పేజీ సంఖ్య - 63

అది పనంటారా?

‘‘హలో .. పండూ, పనిలో ఉన్నావా?’’

‘‘లేదురా .. ఆటోలో ఉన్నా.. ’’


మంచమే కదా!

‘‘నీ మీద బెంగతో అమ్మ మంచం పట్టిందిరా ..’’

‘‘మంచమే కదా .. వదిలేయమనండి నాన్నా’’


ప్రధాని మోదీకి అభ్యర్థన

అయ్యా, మీరు రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసి మంచి పని చేశారు సంతోషం..

అలాగే 500, 1000, 2000 ఎపిసోడ్లతో నడుస్తున్న తెలుగు సీరియల్స్‌ని కూడా రద్దు చేసి మా అందరికీ విముక్తి ప్రసాదిస్తారని ఆశిస్తున్నాం..


భిన్న ధృవాలు

‘‘నేను నాగార్జున అభిమానిని. ఎప్పుడూ కళ్యాణ్‌ జ్యూయలర్స్‌లోనే నగలు కొంటాను’’ భార్య.

‘‘నేను వెంకటేశ అభిమానిని. అందుకే ముత్తూట్‌ ఫైనాన్సలోనే నగలు తాకట్టు పెడతాను’’ భర్త.


మనవడి ప్రేమ

‘‘ప్లీజ్‌ డాక్టర్‌ .. మా తాతయ్యని ఎలాగైనా బతికించండి..’’ చేతులు జోడించాడు సూరిబాబు.

‘‘నా బర్త్‌డేకి ఆడి కారు గిఫ్ట్‌ ఇస్తానని తాతయ్య మాటిచ్చారు’’ కళ్లు తుడుచుకున్నాడు సూరిబాబు.


మార్గం ఉంది

‘‘నీకు సున్నా మార్కులు వచ్చాయి కదా .. ప్రోగ్రెస్‌ కార్డుని మీ డాడీకి ఎలా చూపిస్తావు ..’’ అడిగాడు బంటి.

‘‘ఆయన ఫేస్‌బుక్‌ చూస్తున్న టైంలో చూపిస్తే ... వెంటనే సంతకం చేస్తారు ..’’ చెప్పాడు వెంకి.


తొందరపడ్డానమ్మా!

‘‘దుక్కలా ఉండే మనిషి .. ఇంత హఠాత్తుగా పోతాడనుకో లేదమ్మా ..’’ ఓదార్చింది కామాక్షమ్మ.

‘‘పాపిష్టిదాన్ని .. షాపింగ్‌కు వెళ్లిన రెండు నిమిషాల్లోనే చీర సెలక్ట్‌ చేశాను. ఆ షాక్‌ నుండి తట్టుకోలేకపోయారు’’ కళ్లు తుడుచుకుంది మీనాక్షమ్మ.


నిజాయితీ పోలీస్‌

‘‘ఆ ఇంట్లో దొంగ ఉన్నాడని తెలుసు కదా .. మరి ఎందుకు పట్టుకోలేకపోయావు’’ కోపంగా అడిగాడు ఇనస్పెక్టర్‌.

‘‘ఆ ఇంటి ముందు ‘ఇతరులు లోనకి ప్రవేశించరాద’నే బోర్డుంది’’ వినయంగా బదులిచ్చాడు పోలీస్‌ వెంకటస్వామి.


అన్నలూ జాగ్రత్త!

‘‘అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది. దాన్ని మీ పుట్టినరోజునాడు చేస్తే మరింత పుణ్యం వస్తుంది’’ చెప్పాడు ప్రవచన స్వామి.

‘‘నాకు అన్న లేడు .. అంటే నాకు పుణ్యం రాదా స్వామీ?’’ అమాయకంగా అడిగాడు ఒక భక్తుడు.


ఆ ఆరూ కక్కండి!

అప్పుడే ఇంట్లోకి వచ్చిన భర్తను ‘‘ఆరూ తెచ్చారా?’’ నిలదీసింది అలివేలు.

‘‘ఆరా .. ’’ తెల్లబోయాడు శంభులింగం.

