పేజీ సంఖ్య - 26
రాజేష్ మరియు సురేష్ సంభాషణ
రాజేష్: "నాకు గవర్నమెంటు ఉద్యోగం వచ్చింది" అన్నాడు.
సురేష్: "ఇంటర్వూలో ఏమి అడిగారు?" అడిగాడు.
రాజేష్: "నేను ఆవులిస్తుంటే 'నిద్రవస్తుందా?' అని అడిగారు. నేను అవునన్నాను. సెలెక్ట్ చేసుకున్నారు అంతే" అన్నాడు.
రాజేష్ మరియు సురేష్ సంభాషణ
రాజేష్: "సిగరెట్లు మానెయ్యలనుకున్నాడు. 'ఒక వేళ మద్యలో తాగాలనిపిస్తే ఎలా?' అని అడిగాడు.
సురేష్: "ఆ ఒక్క సారికీ తాగేయ్" అని సలహా ఇచ్చాడు.
రమేష్ మరియు వెంకట్ సంభాషణ
రమేష్: "మీ ఇంట్లో ఎలుక, పిల్లిని తరుముతుందేం?" అని ఆశ్చర్యంగా అడిగాడు.
వెంకట్: "అది మా ఆవిడను. నన్ను చూసి ఉంటుంది" అన్నాడు.
రాజేష్ మరియు వివేక్ సంభాషణ
రాజేష్: "జీవితంలో నేనెప్పుడూ ఓడిపోలేదు" అన్నాడు.
వివేక్: "అది ఎలా సాధ్యమయింది?” అడిగాడు ఆశ్చర్యంగా.
రాజేష్: "నేను ఎప్పుడూ ఏపనీ చేయలేదు" అని వివరించాడు.
ప్రశ్న మరియు విద్యార్థి సంభాషణ
ప్రశ్న: "టీచర్ తెల్లబోయేది ఎప్పుడు?"
జ: "ఏంటి ఇవ్వాళ హెూంవర్క్స్ లెక్కలన్నీ తప్పుచేశావ్' అని అడిగితే విద్యార్ధి మా డాడీ క్యాంప్ కెళ్లే హెూంవర్క్ నేనే చేశాను" అని చెప్పినప్పుడు.
ప్రశ్న మరియు భార్య సంభాషణ
ప్రశ్న: "భర్త అవాక్కయేది ఎప్పుడు?"
జ: "నాకు ఇష్టం ఉండదని తెలిసినా రోజూ కాకరకాయ కూరే చేస్త్నువేం అని అడిగితే భార్య 'నాకు కొత్త చీర కొనిచ్చేంత వరకూ ఇంతే' అని చెప్పినప్పుడు."
ప్రశ్న మరియు ఉద్యోగి సంభాషణ
ప్రశ్న: "బాస్ చేతల్లబోయేది ఎప్పుడు?"
జ: "రోజూ ఆఫీసుకు లేటుగా వస్తావేం అని అడిగితే ఉద్యోగి 'ఇంట్లో రోజూ వంట చెయాల్సింది నేనే సార్' అని చెప్పినప్పుడు."
ప్రశ్న మరియు విలేఖరి సంభాషణ
ప్రశ్న: "నిజాయితీ అయిన టీవీ సీరియల్ నిర్మాత?"
జ: "మీ సీరియల్ ఇంత సక్కైస్ అవ్వడానికి కారణం అని విలేఖరి అడిగితే తెలుగింటి ఆడపడుచుల సహనశీలత అని చెప్పేవాడు."
ప్రశ్న మరియు పేకాటరాయుడు సంభాషణ
ప్రశ్న: "సిసలైన పేకాటరాయుడు?"
జ: "తన పిల్లలకు డైమండ్ రాజ్ ఆటిన్ రాణి అని ముద్దుపేర్లు పెట్టేవాడు."
ప్రశ్న మరియు విలేఖరి సంభాషణ
ప్రశ్న: "విలేఖరి తెల్లబోయేది ఎప్పుడు?"
జ: "మీ అందం వెనుక రహస్యం ఏమిటని అడిగితే.. హీరోయిన్ నా మేకప్మాన్ అని చెప్పినప్పుడు."