పేజీ సంఖ్య - 65

సరిపోయాయా లేదా?

‘‘వారానికి ఎన్ని రోజులు?’’ అడిగింది టీచర్‌.

‘‘ఏడు టీచర్‌’’ చెప్పాడు యూకెజి బన్ని.

‘‘వెరీ గుడ్‌ .. వాటి పేర్లు చెప్పు చూద్దాం’’ మళ్లీ అడిగింది టీచర్‌.

‘‘నిన్న, మొన్న, అటుమొన్న, ఈరోజు, రేపు, ఎల్లుండి, ఆవలెల్లుండి’’ గబగబా అప్పచెప్పాడు బన్ని.


నర్స్‌ మహిమ

‘‘ఇప్పుడెలా ఉంది మీ కండిషన్‌?’’ అడిగాడు డాక్టర్‌.

‘‘ఏమంత బాగాలేదు .. కాని మీ నర్స్‌ వచ్చినప్పుడు మాత్రం కాస్తంత లేవగలుగుతున్నాను డాక్టర్‌’’ చెప్పాడు పేషెంట్‌.


కారణం తెలిసింది

‘‘మన సంపాదన ఎందుకు సరిపోవడం లేదో ఇన్నాళ్లకు అర్థమయ్యింది నాకు’’ చెప్పింది శ్రీవాణి.

‘‘అవునా .. ఎందుకంటావు?’’ ఆసక్తిగా అడిగాడు బాబూరావు.

‘‘నేను ఖర్చు పెట్టినంత వేగంగా మీరు సంపాదించలేకపోతున్నారు’’ వివరించింది శ్రీవాణి.


ఈ సహాయం చేయండి చాలు

‘‘హలో సార్‌, వెల్‌కమ్‌ టు కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ .... మీకు మేము ఏ విధంగా సహాయ పడగలము?’’

‘‘నేను ఎవరికి కాల్‌ చేసినా ఆ కాల్‌ కాస్ట్‌ అవతలి వ్యక్తికి పడేలా చేయగలరా?’’

‘‘ ..... ..... ....... ..... !’’


సెంటిమెంట్‌ లేడీ

‘‘వదినా .. నువ్వెప్పుడూ ఆకుకూరలే వండుతుంటావెందుకు?’’ ఆసక్తిగా అడిగింది కామాక్షి.

‘‘మా కాపురం నిత్యం పచ్చగా ఉండాలని’’ తడుముకోకుండా చెప్పింది మీనాక్షి.


నేటి కూతురు

‘‘మొన్నటి వరకు పప్పా పప్పా అని పిలిచేదానివి .. ఇప్పుడేమిటే డాడీ డాడీ అని మొదలెట్టావు?’’ ఆరా తీసింది తల్లి.

‘‘పప్పా అని పిలుస్తుంటే లిప్‌స్టిక్‌ కరిగి పోతోంది’’ చెప్పింది మోడ్రన్‌ కూతురు.


బూతు ర్యాగింగ్‌

‘‘నీకు వచ్చిన బూతులు కొన్ని వినిపించు. అప్పుడే నిన్ను వదిలేస్తాం’’ ర్యాగింగ్‌లో భాగంగా అన్నాడు సీనియర్‌ స్టూడెంట్‌.

‘‘మిల్క్‌ బూతు, టెలిఫోన్‌ బూతు, పోలింగ్‌ బూతు’’ గుక్కతిప్పుకోకుండా అప్పగించాడు జూనియర్‌ స్టూడెంట్‌.


అందుకు సిద్ధం చేస్తున్నా!

‘‘కోడికి ఈత నేర్పిస్తున్నావెందుకు?’’

‘‘డాక్టర్‌ నన్ను ఓన్లీ ‘సీ-ఫుడ్‌’ మాత్రమే .. అంటే నీటిలో జీవించే వాటినే తినమని చెప్పాడు’’

‘‘అయితే ...’’

‘‘నాకు చేపలంటే ఎలర్జీ. అందుకే కోడికి ఈత నేర్పిస్తున్నాను..’’


తెలివైనోడు!

‘‘అయ్యో .. చేతికి ఆ కట్టేంటి?’’

‘‘మిషన్లో పడింది సార్‌ ...’’

‘‘బాధపడకు .. అదృష్టం బాగుండి ఎడమ చేతికి తగిలింది గాయం. అదే కుడి చెయ్యికి అయ్యుంటే ...’’

‘‘అది కూడా నా తెలివి వల్లనే సార్‌. నిజానికి ముందు నా కుడి చెయ్యే మిషన్లో పెట్టాను. వెంటనే కుడిచెయ్యి విలువ ఏంటో గుర్తుకొచ్చి చప్పున దాన్ని తీసేసి ఎడం చేయి పెట్టాను.’’


