పేజీ సంఖ్య - 64

సమయస్ఫూర్తి

‘‘ఇంట్లో దొంగలు పడ్డారని మీరిచ్చిన ఫిర్యాదు మీద కొన్ని వస్తువులను సేకరించాము. ఈ కుప్పలో మీ వస్తువులేమైనా ఉన్నాయేమో గుర్తుపట్టగలరా?’’ అడిగాడు ఎస్‌.ఐ.

‘‘ఈ చేతి రుమాలు నాదేనండి’’ చెప్పాడు వెంకటేశు.

‘‘అది నీదే అన్న గ్యారంటీ ఏమిటి?’’ అడిగాడు ఎస్‌.ఐ.

‘‘రుమాలు చివర ‘ఎల్‌’ అనే అక్షరం ఉంటుంది’’ వెంకటేశు.

‘‘నా దగ్గర కూడా అలాంటి అక్షరం ఉన్న రుమాలుంది. అదెలా సాధ్యమవుతుంది?’’ కోపంగా అడిగాడు ఎస్‌.ఐ.

‘‘నిజానికి నావి రెండు రుమాళ్లు పోయాయి’’ చెప్పాడు వెంకటేశు.


తేడా తెలుసుకో!

‘‘నీ టూత్‌ పేస్టులో నిమ్మకాయ, పుదీనా, ఉప్పు, లవంగం, అల్లం ఉన్నాయా?’’

‘‘అవన్నీ ఉంటే టూత్‌ పేస్టు అనరు .. చట్నీ అంటారు ..’’


తొక్కలో సూక్తి!

‘వయసులో ఉన్నప్పుడు ప్రేమ పుట్టడం...

చీకట్లో ఉన్నప్పుడు దోమ కుట్టడం ...

ఈ రెండూ జీవితంలో చాలా కామన్‌!’


తెలివి తక్కువ రాజు తెలివైన మంత్రి

ఒకానొక రాజ్యంలో రాజుగారు తన మహామంత్రిని పిలిచి ‘‘మన రాజ్యంలో మహా తెలివైన వారు ఉన్నట్లే, మహా తెలివితక్కువ వాళ్లూ ఉంటారు కదా?’’ అని అడిగాడు.

మంత్రి (సంశయిస్తూనే) ‘‘అవును.. ఉంటారు ప్రభూ’’ అన్నాడు.

‘‘అయితే మన రాజ్యమంతా గాలించి, అందరిలో కెల్లా అతి తెలివితక్కువ వాళ్లను అయిదుగురిని వెదికి పట్టుకుని, సభలో హాజరు పరచండి’’ అని ఆజ్ఞాపించాడు రాజు.

మంత్రి ‘చిత్తం ప్రభూ’ అని సభ నుంచి నిష్క్రమించాడు గానీ మనసంతా ‘ఎలా?’ అన్న ఆలోచనలతోనే నిండిపోయింది.

‘ఎవడికైనా కొన్ని పరీక్షలు పెట్టో, ప్రశ్నలు అడిగో వాడు తెలివైనవాడో, కాడో తేల్చుకోవచ్చు. మరి, తెలివితక్కువ వాడినెలా గుర్తించాలి?’ ఈ సంకటం నుండి బయటపడటమెలాగో అర్థం కాలేదు మంత్రికి.

‘ఒప్పుకున్నాక తప్పదుగా, రాజాజ్ఞ మరి’ అని నిట్టూర్పు విడిచి తెలివితక్కువ వాళ్లను వెదకడానికి బయలుదేరాడు.

ఒక నెల రోజుల పాటు రాజ్యమంతా తిరిగి ఇద్దరిని పట్టుకుని సభలో హాజరు పరిచాడు.

‘‘మహామంత్రీ మీరు పొరబడినట్లున్నారే.. లేక లెక్క తప్పారా? మేము అయిదుగురిని ప్రవేశపెట్టమన్నాం. మీరు ఇద్దరిని మాత్రమే వెంట తీసుకుని వచ్చారు’’ కోపంగా అన్నాడు రాజు.

‘‘మహాప్రభూ! తమరు నేను చెప్పేది కొంచెం ఆలకించండి’’ అన్నాడు మంత్రి.

‘‘సరే సెలవియ్యండి’’ అన్నాడు రాజు.

