పేజీ సంఖ్య - 58
అదే ఫీలింగ్
బ్యాంక్ మేనేజర్ ఒక హోటల్‌కి వెళ్లాడు.
సర్వర్ : సర్ ఆర్డర్ ప్లీజ్!
బ్యా.మే. : మీ దగ్గర ఏముంటాయి?
సర్వర్ : ఇడ్లీ, వడ, ఊతప్పం, ఉప్మా, పొంగల్ దోశ, పూరీ....
బ్యా.మే. : (ఆపమన్నట్టు చెయ్యి ఎత్తి) ఓకే... ఓకే... ఇడ్లీ, వడ, దోశ పట్టుకురా. ఊతప్పం రెండు ప్లేట్లు పార్శిల్ కట్టించు.
సర్వర్ : సారీ సర్, అవేమీ లేవు. అమ్ముడైపోయాయి.
బ్యా.మే. : (చిరాగ్గా) ఈ మాత్రం దానికి ఎందుకు అంత పెద్ద దండకం చదివావు?
సర్వర్ : మరి, మేం మీ ఏటీఎంకు వెళితే అది ముందు పిన్ నంబర్ అడుగుతుంది. ఎక్కౌంట్ డిటెయిల్స్ అడుగుతుంది. ఎంత డబ్బు కావాలో ఎంటర్ చేయమని అడుగుతుంది. తర్వాత ట్రాన్సాక్షన్ ప్రింట్ కావాలా, వద్దా? అని అడుగుతుంది. అన్నీ చేశాక, చివర్లో ‘నో క్యాష్’ అని నింపాదిగా చెబుతుంది కదా! అందుకన్న మాట.
ఆ సుఖమే నే కోరుకున్నా ...
‘‘సార్, కొత్తగా వచ్చిన క్లర్క్ కుమారి పొద్దస్తమానం పక్కసీట్లో ఉన్న కనకారావు భుజంపై ఒరిగిపోతోంది’’ ఫిర్యాదు చేశాడు ఆఫీసు బాయ్.
‘‘అలాగా .. అయితే రేపట్నించి నా కుర్చీ తీసుకెళ్లి ఆ కనకారావు ప్ల్లేస్‌లో వేయ్’’ ఆర్డర్ జారీ చేశాడు మేనేజర్.
చెప్పినందుకే ...
‘‘ఏంటి .. నీ ప్రియురాలు నిన్ను వదిలేసిందా?’’
‘‘అవును ...’’
‘‘నీ మేనమామ కోటీశ్వరుడని చెప్పలేక పోయావా?’’
‘‘చెప్పాను. అందుకే తను ఇప్పుడు నాకు అత్త కాబోతోంది.’’
ఉండే కాలం వస్తే ...
ఓ ఎమ్మెల్యే పిచ్చాసుపత్రి విజిట్ చేశాడు. ఆయన్ని చూడగానే పిచ్చోళ్లంతా దూరంగా జరిగారు. ఒక పిచ్చోడు మాత్రం లెక్కలేనట్టు దర్జాగా నిల్చున్నాడు.
‘‘నేనెవరో తెలుసా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని’’ అన్నాడు ఎమ్మెల్యే.
‘‘ఆర్నెల్ల క్రితం నేను కూడా ఇలాగే అన్నాను. అప్పట్నించి నన్ను ఇక్కడే ఉంచేశారు’’ చెప్పాడు పిచ్చోడు.
‘చావు’ తెలివి!
ఓ మహిళ ... పేరున్న చిత్రకారుడి దగ్గరికెళ్లి తన బొమ్మ గీసిపెట్టమని అడిగింది. ‘దయచేసి ఆ బొమ్మలో నేను ఓ రవ్వల నెక్లెస్ వేసుకున్నట్టు ఉండాలి’ అని షరతు పెట్టింది.
‘ఎందుకు మేడమ్’ అమాయకంగా అడిగాడు ఆర్టిస్టు.
‘పొరపాటున నేను చచ్చిపోయాననుకో. మా ఆయన తప్పకుండా రెండోపెళ్లి చేసుకుంటాడు. ఆ వచ్చే ఆవిడ ఈ బొమ్మను చూసి తీరుతుంది. ఈ నెక్లెస్ కోసం బీరువా అంతా గాలిస్తుంది. ఎక్కడా కనబడదు. దీంతో మా ఆయన ఆఫీసు నుంచి రాగానే గొడవపెట్టుకుంటుంది. మాటా మాటా అనుకుంటారు. ఇక అప్పటి నుంచీ రోజూ గొడవే...’ కళ్లకు కట్టినట్టు జరగబోయేదంతా వివరించింది మహిళ.
