పేజీ సంఖ్య - 68

జవాబు దొరకని ప్రశ్నలు

భార్య: నేను కొంచెం లావుగా ఉన్నాను కదా?

భర్త: కరెక్టే! ఉన్నావు.

భార్య: పిచ్చిపిచ్చిగా మాట్లాడకండి! మీతో మాట్లాడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది.


భార్య: నేను కొంచెం లావుగా ఉన్నాను కదా?

భర్త: నువ్వా? లావా? లేవే!

భార్య: ఏయ్‌! అబద్ధం! మీరు పెద్ద అబద్ధాలకోరు.


భార్య: నేను కొంచెం లావుగా ఉన్నాను కదా?

భర్త: ఉన్నావా? ఏమో....

భార్య: ఏదీ అడిగిన వెంటనే చెప్పలేరేం? మాటే చెప్పలేని మీరు ఆఫీసులో అంతంత డెసిషన్స ఎలా తీసుకుంటున్నారో!


భార్య: నేను కొంచెం లావుగా ఉన్నాను కదా?

భర్త: తెలీదు

భార్య: కనిపించడం లేదా? కళ్ళు పోయాయా?


భార్య: నేను కొంచెం లావుగా ఉన్నాను కదా?

భర్త: అది ఎలా చెప్పను? నువ్వు ఎలా ఉన్నావంటే...

భార్య: ఎవరితోనో పోల్చి చెప్పొద్దు. నాకలాంటివి నచ్చవు. మీరూ...మీ బుద్ధీ....


భార్య: నేను కొంచెం లావుగా ఉన్నాను కదా?

భర్త: మౌనం వహించాడు. సమాధానం లేదు అతని దగ్గర నుంచి.

భార్య: ఏఁవైంది మీకు? చెఁవుడొచ్చిందా?

భార్యలడిగే కొన్ని ప్రశ్నలకు భర్తల దగ్గర సరైన సమాధానాలు ఉండవు. అప్పుడు వారేం చెయ్యాలంటే... యాహూనో, గూగుల్‌నో ఆశ్రయించాలి. తప్పదు.


ఏం చేస్తాను?

రాత్రి పన్నెండైంది. ప్రియురాలికి ఫోన చేశాడు ప్రేమికుడు. అడిగాడు.

‘‘ఏం చేస్తున్నావు హనీ?’’

‘‘ఏం చేస్తాను. ఇంతవరకూ చదివి చదివి, కాళ్ళు పీకుతున్నాయంటే అమ్మకి కాళ్ళు పట్టి, ఇప్పుడే నిద్రపోదామనుకుంటున్నాను.’’ అంది ప్రియురాలు. ఆవ లింత కూడా తీసింది.

‘‘నువ్వేం చేస్తున్నావు స్వీట్‌హార్ట్‌?’’ అడిగింది.

‘‘ఏం చేస్తాను. క్లబ్బులో మధుగాడి ఒళ్ళో కూర్చుని వాణ్ణి నువ్వు కిస్‌ చేస్తోంటే నీ వెనకే నిలబడి చూస్తున్నాను.’’ అన్నాడు ప్రియుడు.


తేలిగ్గా ఉందిప్పుడు

‘‘నెల రోజులు వ్యాయామం చేస్తే ఆరు కిలోలు తగ్గాను తెలుసా?’’ సుధ.

‘‘నెల రోజులకు ఆరు కిలోలేనా? ఒక్క రోజులో నేను 70 కిలోలు తగ్గాను తెలుసా?’’ రమ.

‘‘మైగాడ్‌! నిజమా .. ఎలా?’’ సుధ.

‘‘మా ఆయనకు విడాకులిచ్చా’’ రమ..


... బాగా ముదిరింది

‘‘అదేంటి .. ఆరు నెలల క్రితం నీ పేరు పక్కన బి.ఏ. అని బోర్డు ఉండేది. ఇప్పుడు ఎం.ఏ. అని తగిలించారు. ఎలా సాధ్యం?’’ అడిగాడు ఈశ్వర్రావు.

‘‘నా భార్య పోయిన కొత్త కాబట్టి బి.ఏ. (బాచిలర్‌ ఎగైన్‌) అని రాసుకున్నాను. ఇప్పుడు పెళ్లయింది కాబట్టి ఎం.ఏ. (మేరేజ్‌ ఎగైన్‌) అని రాసుకున్నాను’’ చెప్పాడు పిచ్చేశ్వర్రావు.


అదీ విషయం!

చెడు అలవాట్లు ఎంత హానికరమో పిల్లలకు బోధిస్తోంది టీచర్‌.

‘‘కాబట్టి .. బ్రాందీ, విస్కీ, రమ్ము వంటి మత్తు పదార్థాల జోలికి పోరాదు .. తెలిసిందా?’’

