పేజీ సంఖ్య - 62

నడిచేరకం కాదు

‘‘ఊబకాయం మా కుటుంబమందరిలో ‘రన’ అవుతూనే ఉంది డాక్టర్‌’’ చెప్పాడు పాండురంగం.
‘‘మీ కుటుంబంలో ఎవరూ ‘రన’ చేయరనండి .. బాగుంటుంది’’ బదులిచ్చాడు డాక్టర్‌.


సుబ్బి పెళ్లి ఎంకి చావుకు

‘‘రేపట్నించి టూ వీలర్‌ వెనక కూర్చున్న వాళ్లు కూడా హెల్మెట్‌ పెట్టుకోవాలంట. లేకపోతే ఫైనేస్తారట’’ దినపత్రిక చూస్తూ చెప్పాడు భర్త.
‘‘అయితే పదివేలివ్వండి. మార్కెట్‌కు వెళ్లి చీరల మీదకి మ్యాచింగ్‌ హెల్మెట్లు కొనుక్కొస్తా’’ చెయ్యి చాస్తూ అడిగింది భార్య.


వాళ్లిద్దరూ సమానం!

‘‘ఏరా ఏకాంబరం .. మీ ఆవిడ కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌ అట కదా .. గొడవ వస్తే నీకేం ప్రాబ్లమ్‌ లేదా ..’’ అడిగాడు పీతాంబరం.
‘‘నువ్వన్నది నిజమే. కాని నేను రన్నింగ్‌లో గోల్డ్‌ మెడల్‌ గ్రహీతననే సంగతి మరిచావా?’’ గుర్తుచేశాడు ఏకాంబరం.


కృతజ్ఞత ఉండాలోయ్‌!

‘‘శ్రీవీర వెంకట సత్యనారాయణ లక్ష్మీ సాయి గణేశ కనకదుర్గా ఆంజనేయ శివన్నారాయణ ఫుట్‌ వేర్‌ ... అబ్బ! ఎందుకు బాబాయ్‌ మన చెప్పుల షాపుకు ఇంత పొడవు పేరు పెట్టావు?’’
‘‘ఆ గుళ్లలో కాజేసిన చెప్పులతోనే కదరా నేను ఈ షాప్‌ పెట్టింది .. ఆ మాత్రం కృతజ్ఞత చూపొద్దూ!’’


అంతకంటేనా!

‘‘ఈ రోజు నుండి నీతో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను’’ చెప్పింది భార్య.
‘‘సరే’’ బదులిచ్చాడు భర్త.
‘‘ఎందుకో తెలుసుకోవాలని లేదా?’’ ఆశ్చర్యపోయింది భార్య.
‘‘అక్కర్లేదు. నీ మాటపైన గౌరవముంది’’ చెప్పాడు భర్త.


డబ్బులున్నా రావడం లేదా..

సుబ్బారావు: ఏవమ్మా ఇప్పుడేగా ఏటీఎంలో డబ్బులు పెట్టారు.. అయినా ఇంత సేపు లోపలే ఉంటే ఎలా..?
మమత: అవునండీ నా ముందు ఉన్నవారికి కూడా డబ్బులు బానే వచ్చాయి.. అయినా నాకు మాత్రం రావడం లేదు..
సుబ్బారావు: అదేంటి.. పిన్‌ సరిగా ఎంటర్‌ చేశారా..?
మమత: ఎంటర్‌ యువర్‌ పిన్‌ అనగానే నా తలలో ఉన్న రెండు పిన్నులు పెట్టానండీ.. అయినా డబ్బులు రావడం లేదు..


వెంట్రుక బేరం

రేఖ పొడుగాటి జడ చూసి ప్రేమించేశాడు సుబ్బారావు. రేఖ మాత్రం సుబ్బారావుని ఛీకొట్టింది. కొంత కాలం తర్వాత సుబ్బారావు ఆ ఊరి నుండి వెళ్లబోతూ రేఖ తమ్ముడితో ‘‘ఒరేయ్‌ .. మీ అక్క తల వెంట్రుక ఒకటి తెచ్చివ్వు. జీవితాంతం దాచుకుంటాను. అందుకు నీకు వంద చాక్లెట్లు కొనిస్తా’’ అన్నాడు.
‘‘మా అక్క జడకు వేసుకునే సవరమే తెచ్చిస్తా .. ఎన్ని చాక్లెట్లు ఇస్తావో చెప్పు ముందు?’’ అడిగాడు రేఖ తమ్ముడు.


