పేజీ సంఖ్య - 71
ఎవరు గొప్ప?
‘‘గురుదక్షిణగా ఏకలవ్యుడు బొటన వేలు ఇచ్చాడు తెలుసా?’’ గొప్పగా చెప్పాడు పంతులు.
‘‘ఏకలవ్యుడు ఒక వేలు మాత్రమే ఇచ్చాడు. మేము ఎన్ని వేలు ఇస్తున్నా లెక్కలేదు’’ వెనక బెంచీ నుండి వినిపించాయి అరుపులు.
నాతో పెట్టుకోకు
‘‘ఏయ్ .. పెద్దాయనా టికెట్ చూపించు’’ అడిగాడు టికెట్ కలెక్టర్.
పంచె ముడి విప్పి టికెట్ తీసిచ్చాడు పెద్దాయన.
‘‘ఏంటి ... బుర్ర తిరుగుతోందా! ఇది పాత టికెట్టు’’ కోపంగా అన్నాడు టి.సి.
‘‘మరి ఇది మాత్రం కొత్త రైలా ..’’ అడ్డంగా వాదించాడు పెద్దాయన.
అసలే చలికాలం!
వారిద్దరూ కవలలు. ఒకడు ఏడుస్తుంటే, రెండోవాడు నవ్వుతున్నాడు.
‘‘ఎందుకురా తమ్ముడు ఏడుస్తుంటే నువ్వు నవ్వుతున్నావు?’’ అప్పుడే ఇంట్లోకి వచ్చిన తండ్రి అడిగాడు.
‘‘నేననుకుని మమ్మీ వీడికి రెండోసారి స్నానం చేయించింది హా హా హా ..’’ చెప్పాడు పెద్దోడు.
అన్నీ దాచేస్తుంది!
‘‘హిమాలయాలు ఎక్కడుంటాయి డాడీ?’’ అడిగాడు పుత్రరత్నం.
‘‘ఏమో ... వాటిని కూడా మీ మమ్మీ బీరువాలో పెట్టి తాళం వేసేసి ఉంటుంది. వెళ్లి అడుగు’’ చెప్పాడు జనకుడు.
ఎవరు గొప్ప?
‘‘మా నాన్నకి బ్యాంక్ అకౌంట్ ఉంది. అర్జంటయితే వెంటనే డబ్బు తెస్తాడు తెలుసా?’’ గొప్పగా చెప్పాడు చంటి.
‘‘ఓస్ ... అంతేనా. మా నాన్నకు నోట్లో 4 బంగారు పళ్లున్నాయి. ఎప్పుడవసరం వచ్చినా ఇలా పీకి అలా తాకట్టు పెట్టేస్తాడు’’ మరింత గొప్పగా చెప్పాడు బంటి.
మనసు కరక్కపోదు
‘‘ఎప్పుడూ మీ అమ్మను అంటిపెట్టుకుని తిరుగుతావెందుకురా?’’
‘‘ఏదో సమయంలో నా హోమ్‌వర్క్ చేసిపెట్టకపోతుందా అని!’’
రాత ఫలితం
‘‘ఆ పుస్తకం ప్రచురించి డబ్బులు తగలేసానని మా ఆవిడ విడాకులు తీసుకుంది’’ విచారంగా చెప్పాడు రచయిత శ్రీశైలం.
ఆమెకోసం కాదెహే ...
‘‘ఎందుకురా ... దిగులుగా ఉన్నావు?’’
‘‘మా ఆవిడ పాలుపోసే కుర్రాడితో వెళ్లిపోయిందిరా’’
‘‘బాధపడితే వెళ్లిన భార్య తిరిగి వస్తుందా .. ఊరుకో’’
‘‘నా బాధ అందుకు కాదురా ... అంత చిక్కటి పాలు పోసేవాడు మళ్లీ దొరకడేమోనని’’
అంతే తేడా!
