పేజీ సంఖ్య - 61

రోజూ కనిపించకపోతే బాగుణ్ణు!

‘‘హాయ్‌ డార్లింగ్‌, ఇల్లంతా ఇంత నీట్‌గా సర్దేశావు .. ఈ రోజు నీ ఫోన్లో వాట్సప్‌ పని చేయలేదా?’’ అడిగాడు అప్పుడే ఆఫీసునుండొచ్చిన భర్త.
‘‘వాట్సప్‌ సంగతి దేవుడెరుగు. అసలు సెల్లే కనిపించకపోవడంతో దానికోసం వెతుకుతూ ఇల్లంతా సర్దేశాను ..’’ చెప్పింది భార్య.


పిల్లలు మాత్రమే ..

ఇతర దేశం నుండి వచ్చిన ఒక టూరిస్టు ఇండియాలో పర్యటిస్తూ ఒక గ్రామం గుండా వెళ్తున్నాడు.
‘‘ఈ గ్రామంలో ఎవరైనా గొప్పవారు పుట్టారా?’’ అడిగాడు టూరిస్టు.
‘‘లేదండి. అందరూ చిన్న పిల్లలే పుట్టారు’’ చెప్పాడు టాక్సీ డ్రైవర్‌.


భలే మంచి చౌక బేరమూ ..!

ఇంటికొస్తున్న భార్యా భర్తలకు దారిలో ఒక షాపు ముందు బెనారస్‌ చీర - 10 రూపాయలు; నైలాన చీర - 8 రూపాయలు ; కాటన చీర - 6 రూపాయలు అని రాసి ఉన్న బోర్డు కనిపించింది.
‘‘అబ్బ .. ఎంత మంచి అవకాశం! 50 రూపాయలివ్వండి. 6 చీరలు కొనుక్కొస్తాను’’ సంతోషంగా అడిగింది భార్య.
‘‘సరిగ్గా చూడు .. అది బట్టలమ్మే షాపు కాదు .. ఇసీ్త్ర షాపు’’ తల బాదుకున్నాడు భర్త.


అందుకే వెళ్లను..

కిట్టూ: అమ్మా నేను బడికి వెళ్లను.. మాస్టార్లు నన్ను కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నారు..
తల్లి: ఏమైందిరా..?
కిట్టూ: బయాలజీ మేడం సెల్‌ అంటే కణం అంది. ఫిజిక్స్‌ సార్‌ సెల్‌ అంటే బ్యాటరీ అన్నారు. హిస్టరీ మేడం సెల్‌ అంటే జైలు అంటుంది.. ఇంగ్లీష్‌సార్‌ సెల్‌ అంటే మొబైల్‌ఫోన్‌ అంటున్నారు.. ఎకనామిక్స్‌సార్‌ సెల్‌ అంటే అమ్మకం అని.. ఒకే పదానికి రకరకాల అర్థాలు చెప్పి నన్ను కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నారు..


వెతకండి బాబూ..

పోలీస్‌స్టేషన్‌లోకి కంగారుగా వచ్చిన మహిళ ఎస్సైతో వూట్లాడుతూ ‘సార్ నిన్న ఉదయం మా వారు కుక్కను తీసుకుని బయుటకెళ్లి ఇంత వరకూ తిరిగి రాలేదు... మీరే ఏదోఒకటి చేయూలి..’అంది.
‘అయిుతే మమ్మల్ని ఏం చేయువుంటారు వేుడం’ అంటూ ఎస్సై అసహనం వ్యక్తం చేశారు.
‘వీురేం చేస్తారో నాకు తెలియుదు మా కుక్క ఎక్క డుందో వెతికి పెట్టండి అర్జెంటుగా’ అంటూ వేడుకుంది.


ఎక్కడికెళ్లింది..?