‘ఈ ఐడియా ఎలా వచ్చింది మేడమ్’ ఆరాధనగా అడిగాడు చిత్రకారుడు.
‘జీవన్ ఆనంద్ పాలసీ గురించి విన్లేదా....జిందగీకే సాత్ భీ, జిందగీకే బాద్ భీ! మా ఆయన ఇన్సురెన్సు ఉద్యోగి’ - జవాబిచ్చింది మహిళ.
ద్యే...వు....డా!
ఓ పాతిక అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇరవై అయిదో అంతస్తు మీద సూపర్‌వైజరు ఉన్నాడు. కింద కార్మికుడు ఉన్నాడు. పై నుంచి ఎంత పిలిచినా అతడు పలకడం లేదు. దీంతో, అలా అయినా, తలపైకెత్తి చూస్తాడన్న ఉద్దేశంతో....జేబులోంచి ఓ పది రూపాయల నోటు విసిరాడు. కిందపడిన కరెన్సీని తీసి జేబులో పెట్టుకున్నాడు కానీ, పైకి చూడలేదు. ఈసారి వంద రూపాయల నోటు విసిరాడు. అయినా స్పందన లేదు. దీంతో, ఓ చిన్న రాయి విసిరాడు. అది కాస్తా వెళ్లి నెత్తికి తగిలింది. అప్పుడు తలపైకెత్తాడు.
...ఈ కథంతా చెప్పిన స్వామీజీ ‘ఇందులో నీతి ఏమిటో తెలుసా?’ అని అడిగాడు. ఎవరూ చెప్పలేకపోయారు. మళ్లీ తనే అందుకున్నాడు.
‘వరాలు ఇచ్చినప్పుడు మనం దేవుడిని పట్టించుకోం. కష్టాలు ఎదురైనప్పుడే పైకి చూస్తాం’
ఒకే ప్రశ్న... మూడు జవాబులు
తమిళనాడు విద్యార్థులు ఒకే ప్రశ్నకు వివిధ పరీక్షల్లో వివిధ జవాబులు రాయాల్సి వచ్చింది. ఆ ప్రశ్న ... ‘తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు?’
క్వార్టర్లీలో... ‘జె. జయలలిత’
హాఫ్ ఇయర్లీలో... ‘పన్నీర్ సెల్వన్’
యాన్యువల్ ఎగ్జామ్స్... ‘పళనిస్వామి’
రామేశ్వరమెళ్లినా...
అంతకుముందు రోజు రాజీనామా లేఖ ఇచ్చివెళ్లిన ఉద్యోగి, హెచ్‌ఆర్ మేనేజరు క్యాబిన్‌లోకెళ్లి.... ‘సార్! నా నిర్ణయం మార్చుకుంటున్నా. చచ్చినా కొత్త ఉద్యోగంలో చేరను’ అంటూ కాళ్లావేళ్లా పడ్డాడు.
‘అంతలోనే ఏమైంది?’ అనుమానంగా అడిగాడు హెచ్‌ఆర్ హెడ్డు.
‘మా బాసు కూడా రాజీనామా చేసి, ఆ కంపెనీకే వెళ్తున్నాడట. ఇప్పుడే తెలిసింది’ - జవాబిచ్చాడు ఉద్యోగి.
బాబోయ్ ఎండలు..
సూర్యుడికి కూడా భార్య ఉంటే బావుంటుంది..
కొంచెం కంట్రోల్‌లో ఉంటాడు..
లేదంటే ఏంటిది.. ఇంతలా ఎండలు మండిస్తాడా..!
వారు మేధావులవుతారా..!
దేశంలో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 943 మంది అమ్మాయిలే ఉన్నారట. (జెండర్ రేషియో).. అంటే దానర్థం 57 మంది అబ్బాయిలు అవివాహితులుగానే ఉండిపోతారు.
ఆ 57 మంది పెరిగి పెద్దయ్యాక.. అబ్దుల్ కలాం, వాజ్‌పేయి, రతన్ టాటా, యోగి, నరేంద్ర మోదీ వంటి వారుగా తయారవుతారు..
మిగిలిన 943 మంది.. కుక్కర్ 3 విజిల్స్ అయ్యాక గ్యాస్ ఆపుతూ ఉంటారు.
‘అందమైన’ పురాణం
ఒక అష్టావధాని అవధానం చేస్తుండగా తెలివైన పృచ్ఛకుడు ఇచ్చిన సమస్య ఇది.
దత్తపది...