‘‘ఒరేయ్ .. సుబ్బులూ .. పట్నంలో నీది చొక్కా నలగని పనటగా నిజమేనట్రా?’’ అడిగాడు వెంకన్న.
‘‘అవును ... పనిచేసేటప్పుడు చొక్కా తీసేస్తాను’’ చెప్పాడు సుబ్బన్న
పని మాత్రం ఆగట్లేదు
‘‘ఏడాది నుండి మీ ఇంట్లో పనిమనిషి లేదన్నారుగా ... అయినా మీ ఒళ్లు కొంచెం కూడా తగ్గలేదు సుమీ’’ ఆశ్చర్యపోయింది అలివేలు.
‘‘పనిమనిషి లేదన్నాను కానీ మా ఆయన లేడన్నానా’’ బదులిచ్చింది కనకమాలక్ష్మి.
ఆ నలుగురూ
అందులో ఇలా ఉంది.
‘‘ఆస్పత్రి పేరు, డాక్టరు పేరు, కారు పేరు, కారు నెంబరు, పంక్చరు అయిన టైరు ముందువైపుదా? వెనకవైపుదా? - ఈ ప్రశ్నలకు నలుగురూ ఒకే సమాధానాలు రాస్తే అందరికీ వంద మార్కులు వేస్తాను.’’
రక్షణ కోసం
‘‘నాలుక తడిగానే ఎందుకుంటుంది?’’ అడిగింది సైన్స్ టీచర్.
‘‘నిప్పులాంటి నిజాలు మాట్లాడినప్పుడు కాలకుండా ఉండడం కోసమేమో టీచర్’’ కొద్దిసేపు ఆలోచించి చెప్పాడు తరుణ్.
మోడ్రన్ యమలోకం
‘‘చిత్రగుప్తా ... తక్షణమే ఈ పాపి చిట్టా చూడు. తగిన శిక్ష విధిస్తాను’’ ఆదేశించాడు యమధర్మరాజు.
‘‘రెండు రోజులుగా సర్వర్ డౌన్‌లో ఉంది ప్రభూ .. నెట్ పునరుద్ధరింపబడేవరకు కుదరదు’’ విన్నవించాడు చిత్రగుప్తుడు.
బజ్జోవే దోమా ...
‘‘రాత్రివేళ దోమల బారి నుండి బయటపడాలంటే ఏం చేయాలిరా?’’ అడిగాడు వినోద్.
‘‘దోమలు నిద్రపోయిన తర్వాత మనం పడుకుంటే సరి’’ చెప్పాడు ప్రమోద్.
కిటుకుల కిట్టయ్య
‘‘మామూలు తాళంతో పాటు కాంబినేషన్ లాక్ ఉన్న బీరువాను ఎలా తెరవగలిగావు?’’ ఆసక్తిగా అడిగాడు న్యాయమూర్తి నారాయణ.
‘‘(కాస్త సందేహిస్తూ) ఇలాంటి కిటుకులు చెప్పడానికి సాధారణంగా వెయ్యి రూపాయల ఫీజు తీసుకుంటానండి’’ సిగ్గుపడుతూ చెప్పాడు ముద్దాయి మునిరత్నం.
తిట్లు నీకు .. విషయం నాకు
‘‘సార్, మీ ఆవిడ నుండి ఫోన్’’ రిసీవర్ అందించబోయాడు సెక్రటరీ.
‘‘రెండు నిమిషాల తర్వాత ఇవ్వు’’ చెప్పాడు బాస్.
‘‘ఎందుకు సార్?’’ ఆశ్చర్యపోయాడు సెక్రటరీ.
‘‘ఆవిడ ఎవరికి ఫోన్ చేసినా రెండు నిమిషాల వరకు ఆగకుండా తిట్టి, ఆనక అసలు విషయం చెబుతుంది’’ చెప్పాడు బాస్.
ఏం చేసేవారో?
