పేజీ సంఖ్య - 12
అలా చేద్దాం!
‘డాక్టరు గారు నన్ను విశ్రాంతి తీసుకోవడానికి
స్పెయిన్ లేదా సింగపూర్ వెళ్లమన్నారండీ... ఎక్కడికి వెళ్దామంటారు?’
‘ఇంకో డాక్టర్ దగ్గరికి...’
స్పేర్ ఉంది...
ఇద్దరు తీవ్రవాదులు బాంబ్ ఫిక్స్ చేస్తూ
మాట్లాడుకుంటున్నారు...
‘అన్నా... బాంబుని ఫిక్స్ చేసేటప్పుడే
పేలితే ఎలా?’
‘ఏం ఇబ్బంది లేదు తమ్ముడూ...
నా దగ్గర ఇంకో బాంబు ఉంది’.
కుదరదంతే..
రావణాసురుడిని కోర్టుకి తీసుకొచ్చారు.
‘గీత మీద చెయ్యేసి ప్రమాణం చెయ్...’
‘సీత మీద చెయ్యేసినందుకే ఈ కేసు నడుస్తోంది.
ఇప్పుడు గీత మీదా? నా వల్ల కాదు’ అంటూ భయపడి పారిపోయాడు రావణుడు.
పిలిచే తీరు వేరు!
‘‘నేను అర్ధరాత్రి దొంగను చూసి.
.. ‘దొంగా... దొంగా...’ అని అరిచినా ఎవ్వరూ బయటికి రాలేదు...’’
‘‘మరేం చేశావ్?’’
‘‘తమన్నా... తమన్నా... అని కేకలు వేశా.
అందరూ తలుపులు తీసుకుని బయటకు పరుగులు పెట్టారు.
అప్పుడు దొంగను పట్టించా!’
కరెక్టే కదా...
‘ఏమండీ ఓ శుభవార్త. త్వరలో ఇంట్లో ముగ్గురం కాబోతున్నాం...’
‘ఓహ్... చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు తెలిసింది...’
‘ఇప్పుడే... మా తమ్ముడు కాల్ చేసి వస్తున్నానని చెప్పాడు..’
జంబలకిడి పంబ
హనీమూన్ నుంచి వచ్చిన తర్వాత భర్త, తన భార్య పర్సులో
ఓ యువకుడి ఫోటో గమనించాడు. మొదటి సారి దాన్ని
అంతగా పట్టించుకోలేదు. నెలయినా అది అలాగే ఉండడంతో భర్తకు మానసిక
వేదన మొదలైంది. చివరికి ధైర్యం చేసి భార్యను నిలదీశాడు.
‘అతను నీ మాజీ భర్తా?’ నీరసంగా అడిగాడు.
ఆమె భర్త బుగ్గ గిల్లుతూ ‘కాదు’ అంది.
‘అయితే నీ మాజీ బాయ్‌ఫ్రెండా?’.
భర్త చెవిలో ముద్దుగా, నెమ్మదిగా ‘కాదు’ అంది.
‘అయితే మీ అన్నయ్యా? నాన్నా?’
చేతిని నెమ్మదిగా నిమురుతూ ‘కాదు... కాదు’ అంది.
కోపంతో ‘మరి ఎవడువాడు?’ అని గద్దించాడు.
ముసిముసిగా నవ్వుతూ... సిగ్గుపడుతూ...
‘అది నేనే!! సర్జరీకి ముందు’ అంది.
ఉంటాయి గుర్తించాలి!
‘సైలెంట్ లెటర్స్ ఇంగ్లీషులో మాత్రమే ఉంటాయా,
తెలుగులో ఉండవా మాస్టారూ...!’
‘లేదు. తెలుగులో కూడా ఉంటాయి. ఉదాహరణకి కూతురిని
అత్తారింటికి పంపే ముందు మామగారు, అల్లుడితో ‘బాబూ జాగ్రత్త’
అని అంటాడు. మధ్యలో ‘నువ్వు’ అనే రెండు అక్షరాలు సైలెంటే..!’
కాకి మనసులో మాట!
‘‘వీళ్లు ఎక్కడి మనుషులురా దేవుడా...
అన్నానికి వస్తే తరుముతారు. పిండానికి రాకపోతే బతిమాలతారు..
వీళ్లని అర్థంచేసుకోలేం’’
అలా చేయండి చాలు!
‘రేపుఉదయం నీకు ఉరిశిక్ష వేయబోతున్నాం.
నీ చివరి కోరిక ఏంటో చెప్పు!’
‘ఏం లేదు సార్... నాకు మెడ దగ్గర నరం పట్టేసింది.
తలకిందులుగా ఉరి తీయండి పుణ్యం ఉంటుంది’
‘స్మార్ట్’ వైద్యం
‘నాకు నిద్ర ఎక్కువగా వస్తోంది డాక్టరుగారూ...
తెల్లారాక కూడా బెడ్ మీద నుంచి లేవాలనిపించడం లేదు...’
‘ఏ ఫోన్ వాడుతున్నారు...’
‘నోకియా 1100’
‘ఓ... అదా సమస్య. మీకో స్మార్ట్ ఫోన్ రాసిస్తాను.
అది కొని అందులో ఫేస్‌బుక్, ట్విట్టర్,
వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోండి...
అంతే ఇంక మీకు నిద్ర వస్తే ఒట్టు...’