‘‘ఈ రోజు మీ రాశిఫలంలో ఆదాయం 9, వ్యయం 3 అని ఉంది. వ్యయం పోగా మిగిలిన 6 ఏం చేశారని ’’ విడమర్చింది అలివేలు.

‘‘ ......... !’’ విస్తు పోయాడు శంభులింగం.


మా ఆవిడ బంగారం

‘‘బంగారం .. తిన్నావా?’’

‘‘నీకేమైనా మెంటలా .. బంగారాన్ని ఎవరైనా తింటారా?’’


భిన్న ధృవాలు

‘‘నేను నాగార్జున అభిమానిని. ఎప్పుడూ కళ్యాణ్‌ జ్యూయలర్స్‌లోనే నగలు కొంటాను’’ భార్య.

‘‘నేను వెంకటేశ అభిమానిని. అందుకే ముత్తూట్‌ ఫైనాన్సలోనే నగలు తాకట్టు పెడతాను’’ భర్త.

‘‘మీరు ఏం మాట్లాడినా మీ ఆవిడ దించిన తల ఎత్తదటగా .. ఏం మాయచేశారు?’’ అడిగాడు సుబ్బారావు.

‘‘నువ్వు తల ఎత్తితే యాభై ఏళ్లు పైబడ్డ దానిలా, తల దించితే పాతికేళ్ల పడుచులా ఉంటావని చెప్పాను ..’’ బదులిచ్చాడు రాజారావు.



‘‘సారీ సరోజా .. మన ప్రేమ నుండి నేను డ్రాప్‌ అవుతున్నా. మా పక్కింటాళ్ల సంసారం చూశాక జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలని డిసైడ్‌ అయ్యా ..’’ చేతులు కట్టుకుని బదులిచ్చాడు ప్రేమికుడు.


తిండి ప్రేమికులు

‘‘మనిద్దరం ఇలా పార్కులో కూర్చుని చిప్స్‌ తింటుంటే నీకేమనిపిస్తోంది డార్లింగ్‌?’’ అడిగాడు ప్రియుడు.

‘‘నాకంటే నువ్వే ఎక్కువ చిప్స్‌ తింటున్నావనిపిస్తుంది డియర్‌’’ చెప్పింది ప్రియురాలు.


తమరు వెళ్లమన్నా వెళ్లరు

‘‘ఒకప్పుడు యువతీయువకులు గుంపులు గుంపులుగా గుడికి వచ్చేవారు. ఈమధ్య ఆ సంఖ్య బాగా తగ్గిపోయింది శర్మా’’ విచారంగా చెప్పాడు రామశాస్త్రి.

‘‘గుళ్లో ఠీజీ జజీ పెట్టించండి .. సంఖ్య పెరగొచ్చు’’ సలహా ఇచ్చాడు విష్ణుశర్మ.


అనుమానం అక్కర్లేదు

‘‘స్త్రీ ఒక మగవాడిని లక్షాధికారిని చేయగలదంటావా?’’ అడిగాడు శ్రీకాంత్‌.

‘‘తప్పకుండా చేయగలదు. కాకపోతే ఆ మగవాడు అప్పటికే కోటీశ్వరుడై ఉండాలి’’ చెప్పాడు సుశాంత్‌.


తాకట్టు కుర్రాడు

‘‘పెళ్లి చూపులకు వెళ్లినప్పుడు నిన్ను అమ్మాయి తరఫు వాళ్లంతా బాగా తన్నారట ఎందుకు?’’ అడిగాడు సుందరయ్య.

‘‘అమ్మాయిని చూపించి బంగారంలాంటి పిల్ల అన్నారు. నేను అలవాటులో పొరపాటుగా అయితే తాకట్టు పెట్టుకుంటానని నోరు జారా ..’’ చెప్పాడు కూర్మారావు.


దొరికారూ..దొరగారూ!

‘‘హలో .. ’’

‘‘చెప్పు కాంతం .. ఆఫీసులో బిజీగా ఉన్నాను. నువ్వెక్కడున్నావు?’’