మాటతో బద్ధకం మాయం

‘‘ఆ డాక్టర్‌ నిజంగా దేవుడే. మా ఆవిడ బద్ధకాన్ని చిటికెలో పోగొట్టాడు’’ సంతోషంగా చెప్పాడు పానకాలు.
‘‘ఎలా?’’ అడిగాడు కనకాలు.
‘‘మా ఆవిడ చెప్పినవన్నీ విని ‘వయసు పెరుగుతోంది కదమ్మా’ అన్నాడు. ఆ మాట మందులా పనిచేసింది’’ చెప్పాడు పానకాలు.


ఇంతకంటే మార్పేముంది?

ఒక ప్రఖ్యాత హాలివుడ్‌ తార రోజు రోజుకీ కృశించిపోతూ చివరికి తనకొచ్చిన జబ్బు ఏదో అర్థంగాక డాక్టర్‌ను సంప్రదించింది. రిపోర్టులన్నీ చూశాక ‘‘మీలో ఏ జబ్బూ లేదు. లైఫ్‌లో మార్పు అవసరం’’ చెప్పాడు డాక్టర్‌.
‘‘ఈ రెండేళ్లలో నలుగురు భర్తలను, ఆరు కార్లను, డజనుమంది వంటవాళ్లను, ఇరవైమంది పనిమనుషుల్ని మార్చాను. ఇంతకంటే ఇంకేం మార్పు కావాలంటారు?’’ ఉక్రోషంగా అరిచింది తార.


నాకిది మామూలే!

వస్తాద్‌ సులేమాన నిమ్మకాయ పిండి ‘‘మీలో ఎవరైనా దీన్లోంచి ఇంకొక్క చుక్క రసం తీసినా నేను ఓడిపోయినట్టే’’ అని సవాల్‌ విసిరాడు.
కాసేపటివరకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ఒకతను వచ్చి పిండి రెండు చుక్కల రసం తీశాడు.
‘‘ఎలా తియ్యగలిగావు?’’ ఆశ్చర్యపోయాడు సులేమాన.
‘‘నేను ఇనకమ్‌ టాక్స్‌ ఉద్యోగిని’’ బదులిచ్చాడు అతను.


ఎవరికెంత లాభం?

‘‘నా సలహా వలన మీకు లాభం కలిగిందనుకుంటాను’’ అడిగాడు లాయర్‌.
‘‘ఏదో కొంత. నాకు సలహా ఇచ్చినందుకు మీకు కలిగినంత మాత్రం కాదు’’ పెదవి విరిచాడు క్లయింట్‌.


అదే తేడా!

‘‘బ్రహ్మచారికీ, పెళ్లైనవాడికీ మధ్యన ఉండే ఒక తేడా చెప్పు?’’ అడిగాడు బుచ్చిబాబు.
‘‘బ్రహ్మచారి ఏది పడితే అది తింటాడు. పెళ్తైనవాడు ఏది పెడితే అది తింటాడు’’ చెప్పాడు పిచ్చిబాబు.


గొప్పకోసం పోయా ..

‘‘ఆమెతో నీ పెళ్లి తప్పిపోయిందటగా...’’
‘‘అవును.’’
‘‘నీ మేనమామ కోటీశ్వరుడని చెప్పలేకపోయావా?’’
‘‘చెప్పాను. ఆమె ఇప్పుడు నాకు అత్త కాబోతోంది’’.


మీరు వెళ్లక్కర్లేదు

‘‘సుభద్రా .. ఆ మెడికల్‌ కిట్‌ ఇలా పట్రా. పాపం ఎవరో కుర్రాడు .. నేను లేకపోతే బతకలేనంటున్నాడు’’ కంగారుగా అరిచాడు డా. శేషాద్రి.
‘‘రిసీవర్‌ పెట్టేయండి. ఆ కాల్‌ వచ్చింది అమ్మాయికనుకుంటా’’ వంటింట్లోంచి కేకేసింది సుభద్ర.


