పేజీ సంఖ్య - 60
భావం అలా అర్థమైంది మరి..
అమెరికాలో ఉన్న ఒక భారతీయుడికి హార్ట్ ఎటాక్ రావడంతో అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నారు. భక్తుడైన ఆయన ‘హరి ఓం.. హరి ఓం’ అంటూ దారిలో దైవ నామస్మరణ చేస్తున్నాడు. డ్రైవర్ అంబులెన్స్‌ను వెనక్కి తిప్పి ఇంటికి తీసుకొచ్చేశాడు. అది చూసిన కుటుంబ సభ్యులు ఎందుకు వెనక్కి తెచ్చారని అడిగితే.. ‘హర్రీ హోం.. హర్రీ.. హోం’ అంటూ ఆయన అన్నారు... అందుకే ఇలా చేశా.. అన్నాడు.
ఒకసారి ఇంటికి రా!
అప్పారావు దగ్గరకు బెగ్గర్ వచ్చి ‘‘టెన్ రుపీస్ ప్లీజ్ ..’’ అన్నాడు.
‘‘బీరు కొడతావా?’’ అప్పారావు.
‘‘లేదు సార్ .. నేను తాగను’’ బెగ్గర్.
‘‘దమ్ము కొడతావా .. ఇదిగో సిగరెట్’’ అప్పారావు.
‘‘అలవాటు లేదు సార్’’ బెగ్గర్.
‘‘పేకాడదాం వస్తావా .. నీ పెట్టుబడి కూడా నేనే పెడతాను’’ అప్పారావు.
‘‘నాకసలు పేకాడ్డమే రాదు ..’’ బెగ్గర్.
‘‘సరే, నీకో గర్ల్ ఫ్రెండ్‌ని పరిచయం చేస్తా రా ’’ అప్పారావు.
‘‘ఛీ .. నా కలాంటివి గిట్టవు. ఐ లవ్ మై వైఫ్’’ బెగ్గర్.
‘‘సరే, నాతో మా ఇంటికి రా’’ అప్పారావు.
‘‘ఎందుకు?’’ బెగ్గర్.
‘‘మందు కొట్టనోడు, స్మోక్ చేయనోడు, పేకాట, గర్ల్ ఫ్రెండ్ లేకుండా కేవలం భార్యను మాత్రమే ప్రేమించే వాడి గతి ఏమవుతుందో నా పెళ్లానికి తెలియాలి ..’’
మీకోసమైతే రెట్టింపు
నర్స్ ఉద్యోగం కోసం కార్పొరేట్ హాస్పటల్‌కు వెళ్లింది ఐశ్వర్య.
‘‘సాలరీ ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు?’’ అడిగాడు డాక్టర్.
‘‘టెన్ థౌజండ్’’ చెప్పింది ఐశ్వర్య.
సంతోషంగా ‘‘మై ప్లెజర్’’ అన్నాడు డాక్టర్.
‘‘అది కూడా కలిపితే .. 20,000’’ చెప్పింది ఐశ్వర్య.
పిసినారి పిత
‘‘మా నాన్న ఒఠ్ఠి పిసినారి తెలుసా?’’ చెప్పాడు టింకూ.
‘‘ఎందుకలా అనుకుంటున్నావు?’’ అడిగాడు పింకూ.
‘‘ఆ మధ్య మా చెల్లాయి 5 రూపాయల బిళ్ల మింగేసిందని ఆపరేషన్ చేయించి మరీ బిళ్ల తీయించాడు’’ చెప్పాడు టింకూ.
ఎలా వచ్చినా పర్లేదు
‘‘రాణీ .. నా హృదయపు కోవెలలో కొలువుతీరు’’ చెప్పాడు రోమియో.
‘‘చెప్పు తియ్యమంటావా?’’ కోపంగా అంది రాణి.
‘‘ఎందుకు? నీది దేవుడి కోవెల కాదుగా’’ కూల్‌గా బదులిచ్చాడు రోమియో.
ఎం.ఎల్.ఏ అయితే చాలు!
చెన్నైలోని ఒక రెస్టారెంట్లో నిర్బంధించబడ్డ ఇద్దరు ఎం.ఎల్.ఏలు మాట్లాడుకుంటున్నారు.
‘‘ఇదేం కర్మండీ .. నేను ప్రతిపక్ష ఎం.ఎల్.ఏ ని. నన్ను బంధించడమేంటి?’’ మొత్తుకున్నాడు మొదటి ఎం.ఎల్.ఏ.
