పేజీ సంఖ్య - 27

ప్రశ్న మరియు పేషెంట్ సంభాషణ

ప్రశ్న: "పేషెంట్ తెల్లబోయేది ఎప్పుడు ?"

జ: "నాకు ఓపిక అస్సలు ఉండడంలేదు అని అంటే డాక్టర్ తెలుగు టీవీ సీరియల్లు చూడండి ఓపిక బాగా పెరుగుతుంది అని చెప్పినప్పుడు."



ప్రశ్న మరియు విలేఖరి సంభాషణ

ప్రశ్న: "విలేఖరి తెల్లబోయేది ఎప్పుడు?"

జ: "మీ రాబోయే సినిమాలో చాలా కష్టపడి నటించారా ఎందుకని అని అడిగితే.. హీరోయిన్ ఆ సినిమాలో వంటినిండా బట్టలు వేసుకొని నటించను అని చెప్పినప్పుడు."



ప్రశ్న మరియు టీచర్ సంభాషణ

ప్రశ్న: "టీచర్ తెల్లబోయేది ఎప్పుడు?"

జ: "నీ చేతిరాత చండాలంగా ఉంది, నీ హెూమ్ వర్క్ చెక్ చేయడం నావల్లకాదు అని కోపంగా అంటే విద్యార్ధి రేపటి నుంచి బాగా రాయమని మా డాడీకి చెపుతాను అని అన్నప్పుడు."



ప్రశ్న మరియు విలేఖరి సంభాషణ

ప్రశ్న: "విలేఖరి తెల్లబోయేది ఎప్పుడు?"

జ: "మీరు నెంబర్ వన్ హీరోయిన్ అవ్వడానికి కారణం మీ ప్రతిభా లేక అదృష్టమా అని అడిగితే హీరోయిన్ 'అవేమీకాదు, ఎక్సపోజింగ్ అని చెప్పినపుడు."



ప్రశ్న మరియు టీచర్ సంభాషణ

ప్రశ్న: "టీచర్ తెల్లబోయేదెప్పుడు?"

జ: "హెూమ్ వర్క్ ఎందుకు చెయ్యలేదు అని అడిగితే విద్యార్థి హెూమ్ వర్క్ చేయడానికి మాడాడి లేరు, ఊరెళ్ళారు అని చెప్పినప్పుడు."



ప్రశ్న మరియు బాధ్యతాయుతమైన భర్త

ప్రశ్న: "బాధ్యతాయుతమైన భర్త?"

జ: "ఆఫీసులో ఆఫీసు పనే కాక, ఇంట్లో భార్య కోసం వంట, కొడుకు కోసం హెూమ్ వర్క్ చేసేవాడు."



ప్రశ్న మరియు పూజారి సంభాషణ

ప్రశ్న: "పూజారి తెల్లబోయేదెప్పుడు?"

జ: "పెళ్ళయ్యాక గుడికి రావడం మానేశావేం అని అడిగితే.. మా ఆయన నా కోర్కెలు బాగానే తీరుస్తున్నారు అని చెప్పినపుడు."



ప్రశ్న మరియు తేడా

ప్రశ్న: "తేడా?"

జ: "గతంలో హీరోయిన్లు నటనకు బాగా అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకొనేవారు. ఇప్పుడు ఎక్స్పోజింగ్కు బాగా అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటున్నారు."



ప్రశ్న మరియు నిజాయితీఉన్న నిర్మాత

ప్రశ్న: "నిజాయితీఉన్న నిర్మాత?"

జ: "మా సినిమాలో నటించటానికి ఎక్సోపోజింగ్ పై ఆశక్తి ఉన్న కొత్త నటీమణులు సంప్రదించగలరు అని పేపర్లో ప్రకటన ఇచ్చేవాడు."



ప్రశ్న మరియు భార్య సంభాషణ

ప్రశ్న: "భార్య తెల్లబోయేది ఎప్పుడు?"

జ: "షాజహాన్ భార్యకోసం తాజ్ మహల్ కట్టించాడు. మరి నా కోసం మీరేం కట్టిస్తారు. అని మురిపెంగా అడిగితే.. భర్త నీ షాపింగ్ బిల్లులు కడుతునే ఉన్నాగా" అని చెప్పినప్పుడు.



Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -27

Responsive Footer with Logo and Social Media