తమన్నా - సమంతా - త్రిష - కాజల్
అవధాని గారి పూరణ...
భీష్ముడు అంపశయ్యపై నున్నప్పుడు కృష్ణుడు అర్జునునితో...
తా తమన్నన బొందిన ధన్యుడివు
దోసమంతగ నెంచడు - కాశి రాజ
పుత్రి షండునిగా మారి పుట్టిముంచె
గంగ రప్పించు త్రాగుటకా జలమ్ము
ఇలా తేటగీతిలో ‘అందమైన’ పద్యం చెప్పి సభికుల్ని ఆనందంలో ముంచెత్తారు అవధాని గారు.
గురి తప్పటం లేదు
‘‘మా ఆవిడ గత మూడేళ్లుగా చేతికి దొరికిన వస్తువులన్నీ నాపైకి విసురుతోంది సార్. నిన్న కత్తి కూడా విసిరింది. ఇదిగో గాటు ...’’ గొల్లుమన్నాడు ముకుందం.
‘‘మూడేళ్లనుండి విసురుతుంటే ఇప్పుడెందుకు వచ్చావు?’’ అనుమానం వ్యక్తపరచాడు ఎస్.ఐ.
‘‘మొన్నటి వరకు గురి తప్పేది’’ చెప్పాడు ముకుందం.
పోకచెక్క బతుకు
‘‘ఏ అమ్మాయిని తీసుకెళ్లినా మా మమ్మీకి నచ్చట్లేదు .. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు’’ వాపోయాడు అనిల్.
‘‘వెరీ సింపుల్. మీ మమ్మీకి ఇష్టమైన అమ్మాయినే తీసుకెళ్లు’’ సలహా ఇచ్చాడు సునీల్.
‘‘తీసుకెళ్లాను ... కాని, ఆ అమ్మాయిని డాడీ ఇష్టపడటం లేదు ...’’ గొల్లుమన్నాడు అనిల్.
జెలసీ
‘‘అదిగో .. అతనే ...’’ ఒక తాగుబోతును చూపిస్తూ గుసగుసగా అంది సునీత.
‘‘ఎవరతను?’’ నుదురు చిట్లిస్తూ అడిగాడు భర్త వీరేంద్ర.
‘‘మన పెళ్లికి ముందు నేను విడాకులిచ్చింది ఆయనకే’’ చెప్పింది సునీత.
‘‘అందుకేనా .. ఇప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు’’ కుళ్లుగా అన్నాడు వీరేంద్ర.
కుదర్లేదులే
పొద్దున్నే భర్తను నిద్రలేపి కాఫీ పెట్టిమ్మంది నాంచారి.
‘‘ఇక నావల్ల కాదు’’ అంటూ కోపంగా చెప్పులేసుకున్నాడు జోగినాథం.
‘‘ఎక్కడికెళ్తున్నారు?’’ అడిగింది నాంచారి.
‘‘లాయర్ దగ్గరకి. నీకు విడాకులిచ్చేస్తాను ’’ చెప్పాడు జోగినాథం.
గంట తర్వాత పిల్లిలా వచ్చి కిచెన్‌లో దూరి కాఫీ చేసి భార్యకిచ్చాడు.
‘‘ఏమైంది? విడాకులిస్తానన్నారుగా’’ కాఫీ సిప్ చేస్తూ అంది నాంచారి.
‘‘నేను వెళ్లేసరికి లాయర్ అంట్లు తోముతున్నాడు’’ గొణిగాడు జోగినాథం.
పులికి ఆకలేసింది
‘‘సోమూ .. పులి, మేక బొమ్మల్ని వేసుకురమ్మని హోమ్‌వర్క్ ఇచ్చాను కదా .. మేక బొమ్మ వేయలేదేం?’’ అడిగింది టీచర్.
‘‘రెండూ వేశాను టీచర్. పులికి ఆకలేసిందేమో, మేకను తినేసినట్టుంది’’ గడుసుగా బదులిచ్చాడు సోము.
అయ్య కొడుకు
‘‘నాన్నా .. మా లెక్కల సారు నిన్ను రేపు స్కూల్లో కలవమని చెప్పాడు’’ బుజ్జి.
‘‘ఏమయిందిరా ..?’’ నాన్న.
‘‘ఈరోజు క్లాసులో 6 ్ఠ 6 ఎంత అన్నాడు. 36 అని చెప్పాను. తర్వాత 4 ్ఠ 9 ఎంత అన్నాడు ... ’’ బుజ్జి
‘‘వెధవా .. రెండూ ఒకటే కదరా ..’’ నాన్న.
‘‘నేనూ అదే చెప్పాను’’ బుజ్జి.