గురునాథ్‌ చాలా పొదుపుగా మాట్లాడతాడని పేరు.. ఏ మాట మాట్లాడినా అవసరానికి మించి ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు.. ఆయన దగ్గరకు ఒక సేల్స్‌ గర్ల్‌ వచ్చి మహిళలకు సంబంధించిన బ్రాండు వస్తువులు అమ్మడానికి వచ్చింది..
సేల్స్‌ గర్ల్‌: సార్‌ మీ వైఫ్‌తో మాట్లాడొచ్చా?
గురునాథ్‌: మా ఆవిడ ఇంట్లో లేదు..
సేల్స్‌ గర్ల్‌: ఆవిడ వచ్చేదాకా వెయిట్‌ చేయొచ్చా..?
గురునాథ్‌: ఆ డ్రాయింగ్‌ రూంలో కూర్చోండి.. (మూడు గంటలు గడిచింది. సేల్స్‌ గర్ల్‌కు విసుగొచ్చింది)
సేల్స్‌ గర్ల్‌: మీ ఆవిడ ఎక్కడికెళ్లారో.. ఎప్పుడొస్తారో తెలుసుకోవచ్చా?

గురునాథ్‌: సమాధుల దగ్గరికి వెళ్లిందండీ.. వెళ్లి దాదాపు పదకొండేళ్లు అయ్యింది..


మా ఇంటికి రండి

స్టూడెంట్‌ : మాస్టారండీ సాయంత్రం మీరు మా ఇంటికి రావాలండీ..
టీచర్‌: ఎందుకు రా..?
స్టూడెంట్‌: మా నాన్న సాయంత్రం బడి నుంచి వచ్చేటప్పుడు సున్నాలేసేవాడిని తీసుకురమ్మన్నాడండీ.. మరి మీరే కదండి పరీక్షల్లో సున్నాలేసేది.. అందుకే ..


ఏమీ చేయరు..

లెక్కల టీచర్‌: ఒక స్ర్తీ గంటలో యాభై చపాతీలు చేయగలదు.. మరి ముగ్గురు స్ర్తీలు కలసి గంటలో ఎన్ని చపాతీలు చేయగలరు..
విద్యార్థి: సున్నా..
టీచర్‌: అదేంటి అలా చెబు తున్నావు. నీకు లెక్కలు రావా..?
విద్యార్థి: అదేంటి మీకు వాస్తవ పరిస్థితులు తెలియవా.. ఎక్కడైనా ముగ్గురు ఆడవాళ్లు కలిస్తే పని చేస్తారా..


పెళ్లంటే సర్దుకుపోవడమే...

కిరణ్‌ : పెళ్లంటే ఏంటి స్వామి..?
స్వామీజీ : పోవడం నాయనా..
కిరణ్‌ : అంటే పైకి పోవడమా స్వామి..
స్వామీజీ : దీన్నే తొందరపాటు అంటారు..
పోవడం అంటే.. వణికిపోవడం.. సర్దుకుపోవడం.. అణిగిపోవడం.. ఒదిగిపోవడం లాంటివి నాయనా.


ఉన్నదే అడిగా..

మెడికల్‌ షాప్‌లో కస్టమర్‌తో గొడవ పడుతున్న సేల్స్‌ గర్ల్‌ దగ్గరికి వచ్చిన యజమాని ఏమైందని అడిగాడు..
సేల్స్‌ గర్ల్‌: సార్‌, వీడు ‘ఆంటీ బయటికి రా’ అంటున్నాడు.
కస్టమర్‌: లేదు సార్‌, మందుల చీటీలో అలానే ఉంది.. అదే చెప్పా..
ఓనర్‌: ఒరేయ్‌..అది ఆంటీ బయ టికి రా కాదు.. ‘యాంటీబయాటిక్‌’..


అందుకే..

భర్త : ఈ రోజు వంట చేయలేదేం..?
భార్య : పడ్డానండీ.. పట్టేసింది..
భర్త : ఎక్కడ పడ్డావు.. ఏం పట్టేసింది..?
భార్య : దిండుపై పడగానే నిద్ర పట్టేసింది.


