పేజీ సంఖ్య - 73

దాంపత్యంలో... దాగుడు మూతలు

‘‘ఒంట్లో బాగోలేదండి ... ఈ పూటకి హోటల్లో తినేసి రండి’’ పడుకుని మూల్గింది వనజ.

‘‘అయ్యో ... నిన్ను షాపింగుకి తీసుకెళ్దామని పెందలాడే ఇంటికి వచ్చానే’’ బాధపడ్డాడు సుబ్రహ్మణ్యం.

‘‘అబ్బే ... బానే ఉంది. ఉత్తినే చెప్పానంతే’’ ముసుగు తీసి చెంగున గెంతింది వనజ.

‘‘నేనూ తమాషాకే అన్నాను. వెళ్లి వంట చెయ్యి’’ టవల్‌ తీసుకుంటూ తాపీగా చెప్పాడు సుబ్రహ్మణ్యం.


నవ్వాల్సిన అవసరం లేదు

ఒక కార్పొరేట్‌ ఆఫీసులో బాస్‌ జోక్‌ వేశాడు.

ఆయనకింద పనిచేస్తున్న వాళ్లలో సతీష్‌ తప్పించి మిగతావారంతా పగలబడి నవ్వారు.

కొంత సమయం తర్వాత -

‘‘నా జోక్‌కు నీకు నవ్వు రాలేదా?’’ ఆశ్చర్యంగా అడిగాడు బాస్‌.

‘‘నాకు వేరే కంపెనీలో జాబ్‌ కన్ఫర్మ్‌ అయ్యింది’’ బదులిచ్చాడు సతీష్‌


నా ఆదాయానికి గండి!

‘‘మా మావయ్య గత సంవత్సరం నుండి పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాడండీ’’ బుల్లబ్బాయి.

‘‘ఏం చేస్తున్నాడు?’’ సైక్రియాటిస్టు.

‘‘కుర్చీని కారనుకుని స్టీరింగ్‌ తిప్పుతున్నాడు’’ బుల్లబ్బాయి.

‘‘అది కారు కాదు, కుర్చీ అని చెప్పలేకపోయావా?’’ సైక్రియాటిస్టు.

‘‘ఎలా చెప్పను? కారు అనుకుని ఆ కుర్చీని కడిగినప్పుడల్లా నాకు 200 రూపాయలు ఇచ్చేవాడు’’ బుల్లబ్బాయి.


‘బిజినెస్‌’ ఫాదర్‌

‘‘ఒక అమ్మాయితో నీ పెళ్లి జరపించాలనుకుంటున్నాను’’ తండ్రి.

‘‘నో’’ పుత్రుడు.

‘‘ఆ అమ్మాయి బిల్‌గేట్స్‌ కూతురు’’ తండ్రి.

‘‘అయితే ఓకే’’ కొడుకు.

  • బిల్‌గేట్స్‌ని కలిశాడు తండ్రి.

‘‘మీ అమ్మాయిని నా కోడలుగా చేసుకుందామని వచ్చాను’’ తండ్రి.

‘‘నో’’ బిల్‌గేట్స్‌.

‘‘మా అబ్బాయి వరల్డ్‌ బ్యాంకు సిఇఓ’’ తండ్రి.

‘‘అయితే ఓకే’’ బిల్‌గేట్స్‌.

  • వరల్డ్‌బ్యాంకు ప్రెసిడెంట్‌ను కలిశాడు తండ్రి.

‘‘మా అబ్బాయికి మీ బ్యాంకులో సిఇఓగా ఉద్యోగం ఇవ్వండి’’ తండ్రి.

‘‘నో’’ ప్రెసిడెంట్‌.

‘‘మా అబ్బాయి బిల్‌గేట్స్‌ అల్లుడు’’ తండ్రి.

‘‘అయితే ఓకే’’


మగబుద్ధి

హడావిడిగా రైలెక్కిన హారిక ఒకబ్బాయితో -

‘‘మీ పక్కనున్న ఖాళీ సీట్లో కూర్చోవచ్చా?’’ అడిగింది.

‘‘ఆ సీటు మీ కోసమే’’ చెప్పాడు అబ్బాయి.

‘‘దాహంగా ఉంది. మీ బాటిల్లోని నీళ్లు తాగొచ్చా’’ అడిగింది హారిక.

‘‘మై ప్లెజర్‌!’’ చెప్పాడు అబ్బాయి.

