పేజీ సంఖ్య - 55

అవును .. ఆమె భార్య !

‘‘ఇంతవరకూ కుక్క మీదకి రాళ్లనూ, కర్రలనూ విసిరేవాళ్లనే చూశా గాని, పెళ్లాన్ని విసిరే వాడిని మిమ్మల్నే చూశా’’ కోపంగా అరిచింది భార్య.


దొందూ దొందే

‘‘ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ... ఏంటి సంగతి?’’

‘‘నిన్న ఫేస్‌బుక్‌ చూసుకుంటూ మా ఇల్లు అనుకుని, పక్కింట్లోకి వెళ్లిపోయానురా!’’

‘‘అయ్యో ... ఆ తర్వాత ఏమైంది?’’

‘‘ఆ ఇంటావిడ వాట్సాప్‌ చూసుకుంటూ వాళ్లాయనే అనుకుని నాకు కాఫీ ఇచ్చింది. కాఫీ రుచి చూశాక గానీ తెలీలేదు ... అది మా ఇల్లు కాదని!’’


లైకులే ఆధారం!

‘‘చీరలన్నీ ఫోటో తీసుకుంటున్నారెందుకూ?’’ అనుమానంగా అడిగాడు సేల్స్‌మాన్‌.

‘‘ఈ ఫోటోలన్నీ ఫేస్‌బుక్‌లో పెడతా .. ఏ చీరకి ఎక్కువ లైకులొస్తే, దాన్ని కొంటా..’’ చెప్పింది చెంగల్వరాణి.


నీ కక్కుర్తి మండా!

అమెరికా నుంచి వచ్చిన స్టీఫెన్‌ని భోజనానికి పిలిచాడు శాస్త్రి.

‘‘వెజ్జా .. నాన్‌ వెజ్జా ?’’ అడిగాడు స్టీఫెన్‌.

‘‘మా ఇంట్లో ప్యూర్‌ వెజ్‌’’ చెప్పాడు శాస్త్రి.

‘‘ఓహ్‌ .. ఐ లైక్‌ టు ఈట్‌ ఇండియన్‌ వెజ్‌ డిషెస్‌’’ అన్నాడు స్టీఫెన్‌.

అరిటాకు వేసి, నీళ్లు పెట్టి లోపలికి వెళ్లాడు శాస్త్రి. ఆయన తిరిగి వచ్చే లోపు అరిటాకు తినేసి ‘‘టూ టేస్టీ .. థాంక్యూ’’ అని తేన్చాడు స్టీఫెన్‌.

శాస్త్రి శోషతో పడిపోయాడు వెంటనే.


భవిష్యత్‌ భారతం

రాబోయే రోజుల్లో బస్సులో కనిపించే పోస్టర్లు ఇలా ఉండబోతాయి.

‘‘15 రోజుల్లో మీ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ అలవాటును మాన్పిస్తాం. అలా చేయలేకపోతే మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాం ... గ్యారెంటీ!’’


ఫ్రిజ్‌ లోటు

బంటి: రేయ్‌, రోజు రోజుకీ ఇలా లావవుతున్నావేంటి?

చంటి: మా ఇంట్లో ఫ్రిజ్‌ లేదు రా ...

బంటి: ఫ్రిజ్‌కీ లావుకీ ఏంటి సంబంధం?

చంటి: వండినవన్నీ మిగల్చకుండా తినేయాలి కదా.


బెడిసికొట్టిన తంత్రం

ఆ ఊళ్లో ఒకడు మాత్రమే మాంసాహారి - మిగతావారంతా శాకాహారులే. మాంసాహారి వండే వంటల వాసనకి ఇబ్బంది పడి గ్రామపెద్దకి ఫిర్యాదు చేశారంతా. గ్రామపెద్ద మాంసాహారితో ‘నువ్వు కూడా శాకాహారిగా మారిపో. నీ వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండద’ని చెప్పాడు.