‘‘నేను రాజ్యమంతా తిరుగుతుండగా.. ఇతను ఒక ఎడ్లబండి మీద కూర్చుని తలపై ఒక పెద్దమూటను పెట్టుకుని వెళుతూ కనిపించాడు. అలా ఎందుకని అడుగగా ‘మూటను బండి మీద పెడితే ఎడ్లకు భారమవుతుంది’ అని సమాధానమిచ్చాడు. అందుకే ఇతనిని అయిదవ తెలివితక్కువ వాడిగా తీసుకొచ్చాను’’ అంటూ ఆగాడు మంత్రి.

‘‘భేష్‌! తరువాత...’’ అని అడిగాడు రాజు.

‘‘ఈ రెండో అతను తన ఇంటి పైకప్పు మీద పెరిగిన గడ్డిని తినిపించడానికి తన గేదెను ఇంటి పైకప్పు మీదకు లాగుతూ కనిపించాడు. కావున ఇతడిని నాలుగవ తెలివితక్కువ వాడిగా ప్రవేశపెట్టాను’’ అన్నాడు మంత్రి.

మళ్లీ రాజు ‘‘భేష్‌! ఆ తర్వాత...’’ అని అడిగాడు.

‘‘రాజ్యంలో చాలా సమస్యలుండగా, వాటినన్నింటిని పక్కనబెట్టి తెలివితక్కువ వాళ్లను వెదకటంలో నెలరోజుల పాటు సమయం వృథాగా గడిపాను కాబట్టి నేను మూడవ తెలివితక్కువ వాడిని’’ అని ఆగాడు మంత్రి.

రాజు (గట్టిగా నవ్వుతూ) ‘‘తరువాత’’ అంటూ మరింత ఉత్సాహంగా అడిగాడు.

‘‘పరిష్కరించాల్సిన సమస్యలెన్నో ఉండగా, బాధ్యతలన్నీ విస్మరించి, తెలివితక్కువ వాళ్లకోసం వెదకమన్న తమరు రెండో వారు’’

అది వినగానే సభలోని వారంతా నిశ్చేష్టులై చూస్తుండిపోయారు. నిశ్శబ్దం ఆవరించింది అంతటా.

రాజుకు కోపం వచ్చినా తేరుకుని ‘‘మంత్రిగారూ సందేహం లేదు. మీ మాటల్లో.. వాస్తవానికి దగ్గరగానూ, నిస్సందేహంగా నిజాయితీతో కూడిన నిజముంది. సరే మొదటి తెలివితక్కువ వారెవరో తెలియజెప్పండి’’ అన్నాడు.

‘‘చేయాల్సిన పనులన్నీ మానేసి నెట్‌ ఆన్‌ చేసుకుని వాట్సా్‌పలో ఈ మెసేజ్‌ చదువుతున్నాడే.. వాడే ఆ మొదటివాడు.’’


తమిళనాడులో పరిస్థితి!

మాస్టారు: ఏరా.. మూడు రోజులుగా స్కూలుకు రాలేదేంటి..
కిశోర్‌ : లత చనిపోయింది.. సార్‌.. అందుకే రాలేదు..
మాస్టారు: లత ఎవర్రా..
కిశోర్‌ : మా నాన్న వాళ్ల భార్య సార్‌..
మాస్టారు: వెదవ.. అమ్మ అనలేవా..
కిశోర్‌ : అమ్మ చనిపోయింది అనే పదం వినిప్తేనే పోలీసులు అరెస్టు చేస్తున్నారు సార్‌.. అందుకే అలా చెప్పాల్సి వచ్చింది.


తెలుగు హీరో

‘టైటానిక్‌’ సినిమాను తెలుగులో తీయాలని ఒక ప్రముఖ హీరోని కలిశాడు హాలివుడ్‌ నిర్మాత. తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొద్ది మార్పులు చేస్తే నటించడానికి తనకు అభ్యంతరం లేదన్నాడు హీరో.

‘‘ఏం మార్పులు కావాలో చెప్పండి’’ అడిగాడు హాలివుడ్‌ నిర్మాత.

‘‘క్లైమాక్స్‌లో ఒక చేత్తో హీరోయిన్ను, మరో చేత్తో షిప్పునూ పట్టుకుని ఈదుకుంటూ ఒడ్డుకు చేరేలా చిన్న మార్పు చేయండి చాలు’’ చెప్పాడు హీరో.

నిర్మాత మూర్ఛపోయాడు.