ఏమైంది...?

రాజేష్‌ : ఏంట్రా చలిపుడుతుంది అని చెప్పి స్వెట్టర్‌ వేసుకోవడానికి ఇంట్లోకి వెళ్లినోడివి.. బయటకు వచ్చేటప్పుడు చెమటలు పడుతున్నాయి.. ఏం జరిగింది..?
కిరణ్‌ : పాత స్వెట్టర్‌ వేసుకున్నా చలి తగ్గలేదు.. జేబులో చేయి పెట్టే సరికి చెమటలు పట్టడం మొదలైంది..
రాజేష్‌ : ఏం?
కిరణ్‌ : జేబులో పాత రూ.1000 నోట్లు ఆరున్నాయి..


కోడి భోజనం మరి..

ఓ హోటల్‌ ముందు కోడి భోజనం రూపాయి మాత్రమే అని బోర్డు ఉంది. అది చూసి టోకెన్‌ కొని హోటల్లో కూర్చుని లొట్టలు వేయసాగాడు రామూ. కాసేపయ్యాక జొన్నలు ప్లేట్లో తెచ్చి పెట్టాడు సర్వర్‌.
రాము : ఇదేమిటి జొన్నలు తెచ్చావ్‌..? (కోపంగా)
సర్వర్‌ : అవునండీ కోడి తినేది ఇవేగా...


పాస్‌వర్డ్‌ తెలిసిందోచ్‌

కట్టప్ప ఈమెయిల్‌ చేయడాన్ని సిద్ధప్ప రహస్యంగా చూసి...నాకు తెలిసిపోయింది అన్నాడు.
కట్టప్ప : ఏం తెలిసిపోయిందిరా!
సిద్ధప్ప : నీ పాస్‌వర్డ్‌ నాకు తెలిసిందోచ్‌.
కట్టప్ప : ఆ చెప్పు
సిద్ధప్ప : ఆరు స్టార్లు...
కట్టప్ప : !!!!?????


కేకలు వేశాను..పరుగునా వచ్చారు

రవి : దొంగను చూసి దొంగా...దొంగా. అని అరిచినా..ఒక్కరు కూడా బయటకు రాలేదు రా.
నగేష్‌ : అవునా? మరేం చేశావ్‌రా

రవి : రకుల్‌... రకుల్‌ అని కేకలు వేశాను. అంతా తలుపులు తీసుకుని బయటకు పరుగునా వచ్చారు. దొంగ వాళ్లకి ఇట్టే చిక్కిపోయాడు.


వాళ్లుకూడా కనబడతారు మరి..

కిరణ్‌: కొబ్బరి చెట్టు ఎక్కితే ఇంజినీరింగ్‌ కాలేజీ అమ్మాయిలు కనిపిస్తున్నారు.
శాంతి: అక్కడ నుంచి రెండు చేతులు వదిలేయ్‌ మెడికల్‌ కాలేజీ అమ్మాయిలు కూడా కనిపిస్తారు.


భర్త అంటే పూర్ణాంగీ మరి..

భార్య : ఏవండీ ఆడవాళ్లను అర్ధాంగి అంటారుగా మరి మగవాళ్లని?
భర్త : పూర్ణాంగీ అంటారే పిచ్చి మొహమా..
భార్య : అదేంటి ఆడవాళ్లను అలా.. మగవాళ్లను ఇలా..?
భర్త : ఏది చెప్పినా సగమే వింటారు కాబట్టి అర్ధాంగి.. మీరు చెప్పేది పూర్తిగా వినేదాక వదలరు గనుక పూర్ణాంగీ అంటారు.. అర్థమైందా మళ్లీ చెప్పాలా..
భార్య : వద్దులేండి బాబు.. నాకు ఒకసారి పూర్తిగా వినాలంటేనే విసుగు.. మళ్లీ రెండోసారా..