సరేనని తల ఊపాడు మాంసాహారి.

గ్రామపెద్ద మాంసాహారి మీద గంగా జలం చల్లి ‘‘నువ్వు పుట్టుకతో మాంసాహారివి, ఇక నుండి శాకాహారివి’’ అన్నాడు.

మరుసటిరోజు మళ్లీ అదే ఇంటి నుంచి చికెన్‌ వాసన వచ్చింది. గ్రామపెద్ద, గ్రామస్తులతో కలిసి వెళ్లి చూస్తే...మాంసాహారి, చికెన్‌ మీద గంగాజలం చల్లుతూ ‘‘నువ్వు పుట్టుకతో కోడివి. ఇక నుండి బంగాళాదుంపవి’’ అంటున్నాడు.


తేడా ఎక్కడుందో!

లోకంలో భర్తలందరూ ‘మా అమ్మ బెస్ట్‌’ అంటారు. కానీ భార్య విషయానికి వచ్చేసరికి పక్కింటోడి భార్యే బెస్ట్‌ అంటారెందుకు చెప్మా?


రోగం కుదిరింది

వయసు మళ్లిన దంపతులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో ఒక దెయ్యం వచ్చి, ‘‘మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మానాన్నా గుర్తుకు వస్తున్నారు. ఏదైనా వరం కోరుకోండి ఇస్తాను ...’’ అని అంది.

దానికి ముసలావిడ ‘‘నాకు మా ఆయనతో కలిసి లోకమంతా చుట్టి రావాలని ఉంది’’ అంది.

దెయ్యం చేతిని గాలిలో తిప్పి ‘‘ఇదిగో ఫ్లైట్‌ టికెట్స్‌ - ఎంజాయ్‌’’ అంది.

‘‘నాకు నా వయసుకన్నా 30 ఏళ్లు చిన్న వయసు భార్య కావాలి’’ అని అడిగాడు భర్త

‘‘సరే, ఓం ... బూమ్‌ ... బుస్‌’’ అని మంత్రమేసి మాయమైందా దెయ్యం. తీరా చూస్తే 60 ఏళ్ల ముసలాయన కాస్తా 90 ఏళ్ల ముసలాడిలా అయ్యాడు.


పిచ్చి ... పకోడి

అమ్మాయి: నీ ప్రేమలో పడి నేను పిచ్చిదాన్ని అయిపోయాను.

అబ్బాయి: అబ్బో నేను మాత్రం కలెక్టర్‌ అయిపోయానా - రోడ్డు పక్కన పకోడీలు అమ్ముకుంటున్నా.


సర్వం నాశనం!

అంతర్జాలం - ఆత్మనాశిని

గూగుల్‌ - గుణనాశిని

చరవాణి - బుద్ధినాశిని

కంప్యూటర్‌, సోషల్‌ మీడియా - సంఘనాశిని

సినిమాలు, వార్తాపత్రికలు - వ్యవహారనాశిని

వార్తాచానెళ్లు, టీవీ సీరియళ్లు - సర్వనాశిని!


తస్మాత్‌ జాగ్రత్త!

అత్యవసర పరిస్థితుల్లో కూడా భార్య దగ్గర అప్పు అస్సలు తీసుకోకూడదు. 4 నెలల క్రితం నేను 2 వేలు తీసుకున్నా. ఇప్పటికి 3 సార్లు పూర్తిగా ఇచ్చేశా ... అయినా ఇంకా 1,500 బాకీ మిగిలే ఉంది.


ఐపు లేదు!

రామారావు : ఏమిటి చాలారోజులుగా మీ ఆవిడ కనబడడం లేదు?

సుబ్బారావు: ఏమో నాకూ తెలియదు. పండక్కి నగలు కొనడానికి వనితా జ్యువెలరీకి వెళ్లాం. అక్కడ ఫోటోలు తీసి యెస్టిమేటు వేయించుకుని మిగతా షాపుల్లో పోల్చి చూస్తానని వెళ్లింది. అంతే అడ్రసు లేదు. ఏ షాపులో వెతుకుతోందో ఏమో!


