పేజీ సంఖ్య - 69

మా పద్ధతిలో ...

‘‘ఒక్క మాథ్స్‌లో తప్పించి మిగతా అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిలయ్యావు ఎందుకురా..’’

‘‘మాథ్స్‌ సారు ఒక్కరే మాకు అర్థమయ్యేలా చెబుతారు డాడీ ..’’

‘‘అంటే ...?’’

‘‘3ష x 3ష = 9 తార .. ఇిాగన్నమాట!’’


నేను సినిమా చూడాలి

పెళ్లయ్యాక మొదటిసారి భార్యతో కలిసి సినిమాకు వెళ్లాడు ఘనశ్యామ్‌. ఇంటర్వెల్‌లో బయటకి వెళ్లి పావుకిలో బఠాణీల పొట్లం తీసుకొచ్చి భార్య చేతిలో పెట్టాడు. ఆమె రెండు బఠాణీలు కటకట మనిపించి ‘‘మీరూ తీసుకోండి’’ అని పొట్లం అందించింది.

‘‘అక్కర్లేదు .. అవి నీకోసమే. నేను మాట్లాడకుండా సినిమా చూడగలను’’ మెడ తిప్పకుండా బదులిచ్చి కళ్లను తెరకప్పగించేశాడు ఘనశ్యామ్‌.


వడియాలివ్వండి!

‘‘శర్మా .. ఇలా రాస్తే నేను నీకు గుడ్లు ఇవ్వక తప్పదోయ్‌ .. ’’ ఆన్సర్‌ పేపర్‌ దిద్దుతూ అంది టీచర్‌.

‘‘అయ్యో ... గుడ్లు వద్దు మేడమ్‌. మేం శాకాహారులం’’ బతిమాలాడు శర్మ.


నీ కొడుకుని నాన్నారూ ..

‘‘ఏరా నిన్న ఒకమ్మాయితో కలిసి రెస్టారెంట్‌లోకి వెళ్లడం చూశాను ... బిల్‌ ఎంతయ్యిందేమిటి?’’ నిలదీశాడు తండ్రి.

‘‘సుమారు ఏడువేలయింది నాన్నారూ ..’’ చెప్పాడు తనయుడు.

‘‘అమ్మో .. ’’ నోరుబాదుకున్నాడు తండ్రి.

‘‘ఆ అమ్మాయి దగ్గర అంతకంటే ఎక్కువలేవు మరి’’ చెప్పాడు తనయుడు.


ఏ గాన్‌ అయితేంటి?

చెత్త కుండీలో కొస ప్రాణంతో కొట్టుకుంటున్నాయి రెండు బొద్దింకలు.

‘‘నీది కూడా బేగాన్‌ దెబ్బేనా?’’ అడిగింది మొదటి బొద్దింక.

‘‘కాదు. పారగాన్‌’’ చెప్పింది రెండో బొద్దింక.


అలా వచ్చానన్నమాట!

‘‘డాడీ .. మార్కెట్లోకి కొత్త రకం టీవీని మంచి ఆఫర్‌లో అమ్ముతున్నారు. కొనడానికి డబ్బుందా..’’ అడిగాడు పుత్రరత్నం.

‘‘ఉంది. కాని మనింట్లో ఆల్రెడీ ఒక టీవీ ఉంది కదరా .. ’’ చెప్పాడు దామోదరం.

‘‘నిజానికి నాకు డబ్బు కావాలి. డైరెక్టుగా డబ్బుందా అంటే మీరు కచ్చితంగా లేదంటారని ...’’ అసలు సంగతి చెప్పాడు పుత్రరత్నం.


పిడుగు

‘‘బంగారం లాంటి పాలు .. పిల్లి పాలు చేశావు కదరా ..’’ అరిచింది తల్లి.

‘‘గేదెపాలు పిల్లిపాలు ఎలా అవుతాయమ్మా .. విడ్డూరం కాకపోతే’’ ప్రశ్నించాడు సుపుత్రుడు.


సలహా

‘‘ఒకమ్మాయిని పడేయాలంటే ఏం మిషన్‌ ఉపయోగించాలో అది నేర్పించండి’’ చెప్పాడు సుధాకర్‌ జిమ్‌ మాస్టారుతో.

‘‘అలాంటి మిషన్లు ఇక్కడ లేవు. బయటకెళ్లి ఎ.టి.ఎమ్‌. మిషన్‌ ఉపయోగించు’’ సలహా ఇచ్చాడు జిమ్‌ మాస్టర్‌.


సలహాల వైద్యుడు

‘‘ఈ మధ్య కళ్లు బాగా లాగేస్తున్నాయి డాక్టర్‌’’ చెప్పాడు మదన్‌ కుమార్‌.