కొంప కొల్లేరయ్యింది

‘‘ఒరేయ్‌ పండూ, రిజల్ట్స్‌ వచ్చాయట. వెళ్లి చూసుకుందాం రా’’

‘‘నేనిప్పుడు రాలేను. మా డాడీతో పనిమీద వెళ్తున్నాను. నువ్వే నా రిజల్ట్‌ చూడు. ఒక సబ్జెక్ట్‌ పోతే గుడ్‌మార్నింగ్‌ అని, రెండు సబ్జెక్ట్సు పోతే గుడ్‌మార్నింగ్‌ టు యు అండ్‌ యువర్‌ డాడీ అని పంపించు’’

గంట సేపు తర్వాత పండుకు మెసేజ్‌ వచ్చింది.

‘‘గుడ్‌మార్నింగ్‌ టు యు అండ్‌ యువర్‌ హోల్‌ ఫ్యామిలీ’’.


ఓపికుంటే దగ్గొచ్చు

‘‘దగ్గి దగ్గి ఒంట్లో ఓపిక తగ్గుతోంది డాక్టర్‌’’ చెప్పాడు బుచ్చిబాబు.

‘‘ఈ మందులు వాడండి’’ ప్రిస్కిప్షన చేతికిస్తూ చెప్పాడు డాక్టర్‌.

‘‘దగ్గు తగ్గుతుందా?’’ ఆశగా అడిగాడు బుచ్చిబాబు.

‘‘లేదు. దగ్గడానికి ఓపిక పెరుగుతుంది’’ బదులిచ్చాడు డాక్టర్‌.


మరిప్పుడెలా?

‘‘అతడి పేరు సాయికుమార్‌. యమ స్ట్రిక్ట్ పోలీస్‌ ఆఫీసర్‌. ఆవులిస్తే పేగులు లెక్కబెడతాడు’’ హెచ్చరించాడు వీర్రాజు.

‘‘నా దగ్గర ఆవుల్లేవు. ఉన్నవి రెండూ గేదెలే’’ చెప్పాడు సుబ్బరాజు.


గంగన్న తెలివి

‘‘నీ కొడుకుని కిడ్నాప్‌ చేశాం’’ కాల్‌ చేశాడు గంగులు.

‘‘బాబ్బాబు .. దండం పెడతా. వాడ్ని ఏమీ చెయ్యొద్దు. నీకెంత డబ్బు కావాలో చెప్పు ..’’ వేడుకున్నాడు బ్యాంక్‌ ఆఫీసర్‌ విశ్వనాథం.

‘‘నీ డబ్బు నాకక్కర్లేదు. నేనే నీకు50 లక్షల పాత నోట్లిస్తా. కొత్తనోట్లుగా మార్చివ్వు చాలు. నీ కొడుకుని విడిచిపెడతా’’ చెప్పాడు గంగులు.


దిమ్మతిరిగే...

‘‘ఓకే ... నీకు జాబ్‌ ఇస్తే ఏం చేయగలవు?’’

‘‘ఆయ్‌ .. జాబ్‌ చేస్తానండి ..’’


తనదాకా వస్తే!

‘‘పాప్‌కార్న్‌ ఎందుకలా ఎగిరెగిరి పడుతున్నాయి?’’ అడిగాడు చింటు.

‘‘ఒకసారి గిన్నెలో కూర్చుని చూడు తెలుస్తుంది’’ చెప్పింది ఆంటీ.


తీయకపోతే కొట్టిద్దికదండీ

‘‘వాటర్‌ నుండి కరెంటు ఎందుకు తీస్తారో తెలుసా?’’

‘‘తెలుసండి ... మనం స్నానం చేస్తున్నప్పుడు షాక్‌ కొట్టకుండా ..’’


గొప్ప పనోడు

‘‘ఏంట్రా నువ్వు తెచ్చిన అగ్గిపెట్టెలో ఒక్క పుల్ల కూడా వెలగటం లేదు?’’

‘‘వెలుగుతున్నాయో లేదోనని పుల్లలన్నీ చెక్‌ చేసే తెచ్చానమ్మా’’


బీరపీచు

‘‘మీ అత్తగారి తమ్ముడిగారి అన్నయ్యగారి బావ వాళ్ల తమ్ముడి అన్నయ్య కొడుకు నీకు ఏమవుతాడు?’’

‘‘బంధువు’’


గొప్పవాళ్లుగా ఎవరూ పుట్టరు

‘‘మీ ఊర్లో పుట్టిన గొప్పవాళ్ల పేర్లు చెప్పు?’’

‘‘మా ఊర్లో గొప్పవాళ్లు పుట్టలేదండి. పిల్లలు మాత్రమే పుట్టారు.’’


