పేజీ సంఖ్య - 19

చంటి మరియు బంటి సంభాషణ

చంటి: "మీ ఇంటి ముందు టైగర్ ఉన్నది జాగ్రత్త" అని ఎందుకు పెట్టారు. మీకు లేదుకదా?" అన్నాడు.

బంటి: "మా కుక్క పేరు టైగర్" అన్నాడు.



గవర్నమెంటు ఆఫీసులో సంభాషణ

రంజన్: “మన ఆఫీసర్ అంటే నాకు గౌరవం, ఆదర్శం" అన్నాడు.

సునీల్: "ఎందుకు?" అని అడిగాడు.

రంజన్: "ఆయన మనలా వందలతో సరిపెట్టుకోడురా, లక్షల్లో లంచాలు పడతాడు" అన్నాడు.



పెద్ద రచయిత మరియు మరొక రచయిత సంభాషణ

పెద్ద రచయిత: "మనకు చాలా సన్మానాలు, సత్కారాలు చేయడం, మామూలు మనుషులు ఇలా చేయించుకోకపోవడం వింతగా లేదూ" అన్నాడు.

మరో రచయిత: “మనకు ఆర్ట్ ఉంది. వాళ్ళకు పెద్దహార్ట్ ఉంది?" అని అడిగాడు.



చింటూ మరియు బామ్మ సంభాషణ

చింటూ: ఎప్పుడూ నిజం చెప్పాలని అన్నావే.. ఇవ్వాళ్లే ఎం జరిగిందో తెలుసా?" అన్నాడు.

బామ్మ: “ఏం జరిగింది?" అని అడిగింది.

చింటూ: “స్కూల్లో టీచర్ హెూమ్ వర్క్ చేసిందెవరు అని అడిగితే డాడీ అని చెప్పా.. ఆమె చెంప పేల్చింది" అన్నాడు.



ప్రభుత్వ ఆసుపత్రి సంభాషణ

రోగి: "ఇలా ప్రతిదానికి డబ్బులు అడగడం ఎందుకు నాయినా.. మీకు జీతాలు సరిపోవడం లేదా?" అన్నాడు.

ఉద్యోగి: "అది ఇదివరకు.. ఇప్పుడు జీతాలు బాగానే ఉన్నా అలవాటై అడుగుతున్నాం?" అన్నాడు.



సీనియర్ జర్నలిస్టుల సంభాషణ

1వ జర్నలిస్ట్: "ఫలానా హరీష్ కాబోయే సూపర్ స్టార్" అన్నాడు.

2వ జర్నలిస్ట్: “ఎందుకు?" అని అడిగాడు.

1వ జర్నలిస్ట్: "అతని తండ్రి సూపర్ స్టార్" అన్నాడు.

2వ జర్నలిస్ట్: "మరి, మాజీ గెగాస్టార్ కొడుకు కూడా ఉన్నాడు. అతను సూపర్ స్టార్ కాడా?" అని అడిగాడు.

1వ జర్నలిస్ట్: "అలా చూసుకుంటే ఇద్దరు పాత అగ్రనటుల కొడుకులు కూడా ఉన్నారు మరి" అన్నాడు ఆలోచిస్తూ...



మిత్రులు సంభాషణ

మిత్రుడు: "ఏంటయ్యా మన సి.ఎమ్. నిన్నుచూఇ ఆదోలా నవ్వుతుంటాడు?" అని అడిగాడు చిన్నగా.

ఎక్స్ సి.ఎమ్: "నేను నా టైమ్ లో వెయ్యి కోట్లు మాత్రమే సంపాదించానని చిన్నచూపు" అన్నాడు గుసగుసగా..



రాజేష్ మరియు సురేష్ సంభాషణ

రాజేష్: "ఏంటి మీ బామ్మర్షి వస్తే తెగ ఖుషి అయ్యేవాడివి. ఈసారీ వస్తే డల్ గా ఉన్నావు?" అని అడిగాడు.

సురేష్: "ఈ నెలలో అతను రావడం ఇది మూడోసారి" అన్నాడు" విసుగ్గా..



విలేఖరి మరియు ప్రతిపక్షం నాయకుడు సంభాషణ

విలేఖరి: "మీరు పాలకపక్షం అవినీతిని గురించి చెప్పినా, ప్రజలు మళ్లీ వాళ్ళనే గెలిపించారు. కారణమేంటి?" అని అడిగాడు.

ప్రతిపక్షం నాయకుడు: "ప్రజలు కూడా ఈ మద్యే తమకేం వస్తుందా అని ఆలోచిస్తున్నారు" అన్నాడు నిరాశగా.



ముఖ్యమంత్రి మరియు సెక్రటరీ సంభాషణ

ముఖ్యమంత్రి: "మన మంత్రులకూ, ఎమ్మేల్లేకు ఓ ట్రైనింగ్ ఇప్పించాలయ్యా" అన్నాడు.

సెక్రటరీ: "ఏంటది సార్?" అన్నాడు.

సి.ఎమ్.: "సి.బి.ఐ. ఎంక్వైయిరీలను ఎదుర్కోవడం ఎలా? అనే విషయం గురించి" అన్నాడు.

Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -19

Responsive Footer with Logo and Social Media