పేజీ సంఖ్య - 23

కండక్టర్ మరియు ప్రయాణికుల సంభాషణ

కండక్టర్: "మీరు ముగ్గురు ఎక్కి రెండు టికెట్లే ఎందుకు తీసుకున్నారు?" అని అడిగాడు.

రవి: "వీడి దగ్గర పాస్ ఉందనుకొని" అన్నాడు.

పక్కనే ఉన్న గోపి: "నా దగ్గర పాస్ లేదు" అన్నాడు కంగారుగా.

రవి: "అయితే టికెట్ ఇవ్వండి ఇప్పుడే మా మద్య చిన్న గొడవయిందిలెండి" అన్నాడు డబ్బులు తీస్తూ...



టీచర్ మరియు ఇతర టీచర్ సంభాషణ

టీచర్: "అందరికీ మంచి మార్కులు రావాలని పై నుంచి ఆర్డర్లు చూస్తుంటే, మనం పాఠాలు చెప్పడం మానేసి, గైడ్లుచదివించడం మంచిది" అన్నాడు విసుగ్గా.

మరో టీచర్: "దాని కన్నా స్కూల్కి సెలవులిచ్చి, ఇంటి దగ్గరే చదువుకొమ్మంటే ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయి" అన్నాడు.



టికెట్ కలెక్టర్ మరియు సుబ్బారావు సంభాషణ

టికెట్ కలెక్టర్: "రిజర్వేషన్ లేకుండా, రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ లో ఎందుకు ఎక్కావు?" అని అడిగాడు.

సుబ్బారావు: "జనరల్ కంపార్ట్మెంట్ లో కాలు పెట్టడానికి స్థలంలేదు" అన్నాడు.

టికెట్ కలెక్టర్: "మరెలా...?" అన్నాడు సాలోచనగా.

సుబ్బారావు: "పోలీ ట్రైన్ పైకి ఎక్కి ప్రయాణం చేస్తాలెండి" అన్నాడు. ఓదార్పుగా...



ఆటో డ్రైవర్ మరియు అధికారి సంభాషణ

ఆటో డ్రైవర్: "ఇప్పటికే సిటీలో ఆటోలు సరిగ్గా నిండక కష్టపడుతుంటే, మళ్ళీ రెండు వేల ఆటోలకు పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారు?" అన్నాడు.

అధికారి: "గ్రేటర్ సిటీ అవుతుందికదా చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా ఆటోలు నడుస్తాయికదా" అన్నాడు.

నాయకుడు: “అంటే వాళ్ళూ మాలాగే ఆటోలు నిండక మాలాగ అలా అయితే ఓకే.." అన్నాడు.



హైదరాబాద్లో ఆటో మరియు ప్రయాణికురాలు సంభాషణ

ఆటో అతను: "ముందు కూర్చున్నవాళ్లు కాకుండా, వెనక వాళ్ళకూడా దిగి ఆ చెట్టుదాకా నడవండి. ముందు పోలీసువాళ్ళు ఉన్నారు" అన్నాడు.

ప్రయాణికురాలు: “వెనుక వాళ్లు ఎందుకు?" అని అడిగారు.

ఆటో అతను: “మొత్తం ఖాళీగా ఉంటే వాళ్ళు ఎక్కువ సంతోషిస్తారు" అన్నాడు.



టికెట్ కలెక్టర్ మరియు రమణ సంభాషణ

టికెట్ కలెక్టర్: "టికెట్ లేకుండా ట్రైన్లో ఎందుకు ఎక్కావు?" అని అడిగాడు.

రమణ: "మన ట్రైన్లో నలభై తాతం మంచి టికెట్ లేకుండా ప్రయాణిస్తుంటారట కదా.. నేనూ వాళ్ళలో ఒకణ్ని" అన్నాడు రహస్యంగా.

టికెట్ కలెక్టర్: "అలాగా నేను మామూలు వాళ్ళను వదలను" అంటూ వెళ్ళిపోయాడు.



సీనియర్ హీరో మరియు జూనియర్ హీరో సంభాషణ

సీనియర్ హీరో: "నీ కొత్త హిట్ సినిమాలో ఒక్కపాట కూడా అర్ధం కాలేదు" అన్నాడు.

జూనియర్ హీరో: "అర్థమెలా అవుతుంది. అందులో మాటలు వినిపిస్తేగా.. అదే ఇప్పటి స్టయిలట" అన్నాడు.



రాజేష్ మరియు సుమన్ సంభాషణ

రాజేష్: "నిన్న తెగ బోర్ కొట్టి ఓ తెలుగు సినిమాకి వెళ్ళాను. మైండ్ ఫ్రెష్ అయింది" అన్నాడు.

సుమన్: "ఏముంది దాంట్లో?" అని అడిగాడు.

రాజేష్: "దాంట్లో ఆడవాళ్ళు డ్రెస్లు చక్కగా వేసుకున్నారు. మరీ మన రోడ్లమీద కనిపించేవాళ్ళలాగా కాకుండా" అన్నాడు.



సైకలజిస్ట్ మరియు సునీత సంభాషణ

సునీత: "మా అబ్బాయి క్లాస్ ఫస్ట్ రావాలంటే ఏంచెయ్యాలి?" అని అడిగింది.

సైకలజిస్ట్: "ఓ చెత్త స్కూల్లో వెయ్యాలండి.. అప్పుడు ఫస్ట్ వస్తాడు" అన్నాడు. విసుగ్గా.



హైదరాబాద్ లో ఆటో మరియు ప్రయాణికురాలు సంభాషణ

సంగీత: "మీటరు వెయ్యకుండా, యాభయి రూపాయలు ఇవ్వమంటే ఎలా?" అడిగింది.

ఆటో అతను: "మీటర్ ప్రకారంగా అయితే మీకు ఆటో దొరకడానికి ఎన్నిగంటలు పడుతుందో చెప్పలేదు" అని వెళ్ళిపోయాడు.

Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -23

Responsive Footer with Logo and Social Media