బుర్రుండాలోయ్‌!

‘‘ఏం అగరవత్తులిచ్చావయ్యా .. వెలగటం లేదు’’ కోపంగా అన్నాడు కస్టమర్‌.

‘‘అవి వెలగవండి. మీరే వెలిగించాలి’’ తాపీగా చెప్పాడు షాపుతను.


దొంగల మధ్య రాయలేనండి

‘‘పరీక్ష రాయకుండా ఏడుస్తూ కూర్చున్నావెందుకు బాబూ .. ఒంట్లో బాగోలేదా?’’ జాలిగా అడిగాడు ఇన్విజిలేటర్‌.

‘‘అదేం లేదండి ... నేను రాత్రంతా కష్టపడి రాసుకొచ్చిన స్లిప్పుల్ని ఎవడో కొట్టేశాడండి ..’’ బేరుమన్నాడు శేఖర్‌.


తెల్లారిన తెలివి

‘‘ఒక బుట్టలో 10 మామిడిపళ్లున్నాయి. అందులో 3 కుళ్లిపోయాయి. ఇప్పుడు చెప్పండి బుట్టలో ఎన్ని మామిడిపళ్లుంటాయి?’’

‘‘పదండి’’

‘‘అదెలా?’’

‘‘కుళ్లిపోయినంత మాత్రాన మామిడి పళ్లు మునగకాడలైపోవు కదండీ’’


పానకంలో పుడక

కాన్ఫరెన్స్ జరుగుతోంది.

‘‘మన కంపెనీ లాస్‌లో ఉంది’’ బల్ల గుద్ది చెప్పాడు మేనేజర్‌.

అప్పుడే నీళ్లగ్లాసు తెచ్చిన ప్యూన మేనేజర్‌ చెవిలో ..

‘ కాదు సార్‌, జూబ్లిహిల్స్‌లో ఉంది’’ గుసగుసగా చెప్పాడు.


దేని దారి దానిదే

‘‘గుడ్‌ .. నీకు 90 శాతం అటెండెన్స ఉంది కదా ... బ్యాక్‌ లాగ్స్‌ లేకుండా చూసుకోవచ్చుగా ..’’ సలహా ఇచ్చాడు లెక్చరర్‌.

‘‘కుదరదు సార్‌ .. మందు కొట్టేవాడికి వైనషాపు లేనట్టు, సిగరెట్‌ తాగేవాడికి కిళ్లీ కొట్టు లేనట్టు ... నాకూ ..’’ స్టూడెంట్‌ ఇంకా ఏదో చెప్పబోతుండగానే బుర్ర తిరిగి కిందపడ్డాడు లెక్చరర్‌.


బస్సు కొనలేదండీ!

‘‘హలో ... సార్‌, ఈ రోజు నేను ఆఫీసుకు రాలేను. బైక్‌ పాడయింది’’

‘‘బస్సులో వచ్చేయ్‌’’

‘‘నాకు బస్సు లేదు సార్‌ ..’’


హాహాకారాలు

‘‘నీరు సలసల మరిగినప్పుడు ఒక శబ్దం వస్తుం ది .. గమనించారా?’’ టీచర్‌.

‘‘బహుశా బ్యాక్టీరియా ఆర్తనాదాలనుకుంటా సార్‌’’ స్టూడెంట్‌.


బుర్రుండాలండీ!

‘‘కంగ్రాట్స్‌ .. మీరు సెలక్టయ్యారు. మొదటి సంవత్సరం పాతిక వేలిస్తాం. రెండో సంవత్సరం నుండి 40 వేలిస్తాం’’

‘‘థాంక్యూ సర్‌, నేను రెండో సంవత్సరం వచ్చి జాయినవుతా’’


ఆత్మ దూరిందేమో!

‘‘నిన్న నాకు ఒక మెసేజ్‌ వచ్చింది. అది చదివిన వెంటనే నా ఫోన స్విచ్ఛాఫ్‌ అయిపోయింది తెలుసా’’ చెప్పాడు శర్మ.

‘‘ఆశ్చర్యంగా ఉందే .. ఆ మెసేజ్‌లో ఏముంది?’’ ఉత్సుకతతో అడిగాడు మూర్తి.

‘‘బ్యాటరీ ఔౌఠీ ’’ చెప్పాడు శర్మ.


Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -62

Responsive Footer with Logo and Social Media