‘‘నాకు ముందే తెలుసు టీచర్‌ .. మా డాడీ చెప్పారు’’

‘‘వెరీగుడ్‌. డాడీ అంటే అలా ఉండాలి. మరి ఎందుకు తాగకూడదో చెప్పాడా?’’

‘‘చెప్పాడు టీచర్‌. ఇద్దరు తాగితే డబ్బులకు ఇబ్బందవుతుందని ..’’


ఏ ఎండకాగొడుగు పట్టా!

‘‘మీ బాస్‌ ఒక పట్టాన లీవు ఇవ్వడు కదా! రేపటికి లీవు ఎలా సాంక్షన్‌ చేశాడు?’’ అడిగాడు ముకుందం.

‘‘మా బాస్‌కు రాశిఫలాల పిచ్చి. రేపు నా రాశివారి ఆరోగ్యం బాగోదని రాసున్న పేపరు కటింగ్‌ను లీవ్‌ లెటర్‌కు అటాచ్‌చేశా ...’’ చెప్పాడు వైకుంఠం.


శంక లేదింకా ...

ప్రశ్న - సెల్‌ఫోన్‌ కెమెరా వల్ల ఐదు ఉపయోగములు వ్రాయుము.

జవాబు -

  1. ఊరెళ్లేటప్పుడు సిలిండర్‌, గీజర్‌, లైట్లు, ఫ్యాన్లు ఆఫ్‌ చేసిన ఫోటోలు, ఇంటికి తాళం వేసిన ఫోటోలు, కొళాయి కట్టేసిన ఫోటోలు తీసుకుంటే .. దారిలో అనుమానమొచ్చినప్పుడంతా ఫోన్‌ చూసుకోవచ్చు. కెమెరాఫోన్‌ జిందాబాద్‌!’’

    • డిటో -

3 - డిటో -

    • డిటో -
    • డిటో-

రిజల్ట్‌ - 100 / 100 మార్కులు


గంగ్నంగాడిని మించిపోతా

‘కక్కలేక మింగలేక’ అన్న సామెత ... గతంలో ‘క్లబ్‌ సాండ్విచ్‌’ అనే తిండి పదార్థం ఆర్డర్‌ చేసినవాడెవడో కనిపెట్టుంటాడు. ఆ సాండ్విచ్‌లో కిందనున్న బ్రెడ్‌ ముక్క గుజరాత్‌లో ఉంటే.. పై ముక్క ఆఫ్ఘనిస్థాన్‌లో ఉంటుంది. మధ్యలో బోలెడంత చెత్త. అయినా .. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ని కదా.. ఎలాగోలా మ్యానేజ్‌ చేద్దామని డెంటిస్ట్‌ దగ్గర తెరిచినట్టు నోరు బార్లా తెరిచి, సాండ్విచ్‌ నోట్లో పెట్టుకున్నాను. ఇక చూడండి. ఆ మహాకాయాన్ని మింగలేను, బయటకు తీయలేను. పది నిమిషాలు అవస్థపడుతూనే ఉన్నాను. చుట్టూ ఉన్న జనం యూట్యూబ్‌లో పెట్టడానికి నా వీడియోలు తీస్తున్నారు. ఇది బయటకొస్తే ఆ గంగ్నం స్టైల్‌గాడి రికార్డును నేను కొట్టేసినట్టే.


తోముడే నా పని

మా పనిమనిషి అంట్లు సిన్సియర్‌గా తోమట్లేదని సాక్ష్యా ధారాలతో సహా నిరూపించాలని నిన్న రాత్రి సింకులో సీక్రెట్‌ కెమెరా పెట్టించాను. ఇవాళ ఇంటికొచ్చేసరికి మిగిలిన అంట్లతో పాటు కడిగి బోర్లించిన కెమెరా కూడా కనబడింది. (ప్రస్తుతం దాని లెన్స్‌ మీద అట్టలు కట్టిన విమ్‌ సబ్బును కడుగుతూ ఉన్నాను.)


ఆలూ లేదు చూలూ లేదు ...

డబ్బులేని ప్రొడ్యూసర్‌, స్ర్కిప్టు లేని దర్శకుడు కలిసి సినిమా ఎప్పుడు మొదలుపెట్టాలో మాట్లాడుకుంటుండగా ‘‘ఈ సినిమా నేను తప్పకుండా చేస్తాను..’’ అని మాటిచ్చాడు డేట్లు లేని హీరో. ఈలోగా పెద్ద మొత్తానికి చెక్కిచ్చి వాళ్ల ఏరియా రైట్స్‌ కొన్నాడు అకౌంట్‌లో పైసాలేని డిస్ట్రిబ్యూటర్‌. ఈ కథని సుఖాంతం చేయాలని ఎలాగైనా వృథాప్రయాస పడుతున్నాడు పెన్నులో ఇంకులేని రచయిత!


అదీ విషయం!

చెడు అలవాట్లు ఎంత హానికరమో పిల్లలకు బోధిస్తోంది టీచర్‌.

