పేజీ సంఖ్య - 59
కలలు కల్లలు
‘‘మీరు నాకు డైమెండ్ నెక్లెస్ కొనిస్తున్నట్టు రాత్రి కలొచ్చింది’’ చెప్పింది భార్య.
‘‘అవునవును. బిల్ మీ డాడీ ఇస్తున్నట్టు నాకూ వచ్చింది’’ చెప్పాడు భర్త.
షాపింగే నేరమౌనా?
‘‘నిన్ను ఎందుకు అరెస్టు చేశారు?’’ అడిగాడు జడ్జి.
‘‘షాపింగ్ చేసినందుకు’’ చెప్పాడు గంగులు.
‘‘అదేమంత నేరం కాదే .. దానికెందుకు అరెస్టు చేశారు?’’ అడిగాడు జడ్జి.
‘‘షాపు తెరవకముందే షాపింగ్‌కు వెళ్లానని’’ చెప్పాడు గంగులు.
ధర్మ సందేహం
విద్యార్థి: సార్ .. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని అందరూ అడుగుతున్నారు కానీ కట్టప్ప ఎందుకు పెళ్లి చేసుకోలేదని ఎవరూ అడగరెందుకు?
గురువు: ఆఁ ...!
దూరాలోచన
‘‘పార్వతీదేవి శివుడిని భర్తగా ఎందుకు ఎంచుకుందో నాలుగు కారణాలు రాయండి’’ అని చెప్పాడు టీచర్.
ఒక విద్యార్థి ఇలా రాశాడు.
‘‘శివుడు జింక చర్మం ధరిస్తాడు కాబట్టి పార్వతికి బట్టలుతికే పని ఉండదు. తలపై గంగ ఉంటుంది కాబట్టి బిందె పట్టుకుని నీళ్లకు బయటకి వెళ్లనక్కర్లేదు. చంద్రవంక ఉంటుంది కాబట్టి కరెంటు ప్రాబ్లమ్ లేదు. కందమూలాలు తింటాడు కాబట్టి వంట వండే అవసరం అసలే ఉండదు .. ఈ కారణముల చేత పార్వతి శివుడిని వరించెను’’.
ఆర్డరేసింది ఆవిడే
దేవుడు స్వర్గంలో ఉండే భార్యాభర్తలందరితో ఒక సమావేశం ఏర్పరచి ఆడవాళ్లను, మగవాళ్లను రెండు వరసలుగా నిలుచోమన్నాడు. తర్వాత భార్య మాట వినేవాళ్లంతా ఒక వరసగా, భార్య మాట విననివారంతా మరో వరసలో నిలుచోండి అన్నాడు. ఒక్కడు తప్పించి అంతా భార్య మాట వినే వరసలో నిలుచున్నారు.
‘‘ఇంతమందిలో నువ్వు ఒక్కడివే భార్య మాట వినని వాడవన్నమాట’’ అడిగాడు దేవుడు.
‘‘ఈ లైన్లో నిలుచోమని ఆర్డరేసింది మా ఆవిడేనండి’’ చెప్పాడు ఆ భర్త.
అస్తమానం మార్చలేక!
‘‘నీ వయసు 70 ఏళ్లకు తక్కువుండదు. దరఖాస్తులో 18 ఏళ్లని రాసి ఉంది’’ ఆశ్చర్యపోయాడు కొత్తగా వచ్చిన జడ్జి.
‘‘అందులో అబద్ధం ఏం లేదండి. నా కేసు కోర్టుకు వచ్చినపుడు నా వయస్సు పద్దెనిమిదేళ్లే నండి’’ చేతులు కట్టుకుని విన్నవించుకున్నాడు నిందితుడు.
క్యా బాత్ హై!
భార్యంటే - దారి తెలిసి డ్రైవింగ్ తెలియని స్త్రీ.
భర్తంటే - డ్రైవింగ్ తెలిసి దారి తెలియని మొగాడు.
అందుకే ఇద్దరూ కలిసి ప్రయాణం చేయాలి!