‘‘ఉండవయ్యా బాబూ .. నేను పక్క రాష్ట్రం ఎం.ఎల్.ఏ.ని. నన్ను ఎందుకు కిడ్నాప్ చేసి తీసుకువచ్చి పడేసారో తెలియడం లేదు ..’’ లబలబమన్నాడు రెండో ఎం.ఎల్.ఏ.
ఐ వాంట్ పీస్!
ప్రేమికుల రోజునాడు భర్త భార్యకు ఒక తెల్ల గులాబి ఇచ్చాడు.
‘‘పెళ్లికి ముందు వాలంటైన్స్ డే నాడు ఎర్ర గులాబి ఇచ్చారు కదా. ఇప్పుడు తెల్ల గులాబి ఇస్తున్నారెందుకు?’’ అడిగింది భార్య.
‘‘అప్పుడు నీ ప్రేమ కావాలని ఎర్ర గులాబి ఇచ్చాను. ఇప్పుడు ఇంట్లో శాంతి కావాలని తెల్లగులాబి ఇస్తున్నాను’’ నిర్లిప్తంగా బదులిచ్చాడు భర్త.
అభ్యర్థన
‘‘ఈ పాపిని తీసుకెళ్లి నూనెలో వేగించండి’’ ఆజ్ఞాపించాడు యముడు.
‘‘నేనసలే హార్ట్ పేషెంటుని. దయచేసి సఫోలా నూనె వాడమని చెప్పండి స్వామి’’ అర్థించాడు పాపి.
అమ్మాయి ఒప్పుకుంది
‘‘అమ్మా .. కొత్త వంటవాణ్ణి తెచ్చుకుందాం. రోజూ ఒకే రకం తిని బోరు కొడుతోంది’’ గారాలు పోయింది కూతురు.
‘‘ఏవండోయ్ .. అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది’’ సంతోషంగా కేక పెట్టింది సుందరమ్మ వంటింట్లో ఉన్న భర్తకు వినిపించేలా.
మరెలా?
‘‘రోజుకు పది గ్లాసుల నీళ్లు తాగాలి’’ డాక్టర్.
‘‘కుదరదు .. ’’
‘‘ఎందుకు?’’
‘‘ఇంట్లో నాలుగే గ్లాసులున్నాయి’’.
అందుకే పేలుతున్నాయి..
పాకిస్థాన్‌లో కూడా బాంబులు ఎందుకు పేలుతున్నాయి..?
కొంతమంది బద్దక టెరరిస్టులు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద పనిచేయడం వల్లే..
ఉత్తమ విద్యార్థి
టీచర్: భారత దేశం నుంచి మొదటిసారిగా విదేశాలు వెళ్లిన మహిళ ఎవరు?
విద్యార్థి: సీత టీచర్.. అప్పట్లోనే శ్రీలంక వెళ్లింది.
టీచర్ షాక్స్.. విద్యార్థి రాక్స్..
పక్షవాతం వచ్చింది..
అమ్మ: ఒరేయ్ త్వరగా ఇంటికిరా.. కోడలికి పక్షవాతం వచ్చినట్లుంది. మెడ వాలిపోయి, మూతి వంకరగా, కళ్లు పైకి తేలేసి పిచ్చి చూపులు చూస్తోంది రా.
కొడుకు: అమ్మా, నువ్వు కంగారు పడకు.. అది ఫోన్‌లో సెల్ఫీ తీసుకొంటుంది అంతే.
తెలివి తెల్లారింది
‘‘క్లియరెన్స్ సేల్ బోర్డ్ పెట్టినా కస్టమర్లు రావట్లేదయ్యా ..’’ వాపోయాడు వరహాలరావు.
‘‘అయ్యో .. ఇంతకీ మీరు చేస్తున్న బిజినెస్ ఏంటి?’’ అడిగాడు కోదండం.
‘‘హోటల్ బిజినెస్’’ చెప్పాడు వరహాలరావు.
రివర్సయింది
‘‘డాక్టర్ ... మా ఆయన నిద్రలో నడుస్తున్నాడని చెపితే అది పోవడానికి మందిచ్చారు కదా..’’
‘‘యా .. మందు బాగా పనిచేసిందా? మానేశారా?’’
‘‘నడవడం మానేసి పరిగెట్టడం మొదలుపెట్టారు డాక్టర్!’’