హైటెక్‌ జ్యోతిష్కుడు

‘మీ నామ, నక్షత్ర, రాశికి సరిపోవు అదృష్ట రత్నం సూచించబడును’ అని బోర్డు పెట్టాడు జ్యోతిష్కుడు - ఒక్కరు కూడా ఆ వైపు చూడలేదు.

మరుసటి రోజు ...

‘మీ నామ, నక్షత్ర, రాశికి సరిపోవు సెల్‌ఫోన్‌ ఏదో సూచించబడును’ అని బోర్డు మార్చాడు. కొద్ది నిమిషాల్లోనే జనాలు క్యూ కట్టారు.


సంస్కారం

‘‘మమకారానికి, సంస్కారానికి తేడా ఏంటి స్వామి?’’

‘‘నీ పోస్టుకు నువ్వే లైక్‌ కొట్టుకుంటే మమకారం ... అదే వేరేవాళ్లకి లైక్‌కొడితే సంస్కారం నాయనా!’’


దొంగ తెలివి

గజదొంగ గంగులు భార్యాభర్తలిద్దరినీ కట్టేసి ఆ ఇంట్లోని నగలన్నీ మూటకట్టుకున్నాడు. వెనక్కి వెళ్లేముందు బుర్రలో ట్యూబ్‌లైట్‌ వెలిగింది.

‘‘ఈ నగలను ఎలాగూ నేను బయట అమ్ముకోవాల్సిందే కదా. మీరే కొనుక్కుంటే పోలా .. మీకయితే 10 శాతం డిస్కౌంట్‌ కూడా ఇస్తా’’ అని బేరాలు సాగించాడు.


పీచమణచండి ప్లీజ్‌!

చిత్తుగా మోసపోయిన ఒక ఖాతాదారుడు, ప్రధానికి ఒక విన్నపం చేస్తూ ‘‘మోదీ గారు ... దయచేసి ఫేస్‌బుక్‌ అకౌంట్లని కూడా ఆధార్‌తో లింకు చేసే రూల్‌ పెట్టండి. వెధవలు అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి అకౌంట్లు సృష్టించి నాలాంటి వారిని ఆశ పెట్టి చంపుతున్నారు’’ అని మొరపెట్టుకున్నాడు.


భర్త: నాకు భయం లేదు. నువ్వంటే అస్సలు భయం లేదు. (కోపంగా అరిచాడు)

భార్య: పెళ్లిచూపులకు మీతో పాటు నలుగురిని తీసుకొచ్చారు. పెళ్లికి 400 మందితో వచ్చారు.

భర్త: అవును ... ఐతే ఏంటి?

భార్య: నేను మాత్రం ఒక్కదాన్నే మీ ఇంట్లోకి ధైర్యంగా అడుగుపెట్టాను. ఇప్పుడు చెప్పండి ఎవరు పిరికివాళ్లో..!


బెండకాయ బతుకు

భర్త: నాకు ఇష్టం ఉండదని తెలిసి కూడా ఇన్ని బెండకాయ ఐటమ్స్‌ చేశావేంటి? (కయ్యిమన్నాడు)

భార్య: మీ ఎఫ్‌.బీ ఫ్రెండ్‌ సరళ తన వాల్‌పైన బెండకాయ ఫోటో పెడితే ‘వావ్‌ నోట్లో నీళ్లూరుతున్నాయి. ఎప్పుడు టేస్ట్‌ చేద్దామా అని ఉందం’టూ కామెంట్‌ పెట్టారుగా. మూసుకు తినండి. నీళ్లు ఎలా ఊరుతాయో నేనూ చూస్తాను (గరిటె గాల్లోకి తిప్పింది).