కలసి ఉంటే కలదు నరకం
‘‘ఏమండి ... స్వర్గంలో భార్యాభర్తలను ఒకే దగ్గర ఉంచరట నిజమేనా?’’ సందేహం వెలిబుచ్చింది కాంతం.
‘‘ఒకే దగ్గర ఉంచితే అది స్వర్గమెందుకు అవుతుందే పిచ్చిదానా’’ చెప్పాడు ఏడుకొండలు.
తెలివి
‘‘ఒరేయ్ ... ఆవుకు పచ్చ కళ్లద్దాలు ఎందుకు పెట్టావురా?’’ అరిచాడు యజమాని.
‘‘ఆయ్ .. ఈరోజు పచ్చగడ్డి దొరకలేదండి’’ చెప్పాడు పాలేరు.
అందుకే అభిమానం
‘‘మీ అభిమాన రచయిత ఎవరు?’’
‘‘జార్జ్ వాషింగ్టన్’’
‘‘ఆయన రచనలు చేయలేదే!’’
‘‘అందుకే ఆయనంటే అభిమానం’’
మాటమీదే నిలుచున్నాను
‘‘ఇకపై మద్యం ముట్టుకోనని ప్రమాణం చేశావు కదా .. మళ్లీ తాగుతున్నావేం?
‘‘సరిగ్గా చూడు ... సా్ట్ర వేసుకున్నాను.’’
మొదటి యువకుడు
‘‘నిన్ను ప్రేమించిన మొదటి యువకుడ్ని నేనే కదా?’’ గోముగా అడిగాడు ప్రియుడు.
‘‘అవును. మిగతావారంతా వయసు మళ్లినవారే’’ నిజాయితీగా ఒప్పుకుంది ప్రేయసి.
నిర్ణయం మార్చుకుంటే..
భార్య : ఎక్కడికెళుతున్నారు..?
భర్త : ఆత్మహత్య చేసుకోవడానికి
భార్య : ఒక సంచి కూడా పట్టుకెళ్లకూడదూ..?
భర్త : అదెందుకు?
భార్య : ఒక వేళ నిర్ణయం మార్చుకుంటే వచ్చేటప్పుడు కిలో టమాటాలు, అరకిలో చింతపండు తెస్తారని..
ఒకసారి ఇంటికి రా!
అప్పారావు దగ్గరకు బెగ్గర్ వచ్చి ‘‘టెన్ రుపీస్ ప్లీజ్ ..’’ అన్నాడు.
‘‘బీరు కొడతావా?’’ అప్పారావు.
‘‘లేదు సార్ .. నేను తాగను’’ బెగ్గర్.
‘‘దమ్ము కొడతావా .. ఇదిగో సిగరెట్’’ అప్పారావు.
‘‘అలవాటు లేదు సార్’’ బెగ్గర్.
‘‘పేకాడదాం వస్తావా .. నీ పెట్టుబడి కూడా నేనే పెడతాను’’ అప్పారావు.
‘‘నాకసలు పేకాడ్డమే రాదు ..’’ బెగ్గర్.
‘‘సరే, నీకో గర్ల్ ఫ్రెండ్‌ని పరిచయం చేస్తా రా ’’ అప్పారావు.
‘‘ఛీ .. నా కలాంటివి గిట్టవు. ఐ లవ్ మై వైఫ్’’ బెగ్గర్.
‘‘సరే, నాతో మా ఇంటికి రా’’ అప్పారావు.
‘‘ఎందుకు?’’ బెగ్గర్.
‘‘మందు కొట్టనోడు, స్మోక్ చేయనోడు, పేకాట, గర్ల్ ఫ్రెండ్ లేకుండా కేవలం భార్యను మాత్రమే ప్రేమించే వాడి గతి ఏమవుతుందో నా పెళ్లానికి తెలియాలి ..’’
వాట్సప్ బిచ్చగాడు
‘‘అమ్మా .. ఆకలేస్తోంది. అన్నం ఉంటే పెట్టమ్మా ..’’ అరిచాడు బిచ్చగాడు.
‘‘ఇంకా వంటకాలేదు .. తర్వాత రా’’ చెప్పింది ఇల్లాలు.
