Subscribe

పేజీ సంఖ్య - 16

హైదరాబాద్ లోకల్ బస్సులో...

కండక్టర్ : "బస్సు ఎక్కకండి, రష్ ఎక్కువగా ఉంది. వెనుక ఖాళీ బస్సు వస్తుంది." అన్నాడు.

ప్రయాణీకుడు హరీష్ : "ఆ బస్సు ఎక్కితే జర్నీ చేసినట్లుండదు" అన్నాడు.


బార్లో ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు

రమేష్ : “పెళ్ళయిన తర్వాత మన ఫ్రెండ్స్ అంతా మాటలు తగ్గించేశారు. సురేష్, నువ్వేంటి మాట్లాడ్డమే మానేశావు? అని అడిగాడు.

సురేష్ : నాకు ఇద్దరు భార్యలు" అని చెప్పి ముగించాడు.


ఇద్దరు బాస్ లు మాట్లాడుకుంటున్నారు

మొదటి బాస్ : "నువ్వు ఎవ్వరినీ నమ్మవెందుకు?" అని అడిగాడు.

రెండవ బాస్ : "నిజం చెప్పాలంటే నన్ను నేనే నమ్మను” అన్నాడు.


గురువు-శిష్యుడి సంభాషణ

గురువు : "మనిషి, దేవుడు మనలాగే ఉంటాడని ఊహించి మన రూపంలోనే దేవుడిని తయారుచేసాడు" అన్నాడు ఆలోచించి.

శిష్యుడు : "దేవుడు మనలాగే ఎక్స్పెక్టచేస్తాడు అనుకొని, ప్రతిపని పూర్తవగానే దేవుడికి దక్షిని ఇస్తాం" అన్నాడు బాగా ఆలోచించి.


రాజారావు-ఆనందరావు సంభాషణ

రాజారావు : "జీవితంలో నాకు ఒకటే కష్టం.. నాకు పిల్లలు లేరు" అన్నాడు.

ఆనందరావు : “నాకు ముగ్గురు పిల్లలు అంటే మూడు కష్టాలు" అన్నాడు.


రాజేష్-సురేష్ సంభాషణ

రాజేష్ : “ఈ మధ్య నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. చేసిన ప్రతి తప్పుకు, దేవుడు హుండీలో పది రూపాయలు వెయ్యాలని నిర్ణయించుకున్నాను" అన్నాడు.

సురేష్ : "తర్వాత..'" అని అడిగాడు.

రాజేష్ : “తర్వాత ఏముంది! నా తప్పులకు జీతం సరిపోవడంలేదు. అప్పులు తీసుకొని మరీ హుండీలో వెయ్యాల్సివస్తుంది" అన్నాడు విచారంగా..


విడిపోయిన ఫ్రెండ్స్ సంభాషణ

మొదటి ఫ్రెండ్ : "మనం విడిపోయి ఇన్ని రోజులైనా నువ్వు రోజూ గుర్తుకు వస్తుంటావు" అన్నాడు.

రెండవ ఫ్రెండ్ : "ఎందుకు?" అని అడిగాడు.

మొదటి ఫ్రెండ్ : "నీ తిట్లు అలాంటివి" అన్నాడు.


పెట్రోల్ ధర పెరుగుదలపై చర్చ

ప్రతిపక్షనాయకుడు : "పెట్రోల్ ధర పెంచితే సాధారణ ప్రజలు ఎట్లా బ్రతుకగలరు" అన్నాడు.

అధికార పక్షం నాయకుడు : "అంతర్జాతీయం ఆయిల్ రేట్లు పెరిగాయి" అన్నాడు.

ప్రతిపక్షనాయకుడు : "అయినా మేం ప్రజల కోసం బంద్ ప్రకటిస్తున్నాం" అన్నాడు. ఆవేశంగా..

అధికార పక్షం నాయకుడు : "మీ బంద్ లో ప్రజలకు కష్టం రాకుండా చూస్తాం" అన్నాడు..


అనిత-సైకాలజిస్ట్ సంభాషణ

అనిత : "మా ఆయన అన్నీ తప్పులే చేస్తుంటాడు" అంది.

సైకాలజిస్ట్ : "మీరు ప్రేమ, అవగాహన పెంచుకోవాలి. వారం రోజుల తర్వాత ఎలా ఉందో చెప్పండి" అంది.

అనిత : "వారం రోజుల తర్వాత వచ్చి అంది" నిజానికి నేనే అన్నీ తప్పులు చేస్తుంటానని అర్ధమైంది" అంది.


రాము-శ్యామ్ సంభాషణ

రాము : "ఇవ్వాళ్ల మా టీచర్ "నిన్ను నువ్వు తెలుసుకో ఇంట్రస్టింగ్ ఉ టుంది" అంది" అన్నాడు.

శ్యామ్ : "నా కైతే ముందు సీట్లో కూర్చునే రాణి గురించి తెలుసుకుంటే ఇంట్రస్టింగ్ గా ఉంటుంది" అన్నాడు.

Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -16

Responsive Footer with Logo and Social Media