అంతా ఆవిడ దయ!
మనం తినే ప్రతి మెతుకుపై మన పేరు రాస్తాడు భగవంతుడు.
కానీ ఆ మెతుకు బిర్యానీ మెతుకా, చద్దన్నం మెతుకా అనేది భార్య నిర్ణయిస్తుంది.
అందుకే తగలబెడుతున్నాం!
రావణుడి బొమ్మ తగలబెట్టడానికి వచ్చిన ప్రజలకు బొమ్మలో నుండి రావణుడి గొంతు వినిపించింది -
‘నన్నెందుకు కాలుస్తారు. నేను మీ భార్యలనేమైనా ఎత్తుకెళ్లానా?’
ఇంతలో గుంపులో నుండి ఎవరో సమాధానమిచ్చారు.
‘లేదు. అందుకే తగలబెడుతున్నాం’
గతం కావాలి..
పంచాంగ కర్త: అమ్మా.. మీ ఆయన జాతకం ప్రకారం ఈ ఏడాది ఆదాయ వ్యయాలు చెప్పమంటారా..?
రమణి: ఆయన భవిష్యత నిర్ణయించేది నేనే కానీ... గతం ఏంటో చెప్పండి చాలు.. దాన్ని బట్టే ఆయన జీవితం ఉంటుంది.
అందుకే..
బోనులో ముద్దాయి మనోజ్‌ని జడ్జి ప్రశ్నిస్తూ.. ‘నువ్వు ఏడాది క్రితం జైలు నుంచి తప్పించుకుని ఎందుకు పారిపోయావు..?’
మనోజ్: అప్పుడు మానస నన్ను పెళ్లి చేసుకోవాలని ఎదురుచూస్తోంది... అందుకే..’
జడ్జి: మరెందుకు అకస్మాత్తుగా నీ అంతట నీవే వచ్చి కోర్టులో లొంగిపోయావు..?
మనోజ్: నాకు స్వాతంత్రం కావాలనిపించింది..
తాగుబోతుతో పెట్టుకోకు
పోలీస్: ఎక్కడుంటావు?
తాగుబోతు: మా పేరెంట్స్‌తో.
పోలీస్: వాళ్లెక్కడుంటారు?
తాగుబోతు: నా దగ్గరే.
పోలీస్: మీ ఇల్లెక్కడ?
తాగుబోతు: మా పక్కింటి పక్కన.
పోలీస్: మీ పక్కిల్లు ఎక్కడ?
తాగుబోతు: నేను చెప్పినా మీరు నమ్మరు.
పోలీస్: నమ్ముతా ... చెప్పు.
తాగుబోతు: మా ఇంటి పక్కనే.
అత్తగారూ - కొత్త కోడలు
సిటీలో పుట్టి పెరిగిన అమ్మాయి పల్లెటూరి అబ్బాయిని పెళ్లాడింది. అత్తవారింటికి వెళ్లిన మొదటి రోజు -
‘‘గడ్డి తీసుకెళ్లి గేదెముందు వేసిరామ్మా’’ అత్త పని పురమాయించింది.
గడ్డి తీసుకెళ్లిన కోడలికి గేదె నోట్లో నురగ కనిపించి వెనక్కి వచ్చేసింది.
‘‘గడ్డి వెనక్కి తెచ్చేశావెందుకు?’’ అడిగింది అత్త.
‘‘అది ఇంకా మొహం కడుక్కోలేదండి. బ్రష్ చేసుకుంటోంది’’ చెప్పింది కొత్త కోడలు.
ఆరంభశూరుడు
‘‘ఎక్కడికెళ్తున్నారు?’’ అడిగింది భార్య.
‘‘ఆత్మహత్య చేసుకోవడానికి’’ చిరాగ్గా బదులిచ్చాడు భర్త.
‘‘ఈ సంచి పట్టుకెళ్లండి’’ అందించింది భార్య.
‘‘ఎందుకు?’’ అడిగాడు భర్త.
‘‘మీరు మధ్యలో నిర్ణయం మార్చుకుంటే, వచ్చేప్పుడు కిలో వంకాయలు, అరకేజీ చింతపండు తీసుకురండి’’ చెప్పి హడావిడిగా ఇంట్లోకి వెళ్లింది భార్య.
బాధితులు
‘‘తోడల్లుడు అంటే ఎవరు నాన్నా?’’ అడిగాడు పుత్రుడు.
‘‘ఒకే కంపెనీ వలన మోసపోయిన ఇద్దరు కస్టమర్లు’’ చెప్పాడు తండ్రి.