‘‘అయితే నా సెల్ నెంబరు చెబుతా .. వంటవగానే మిస్డ్ కాల్ ఇవ్వండి’’ సలహా ఇచ్చాడు బిచ్చగాడు.
ఒళ్లు మండిన ఇల్లాలు ‘‘అన్నం అవగానే వాట్సప్‌లో అప్‌లోడ్ చేస్తా. నువ్వు డౌన్‌లోడ్ చేసుకుని తిను’’ అంది కోపంగా.
నరకమా? ఓటమా?
‘‘నువ్వు అబద్ధపు సాక్ష్యం చెబితే ఏమవుతుందో తెలుసా?’’ అడిగాడు జడ్జి.
‘‘తెలుసండి. చచ్చిన తర్వాత నరకానికి పోతాను’’ చెప్పాడు శేషాచలం.
‘‘గుడ్. మరి నిజం చెబితే?’’ అడిగాడు జడ్జి.
‘‘కేసు ఓడిపోతాను’’ చెప్పాడు శేషాచలం.
అనుమానం పీనుగు
‘‘మీ ఆయనకు ఏమైనా పిచ్చా .. నా చుట్టూ తిరుగుతూ పరిశీలనగా చూస్తున్నాడెందుకు?’’ భయపడుతూ అడిగింది అలివేలు.
భర్త దూరంగా వెళ్లగానే ‘‘ఎవడైనా ఆడవేషంలో వచ్చి నాతో మాట్లాడుతున్నాడేమోనని అనుమానం’’ చెప్పింది చంద్రావతి.
మీరే పొరపడ్డారు!
‘‘ఏంటమ్మా ... సమస్య?’’ అడిగాడు డాక్టర్.
‘‘మావారు నిద్రలో గురక పెడుతున్నారండి’’ చెప్పింది ఆదిలక్ష్మి.
‘‘నేను మనుషుల డాక్టర్ని కాను పశువుల డాక్టర్ని’’ నవ్వాడు డాక్టర్.
‘‘తెలుసండి. కాని ఆయన గురకలో గాడిద ఓండ్ర వినిపిస్తోంది’’ చెప్పింది ఆదిలక్ష్మి.
నేనెవరికి చెప్పుకోను?
‘‘నా భార్య ఎప్పుడూ తన మాజీ భర్త గురించి చెబుతూ ఉంటుంది. భరించలేకపోతున్నానురా ...’’ బావురుమన్నాడు శ్రీకాంత.
‘‘నీ భార్య పర్లేదురా .. నా భార్య కాబోయే భర్త గురించి చెప్పి భయపెడుతుందిరా’’ గొల్లుమన్నాడు రమాకాంత.
చీరలమ్మ
‘‘అయ్యో .. వెంటనే మనం చీరలు కొన్న షాపుకు వెళ్లాలండి’’ కంగారుపడింది మాణిక్యం.
‘‘చీరలు వదిలేశావా?’’ బైక్ వెనక్కి తిప్పుతూ అన్నాడు సుబ్రహ్మణ్యం.
‘‘కాదు .. మన చంటిదాన్ని’’ చెప్పింది మాణిక్యం.
గొప్పలమ్మ
‘‘మా ఇంటికి చాలామంది వస్తుంటారు తెలుసా’’ గొప్పగా అంది పంకజం.
‘‘అవునా ... మీవారేం చేస్తుంటారు?’’ అడిగింది జలజం.
‘‘అప్పులు’’ ఠపీమని బదులిచ్చింది పంకజం.
మళ్లీ కనిపించకు
‘‘మేడం చీమల మందు కొంటారా?’’ అడిగాడు సేల్స్‌మ్యాన్.
‘‘ఈ రోజు చీమలకు మందు కొంటే, రేపు దోమలు టానిక్స్ అడుగుతాయి .. వెళ్లవయ్యా’’ దభీమని తలుపేస్తూ అంది కాంతం.
వాట్సప్ బిచ్చగాడు
‘‘అమ్మా .. ఆకలేస్తోంది. అన్నం ఉంటే పెట్టమ్మా ..’’ అరిచాడు బిచ్చగాడు.
