పేజీ సంఖ్య - 24
తెలివైన భక్తుడు..?
జ: "దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, ఎప్పుడూ కోర్కెలను తీర్చే కామధేనువును ఇవ్వమని కోరేవాడు."
జడ్జి మరియు ముద్దాయి సంభాషణ
జడ్జి: "నీకు ఏకంగా ఐదేళ్ళు జైలు శిక్ష వేస్తే సంతోషంగా కనిపిస్తున్నారేం?" అని అడిగాడు.
ముద్దాయి: "బయట ధరలు బాగా పెరిగిపోతున్నాయి సార్" అన్నాడు.
జడ్జి మరియు ముద్దాయి సంభాషణ
జడ్జి: "నీమీద కేసు రుజువులు లేక కొట్టేస్టున్నాను. అని, ఓ క్షణం ఆగి "గుడ్ మంచి లాయర్ను పెట్టుకున్నావ్. ఆల్ ది బెస్ట్" అన్నాడు.
దేవుడు మరియు భక్తుడు సంభాషణ
దేవుడు: "ప్రత్యక్షమై 'నరుడా ఏమి నీ కోరిక?' అన్నాడు.
భక్తుడు: "మీ ఫోటో ఒకటి తీసుకోవాలని" అన్నాడు.
దేవుడు: "అలా కుదరదు. నాకు ఇలా పర్సనల్గా కలవడమే అలవాటు" అన్నాడు.
హైదరాబాద్లో వినాయక చవితి సంభాషణ
రాజేష్: "చందా ఇవ్వడం కుదరదు" అన్నాడు.
గల్లీ లీడర్: "ఎందుకు?" అన్నాడు.
రాజేష్: "మా ఆవిడ ఇంట్లో లేదు" అన్నాడు.
లీడర్: "ఆవిడ లేకుంటే ఇవ్వరా?" అని అడిగాడు గట్టిగా.
రాజేష్: "ఆమెదే ఈ ఇంట్లో పెత్తనం" అని వివరించాడు.
లీడర్: "ఇలా అయితే మే ఎవరి దగ్గర చందాలు వసూలు చెయ్యలేం" అన్నాడు వెళ్ళిపోతూ..
ధనవంతుల సంభాషణ
మొదటి ధనవంతుడు: "మన వాళ్ళందరం మన కోసం ఓ రోజును ఏర్పాటు చేసుకోవాలి."
రెండో ధనవంతుడు: "అలా కుదరదు" అన్నాడు.
మొదటి ధనవంతుడు: "ఎందుకు?" అని అడిగాడు.
రెండో ధనవంతుడు: "ఆ మిగిలిన 364 రోజులు కూడా మనవే కదా" అన్నాడు. నవ్వుతూ.
లత మరియు రవి సంభాషణ
లత: "నీ విశాల హృదయం చూసి నిన్ను ప్రేమించాను" అంది.
రవి: "మరి విశాల హృదయం కదా. అందులో సుమ. నవ్య కూడా ఉన్నారు" అన్నాడు.
సుందరయ్య మరియు బంగారయ్య సంభాషణ
సుందరయ్య: "మా అల్లుఉ స్కూటర్ కొనివ్వమని అడగటం మానేశాడు" అన్నాడు.
బంగారయ్య: "మా అల్లుడు కూడా మానేశాడు" అన్నాడు.
సుందరయ్య: "కాని ఎందుకు?" అని అడిగాడు.
బంగారయ్య: "ఈమధ్య పెరిగిన పెట్రోలు ధరలు నువ్వు చూసుండవ్" అన్నాడు.
పెళ్లి సంభాషణ
ఒకడు: "పెళ్ళిలో పెళ్ళి కొడుకు, పెళ్ళికూతురు తరపువాళ్ళు గొడవ పడాలికాని పురోహితుడు, వీడియో గ్రాఫర్ గొడవ పడుతున్నారు?" అని అడిగాడు.
ప్రక్కనతను: "వాళ్ళు పెళ్ళి ఎలా చేయాలనే విషయంలో గొడవ పడుతున్నారు" అని వివరించాడు.
ప్రియాంక మరియు రాజేష్ సంభాషణ
ప్రియాంక: "మా ఆయన ఒక రూపాయికి బదులు ఐదు రూపాయలు దానం చేస్తున్నారు. కళ్ళు పరీక్షించండి" అంది.
డాక్టర్: "నిజమేనా?" అని అడిగాడు.
భర్త రాజేష్: "మీకు ఇంతంత ఫీజులిస్తున్నప్పుడు ఓ ఐదు రూపాయలు దానం చేస్తే ఏండని అలా చేస్తున్నా" అన్నాడు.