Subscribe

పేజీ సంఖ్య - 15

హైదరాబాద్లో...

కొత్తగా వచ్చిన ఆకాశ్ : "ఒక్క కిలో మీటర్ లోనే పది స్టాపులా కండక్టర్గారూ” అని అడిగాడు.

బస్ కండక్టర్ : "అవి స్టాపులు కావు. స్టేజ్ బ్రేకర్లు.. అక్కడ జనం ఎక్కుతుంటారు, దిగుతుంటారు” అని చెప్పాడు.

ఆకాశ్ : మరి బస్ స్టాపులో దిగరా?" అని అడిగాడు.

కండక్టర్ : "దానికి ముందు వచ్చే స్పీడ్ బ్రేకర్ దగ్గర దిగిపోతారు” అన్నాడు.


హైదరాబాద్ సిటీ సఫారీ

రాము : "హైదరాబాద్ సిటీ చూద్దామని వచ్చాను. ఒక్క రోజులో చూడవచ్చా?" అని అడిగాడు.

సంతోష్ : “ఇది వరకు అలా చూసేవాళ్ళు. ఇప్పుడు ఒక్కోరోజు ఒక్కోప్లేసుకి వెళ్ళాలి" అన్నాడు.

రాము : "ఎందుకు?" అని అడిగాడు.

సంతోష్ : ట్రాఫిక్ జామ్ వల్ల" అని చెప్పాడు.


దేశ సేవ

టీచర్ : "ఎంతయినా పరాయి దేశం వెళ్ళి వాళ్ళకు సేవ చేసేకన్నా, సొంత దేశ సేవ మంచిది" అంది.

రాము : "ఎందుకు?" అని అడిగాడు.

టీచర్ : ఇక్కడే సేవ చేస్తే కోట్లు సంపాదించుకోవచ్చు. మన ఐ.ఏ.ఎస్. ఆఫీసర్లు, రాజకీయ నాయకులనీ చూస్తే తెలియడం లేదూ!" అంది.


సంపాదన కోరిక

రామారావు : "మా వాడికి కోట్లు సంపాదించాలని కోరిక” అన్నాడు.

సుబ్బారావు : “బిజినెస్ చేద్దామనుకుంటున్నాడా?" అని అడిగాడు.

రామారావు : దానికి వాడు ఐ.ఏ.ఎస్. అయ్యే మార్గం ఎంచుకున్నాడు. దాంట్లో బిజినెస్ లాగా లాస్ ఏమీ ఉండదట" అన్నాడు.


విభిన్న దొంగలు

రాజకీయ నాయకుడు : "నన్ను, మామూలు దొంగలతో కలిపి ఒకే సెల్లో ఉండమంటున్నారా?" అని అడిగాడు కోపంగా.

జైలర్ : "వాళ్ళకీ మీలాగే డబ్బంటే మాచెడ్డ ఆశక్తి" అని సర్దిచెప్పాడు.


సినీరంగం Vs రాజకీయ రంగం

విలేఖరి : "మీరు సినీరంగం నుండి రాజకీయ రంగానికి వెళ్తున్నారా?" అని అడిగాడు.

హీరో : "లేదు, కాని నిజానికి రాజకీయరంగం నుండి సినీరంగంలోకి వస్తేనే ఈజీగా నటించేయగలరు" అన్నాడు.


స్విట్జర్లాండ్ ప్రయాణం

సురేష్ : "నేను స్విట్జర్లాండ్ వెళ్తున్నాను.. ఈ సమ్మర్లో" అన్నాడు.

నరేష్ : "మంచి ఐడియా" అన్నాడు.

సురేష్ : "ఏంటి?" అని అడిగాడు.

నరేష్ : "అక్కడి బ్యాంకుల్లోనే మన డబ్బులు సేఫ్ అండ్ సీక్రెట్” అన్నాడు.


పిసినారి పాపారావు

పాపారావు : బస్టాండ్లో వెయింగ్ మిషన్ లో రెండు రూపాయల కాయిన్ వేసి, దానిపై నిలబడ్డాడు. దాంట్లో నుంచి బరువు ఇంకా అదృష్టంతో "మీ బ్రతుకులో ఈ రోజు లాభం కలుగుతుంది" అని వచ్చింది.

ఆ తర్వాత : తాను వేసిన రెండు రూపాయల కాయిన్ బయటకి వచ్చింది. పాపారావు ఆ రెండు రూపాయలు తీసుకొని, "లాభం వస్తుందని ఎంత కరెక్టుగా చెప్పింది" అనుకుంటూ సంతోషంగా వెళ్ళిపోయాడు.


గవర్నమెంట్ వెయింగ్ మిషన్

సుందర్ : బస్టాండులో గవర్నమెంటు వెయింగ్ మిషన్పై నిలబడి రెండు రూపాయల కాయిన్ వేశాడు.

పక్కనున్న అతను : “ఆ మిషన్ పనిచేయడంలేదు" అన్నాడు.

సుందర్ : దాంతో, నాలుగు రెండు రూపాయిల కాయిన్ల వేశాడు. తర్వాత దాంట్లో వెయిట్ చూపే పేపర్ వచ్చింది.

పక్కనతను : "అరె, ఎలా వచ్చింది?" అని ఆశ్చర్యపోతూ అడిగాడు.

సుందర్ : "నాకు గవర్నమెంట్ వాళ్లపనితీరు బాగా తెలుసు. పై ఆదాయం వస్తే ఎంతపనైనా చేస్తారు" అన్నాడు.


బస్ పాస్ ఇష్యూ

రాము : "ఎప్పుడూ నేను బస్ పాస్ చూపిస్తే కండక్టర్ 'రైట్' అనేవాడు. ఇవాళ 'రాంగ్' అన్నాడేం?" అని అడిగాడు.

శ్యామ్ : "నీ బస్ పాస్ డేట్ అయిపోయిందేమో చూసుకో" అన్నాడు.

Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -15

Responsive Footer with Logo and Social Media