పోల్చితే అంతే మరి.

తండ్రి: ఎందుకురా 2వేల నోటులా ఎప్పుడూ ఇంట్లో ఖాళీగా కూర్చుంటావ్‌..ఇలానే ఉంటే 1000 నోటులా ఎందుకు పనికి రాకుండా పోతావ్‌.. వాడు చూడు చిన్నోడైనా వంద నోటులా ఎంచక్కా రాజాలా బతికేస్తున్నాడు.
కొడుకు: ఎందుకు నాన్నా, మాటలతో ‘మోదీ మోదీ’ అని చంపుతావు..


నేనెవర్ని?

‘‘నేను ఎప్పుడూ చూడని కళ్లు నన్ను ఆశగా చూస్తున్నాయి .. నేనెవర్ని?’’ అరిచాడు శివుడు.
‘‘నువ్వు బ్యాంకు మేనేజర్‌వి బాబూ ..’’ సావధానంగా చెప్పాడు కట్టప్ప.


ఎవరు గొప్ప?

‘‘మా ఆవిడ ఏం చెప్పినా కుండబద్దలు కొట్టిచెబుతుంది తెలుసా?’’ గొప్పగా చెప్పాడు ఏసుపాదం.
‘‘మా ఆవిడైతే ఫ్రిజ్జు, టీవీ, కూలర్‌ బద్దలు కొట్టి చెబుతుంది’’ మరింత గొప్పగా చెప్పాడు సామవేదం.


ఒకప్పటి మాట!

‘‘వెయ్యి రూపాయలకి ఎన్ని వంద నోట్లు వస్తాయో చెప్పు?’’ అడిగింది టీచరమ్మ.
‘‘ఒకప్పుడు పది వచ్చేవి. ఇప్పుడు ఒక్కటి కూడా రాదు’’ చెప్పాడు స్టూడెంట్‌.


నోరుండేది అడుగు

‘‘డాడీ .. మా స్కూల్‌ డ్రామాలో నాకు హస్బెండ్‌ క్యారెక్టర్‌ ఇచ్చారు’’ ఉత్సాహంగా చెప్పాడు టింకూ.
‘‘నా పరువు తీశావురా .. వెళ్లి కనీసం ఒక్క డైలాగైనా ఉండే క్యారెక్టర్‌ ఇమ్మని అడుగు’’ అసహనం ప్రకటించాడు సుబ్బారావు.


లేనిదెలా అడగను?

భర్తను వంద రూపాయలు అడిగింది సుమతి. డబ్బులెందుకంటూ గీచి గీచి వంద ప్రశ్నలేసి ‘‘నీకు డబ్బు విలువ బొత్తిగా తెలియదు. నీకు కావలసింది డబ్బు కాదు. తెలివితేటలు’’ అన్నాడు శేషాచలం.
‘‘నిజమే. మీదగ్గరున్న వంద రూపాయలకే ఇన్ని ప్రశ్నలేశారు. మీదగ్గర లేని తెలివి తేటలడిగితే ఇంకెన్ని ప్రశ్నలేసి చంపుతారో’’ తెలివిగా బదులిచ్చింది సుమతి.


డోసు సరిపోయిందా!

‘‘నువ్వు పొద్దున్నే ఎన్ని గంటలకు లేస్తావు?’’
‘‘సరిగ్గా .. 4 గంటలకు’’
‘‘వావ్‌ .. అంత తెల్లారే లేచి ఏం చేస్తావు?’’
‘‘అటు పక్కకి తిరిగి పడుకుంటా’’


అనుభవసారం

‘‘ప్రేమ గురించి మీ అభిప్రాయం చెప్పండి?’’
‘‘ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు. పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉండదు’’


నువ్వుండగా అదెందుకు?