మందులే శరణ్యం

‘‘మా వారికి జ్ఞాపకశక్తి పూర్తిగా సన్నగిల్లింది డాక్టరుగారూ. మెమొరీ కార్డు వేయించాల్సి ఉంటుందంటారా?’’ ఆత్రంగా అడిగింది అలివేలు.

‘‘ఇంకా టెక్నాలజీ అంత అభివృద్ధి చెందలేదమ్మా.. అంతవరకూ మందులు రాస్తాను వాడండి’’ చెప్పాడు డాక్టర్‌ మిత్ర.


నిలువుదోపిడి

‘‘ఆపరేషన్‌ అయ్యాక నువ్వు నడుచుకుంటూ ఇంటికి వెళ్లవచ్చు’’ చెప్పాడు డాక్టర్‌.

‘‘అంటే .. ఆటోకి కూడా డబ్బులు మిగలవా డాక్టర్‌?’’ భయంగా అడిగాడు పేషెంటు.


వెరీ సింపుల్‌!

‘‘కోడి నిర్వచనం చెప్పు?’’ అడిగింది టీచరమ్మ.

‘‘కూస్తే గడియారం, కోస్తే ఫలహారం’’ చెప్పాడు బంటీ.


బుర్రుండాలోయ్‌!

‘‘యుద్ధానికి వెళుతూ బుల్లెట్‌ ప్రూఫ్‌ వేసుకోవాలి గాని దోమతెర ముసుగేసుకుని వెళ్తారా ఎవరైనా?’’ ఆశ్చర్యపోయాడు శేషాచలం.

‘‘దోమలే దూరలేనప్పుడు బుల్లెట్‌ ఎలా దూరుతుందో కాస్త ఆలోచించు’’ తెలివిగా ప్రశ్నించాడు వెంకటాచలం.


మనసు మాట వినదు

‘‘ఏమండీ .. ముంతాజ్‌ పోయాక షాజహాన్‌ తాజ్‌మహల్‌ కట్టాడు. ఒకవేళ నేను పోయాననుకోండి .. ఏం కడతారు?’’ గోముగా అడిగింది ఆనందలక్ష్మి.

‘‘మరో అమ్మాయి మెడలో తాళి కడతాను’’ మనసులో మాటను అనుకోకుండా బయటపెట్టాడు ఆనందవిహారి.


జైల్లో ఏం కనిపెట్టగలం?

‘‘న్యూటన్‌ చెట్టుకింద కూర్చుని గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టాడు. దీన్ని బట్టి నీకు ఏమర్థయింది?’’ అడిగింది టీచర్‌ వినోదిని.

‘‘ఇలా క్లాసులోనే కూర్చుంటే కొత్త విషయాలు ఏవీ కనిపెట్టలేమని ...’’ అసహనంగా చెప్పాడు విద్యార్థి విద్యాధర్‌.


అడ్జెస్ట్‌ అవుతాన్లెండి!

‘‘హలో .. నేను ఆన్‌ లైన్లో బుక్‌ చేసిన అండర్‌ వేర్స్‌ వచ్చాయి. కానీ వాటికి పెద్ద పెద్ద పెద్ద రెండు రంధ్రాలున్నాయి’’ చెప్పాడు తిమ్మన్న.

‘‘సారీ సార్‌. పొరపాటైంది. వెంటనే రీప్లేస్‌ చేస్తాం’’ జవాబిచ్చింది కస్టమర్‌ కేర్‌ అమ్మాయి.

‘‘పర్లేదు లెండి. ఆ కన్నాల్లో నా కాళ్లు పెట్టుకుంటున్నా ...’’ చెప్పాడు తిమ్మన్న.


ముందు జాగ్రత్త చర్య

‘‘ఆవిడ భర్తను ఎందుకు చంపిందో కనుక్కున్నావా?’’ అడిగాడు ఎస్‌.ఐ.

‘‘ఆవిడ కడిగిన ఇల్లు తొక్కేశాడన్న కోపంతో రోకలి విసిరేసిందని చుట్టుపక్కల జనం చెబుతున్నారు సార్‌’’ వివరించాడు పోలీస్‌.

‘‘వెంటనే ఆవిడ్ని అరెస్టు చెయ్‌ .. ’’ ఆర్డరేశాడు ఎస్‌.ఐ.

‘‘ఆవిడ ఇంకా ఇంట్లోనే ఉందండి. లోనకి వెళ్దామంటే ఇల్లింకా ఆరలేదు ...’’ చెప్పాడు పోలీస్‌.


పేరు మార్చాలి!

‘‘మీ ఇంటినిండా చీమలే .. మందు చల్లించలేకపోయారా?’’ సలహా ఇచ్చింది సుజాత.

‘‘లాభం లేదు సుజాతా .. ఇంటి ముందు ‘స్వీట్‌హోం’ అనే అక్షరాలు ఉన్నంత కాలం వాటిని బయటికి పంపడం అంత సులభం కాదు ..’’ వాపోయింది అరవింద.