‘‘ఇంకా వంటకాలేదు .. తర్వాత రా’’ చెప్పింది ఇల్లాలు.
‘‘అయితే నా సెల్ నెంబరు చెబుతా .. వంటవగానే మిస్డ్ కాల్ ఇవ్వండి’’ సలహా ఇచ్చాడు బిచ్చగాడు.
ఒళ్లు మండిన ఇల్లాలు ‘‘అన్నం అవగానే వాట్సప్‌లో అప్‌లోడ్ చేస్తా. నువ్వు డౌన్‌లోడ్ చేసుకుని తిను’’ అంది కోపంగా.
అనుమానం పీనుగు
‘‘మీ ఆయనకు ఏమైనా పిచ్చా .. నా చుట్టూ తిరుగుతూ పరిశీలనగా చూస్తున్నాడెందుకు?’’ భయపడుతూ అడిగింది అలివేలు.
భర్త దూరంగా వెళ్లగానే ‘‘ఎవడైనా ఆడవేషంలో వచ్చి నాతో మాట్లాడుతున్నాడేమోనని అనుమానం’’ చెప్పింది చంద్రావతి.
మీరే పొరపడ్డారు!
‘‘ఏంటమ్మా ... సమస్య?’’ అడిగాడు డాక్టర్.
‘‘మావారు నిద్రలో గురక పెడుతున్నారండి’’ చెప్పింది ఆదిలక్ష్మి.
‘‘నేను మనుషుల డాక్టర్ని కాను పశువుల డాక్టర్ని’’ నవ్వాడు డాక్టర్.
‘‘తెలుసండి. కాని ఆయన గురకలో గాడిద ఓండ్ర వినిపిస్తోంది’’ చెప్పింది ఆదిలక్ష్మి.
నరకమా? ఓటమా?
‘‘నువ్వు అబద్ధపు సాక్ష్యం చెబితే ఏమవుతుందో తెలుసా?’’ అడిగాడు జడ్జి.
‘‘తెలుసండి. చచ్చిన తర్వాత నరకానికి పోతాను’’ చెప్పాడు శేషాచలం.
‘‘గుడ్. మరి నిజం చెబితే?’’ అడిగాడు జడ్జి.
‘‘కేసు ఓడిపోతాను’’ చెప్పాడు శేషాచలం.
నేనెవరికి చెప్పుకోను?
‘‘నా భార్య ఎప్పుడూ తన మాజీ భర్త గురించి చెబుతూ ఉంటుంది. భరించలేకపోతున్నానురా ...’’ బావురుమన్నాడు శ్రీకాంత.
‘‘నీ భార్య పర్లేదురా .. నా భార్య కాబోయే భర్త గురించి చెప్పి భయపెడుతుందిరా’’ గొల్లుమన్నాడు రమాకాంత్.
చీరలమ్మ
‘‘అయ్యో .. వెంటనే మనం చీరలు కొన్న షాపుకు వెళ్లాలండి’’ కంగారుపడింది మాణిక్యం.
‘‘చీరలు వదిలేశావా?’’ బైక్ వెనక్కి తిప్పుతూ అన్నాడు సుబ్రహ్మణ్యం.
‘‘కాదు .. మన చంటిదాన్ని’’ చెప్పింది మాణిక్యం.
గొప్పలమ్మ
‘‘మా ఇంటికి చాలామంది వస్తుంటారు తెలుసా’’ గొప్పగా అంది పంకజం.
‘‘అవునా ... మీవారేం చేస్తుంటారు?’’ అడిగింది జలజం.
‘‘అప్పులు’’ ఠపీమని బదులిచ్చింది పంకజం
మళ్లీ కనిపించకు
‘‘మేడం చీమల మందు కొంటారా?’’ అడిగాడు సేల్స్‌మ్యాన్.
‘‘ఈ రోజు చీమలకు మందు కొంటే, రేపు దోమలు టానిక్స్ అడుగుతాయి .. వెళ్లవయ్యా’’ దభీమని తలుపేస్తూ అంది కాంతం.