పేజీ సంఖ్య - 21

బాస్ల కాన్ఫరెన్స్లో...

మొదటి బాస్: "ఈ మధ్య మా ఆపీసు స్టాఫ్ సరిగ్గా మాట వినట్లేదయ్యా. నీ పరిస్థితి ఎలా ఉంది?" అని అడిగాడు.

రెండవ బాస్: "మా స్టాఫ్ మరీ అమాయకులండి. నేను పెట్టే టెన్సన్కి టెన్సన్కి మద్య గ్యాప్ కావాలంటున్నారు." అన్నాడు.



టీచర్ మరియు రాము సంభాషణ

టీచర్: "చైనా సామాన్లు ప్రపంచం అంతటా దొరుకుతాయట. దీన్ని బట్టి ఏమర్దమవుతుంది?" అని అడిగింది.

రాము: "మన దేశంలోనే కాక అన్ని దేశాల కూడా బీదవాళ్ళు ఉన్నారని" అన్నాడు బాగా ఆలోచించి.



టీచర్ మరియు శ్యామ్ సంభాషణ

టీచర్: "చైనా బొమ్మలతో ఆడుకోకూడదని పేపర్లో వచ్చింది. ఎందుకో చెప్పు?" అంది.

శ్యామ్: "అవి వాళ్ళవి కాబట్టి." అన్నాడు.



ప్రతిపక్ష నాయకుడు సంభాషణ

ప్రతిపక్ష నాయకుడు: "ప్రభుత్వం ఇప్పుడు నడిపిస్తున్న పథకాలన్నీ మేమే మొదలు పెట్టాం." అన్నాడు.

ఓ గొంతు: "వాటిలో అంత ప్రాపిట్ ఉంటుందా సార్?" అని ముందున్న గుంపులోనుంచి వినిపించింది.



అనసూయ మరియు విజయ సంభాషణ

అనసూయ: "మీ ఆయన సెలవొస్తే చాలు, బారికెళ్ళి, మందుతాగుతుంటాడంట కదా?" అంది.

విజయ: "అవును ఆ విషయం మీకెలా తెలుసు?" అంది బాధగా...

అనసూయ: "అదే బార్లో మా ఆయన రోజూ పీకలదాకా తాగుతుంటాడ్లే." అంది.



టీచర్ మరియు రమ సంభాషణ

టీచర్: "ఇప్పుడు సంగీతం, సాహిత్యం గురించి చెప్పాను కదా.. ఈ రెండిటిలో నువ్వు దేన్ని ఎంచుకుంటావ్?" అని అడిగింది.

రమ: "సాహిత్యాన్ని." అంది.

టీచర్: "ఎందుకు?" అని అడిగింది.

రమ: "దానివల్ల శబ్ద కాలుష్యం ఉండదు. ఇక ఇంటి పక్కవాళ్ళు కూడా పొట్లాటకు రారు." అంది ఆలోచించి.



లెక్చరర్ మరియు హరీష్ సంభాషణ

లెక్చరర్: "నువ్వు ఇంజనీరింగ్నే ఎందుకు ఎంచుకున్నావ్?" అని అడిగాడు.

హరీష్: "మా డాడీ దృష్టిలో చదువంటేనే ఇంజనీరింగ్సార్." అన్నాడు.

లెక్చరర్: "మరి ఉద్యోగం అంటే?" అని అడిగాడు.

హరీష్: "అమెరికాలో చేసేదే అసలైన ఉద్యోగం." అని వివరించాడు.



విలేఖరి మరియు హీరో సంభాషణ

విలేఖరి: "అందరూ పాత హీరోల వంశాల నుండే యువ హీరోలు వస్తుంటే బయటి వాళ్ళకు అవకాశం రావడం ఎలా?" అని అడిగాడు.

హీరో: "మా పోటీ హీరో వంశంనుండే ఎక్కువమంది యువహీరోలు వస్తున్నారు మరి." అన్నాడు కసిగా.



టీచర్ మరియు రాము సంభాషణ

టీచర్: "మ్యాన్ ప్రపోజెస్.. గాడ్ డిస్ పోజ్స్ అంటే అర్ధం ఏమిటి?" అని అడిగింది.

రాము: "మన పనికి దేవుడు ఎన్ని అడ్డంకులు పెట్టినా, దేవుణ్ని తిట్టుకోకూడదని." అన్నాడు ఆలోచించి.



ప్రియ మరియు రాజేష్ సంభాషణ

ప్రియ: "మన పెళ్ళికాక ముందు నన్ను పెళ్ళి చేసుకోకుంటే చస్తాను అన్నారు." అంది గోముగా.

భర్త రాజేష్: "పెళ్ళి చేసుకుంటే ఇలా రోజూ చావాల్సి వస్తుందని తెలియక అలా అన్నాను." అన్నాడు.

Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -21

Responsive Footer with Logo and Social Media