‘‘మన అల్లుడుగారు కొత్త బైక్‌ కొనిస్తే గాని దసరా పండక్కి రానని అలిగితే .. అప్పో సప్పో చేసి కొనిచ్చాం. మరి పండగైపోయి వారమైనా కదలడేం?’’ అనుమానం వ్యక్తపరచాడు వీరభద్రం.

‘‘లాప్‌టాప్‌ కొనిస్తేగాని ఇల్లు కదలనని మన అమ్మాయితో చెప్పాడటండీ’’ తల బాదుకుంది అన్నపూర్ణమ్మ.


చెప్పలేను

లావుగా, అందంగా ఉన్న ఓ యువతి డాక్టర్‌ని కలిసింది.

డాక్టర్‌: బరువు ఎన్ని కిలోలు ఉన్నారు?

యువతి: కళ్ళద్దాలసహా 120 కిలోలు.

డాక్టర్‌: కళ్ళద్దాలు తీసేస్తే ఎంత ఉన్నారు?

యువతి: చెప్పలేను, కళ్ళద్దాలు తీసేస్తే నాకేమీ కనిపించదు సార్‌.


లేదే

ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అబ్బాయితో అమ్మాయి అన్నదిలా.

‘‘ఇంక నువ్వు అమ్మాయిల్ని చూడ్డానికి వీల్లేదు. నాతో కమిట్‌ అయిపోయావు.’’

‘‘అయితే? నేను డైట్‌లో ఉన్నాను, ఉన్నంత మాత్రాన మెనూ చూడకూడదని ఎక్కడా రాసి లేదే’’


డాడీ

కొడుకు దగ్గరకు వచ్చాడు తండ్రి. అడిగాడు.

‘‘ఒరేయ్‌! నీ ఫోనోసారివ్వరా?

‘‘ఇస్తున్నాను డాడీ! ఒక్క క్షణం, స్చిచ్ఛాన్‌ చేసి ఇస్తా’’ అన్నాడు కొడుకు. అని గబగబా గర్ల్‌ఫ్రెండ్‌ ఫోటో డిలీట్‌ చేశాడు. అలాగే అమ్మాయిల ఫోన్‌నెంబర్లు డిలీట్‌ చేశాడు. దాంతో ఫోన్‌కాల్‌ రిసీవ్‌ చేసుకోవడాన్ని కూడా డిలీట్‌ చేశాడు. ఇంకా చాలా డిలీట్‌ డిలీట్‌ డిలీట్‌ చేశాడు. చేసి ధైర్యంగా ఫోనిచ్చాడు తండ్రికి. అడిగాడు.

‘‘ఫోనెందుకు డాడీ?’’

‘‘టైమెంతయ్యిందో చూద్దామని.’’

‘‘డాడీ’’ గొల్లుమన్నాడు కొడుకు.


మందుబాబులకు ఇవ్వబడదు!

‘‘నా మిత్రుడికి ఇల్లు అద్దెకు ఇవ్వనని అన్నావట ఎందుకు?’’

‘‘తాగుబోతులకు ఇల్లు అద్దెకు ఇవ్వను’’

‘‘వాడు తాగుబోతన్న విషయం ఎవరు చెప్పారు నీకు?’’

‘‘ఒకరు చెప్పక్కర్లేదు. ఇల్లు చూడ్డానికి వచ్చిన రోజే అటాచ్డ్‌ బారుందా అని అడిగాడు’’


నేర్చుకున్న పాఠం

‘‘ఎక్కువగా పెళ్లయిన మగాళ్లకే పొట్ట వస్తుంది ఎందుకురా?’’ అడిగాడు వీరబాబు.

‘‘బాధలన్నీ కడుపులోనే దాచుకుంటారు కాబట్టి’’ చెప్పాడు బుచ్చిబాబు.


పిచ్చర పిడుగు

‘‘అమ్మా .. ఇందాకట్నించి ఎండలో ఒక ముసలాయన అరుస్తున్నాడు. పదిరూపాయలివ్వమ్మా ..’’

‘‘అయ్యో పాపం ... ఇదిగో ఇచ్చేసిరా నాయనా .. ఇంతకీ ఏమని అరుస్తున్నాడ్రా?’’

‘‘ఐస్‌ క్రీం .. ఐస్‌ క్రీం .. అని’’

‘‘ఆఁ ...!’’


అమ్మ పనే!

‘‘అక్కా .. ఆకాశం చూడు ... ఎంత తళ తళ మెరుస్తోందో?’’ చెల్లెలు.

‘‘అవును .. అమ్మ surf excelతో ఉతికి ఆరేసిందనుకుంటానే ..’’ అక్క.


Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -65

Responsive Footer with Logo and Social Media