‘‘ఇప్పటి పరిస్థితుల్లో గాంధీగారుంటే ఏం చేసేవారో’’ అడిగాడు టీచర్.
‘‘పెన్షన్ తీసుకుంటూ, స్వచ్ఛభారత్‌లో పాల్గొంటూ ఉండేవారు’’ ఠపీమని చెప్పాడు భజగోవిందం.
టపా కట్టే వయసే ముఖ్యం
డెభై ఏళ్ల వైకుంఠం పాతికేళ్ల పడుచు ప్రేమలో పడ్డాడు. ఈ విషయం ఆమెతో చెప్పడానికి ధైర్యం చాలక -
‘‘ఒరే, పెళ్లీ పెటాకులూ లేకుండా ఇన్నేళ్లూ వ్యాపారంలో పడి దాదాపు పదికోట్లు వెనకేశాను. అనుభవించడానికి ఎవరూ లేరు. ఇప్పుడు ఆ పడుచుపై మనసు పడ్డాను. నా వయసు 30 ఏళ్లు తగ్గించి చెబితే పెళ్లికి ఒప్పుకుంటుందం టావా’’ మిత్రుడు శ్రీశైలంతో మొరపెట్టుకున్నాడు.
‘‘కచ్చితంగా ఒప్పుకుంటుంది - కాకపోతే, ఇప్పటి నీ వయసుకి మరో 20 ఏళ్లు కలిపి చెబితే’’ సలహా ఇచ్చాడు శ్రీశైలం.
తేడా
‘‘అద్దానికి, అబద్ధానికి తేడా ఏంటి?’’ అడిగింది టీచర్.
‘‘అద్దం ఉన్నది ఉన్నట్టు చెబుతుంది. అబద్ధం లేనిది ఉన్నట్టు చెబుతుంది’’ ఠపీమని చెప్పాడు బంటీ.
పోలిక
‘‘ప్రేమకు, పెళ్లికి తేడా ఏంటి?’’ అడిగాడు సురేష్.
‘‘ప్రేమ సైకిల్ ప్రయాణమైతే, పెళ్లి పడవ ప్రయాణం’’ చెప్పాడు రమేష్.
‘‘అదెలా?’’ ఆరా తీశాడు సురేష్.
‘‘ఇష్టం లేకపోతే సైకిల్ దిగిపోవచ్చు. కాని పడవప్రయాణంలో మధ్యలో దిగడం కుదరదు కదా’’ వివరించాడు రమేష్.
పది రూపాయలే!
‘‘నువ్వు మీ అమ్మ ద్వారా తెలుసుకుని చేసిన గుత్తివంకాయ కూర ఖరీదు 155 రూపాయలు’’ కొత్తగా కాపురం పెట్టిన రామానుజం భార్యతో అన్నాడు.
‘‘అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు?’’ ఆశ్చర్యపోయింది వసుంధర.
‘‘ఇదిగో ఎస్.టి.డి. బిల్’’ చూపెట్టాడు రామానుజం.
ముందు జాగ్రత్త!
‘‘నువ్వేమీ బెంగ పెట్టుకోకు స్వప్నిల్. మా నాన్న నిన్ననే నా లగేజ్ పాక్ చేసి పెట్టాడు’’ బదులిచ్చింది రోజీ.
చిక్కలేదు
చాలాకాలం తర్వాత రెండు పుస్తకాలు ఎదురుపడ్డాయి లైబ్రరీ టేబిల్ మీద.
‘ఏంటలా చిక్కిపోయావు? ఎండలకా?’ అని అడిగింది ఒక పుస్తకం రెండోదాన్ని.
‘కాదు. ఎవడికో కోపం వచ్చి ముందుమాటలన్నీ చించేశాడు’ జవాబిచ్చింది అది.
ఇప్పుడా... ఇదివరకా?