రోగం కుదిరింది

‘‘నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను’’ పేషెంట్‌.

‘‘ఐ డోంట్‌ నో తెలుగు ...’’ నర్స్‌.

‘‘ఐ లవ్‌ యూ సిస్టర్‌ ..’’ పేషెంట్‌.

‘‘ఐ లవ్‌ యూ బ్రదర్‌ ..’’ నర్స్‌.


ఆ ముక్క ముందే చెప్పాల్సింది!

‘‘హలో .. ఎంత ప్రయత్నించినా విండోస్‌ తెరుచుకోవట్లేదండీ ..’’

‘‘కొద్దిగా కొబ్బరి నూనె వేడి చేసి అంచుల వెంట బాగా రుద్దు’’

కొద్దిసేపు తర్వాత -

‘‘మీరు చెప్పినట్టు చేస్తే కంప్యూటర్‌ మొత్తం పాడైపోయింది.’’

‘‘నేను ఇంట్లో విండోస్‌ అనుకున్నా’’.


ఖాళీగా ఉండట్లేదండి

‘‘బాబూ .. బిటెక్‌ పూర్తయినట్టుంది. ప్రస్తుతం ఏం చేస్తున్నావు?’’

‘‘సాఫ్ట్‌వేర్‌లో ఖాళీ లేదు. హార్డ్‌వేర్‌లో ‘గ్రోత్‌’ లేదు. రియలెస్టేట్‌లో రౌడీలెక్కువ. కన్‌స్ట్రక్షన్‌లో శాలరీ తక్కువ. అందుకని ఫేస్‌బుక్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేశానండి’’.


తొక్కలో సూక్తి

ప్రేమా, దోమా రెండూ ఒక్కటే. ఒకటి నిద్ర రాకుండా చేస్తుంది. రెండోది నిద్ర పోకుండా చేస్తుంది.


అభినవ ద్రోణుడు

‘‘ఎందుకు నాయనా విచారంగా ఉన్నావు?’’ దేవుడు.

‘‘ఏముంది స్వామీ .. దారిద్య్రం .. ’’ మానవుడు.

దేవుడు తన వేలిని పక్కనే ఉన్న ఒక రాయివైపు చూపించగానే అది బంగారుగా మారిపోయింది.

‘‘ఇప్పుడు సంతోషమా ..’’ దేవుడు.

‘‘అదెన్నాళ్లు స్వామీ ..’’ మానవుడు.

దేవుడు ఒక చెట్టువైపు వేలు చూపించగానే చెట్టు బంగారమైంది.

‘‘ఇప్పుడు సంతోషమా ..’’ దేవుడు.

‘‘ఏదో కొన్నాళ్లు పర్వాలేదు ... తర్వాత మళ్లీ దారిద్య్రమే కదా ..’’

‘‘ఏమిస్తే నీకు సంతోషం కలుగుతుందో చెప్పు నాయనా .. ’’ దేవుడు.

‘‘మీ చూపుడు వేలివ్వండి’’ మానవుడు.

‘‘ఆఁ .. ’’ అదృశ్యమయ్యాడు దేవుడు.


చేయనందుకే!

‘‘సీతను కిడ్నాప్‌ చేశానని రాముడు నన్ను చంపడంలో అర్థముంది. మీ భార్యలను నేను కిడ్నాప్‌ చేయలేదు కదా, మరి నన్నెందుకు ప్రతి దసరాకి కాల్చి చంపుతున్నార్రా?’’ కోపంగా అరిచాడు రావణుడు.

‘‘కిడ్నాప్‌ చేయనందుకే ...’’ ఏక కంఠంతో వినిపించాయి కొన్ని గొంతులు.


సారీ .. స్వాహా!

‘‘అదేంటో .. ఎండలో నడుస్తున్నా, వానలో తడుస్తున్నా నువ్వే గుర్తుకొస్తున్నావు రాజా’’

‘‘సారీ .. రాణీ, ఈసారి వచ్చినప్పుడు నీ గొడుగు తప్పకుండా తీసుకొచ్చి ఇ్తా’’.


నో అబ్జక్షన్‌

‘‘సెల్‌ఫోన్‌ ఎక్కువగా వాడితే మెదడువాపు వస్తుందట...’’

‘‘అది మెదడున్నోళ్లకై ఉంటుంది. నువ్వు మాట్లాడొచ్చు పర్లేదు.’’


