పేజీ సంఖ్య - 11

ఎన్ని చేపలు

ఒకాయన బారు బయట ఉన్న వాష్‌బేసిన్‌లో చేపలు
పడుతున్నాడు. బారులో కూర్చున్న పెద్దాయనకి అతన్ని చూసి జాలి వేసింది.
‘పాపం పిచ్చివాడు’ అనుకుంటూ లోపలికి పిలిచి ఓ పెగ్గు పోయించాడు.
తర్వాత కాసేపు ఆటపట్టిద్దామని ‘ఇప్పటిదాకా ఎన్ని చేపలు
పట్టావేంటి?’ అని అడిగాడు. ఆ మాటకి చిరునవ్వు చిందిస్తూ- ‘నీతో కలిపి
ఎనిమిది మంది!’ అంటూ మూతి తుడుచుకుంటూ బయటకి
వెళ్లిపోయాడు మందుబాబు.

క్రికెట్‌!

జానీ హాస్పిటల్‌లో ఆఖరి క్షణాలు లెక్కపెడుతున్న
తన మిత్రుడు మైఖేల్‌ దగ్గరకి వెళ్లాడు.
‘నాకు ఎప్పటినుంచో ఓ సందేహం ఉంది. స్వర్గంలో క్రికెట్
‌ ఆడతారా లేదా అన్నదే నా అనుమానం. నువ్వు కనుక
స్వర్గానికి వెళ్తే, అక్కడ క్రికెట్‌ ఆడతారో లేదో వచ్చి నాకు చెబుతావా,’
అని అడిగాడు. సరేనన్నాడు మైఖేల్‌.
ఆ సాయంత్రమే మైఖేల్‌ చనిపోయాడు.
మర్నాడు రాత్రి జానీకి మైఖేల్‌ మాటలు వినిపించాయి-
‘జానీశ్రీ స్వర్గంలో కూడా క్రికెట్‌ ఉందని
చెప్పడానికి వచ్చాను. కాకపోతే... కాకపోతే...’
‘కాకపోతే ఏంటి?’ విసుక్కున్నాడు జానీ.
‘రేపు బ్యాటింగ్‌ నీదేనంట!’

మేనేజర్‌ ఏడీ!

బాలు: ఇంత చెత్తగా ఉన్న దోశ నేను తిననంటే తినను.
మీ మేనేజర్‌ ఎక్కడ? పిలువ్‌ వాడిని...

వెయిటర్‌: అబ్బే! ఇంత చెత్త దోశని మా
మేనేజర్‌ కూడా తినరు సార్‌!

వరం

బలరాం అడవిలో దారి తప్పిపోయాడు. ఇంతలో అకస్మాత్తుగా
అతనికి పులి ఎదురుపడింది. బలరాంని చూడగానే పులి
వెంటపడటం మొదలుపెట్టింది. బలరాం పరిగెత్తీ పరిగెత్తీ అలసిపోయాడు.
పరగులు పెడుతూనే ‘స్వామీ! ఆ పులిని నీ భక్తుడిగా మార్చేయి!’
అని వేడుకొన్నాడు. వెనక్కి తిరిగి చూసేసరికి పులి బుద్ధిగా తపస్సు
పులిని పలకరించడానికి దాని వైపు వెళ్లాడు.
బలరాం తన దగ్గరకు రాగానే పులి కళ్లు తెరిచి
ఇలా అంది- ‘స్వామీ నువ్వెంత మంచివాడికి.
నా కోరికని మన్నించి ఈ మనిషిని నా దగ్గరకు పంపించావా!’

నేను వదులుతానా!

పోలీసు: నీకసలు బుద్ధుందా! ఏకంగా ఊరేగింపు
మీదకే లారీ తోల్తావా. నీవల్ల ఇప్పుడు 20 మంది
చావుబతుకుల్లో ఉన్నారు తెలుసా!

డ్రైవరు: నాదేం తప్పు లేదండీ! నేను లారీ నడుపుతుండగా
ఎదురుగా ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు.
మరోవైపు ఊరేగింపు జరుగుతోంది. మీరే చెప్పండి!
మీరైతే ఎవరి మీదకి లారీ పోనిస్తారు?

పోలీసు: ఇందులో అంత ఆలోచించాల్సింది ఏముంది!
ఇద్దరి మీదకే పోనిస్తాను.

డ్రైవరు: నేనూ అదే పని చేద్దామనుకున్నాను సర్‌!
కానీ వాళ్లు ఊరేగింపులో చేరిపోయి తప్పించుకోవాలని చూశారు!!!

అందుకే కదా!

టీచర్‌: ఏటా సైబీరియా నుంచి కొల్లేరు దాకా కొన్ని
కొంగలు ఎగురుకుంటూ వస్తాయి. ఎందుకో ఎవరికన్నా తెలుసా!

శీను: అంత దూరం అవి నడవలేవు కదా టీచర్‌!

అసలు సమస్య

హరి: నా భార్యకి తాగుడు సమస్య ఉందిరా బాబూ!

చందు: అవునా! నీ భార్య తాగుతుందా.... నాకు చెప్పనేలేదే....

హరి: అబ్బే.. తాగేది నేనే. కానీ సమస్య మా ఆవిడది!

మాంఛి నిద్ర

వైద్యుడు: మీకు బాగా నిద్ర పట్టేందుకు
ఒక అద్భుతమైన మాత్ర రాస్తున్నాను.

రోగి: థాంక్యూ డాక్టర్‌! ఈ మందు ఎప్పుడు వేసుకోవాలి.

వైద్యుడు: ప్రతి రెండు గంటలకి ఓసారి....

ప్రాక్టికల్స్‌

తల్లి: ఇవాళ స్కూల్లో ఏం నేర్చుకున్నారు చిన్నూ!

చిన్నూ: మంటలు ఎలా వెలిగించాలో తెలుసుకున్నాం మమ్మీ.

తల్లి: వావ్‌! మరి రేపు స్కూల్లో ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు?

చిన్నూ: స్కూలా.... ఇంకెక్కడి స్కూలు!!!

పెళ్లైన కొత్తలో...

భార్య: మీరు బాగా మారిపోయారు!

భర్త: ఎందుకు డార్లింగ్‌... అంత అభాండం మోపుతున్నావు?
భార్య: కాకపోతే మరేంటి? పెళ్లయిన కొత్తలో మనిద్దరం
కలిసి భోజనం చేసేవాళ్లం. మీరు కొసరి కొసరి
అంతా నాతోనే తినిపించేవాళ్లు. ఇప్పుడేమో నాకు
ఉందో లేదో కూడా చూడకుండా తినేస్తున్నారు.

భర్త: ఓస్‌ అంతేకదా! పెళ్లయిన కొత్తలో అంటే నువ్వు
అప్పుడే వంట నేర్చుకుంటున్నావు. మరి ఇప్పుడు బాగానే చేస్తున్నావు కదా!!

Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య - 11

Responsive Footer with Logo and Social Media