మార్గం ఉంది నాయనా
‘‘స్వామీ .. నాలోని లోపాలు తెలుసుకునే మార్గం చెబుతారా?’’ అడిగాడు భక్తుడు.
‘‘పిచ్చివాడా .. దానికి ఇంత దూరం నన్ను వెతుక్కుంటూ రావాలా? నీ భార్యతో ‘ఈ మధ్య నువ్వు కాస్త లావెక్కావు’ అను చాలు. ఈ జన్మలోని లోపాలతో పాటు నీ గత జన్మలోని లోపాలు కూడా వినగలవు’’ బోధించాడు స్వామీజీ.
వాడే రాంగ్ రూట్‌లో వచ్చాడు
ఒక పావురం స్పీడుగా వెళ్తున్న కారుకి ఢీ కొట్టి మూర్ఛపోయింది. రెండు గంటల తర్వాత స్పృహ వచ్చి చూస్తే తనొక పంజరంలో ఉన్నట్టు గ్రహించింది.
అప్పుడది ఇలా అనుకుంది.
‘‘కొంపదీసి డ్రైవర్ చచ్చాడా .. నన్ను తీసుకొచ్చి జైల్లో పెట్టారు?’’
అసలంటూ ఉంటే కదా!
‘‘అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరికింది నాకు’’ భార్య.
‘‘వావ్ ... ఏం కోరుకున్నావు?’’ భర్త.
‘‘మీకు ఇప్పుడున్న తెలివిని పది రెట్లు పెంచమని కోరాను’’ భార్య.
‘‘ఓహ్ .. నేనంటే నీకెంత ప్రేమో .. మరి పెంచాడా?’’ భర్త.
‘‘లేదు. జీరోని ఎన్నిసార్లు వెచ్చించినా లాభం లేదన్నాడు’’ భార్య.
జబ్బుంటేనే ఉద్యోగం
ఒక కార్పొరేట్ కంపెనీలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఇద్దరి ఆరోగ్యం మాత్రం ఫర్‌ఫెక్ట్‌గా ఉంది. మిగతా వాళ్లందరికీ బి.పి, కొలసా్ట్రల్ వగైరా జబ్బులు ఉన్నాయి.
మర్రోజు మేనేజ్‌మెంట్ ఆ ఇద్దరి ఉద్యోగాలు పీకేసింది.
ఆ జబ్బులేమీ లేవంటే వాళ్లు సరిగ్గా పని చేయడం లేదని.
ప్రశాంతత విలువ
‘‘పెళ్లి రోజున సుబ్బారావు తన భార్యకు డైమండ్ నెక్లెస్ బహుమతిగా ఇచ్చాడు తెలుసా ..’’
‘‘ఆమె వాడ్ని చాలా మెచ్చుకుని ఉంటుందే ..’’
‘‘ఆవిడ ఆ తర్వాత ఆరు నెలలపాటు సుబ్బారావుతో మాట్లాడలేదు’’
‘‘బహుశా అది డూప్లికేట్ సరుకని తెలిసిందేమో.’’
‘‘అదేం కాదు .. ఆ ఒప్పందం పైనే సుబ్బారావు డైమెండ్ నెక్లెస్ కొన్నాడట!’’
మౌనేశ్వర్రావు
‘‘రోజూ మీరెంత సేపు మౌనం పాటిస్తారు?’’
‘‘రెండు నిమిషాలు.’’
‘‘మిగతా సమయం ఏం చేస్తుంటారు?’’
‘‘మౌనం ప్రాశస్త్యం గురించి ఉపన్యాసం ఇస్తుంటాను’’.
ఎంత రుద్దినా మారదట.
రవి: మామ గిరిగాడినెందుకు రా అమ్మాయిలందరూ కలిసి కొడుతున్నారు..?
మహేష్: ఏముంది మనోడికి నోటిదూలెక్కువ కదా.. ‘వాలెంటైన్స్ డే అని అమ్మాయిలందరూ బ్యూటీపార్లర్ దగ్గర క్యూలో ఉంటే.. వాళ్ల దగ్గరకు వెళ్లి ‘మారుతీ 800ని ఎంత క్లీన్ చేసినా బీఎండబ్ల్యూ అవదు. డబ్బులు వేస్ట్ చేయకుండా ఇంటికెళ్లమని చెప్పాడట అంతే.. వీరబాదుడు బాద తున్నారు. ఆపుదామని ట్రైచేస్తే నాకూ కొన్ని పడ్డాయి.