కాసేపయ్యాక -

‘‘అన్నయ్యా ... రాబోయే స్టేషన్‌ ఏది?’’ అడిగింది అమ్మాయి.

‘‘నా బుర్రలో దివ్యశక్తి ఉందనుకున్నావా? లెగు లెగు ... నిద్రొస్తుంది నాకు’’ కసురుకున్నాడు అబ్బాయి.


ప్రయత్నించు!

టీ కప్పులో టీ చూడగలను నేను!

వరల్డ్‌ కప్పులో వరల్డ్‌ చూడగలవా నువ్వు?

నీ సెల్‌కి నా అడ్రస్‌ పంపగలను నేను!

నా అడ్రస్‌కి నీ సెల్‌ పంపగలవా నువ్వు?


బద్ధకాల బాబు

‘‘బాధకీ భయానికి తేడా ఏమిట్రా?’’ అడిగాడు ఆనందం.

‘‘బాధ పడితే షర్టు తడుస్తుంది. భయపడితే నిక్కరు తడుస్తుంది’’ ఠపీమని చెప్పాడు భాస్కరం.


దటీజ్‌ మొగుడు!

ఒక భర్త రాత్రి పొద్దుపోయాక తన భార్యకు ఇలా ఎస్‌.ఎం.ఎస్‌. చేశాడు.

‘‘నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన దేవతవు నువ్వు. నీకు సర్వదా కృతజ్ఞుడను. ఇప్పుడు నేనీ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం నువ్వే’’

‘‘ఇవ్వాళ కూడా మందు ఎక్కువై నట్టుంది. నా ఖర్మ. ఏమీ అననులే. ఇంటికి తగలడు’’ అని రిప్లయ్‌ ఇచ్చింది.

వెంటనే భర్త ‘‘థాంక్స్‌ - నేను ఇంటి బయటే ఉన్నాను. దయచేసి తలుపు తియ్‌’’ అంటూ మరో ఎస్‌.ఎం.ఎస్‌. ఇచ్చాడు.


అదీ సంగతి!

‘‘బాబూ అన్నం తిని మూడు రోజులైంది. ఒక రూపాయి ఉంటే దానం చెయ్యండి’’ చెయ్యి చాచింది బిచ్చగత్తె.

‘‘ఒక్క రూపాయితో ఏమొస్తుంది?’’ ఆశ్చర్యపోయాడు శంభులింగం.

‘‘ఎంత వెయిట్‌ తగ్గానో చూసుకుంటానయ్యా’’ చెప్పింది బిచ్చగత్తె.


పందెం గెలిచింది

ఒక కోడికి పూలదండ వేసి వీధిలోని కోళ్లన్నీ కలిసి ఊరేగిస్తున్నాయి. ఆ సంబరం చూసిన ఒక కాకి పక్క కాకిని ‘‘ఎన్నికల్లో గెలిచిందా?’’ అని అడిగింది.

‘‘కాదు - చికెన్‌ షాపు ముందుకెళ్లి తొడకొట్టిందట!’’ చెప్పింది పక్క కాకి.


ఆయన చేతిలో లేదు

‘‘గత పదేళ్లుగా కఠోర తపస్సు చేస్తున్నా ... దేవుడు ప్రత్యక్ష్యం కావటం లేదు స్వామీ?’’ అడిగాడు జూనియర్‌ స్వామి.

‘‘ఏం కోరుకుందామని ఈ తపస్సు?’’ కళ్లు విప్పి అడిగాడు సీనియర్‌ స్వామి.

‘‘ధరలు తగ్గించమని అడుగుతా’’ నిజాయితీగా చెప్పాడు జూనియర్‌.

‘‘ఈ జన్మలో నీకు దేవుడు ప్రత్యక్షం కాడు’’ మళ్లీ కళ్లు మూసుకుంటూ అన్నాడు సీనియర్‌.


వీరు వారవలేరు

‘‘మనిషికీ, గాడిదకీ తేడా చెప్పు చూద్దాం?’’ అడిగాడు పంతులు కోదండరామయ్య.

‘‘మనిషి గాడిద కాగలడు కానీ, గాడిద మనిషి కాలేదండి’’ చెప్పాడు వీరబాబు.


యమ ‘కంత్రీ’

ముగ్గురమ్మాయిలు నరకానికి వెళ్లారు. ‘ముద్దు’ అనుభవం ఉందా అని ఆరాతీశాడు యమభటుడు.