‘‘నిద్రాహారాలు మాని కుటుంబాన్ని వదిలేసి ఊరికి దూరంగా బతికేవాళ్ళను ఏమంటారు?’’ టీచర్ ఒక పిల్లవాణ్ణి అడిగాడు.
‘‘ఇప్పుడా? ఇదివరకా?’’ అడిగాడు పిల్లవాడు.
‘‘రెండూ చెప్పు’’ ఆశ్చర్యపోతూ అన్నాడు టీచర్.
‘‘ఇదివరకైతే ఋషులు. ఇప్పుడైతే ఐ.టి. ఉద్యోగులు.’’
ఎవరు మాట్లాడుతున్నది?
భార్యాభర్తలు ఒక రెస్టారెంట్‌లో కూర్చుని ఉన్నారు. భర్త మద్యం తాగుతున్నాడు. ఉన్నట్టుండి ‘ఐ లవ్ యు’ అన్నాడు. భార్య ఆశ్చర్యపోయింది.
‘‘నువ్వా, నీ విస్కీనా మాట్లాడుతున్నది?’’ అనడిగింది.
‘‘నేనే. నా విస్కీతో మాట్లాడుతున్నా?’’ చెప్పాడు భర్త.
నేమ్ ప్లేట్
‘‘హలో సార్ పోయిన సంవత్సరం ఈ వీధిలో వెళుతున్నపుడు చూస్తే మీ ఇంటి ముందు సురేష్ బి.ఎ. అని ఉంది. ఇప్పుడు చూస్తే సురేష్ ఎం.ఎ అని ఉంది. ఏడాదిలో ఎం.ఎ పూర్తి చేశారా?’’ అడిగాడు ఒకాయన ఆ దారిన పోతూ.
‘‘మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. పోయిన సంవత్సరం మా ఆవిడ చనిపోయినపుడు ‘బ్యాచిలర్ ఎగైన్’ అన్న అర్థంలో బి.ఎ. అని పెట్టాను. ఈ మధ్యే మళ్ళీ పెళ్ళి చేసుకున్నా కాబట్టి ‘మ్యారీడ్ ఎగైన్’ అర్థంలో ఎం.ఎ అని పెట్టాను’ వివరించాడు సురేష్.
ఏది ముందు?
లెక్చరర్ స్టూడెంట్‌ని అడిగాడు... ‘‘పది తేలిక ప్రశ్నలు అడగనా? లేక ఒక కష్టమైన ప్రశ్న అడగనా?’’
‘‘కష్టమైన ప్రశ్నే అడగండి’’ చెప్పాడు స్టూడెంట్.
‘‘ఏది ముందు వస్తుంది? పగలా, రాత్రా?’’
‘‘పగలు.’’
‘‘ఎలా చెప్పగలవు?’’
‘‘సారీ సార్... మీరు ఒకటే ప్రశ్న అడుగుతానన్నారు’’ స్టూడెంట్ జవాబిచ్చాడు.
అర్థం ఇది!
‘వైఫ్ పూర్తి అర్థం ఏమిటో తెలుసా నీకు?’ భర్త భార్యను అడిగాడు.
ఆమె ఏదో చెప్పేలోపలే ‘‘""Without Information Fighting Everytime
(ముందస్తు సమాచారం లేకుండా అస్తమానం పోట్లాడేది-WIFE)’’ అన్నాడు.
‘‘కాదు కాదు.With Idiot For Ever''
’’ అని తిప్పికొట్టింది భార్య.
రాసలీల వేళ రాయబారమేల?
‘‘డాక్టర్‌ని ప్రేమించడం పొరపాటైపోయిందే’’ వాపోయింది సుజాత.
‘‘ఏమయిందే?’’ ఆరా తీసింది హరిత.
‘‘ఆయన రాసే ప్రేమలేఖలు అర్థంగాక, అస్తమానం మెడికల్ షాపు వారితో చదివించుకోవాల్సి వస్తోంది’’ బదులిచ్చింది సుజాత.