కళ్లు పరీక్షించి ‘‘కొన్నాళ్లపాటు లేడీస్‌ హాస్టల్‌ వైపు వెళ్లడం మానేయండి’’ సలహా ఇచ్చాడు డాక్టర్‌ ఏఝదంతం.


రివర్స్‌గేర్‌

‘‘ఒక స్వెట్టర్‌ అల్లడానికి మూడు గొర్రెలు కావాలి తెలుసా?’’ చెప్పింది అనసూయ.

‘‘ఏమిటేమిటి ... గొర్రెలు కూడా స్వెట్టర్లు అల్లడం నేర్చేసుకున్నాయా ...’’ ముక్కున వేలేసుకుంది మంగతాయారు.


అసరసుడు

అప్పుడే స్నానం చేసి వచ్చిన అలివేలుని తినేసేలా చూశాడు ఆనందరావు.

‘‘మీరలా చూడకండి బాబూ ... చచ్చేంత సిగ్గు నాకు’’ మెలికలు తిరిగింది అలివేలు.

‘‘నేను పెట్టుకున్న వేన్నీళ్లతో ఎందుకు స్నానం చేశావ్‌?’’ గుడ్లురిమాడు ఆనందరావు.


ఆలోచనలో బిజీగా ఉన్నా

‘‘ఏరా .. గంటనుండి దీర్ఘంగా ఏదో ఆలోచిస్తూ ఉన్నావు?’’ అడిగింది టీచర్‌.

‘‘సమయాన్ని వృథా చేయకుండా ఉండడం ఎలా అని ఆలోచిస్తున్నాను టీచర్‌’’ చేతులు కట్టుకుని చెప్పాడు విద్యార్థి.


నాదెప్పుడూ ఒకటే మాట!

‘‘అప్పు తీసుకుని ఏడాది దాటిపోయింది .. ఇంతవరకు బాకీ తీర్చే సూచనలేవీ కనిపించడం లేదు’’ నిలదీశాడు సుబ్బిశెట్టి.

‘‘మళ్లీ అడుగుతావేం? అప్పు తీసుకున్నప్పుడే చెప్పాగా ..’’ అన్నాడు కోదండరామయ్య.

‘‘ఏం చెప్పావు?’’ నొసలు చిట్లించాడు సుబ్బిశెట్టి.

‘‘నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనని’’ తాపీగా బదులిచ్చాడు కోదండరామయ్య.


మార్గం ఉంది నాయనా!

‘‘డాక్టరుగారూ .. ఇంజక్షన్‌ అంటే నాకు భయమండి. మరో మార్గమేదైనా ఉంటే చూద్దురూ’’ భయంగా అన్నాడు గంగాధరం.

‘‘అలాగే .. ఈ మత్తుమందు పీల్చండి. మీరు మూర్ఛపోయాక ఇంజక్షన్‌ చేస్తాను’’ చెప్పాడు డాక్టర్‌ జ్ఞానానందం.


స్వర్గసీమలో ...

‘‘ఏమండీ .. స్వర్గంలో భార్యాభర్తలను ఒకే చోట ఉంచరట ...’’ టీవీలో మోక్షానంద స్వామి ప్రవచనాలు వింటూ అరిచింది సుబ్బలక్ష్మి.

‘‘అలా ఉంచితే అది స్వర్గమెలా అవుతుంది ...’’ వంటింట్లోంచి బదులు పలికాడు వీరబాబు.


ఇకనుండి నోట్లివ్వండి!

‘‘చిల్లర తిండి తినవద్దని నీకు ఎన్ని సార్లు చెప్పానురా’’ కసిరాడు తండ్రి.

‘‘కాని నువ్వు నాకిచ్చింది కూడా చిల్లరే కదా డాడీ’’ అమాయకంగా అడిగాడు పుత్రరత్నం.


గొడవలో గోవిందం!

ఏదో మిష మీద టైపిస్టు సుభద్ర, గుమాస్తా సూరిబాబు రెచ్చిపోయి తిట్టుకుంటున్నారు.

‘‘ఛీ ఛీ .. నీలాంటి కుక్క ఈ ఆఫీసులో మరొకడు లేడు’’ అరిచింది సుభద్ర.

అప్పుడే ఆఫీసులోకి అడుగుపెట్టిన మేనేజరు ‘‘ఏంటా అరుపులు ... ఇక్కడ నేనున్నాను’’ అన్నాడు కోపంగా.


తప్పులెన్ను మగడు

‘‘డార్లింగ్‌ మన పెళ్లయిన ఈ ఒక్కరోజులోనే నీలో లోపాలెన్ని ఉన్నాయో కనిపెట్టాను ... చెప్పమంటావా?’’ అన్నాడు శేషగిరి.

‘‘ఒప్పుకుంటానండి. నాలో లోపాలు ఉండబట్టే మంచి భర్తను పొందలేకపోయాను ..’’ అమాయకంగా అంటించింది ఆదిలక్ష్మి.