‘‘కె.ఎఫ్‌.సి.లో మీ వెనక టేబుల్‌ దగ్గర. నాతో పాటు పిల్లలూ ఉన్నారు. డాడీ పక్కన కూర్చున్న ఆంటీ ఎవరో కనుక్కోమని గొడవ చేస్తుంటే కాల్‌ చేశా ..’’

‘‘ ..... !’’


ఎర వేశా..లూటీ చేశా

‘‘రేయ్‌ బావా .. ఆ వినోద్‌గాడు తన ఫేస్‌బుక్‌ గర్ల్‌ఫ్రెండ్‌కి రూ.500 పెట్టి రీచార్జ్‌ చేయించాడ్రా ..’’

‘‘వెధవ గాడిద .. మనకు మిస్డ్‌ కాల్‌ ఇస్తాడు. గర్ట్‌ ఫ్రెండ్‌కు మాత్రం రీచార్జ్‌ చేయిస్తాడా .. అవున్రా, అయినా ఈ విషయం నీకెలా తెలిసింది?’’

‘‘హహహా .. ఆ ఫేస్‌బుక్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ను నేనే’’


అదే కారణం!

‘‘కారణం లేకుండా తాగనని మాటిచ్చారు కదా. ఇప్పుడు తాగి వచ్చారెందుకు?’’ నిలదీసింది తాయారు.

‘‘దీపావళి వస్తోంది కదా .. అందుకే తాగాను’’ చెప్పాడు హనుమంతు.

‘‘దీపావళికీ - తాగడానికీ ఏమిటి సంబంధం?’’ కోపంగా అంది తాయారు.

‘‘మన పిల్లలు రాకెట్లు కాల్చడానికి సీసా కావాలి కదా ..’’ అదే స్థాయిలో జవాబిచ్చాడు హనుమంతు.


మాతో పాటే తింటుంది!

‘‘టామీ మా ఇంట్లో ఒక మెంబరు లాంటిది’’ చెప్పాడు దశరథ్‌.

‘‘కావచ్చు. కానీ దాన్ని రేషన్‌ కార్డులో చూపించి సరుకులు ఎక్కువ ఇమ్మని డిమాండ్‌ చేయడం బాలేదు’’ కచ్చితంగా చెప్పాడు అధికారి.

తనను కొట్టబోతున్న చిట్టిబాబుతో ‘‘నేనంటే నీకు జెలసీ’’ కోపంగా అంది బొద్దింక.

‘‘ఎందుకు?’’ అడిగాడు చిట్టిబాబు.

‘‘నన్ను చూస్తే భయపడి చచ్చే మీ ఆవిడ నిన్ను చూస్తే అస్సలు భయపడదని .. ’’ చెప్పింది బొద్దింక.


భర్తే కారణం అయి ఉంటాడని

‘ఏమండీ ఎక్కడున్నారు? ఆఫీసులోనే ఉన్నారా?’’ కంగారుగా అడిగింది భార్య.

‘‘అవును ఆఫీసులోనే ఉన్నాను. ఏమయింది?’’ ఆందోళనగా అడిగాడు భర్త.

‘‘ఏం కాలేదండీ. మన పనిమనిషి ఎవరితోనో లేచిపోయిందని దాని మొగుడొచ్చి ఏడుస్తూ చెబితేనూ... మీరున్నారో, లేదో అని అడిగా..’’ తాపీగా చెప్పింది భార్య.


ఒకేసారి చంపకు

‘‘మన కుటుంబానికి ఇంత అన్యాయం చేసిన ఆ గంగారాం గాడ్ని చంపి నా కసి తీర్చుకుంటాను నాన్నారూ’’ శపథం చేసింది మంగతాయారు.

‘‘వద్దమ్మా .. నా మాట విని వాడ్ని పెళ్లి చేసుకో. అలాంటి వాడు ఒకేసారి చావకూడదు. ప్రతి క్షణం కుళ్లి కుళ్లి చావాలి’’ చెప్పాడు తండ్రి.


దోచుకున్నవి కక్కు

ఒక అర్ధరాత్రి వేళ కొందరు ముసుగు మనుషులు ఒక కారును అటకాయించి ‘‘మర్యాదగా నీ దగ్గరున్న డబ్బు బయటికి తీయ్‌’’ అని గన్‌ చూపించారు.

