Subscribe

పేజీ సంఖ్య - 17

ఫోటో

రాధిక ఫోటో చూపిస్తూ "నాకు పెళ్ళి సెటిల్ అయింది. అబ్బాయి ఫోటో చూసి నా టేస్ట్ ఎలా ఉందో చెప్పు" అంది.

చంద్రిక : “నీ టేస్ట్ బావుంది. అబ్బాయి టేస్టే బాగాలేదు” అంది.


బస్సులో గోపి-అమ్మాయి సంభాషణ

గోపి : "ఏయ్ మిస్టర్ చెయ్యి ఎక్కడ వేశావ్" అన్నాడు కోపంగా...

గోపి : "రాంగ్ ప్లేసా.. సారీ" అన్నాడు చెయ్యి తీసేస్తూ..


సురేష్-భార్య సుందరి సంభాషణ

సురేష్ : "ప్రతి మనిషికి ఓ లోపం ఉంటుందని అంటే ఇదివరకు నమ్మకపోయే వాణ్ని" అన్నాడు.

భార్య సుందరి : "ఇప్పుడు?" అని అడిగింది.

సురేష్ : “నమ్ముతాను. ఎందుకంటే అందరికి ఒక భార్య ఉంటుందికదా" అన్నాడు.


ఆనంద్-సుప్రియా సంభాషణ

ఆనంద్ : "సారీ సుప్రియా, నేను నీ ప్రేమను కొనలేను. మనం విడిపోదాం" అన్నాడు.

సుప్రియా : "ఎందుకు?" అంది.

ఆనంద్ : "మన ప్రేమ మొదలయ్యాక నా జీతం సరిపోవడంలేదు."


కమల-అనిత సంభాషణ

కమల : "ఆ విమలది పెద్ద బడాయి, ప్రతి విషయంలో తనే ఫస్ట్ ఉండాలని ఆరాటం" అంది.

అనిత : "ఏమిటి విషయం?" అని అడిగింది.

కమల : "మొన్న నాగుల చవితినాడు పుట్టలో పాలలో బూస్ట్ కలిపిపోసింది" అంది.


పేషంట్-డాక్టర్ సంభాషణ

పేషంట్ : "నాకు తెగ బద్దం.. ఏ పనీ చేయబుద్దికాదు" అన్నాడు ఆవులిస్తూ..

డాక్టర్ : "సరే.. ముందు బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, ఇసిజి, సిటీ స్కాన్ చేయించండి.. నెక్స్ట్" అన్నాడు.


పెళ్లికొడుకు-ఫ్రెండ్ సంభాషణ

పెళ్లికొడుకు : "అదేయ్.. ఫోన్ కట్ చెయ్యి నా పెళ్లి జరుగుతుంది" అన్నాడు.

సెల్లో : "సరే అక్షింతలప్పుడు మళ్ళీ కాల్ చేస్తాలే" అని ఫ్రెండ్ చెప్పాడు.


షాపు యజమాని-పింకీ సంభాషణ

షాపు యజమాని : "మా షాపులో ఏది కొన్నారెండు రూపాయలు డిస్కౌంట్ ఇస్తాం" అన్నాడు.

పింకీ : “అయితే రెండు రూపాయి షాంపు ప్యాకెట్ ఇవ్వండి" అంది.


మెడికల్ షాపు-అనిత సంభాషణ

అనిత : "సార్, మీకేమైనా మెడిసిన్స్ కావాలా, డోర్ డెలివరీ చేస్తాం” అని..

స్వయం : "ఇకముందు ఆ అవసరంలేదు" అని వినిపించింది.

అనిత : "ఎందుకు మా సర్వీస్ బాగాలేదా?" అంది.

స్వయం : "సర్వీస్ బావుంది. పేషంట్ పోయాడు" అని వినిపించింది.


కొత్త సంగీత దర్శకుడు-నిర్మాత సంభాషణ

కొత్త సంగీత దర్శకుడు : "సార్, నాకు సంగీతంపైన మంచి పట్టుఉంది. నన్ను మీ సినిమాలో సంగీత దర్శకుడుగా నన్ను పెట్టుకోండి" అన్నాడు.

నిర్మాత : "ఇప్పటి సినిమా సంగీతంలో ఎక్కడైనా పట్టు ఉందా.. ట్రెండ్ ఫాలో కాకుండా సంగీతం నేర్చుకొని వస్తే ఎట్లా" అన్నాడు విసుగ్గా..

Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -17

Responsive Footer with Logo and Social Media