నీ తాత దిగిరావాలి

‘‘ఐ లవ్‌ యూ’’ ప్రపోజ్‌ చేసింది కోడిపుంజు.

‘‘సారీ ... ఐ కాంట్‌ ’’ ముఖం తిప్పుకుంది పెట్ట.

‘‘నీకోసం ఏమైనా చేస్తా ... గుండు ఎత్తమంటావా?’’ తొడకొట్టింది పుంజు.

‘‘గుడ్డు పెట్టు చాలు’’ చెప్పింది పెట్ట.


తొక్కలో సూక్తి

‘‘జీవితంలో మీరంతా గుర్తుపెట్టుకోవలసింది ఒకటుంది. ఏ చెట్టయినా గాలి వీస్తే ఊగుతుంది ... వీయకపోతే ఊగదు’’

  • శ్రీశ్రీశ్రీ వృక్షానందగిరిస్వాములు.


చావు ముందే రాకూడదా!

తన చుట్టూ ఉన్న అప్సరసలను ఆబగా చూస్తూ‘‘ఈ దివ్యమైన చావు 60 ఏళ్ల క్రితమే ఎందుకు రాలేదని’’ కళ్లు తుడుచుకుంటూ చెప్పాడు భద్రయ్య.


ఏ క్లాస్‌ వెంగళప్ప

‘‘అలా తిరగడం దేనికి? కుదురుగా ఒక దగ్గరుండి ఫోన్‌ చేసుకోవచ్చు కదా’’ సలహా ఇచ్చింది అలివేలు.

‘‘నా ఫ్రెండ్‌కు కాల్‌ చేస్తే ‘తిరిగి’ ప్రయత్నించండి అంటోంది ఎవరో అమ్మాయి - అందుకే’’ చెప్పాడు వీరభద్రం.


తండ్రి తెలివి

‘‘డాడీ ... నీటినుండి కరెంట్‌ ఎందుకు తీస్తారు?’’ అడిగాడు పుత్రరత్నం.

‘‘మనం స్నానం చేసినప్పుడు షాక్‌ కొడుతుందని’’ చెప్పాడు జనకుడు.


రేటు కనుక్కో!

పెళ్లాం దొంగ మొగుడితో -

‘‘ఇదిగో నిన్నే ... చుట్టు పక్కలవాళ్లు మన టీవీ రేటెంతని అడుగుతుంటే చెప్పలేక సిగ్గుతో చస్తున్నా ... రేపయినా దాని రేటెంతో షాపులో కనుక్కో’’


పండంటి కాపురం

‘‘నేను నిన్ను ఒక్కసారైనా చూడకుండా పెళ్లికి ఎలా ఒప్పుకున్నానో అర్థం కావడం లేదు ... ’’ భార్య.

‘‘హూఁ ... నేను నిన్ను చూసి కూడా ఎలా పెళ్లి చేసుకున్నానో నాకు అర్థం కావడం లేదు?’’ భర్త


కొంప మునిగింది

వరుడి పేరు శేషు, వధువు పేరు కీర్తి.

ఆ మార్యేజ్‌ హాలు ముందు వధూవరుల ఫోటోలతో పాటు ‘‘కీర్తిశేషుల వివాహానికి తరలిరండి’’ అని రాసి ఉంది.


మొదటిసారి

జంబులింగం జీవితంలో మొదటిసారి శంభులింగంతో కలిసి ఒక స్టార్‌ హోటల్‌కు వెళ్లాడు.

‘‘ఏం కావాలి సార్‌?’’ శంభులింగాన్ని ఉద్దేశించి అడిగాడు వెయిటర్‌.

‘‘మెనూ తీసుకురా’’ చెప్పాడు శంభులింగం.

వెయిటర్‌ తనని అడక్కముందే ‘‘నేను కూడా మెనూనే తింటాను’’ చెప్పాడు జంబులింగం.


కాపీ కొట్టకుండా ...

‘‘ఆపరేషన్‌కు ముందు పేషంట్‌కు మత్తుమందు ఎందుకు ఇస్తారో చెప్పగలవా రామూ?’’ అడిగింది టీచర్‌.

‘‘తాము చేసే ఆపరేషన్‌ పేషంటు చూసి నేర్చుకుంటాడేమోనన్న భయంతో అయ్యుంటుంది టీచర్‌’’ చెప్పాడు రాజు.


బాధల గని

‘‘పెళ్లయిన మగాళ్లకే ఎక్కువగా పొట్ట వస్తుంది ఎందుకురా?’’ అడిగాడు ఒకటో తాగుబోతు.

‘‘బాధలన్నీ కడుపులో దాచుకుంటారు కాబట్టి’’ చెప్పాడు రెండో తాగుబోతు.


Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -69

Responsive Footer with Logo and Social Media