బిజీ

‘‘ఏఁవయ్యా! ఏదైనా మంచి జోక్‌ చెప్పవయ్యా’’ ఫోన్లో అడిగాడు ఆఫీసర్‌.
‘‘నేనిప్పుడు బాగా బిజీగా ఉన్నాను సార్‌! పని చేసుకుంటున్నాను. కాసేపాగిన తర్వాత తప్పకుండా చెబుతాను.’’ చెప్పాడు క్లర్క్‌.

‘‘జోక్‌ అదిరిందయ్యా! ఇంకొకటి చెప్పు.’’ నవ్వసాగాడు ఆఫీసర్‌.


పాస్‌వర్డ్‌

‘‘ఏఁవండీ! నాకు మీరో చిన్న హెల్ప్‌ చేసి పెట్టాలి.’’ గోముగా అడిగింది భార్య.
‘‘చెప్పు, ఏం చెయ్యమంటావు?’’ అడిగాడు భర్త.
‘‘నాకోసం అదిగో అక్కడ ఉందే, ఆ పులిని మీరు చంపి పారేయండి.’’
‘‘బుద్ధుందా నీకు? పులిని చంపాలా? నావల్ల అయ్యే పనేనా? ఇంకేదైనా అడుగు.’’ కసురుకున్నాడు భర్త.
‘‘అయితే మీ ఈ-మెయిల్‌ పాస్‌వర్డ్‌ చెప్పండి.’’

‘‘అదీ...అది దేనిగ్గాని, పులిని చంపాలి. అంతేకదా... ఇదిగో...’’ పరుగుదీశాడతను.


పాపం భార్య

భర్త: నాభార్య కనిపించడం లేద్సార్‌! షాపింగ్‌కి అని వెళ్ళింది, ఇంత రాత్రయినా ఇంకా రాలేదు.
ఇనస్పెక్టర్‌: ఆవిడ హైట్‌ ఎంత?
భర్త: హైట్‌...నేనెప్పుడూ చెక్‌ చెయ్యలేదు సార్‌.
ఇనస్పెక్టర్‌: సన్నగా ఉంటారా? లావుగా ఉంటారా?
భర్త: సన్నగా ఉండదు, అలా అని లావుకూడా కాదు.
ఇనస్పెక్టర్‌: కళ్ళెలా ఉంటాయి?
భర్త: పెద్దగా ఎప్పుడూ పట్టించుకోలేద్సార్‌.
ఇనస్పెక్టర్‌: జుత్తు ఏ రంగులో ఉంటుంది?
భర్త: తన ఇష్టఁవండి. ఏ రంగు పడితే ఆ రంగు వేసుకుంటుంది.
ఇనస్పెక్టర్‌: ఏ రంగుచీర కట్టుకున్నారు?
భర్త: చీరలో ఉందో, పంజాబీడ్రస్‌లో ఉందో ఏమో! తెలీద్సార్‌!
ఇనస్పెక్టర్‌: కార్లో వెళ్ళారా?
భర్త: అవున్సార్‌.
ఇనస్పెక్టర్‌: కారు ఏ రంగు...
భర్త: బ్లాక్‌ ఆడి ఏ ఎయిట్‌ విత సూపర్‌ చార్జ్‌డ్‌ 3.0 లీటర్‌ వి6 ఇంజనజెనరేటింగ్‌ 333 హార్స్‌పవర్‌ టీమిడ్‌విత్ యాన్ ఎయిట్‌ స్పీడ్‌ టిప్‌ట్రానిక్‌ ఆటోమెటిక్‌ ట్రాన్స్ మిషన్ విత్ మాన్యువల్‌ మోడ్‌. ఇంకా చెప్పాలంటే ఇట్‌ హేజ్‌ ఫుల్‌ లెడ్‌ హెడ్‌లైట్స్‌, అండ్‌ హేజ్‌ ఎ వెరీ థిన్ స్ర్కాచ్ ఆన్ ది ఫ్రంట్‌ లెఫ్ట్‌డోర్‌...’’
అంటూ కన్నీరుపెట్టుకున్నాడతను. పెద్దగా ఏడవసాగాడు.
ఇనస్పెక్టర్‌: ఏడవకండి! మీ కారు మీకు దొరుకు తుంది.


Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -64

Responsive Footer with Logo and Social Media