‘‘ప్రియా .. నీకోసం కొండమీది కోతినైనా తీసుకొస్తాను ..’’ కుప్పించి దూకబోయాడు ప్రియుడు.
‘‘వద్దులే .. నువ్వు చాలు’’ వెనక్కి లాగింది ప్రేయసి.


మరి సినిమాల్లో ట్రైచేయొచ్చు కదా..

బెగ్గర్‌ : అమ్మా..! ఏదైనా ఉంటే పెట్టమ్మ..
వల్లీ : ఏ.. కాళ్లు చేతులు బానేఉన్నాయిగా.. ఏదైనా పని చేసుకుని బతకొచ్చుగా..
బెగ్గర్‌ : మీరు అందంగా.. సరైన ఎత్తు.. మంచి కలర్‌ ఉన్నారుగా మేడమ్‌.. మరి సినిమా హీరోయిన్‌గా ట్రై చేయొచ్చుగా..
వల్లీ : ఉండు బిర్యాని తీసుకొస్తా.. పాపం ఆకలితో ఉన్నట్లున్నావ్‌...


మామా! తప్పుకో!!

విమాన ప్రయాణంలో ఇండియన్సకి వైన ఇవ్వడం నిషేధించారు. ఎందుకంటే - తాగిన తర్వాత మిగతా దేశాలవాళ్ల ప్రవర్తనకూ మన వాళ్ల ప్రవర్తనకూ మధ్య చాలా తేడా ఉంటోందట.
బ్రిటిషర్‌ - నేను పడుకుంటా!
అమెరికన - నేను ఇంటర్నెట్‌లో పనిచేసుకుంటా!
జర్మన - నేను మ్యూజిక్‌ వింటా!
చైనీస్‌ - నేను సినిమా చూస్తా!
ఇండియన - మామా, తప్పుకో! నేను ఫ్లైట్‌ నడుపుతా!


పేద విద్యార్థి

‘‘సుశీల్‌ .. రోజంతా అమ్మాయిలతో మాట్లాడుతూనే ఉంటావెందుకు?’’ మందలించింది టీచర్‌.
‘‘నేను చాలా బీదవాడ్ని టీచర్‌. నా ఫోన్లో వాట్సప్‌ లేదు’’ చేతులు కట్టుకుని బదులిచ్చాడు స్టూడెంట్‌.


దేవుడి టార్చ్‌

‘‘వాన వచ్చేప్పుడు మెరుపులు ఎందుకొస్తాయి?’’ అడిగాడు చింటు.
‘‘భూమి పూర్తిగా తడిసిందో లేదో చూసుకోవడానికి దేవుడు వేసే టార్చ్‌లైటు అది’’ చెప్పాడు బంటి.


సలహా

‘‘రోజూ 2 గంటల ప్రయాణం ... బస్‌లో వెళ్తుంటే చుక్కలు కనిపిస్తున్నాయిరా ..’’ చెప్పాడు శ్రీకాంత.
‘‘లెక్కపెట్టుకుంటూ వెళ్లు .. టైం పాస్‌ అవుతుంది’’ సలహా ఇచ్చాడు శశికాంత.


మామా! తప్పుకో!!

విమాన ప్రయాణంలో ఇండియన్సకి వైన ఇవ్వడం నిషేధించారు. ఎందుకంటే - తాగిన తర్వాత మిగతా దేశాలవాళ్ల ప్రవర్తనకూ మన వాళ్ల ప్రవర్తనకూ మధ్య చాలా తేడా ఉంటోందట.
బ్రిటిషర్‌ - నేను పడుకుంటా!
అమెరికన - నేను ఇంటర్నెట్‌లో పనిచేసుకుంటా!
జర్మన - నేను మ్యూజిక్‌ వింటా!
చైనీస్‌ - నేను సినిమా చూస్తా!
ఇండియన - మామా, తప్పుకో! నేను ఫ్లైట్‌ నడుపుతా!


Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -61

Responsive Footer with Logo and Social Media