‘‘నేను పెళ్లికి ముందు నా బాయ్‌ ఫ్రెండుకు కిస్సిచ్చా’’ - మొదటి అమ్మాయి.

‘‘నీవు నరకానికి - ఫో’’ - యమభటుడు.

‘‘పెళ్లయ్యాక మా ఆయనకి కిస్సిచ్చా’’ - రెండో అమ్మాయి.

‘‘నీవు స్వర్గానికి పో’’ - యమభటుడు.

‘‘జీవితంలో ఎప్పుడూ ఎవరికీ కిస్సివ్వలేదు’’ - మూడో అమ్మాయి.

‘‘నీవు నా గదిలోకి పో’’ ఆనందంగా అన్నాడు యమభటుడు.


ఓల్డెస్ట్‌ యానిమల్‌

‘‘భూమ్మీద ఇప్పటికీ కనిపించే అతి ప్రాచీన జంతువు ఏది?’’

‘‘జీబ్రా’’

‘‘ఎలా?’’

‘‘ఇప్పటికి అది బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనే ఉంటుంది కాబట్టి’’


మోడ్రన్‌ చిలకమ్మ !

‘చిట్టి చిన్నోడా ... లవ్వర్‌ తిట్టిందా?

బారుకెళ్లావా? బీరు కొన్నావా?

ఫ్రిజ్‌లో పెట్టావా? గుటుక్కుమన్నావా?

కిక్కు ఎక్కిందా? కక్కుకున్నావా?’


ఒళ్లు వంచడు మరి !

‘‘ఏమే ... సుజాతా, మీ ఆయన్ని పదేళ్ల క్రితం చూశాను. బాగున్నాడా? అప్పుడు కోకాకోలా బాటిల్లా స్మార్ట్‌గా ఉండేవాడు’’ పలకరించింది వనజ.

‘‘నీవు చూసింది 300 మి.లీ. బాటిల్‌ని. అదిప్పుడు 3 లీటర్ల బాటిల్‌ అయ్యింది ’’ వాపోయింది సుజాత.


రైల్వే ప్రమాదం

వీరబాబు రైల్వే ఇంటర్వ్యూకి వెళ్లాడు.

‘‘గతంలో మీరు రైల్లో ప్రయాణిస్తుండగా యాక్సిడెంట్‌ ఏదైనా జరిగిందా?’’ ప్రశ్నించాడు అధికారి.

‘‘జరిగింది. ఒకసారి అరకు రూట్‌లో సొరంగం వచ్చినప్పుడు నా ముందున్న అమ్మాయికి కిస్‌ ఇవ్వబోయి పొరబాటున వాళ్ల నాన్నకిచ్చాను’’ చెంప తడుముకుంటూ చెప్పాడు వీరబాబు.


మాలోకం

‘‘మీరేం చదువుకున్నారు?’’ అడిగాడు సర్దార్‌జీ.

‘‘బి.ఏ.’’ చెప్పాడు సిద్దిక్‌.

‘‘రెండక్షరాలేనా ... అదీ తిరగేసి’’ ఫక్కుమన్నాడు సర్దార్‌జీ.


ఒకరికొకరు

‘‘ఒరేయ్‌ ... చింటూ, మీ టీచరమ్మ మన ఇంటివైపే వస్తోంది. ఈ రోజు స్కూల్‌కి డుమ్మా కొట్టావుగా. త్వరగా వెళ్లి ముసుగుతన్ని పడుకో. జ్వరం వచ్చిందని సర్ది చెబుతాలే’’ చెప్పాడు తాతయ్య.

‘‘పడుకోవల్సింది నీవే ... నీకు జ్వరమొచ్చిందని చెప్పి డుమ్మా కొట్టాను’’ కంగారుపెట్టాడు మనవడు.


సలహా

‘‘మా టామీ నిన్నట్నుంచి కనిపించడం లేదు. నా మనసేమీ బాగులేదురా’’ వాపోయాడు జోగినాథం.

‘‘దానికంత బాధెందుకురా ... పేపర్లో ప్రకటన ఇవ్వచ్చుగా’’ సలహా ఇచ్చాడు రంగనాథం.

‘‘ఇస్తే లాభం ఏమిటి? దానికి చదవడం, రాయడం రాదుగా’’ చెప్పాడు జోగినాథం.


Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -73

Responsive Footer with Logo and Social Media