?"

జ: "బట్టలు మరీ చిన్నవిగా ఉన్నాయేం అని అడిగితే నిర్మాత మనది లో బడ్జెట్ సినిమా కదయ్యా అని చెప్పినప్పుడు."



ప్రశ్న మరియు డాక్టర్

ప్రశ్న: "డాక్టర్ అవాక్కయేది ఎప్పుడు?"

జ: "కడుపులో మంటగా ఉందా, ఎప్పట్నుంచి అని అడిగితే పేషెంట్ పక్కింటా వాళ్ళు కారు కొన్నప్పట్నుంచి అని చెప్పినపుడు."



ప్రశ్న మరియు ప్రేమికుడు

ప్రశ్న: "ప్రేమికుడు అవాక్కయేదెపుడు?"

జ: "నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ కిష్టం అయితే పెళ్ళిచేసుకుంటాను అంటే ఆ యువతి మా ఆయన ఒప్పుకోవాలిగా మరి అన్నపుడు."



ప్రశ్న మరియు స్నేహితురాలు

ప్రశ్న: "స్నేహితురాలు తెల్లబోయేది ఎప్పుడు?"

జ: "మా ఆయన క్లబ్బుకెళ్తాడని నీకెలా తెలుసు అంటే స్నేహితురాలు మా ఆయనకూడ అదే క్లబ్లో మందుతాగి, పేకాట ఆడుతుంటాడులే అని చెప్పినప్పుడు."



ప్రశ్న మరియు స్నేహితురాలు

ప్రశ్న: "స్నేహితురాలు తెల్లబోయేది ఎప్పుడు?"

జ: "ఇవ్వాళ మీ ఇంట్లో ఏం కూర అని అడిగితే స్నేహితురాలు ఉండు, మా ఆయన్ని అడిగి చెబుతాను అన్నపుడు."



ప్రశ్న మరియు టీచర్

ప్రశ్న: "టీచర్ తెల్లబోయేది ఎప్పుడు?"

జ: "ఇవ్వాళ హెూమ్ వర్క్ చేయలేదేం అని అడిగితే స్టూడెంట్ మా డాడాకి ఆరోగ్యం బాగాలేదు మేడమ్ అని చెప్పినపుడు."



Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -30

Responsive Footer with Logo and Social Media