‘‘కాబట్టి .. బ్రాందీ, విస్కీ, రమ్ము వంటి మత్తు పదార్థాల జోలికి పోరాదు .. తెలిసిందా?’’

‘‘నాకు ముందే తెలుసు టీచర్‌ .. మా డాడీ చెప్పారు’’

‘‘వెరీగుడ్‌. డాడీ అంటే అలా ఉండాలి. మరి ఎందుకు తాగకూడదో చెప్పాడా?’’

‘‘చెప్పాడు టీచర్‌. ఇద్దరు తాగితే డబ్బులకు ఇబ్బందవుతుందని ..’’


స్వేచ్ఛ కోసం

‘‘జైల్లోంచి తప్పించుకు పారిపోయావు దేనికి?’’ లాయర్‌.

‘‘పెళ్లి చేసుకోవాలనిపించింది’’ గంగులు.

‘‘చేసుకున్నావా?’’ లాయర్‌.

‘‘చేసుకున్నాను’’ గంగులు.

‘‘మరి మళ్లీ వచ్చి లొంగిపోయావెందుకు?’’ లాయర్‌.

‘‘స్వేచ్ఛ కావాలనిపించింది ..’’ చెప్పాడు గంగులు.


వాళ్లెందుకు వచ్చినట్టో?

‘‘మనం ఈ ప్రపంచంలోకి వచ్చింది ఎదుటివారికి సహాయం చేయడానికే నాయనా’’ బోధించాడు గురూజీ.

‘‘మరి అవతలివారు ఎందుకు వచ్చినట్టు గురూజీ?’’ ప్రశ్నించాడు శిష్యుడు.


అమ్మచెప్పింది!

‘‘పన్నెండేళ్ల లోపు పిల్లలకు మాత్రమే హాఫ్‌ టికెట్‌ .... నీ వయసెంత బుజ్జీ?’’

‘‘పదకొండు’’

‘‘నీకు పన్నెండేళ్లు ఎప్పుడొస్తాయి?’’

‘‘బస్సు దిగాక’’


రెండేళ్లకోమారు ...

‘‘పోయినసారి వచ్చినప్పుడు నాకు క్షవరం చేసింది ఎవరయ్యా?’’ అడిగాడు జులపాల ఆసామి.

‘‘నాకు తెలియదండి ... నేను ఈ షాపులో చేరి రెండేళ్లే అయ్యింది’’ చెప్పాడు క్షవరం చేసే కుర్రాడు.


యథా పంతులు .. తథా విద్యార్థులు

‘‘ఎందుకురా .. స్కూల్‌ నుండి ఇంత లేట్‌గా వచ్చావు?’’ తల్లి.

‘‘మా టీచర్‌ పడుకున్నాడమ్మా .. లేచే సరికి ఆలస్యమైంది’’ పుత్రుడు.

‘‘ఆయన నిద్రపోతే మీరు రావడానికేంరా?’’ తల్లి.

‘‘మరి మమ్మల్ని నిద్ర లేపాల్సింది ఆయనే కదా’’ పుత్రుడు.


... బాగా ముదిరింది

‘‘అదేంటి .. ఆరు నెలల క్రితం నీ పేరు పక్కన బి.ఏ. అని బోర్డు ఉండేది. ఇప్పుడు ఎం.ఏ. అని తగిలించారు. ఎలా సాధ్యం?’’ అడిగాడు ఈశ్వర్రావు.

‘‘నా భార్య పోయిన కొత్త కాబట్టి బి.ఏ. (బాచిలర్‌ ఎగైన్‌) అని రాసుకున్నాను. ఇప్పుడు పెళ్లయింది కాబట్టి ఎం.ఏ. (మేరేజ్‌ ఎగైన్‌) అని రాసుకున్నాను’’ చెప్పాడు పిచ్చేశ్వర్రావు.


మా పూచీ లేదు

మొదటి రోజు ఎల్‌.కె.జి. క్లాసుకు వచ్చిన చిట్టి గౌనుకు ఒక స్లిప్‌ అంటించి ఉండటం చూసిన టీచర్‌ ఆశ్చర్యపోయింది. అందులో ఇలా రాసి ఉంది.

‘గమనిక : మా చిట్టి అల్లరికి సంబంధించిన ఎటువంటి ఫిర్యాదులు మేము తీసుకోము - ఇట్లు చిట్టి అె్మూనాన్న’


తేలిగ్గా ఉందిప్పుడు

‘‘నెల రోజులు వ్యాయామం చేస్తే ఆరు కిలోలు తగ్గాను తెలుసా?’’ సుధ.

‘‘నెల రోజులకు ఆరు కిలోలేనా? ఒక్క రోజులో నేను 70 కిలోలు తగ్గాను తెలుసా?’’ రమ.

‘‘మైగాడ్‌! నిజమా .. ఎలా?’’ సుధ.

‘‘మా ఆయనకు విడాకులిచ్చా’’ రమ..


Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -68

Responsive Footer with Logo and Social Media