అప్పుడు అలా..ఇప్పుడు ఇలా...
కొత్తగా పెళ్లైన వ్యక్తి తన భార్యకు వాలెంటైన్స్‌డే నాడు తెల్లగులాబి ఇచ్చాడు.
భార్య: అదేంటి గత సంవత్సరం మనం ప్రేమలో ఉన్నప్పుడు ఎర్ర గులాబి ఇచ్చారు. ఇప్పుడు తెల్ల గులాబి ఇచ్చారెందుకు?
భర్త: అప్పుడు ప్రేమ కావాలి కాబట్టి ఎర్రగులాబి.. ఇప్పుడు శాంతి కావాలి కాబట్టి తెల్లగులాబి.
అన్నీ అంతే
టీవీ చూస్తూ బాదం పప్పు తింటున్న భార్యతో నాకూ పెట్టవోయ్ టేస్ట్ చూస్తానని భర్త అడుగుతాడు..
వెంటనే భార్య తన చేతిలో ఉన్న ఒక బాదం పప్పు ఇస్తుంది..
మరీ ఒకటేనా అన్న భర్తతో... అన్నీ ఒకే టేస్ట్ ఉన్నాయండీ అందుకే ఒకటిచ్చాను.. రుచి తెలుసుకుంటానికి అది చాలు..
పరీక్షను బట్టి సమాధానం
తమిళనాడు ఈ విద్యాసంవత్సరంలో మీ సీఎం ఎవరు అనే ప్రశ్నకు
త్రైమాసిక పరీక్ష సమయంలో జయలలిత
అర్ధవార్షిక సమయంలో పనీర్ సెల్వం
వార్షిక పరీక్ష సమయంలో శశికళ
ఇలా పరీక్షను బట్టి ఆన్సర్ మారుతుంది మరి..
నేనసలే సెన్సిటివ్!
‘‘మన పిల్లి పిల్ల ఎలా ఉంది?’’ క్యాంపుకు వెళ్లిన భర్త ఫోన చేసి అడిగాడు.
‘‘చచ్చిపోయిందండీ’’ చెప్పింది భార్య.
‘‘అయ్యో .. ఎలా?’’ కంగారు పడ్డాడు భర్త.
‘‘గోడపైనుండి పడి’’ చెప్పింది భార్య.
‘‘అయ్యో .. అయినా అంత సడనగా చెబుతావేంటి? ముందు గోడ ఎక్కిందని, తర్వాత జారి పడిందని, ఆ తర్వాత శ్వాస వదిలిందని చెప్పొచ్చు కదా! అన్నట్టు నేను వచ్చేముందు మా అమ్మకు ఒంట్లో బాగో లేదు కదా .. ఇప్పుడెలా ఉంది?’’
‘‘నిన్ననే గోడ ఎక్కిందండి ..’’ చెప్పింది భార్య.
వాణ్ణి సుఖపడనివ్వద్దు ప్లీజ్!
‘‘మా పక్కింటాయన భార్య కనిపించడం లేదు సార్ ..’’
‘‘పక్కింటాయన భార్య గురించి నువ్వెందుకు పోలీస్ స్టేషనకు వచ్చి కంప్లయింట్ ఇస్తున్నావు?!’’
‘‘వాడు రోజూ పార్టీలు చేసుకోవడం భరించలేకపోతున్నాను సార్ ..’’
నా వంతు తీసుకో!
‘‘సార్, మా రాజకీయ నాయకుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. విడిచిపెట్టడానికి 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెట్రోలు పోసి తగలబెడతామని బెదిరిస్తున్నారు. అతడ్ని విడిపించడానికి విరాళాలు సేకరిస్తున్నాం .. మీ వంతు ..’’ కారుని ఆపి అడిగారు సదరు నాయకుడి పార్టీ కార్యకర్తలు.
‘‘నా వంతుగా .. లీటర్ పెట్రోలు తీసుకో ..’’ చెప్పాడు కారువాలా.
నేను రెడీ!
సర్కస్ జరుగుతోంది. స్టేజ్‌పైనున్న బోనులో ఒక అందమైన అమ్మాయి, సింహం ముద్దులాడుకుంటున్నారు.
‘‘మీలో ఎవరైనా అలా చేయగలరా?’’ అరిచాడు రింగ్ మాస్టర్.
‘‘సింహాన్ని బోనులోంచి తప్పిస్తే నేను రెడీ’’ అరిచాడు ప్రేక్షకుల్లో ఒకడు.