Subscribe

పేజీ సంఖ్య - 13

క్లయింట్

క్లయింట్ : సార్ ఒక్క ప్రశ్నకు ఎంత ఫీజు తీసుకుంటారు?

లాయర్: ప్రశ్నకు రెండొందలు

క్లయింట్ : కొంచెం తగ్గించరా?

లాయర్: తగ్గించను ఈ రెండు ప్రశ్నలకు నాలుగువందలు ఇవ్వండి



భక్తి

దేవుడు : “ఏమిటి నీ కోరిక?”

భక్తుడు : నాకు టీవీ సీరియల్లో హీరోగో నటించే వారం ఇవ్వండి" అన్నాడు.

దేవుడు : “కాని వంద సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకడం సృష్టి విరుద్దం కదా” అన్నాడు.



హీరోయిన్ భయం

మొదటి హీరోయిన్ : “నేను మొన్న అర్ధరాత్రి రోడ్డుమీద ఒంటరిగా నడిచాను" అంది.

రెండో హీరోయిన్ : “మేకప్ లేకుండా నడిచుంటావ్" అంది.



ప్రేక్షకుల అభిప్రాయం

విలేఖరి : "మీరు పెళ్ళయిన తర్వాత నటించడానికి మీ భర్త ఒప్పుకున్నారా?” అని అడిగాడు.

హీరోయిన్ : "అది డిసైడ్ చేసేది.. నా భర్తో, నేనో కాదు, ప్రేక్షకులు” అంది.



హర్రర్ సినిమా

డైరెక్టర్ : “నేను తీయబోయే హర్రర్ సినిమాలో మీ పాత్ర ప్రేక్షకులను భయపెట్టే విధంగా ఉంటుంది” అన్నాడు.

హీరోయిన్ : “నాకు ఎలాంటి మేకప్ వేయబోతున్నారు” అంది.

డైరెక్టర్ : “మీరు మేకప్ ఏమీ వేసుకోకండి చాలు॥” అన్నాడు.



బాడీ లాంగ్వేజ్

రాము : "ఆయన బాడీ లాంగ్వేజ్ బావుంది అంటే ఏమిటర్ధం?” అని అడిగాడు.

శ్యాము : "ఆయన బాడీపైన రాయించుకున్న టాటూలో భాష బావుందనేమో” అన్నాడు.



కమీషన్

డాక్టర్ : "నేను జ్వరానికి మూడు టాబ్లెట్స్ రాస్తాను.. నువ్వు ఆ పేషెంట్ కి ఐదు టాబ్లెట్స్ రాసావేం..?" అని అడిగాడు.

మరో డాక్టర్ : “మెడిసిన్లపై థర్టీ పర్సెంట్ కమీషన్ వస్తున్నప్పుడు, ఆ మాత్రం రాయాలనిపించదా” అన్నాడు.



ఎన్నికలు

ప్రతిపక్ష నాయకుడు : "మొన్న ఎన్నికల్లో మీరు గెలిపించిన అభ్యర్థి కోట్ల తినేసాడు అని పేపర్లో వచ్చింది. ఈ సారి ఎవరిని గెలిపిస్తారు?" అని అడిగాడు.

జనంలోంచి గొంతు వినిపించింది “మళ్లీ అతణ్నే.. అతను మాకు ఫ్రీ బియ్యం, ఫ్రీ ఆరోగ్యం, ఫ్రీ చదువు, అన్నీ ఇస్తాడు” అని.



అనురాగం

పక్కింటావిడ : "మీ పాపకు అనురాగాలు సీరియల్ చూపిస్తూ అన్నం పెడతావెందుకు?" అని అడిగింది.

విమల : “నేనుకూడా చిన్నప్పుడు ఈ సీరియల్ చూస్తూనే అన్నం తినేదాన్ని” అంది.

విమల అమ్మ : “మా అమ్మకూడా నాకు ఈ సీరియల్ చూస్తూనే అన్నం తినిపించేది" అంది.



కాస్ట్యూమ్

విలేఖరి : "మీ సినిమాలలో నటీమణులు చిన్న బట్టలతో నటిస్తుంటారు. మరీ మీ కొత్త సినిమాలో కూడా అంతేనా?” అని అడిగాడు.

నిర్మాత : “కొత్త సినిమాకి అస్సలు కాస్ట్యూమ్ డిజైనరిని పెట్టుకోలేదు” అన్నాడు ఉత్సాహంగా.



Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -13

Responsive Footer with Logo and Social Media