‘‘నేనెవరో తెలుసా .. ప్రముఖ రాజకీయ నాయకుడిని’’ కోపంగా చెప్పాడు కారులోపలి వ్యక్తి.

‘‘అయితే మా డబ్బులు మాకు తిరిగిచ్చేయ్‌’’ అన్నారు గన్‌ మరింత సూటిగా పెట్టి.


ఎవరి దారి వారిదే

పరంధామయ్యకు అదే ఆఖరి రాత్రని చెప్పేశాడు డాక్టర్‌. దాంతో ఆపకుండా భార్యతో మాట్లాడ్డం ప్రారంభించాడు పరంధామయ్య. సగం రాత్రయ్యాక ఆవలించి కళ్లుమూసుకుంది అలివేలు.

‘‘ఇదేమిటీ .. నిద్రపోతున్నావా?’’ కోపంగా అన్నాడు పరంధామయ్య.

‘‘మీకేం బాబూ ఉదయం ఇంక లేవనక్కర్లేదు. పొద్దుటే నాకు బోల్డు పనులున్నాయి’’ నిద్రమత్తులో బదులిచ్చింది అలివేలు.


పెళ్లి రేఖలు లేనట్టే

‘‘నువ్వు వివేకానందుడు, వాజ్‌పేయి, అబ్దుల్‌ కలాం అంతటి వాడవవుతావు నాయనా’’ హస్తరేఖలు చూసి చెప్పాడు జ్యోతిష్యుడు.

‘‘అంటే నాకీ జన్మలో పెళ్లయ్యే యోగం లేదంటారా స్వామీ’’ బోరుమన్నాడు ప్రసాదు.


ఆదర్శపతి

‘‘ఇన్నాళ్ల కాపురంలో మీరు పేకాటలో గెలిచిన దాఖలాలు లేవు. నిన్న రాత్రి చాలా డబ్బులు తీసుకొచ్చారు ... ఎలా సాధ్యం?’’ అనుమానంగా అడిగింది కనకదుర్గాదేవి.

‘‘ఆట చివర్లో ధర్మరాజుని ఆదర్శంగా తీసుకుని మా ఆవిడ్ని ఒడ్డుతున్నా అన్నాను. అంతే! వెధవలు గెలిచిన డబ్బంతా వదిలేసి వెనక్కి చూడకుండా పారిపోయారు’’ అసలు సంగతి చెప్పాడు కనకారావు.


అదీ తేడా!

‘‘బ్రహ్మచారికీ, పెళ్లయినవాడికీ తేడా ఏమిటోయ్‌?’’ అడిగాడు వీరబాబు.

‘‘బ్రహ్మచారి ఏది పడితే అది తింటాడు. పెళ్లయినవాడు ఏది పెడితే అది తింటాడు’’ చెప్పాడు బుచ్చిబాబు.


పెళ్లికి వేళయ్యింది!

‘‘ఈసారి ఎగ్జామ్‌లో ఫెయిలైతే మా డాడీ నా పెళ్లి చేస్తానన్నాడు’’ చెప్పాడు మదన్‌.

‘‘మరి బాగా ప్రిపేరవుతున్నావా?’’ అడిగాడు నితిన్‌.

‘‘ఆ .. పనులన్నీ అయిపోయాయి. ఒక్క రిసెప్షన్‌కు మాత్రమే బట్టలు కొనాలి’’ చెప్పాడు మదన్‌.


చుట్టాలొస్తున్నారు!

‘‘ఏమయ్యా .. వింటున్నావా? మన ఇంటిగలావిడ అరుపులు’’ అడిగింది చెట్టుమీది ఆడకాకి.

వింటున్నా అన్నట్టుగా తల ఊపింది మగ కాకి.

‘‘త్వరగా వెళ్లి తినడానికి ఏమైనా ఏరుకురా .. దిక్కుమాలిన చుట్టాలు తగలడతారేమో’’ రెట్టించింది ఆడ కాకి.


Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -63

Responsive Footer with Logo and Social Media