బుర్రున్నోడు

పార్టీకి వచ్చిన వాళ్ళని చూసి ఆ భార్యాభర్తలిద్దరూ నోరెళ్లబెట్టారు. పిలిచింది యాభైమందిని. ఆ యాభైమందినిగాక, ఓ పదిమందిని ఎగసా్ట్ర వేసుకున్నారు. మొత్తం అరవైమందికి మాత్రమే డిన్నర్‌ ఏర్పాటుచేశారు. తీరా చూస్తే వందమందికి పైనే ఉన్నారు. ఇప్పుడెలా? తలలు పట్టుకున్నారిద్దరూ. ఎవర్ని వెళ్లిపొమ్మనాలి. ఎలా వెళ్లిపొమ్మనాలి? అంతుచిక్కలేదు. అంతలో భర్తకు ఓ ఆలోచన తట్టింది. అందర్నీ ఉద్దేశిస్తూ ఇలా అన్నాడు.

‘‘ఇక్కడికి పెళ్లికూతురి తరుపున వచ్చినవాళ్లు దయచేసి లేచి నిలబడండి’’.

ఓ పాతికమంది నిల్చున్నారు. ‘‘గుడ్‌! ఇప్పుడు పెళ్లికొడుకు తరుపున వచ్చిన వాళ్లు కూడా లేచి నిలబడండి’’.

ఓ ముప్పయిమంది దాకా నిల్చున్నారు.

‘‘వెరీగుడ్‌! అయ్యా! ఇక్కడ జరుగుతున్నది పెళ్లికాదు, బర్త్‌డే ఫంక్షన్‌. దయచేసి పెళ్లికి వచ్చినవారు వెళ్లిపోతే ఆనందిస్తాం’’


సేమ్‌ టు సేమ్‌

చూడు భయ్యా... ప్రేమా, దోమా రెండు ఒక్కటే. ఒకటి నిద్ర రాకుండా చేస్తుంది, ఇంకోటి నిద్ర పోకుండా చేస్తుంది.


పిల్లి ... పులి

ముస్తాబై వెళుతున్న పిల్లిని ‘‘ఎక్కడికి వెళుతున్నావ్‌’’ అడిగింది కుందేలు.

‘‘మా తమ్ముడు పులి పెళ్లికి’’ అంది పిల్లి.

‘‘అదేమిటి నువ్వేమో పిల్లిలా ఉన్నావు, మీ తమ్ముడు పులి అంటావేమిటి?’’ నిలదీసింది కుందేలు.

‘‘అదా.. పెళ్లికి ముందు నేనూ పులినేలే’’ నిట్టూర్చింది పిల్లి.


ప్రేమ పిసినార్లు

ఒక పిసినారి అబ్బాయి, పీనాసి అమ్మాయి ప్రేమించుకున్నారు.

అమ్మాయి: నేను మా డాడీ పడుకున్నాక ఒక రూపాయి కాయిన్‌ కింద పడేస్తాను. అదే సిగ్నల్‌ అనుకుని పైకి వచ్చేయ్‌.

అబ్బాయి: ఓకే ఓకే... ష్యూర్‌.

ఒక పది నిమిషాల తర్వాత...

కాయిన్‌ కింద పడిన శబ్దం వచ్చింది. కానీ, అబ్బాయి ఆ రోజు రాత్రి పైకి వెళ్లలేదు.

తర్వాత రోజు పొద్దున్నే ...

అమ్మాయి: నిన్న రాత్రి ఎందుకు రాలేదు. సిగ్నల్‌ వినిపించలేదా?

అబ్బాయి: అదేం కాదు. వినిపించింది.

అమ్మాయి: మరి ఎందుకు రాలేదు??

అబ్బాయి: కాయిన్‌ పడేశావ్‌గా, అది వెతుకుతూ రాత్రంతా కిందే ఉండిపోయా. నా బ్యాడ్‌లక్‌ .. కాయిన్‌ దొరకలేదు.

అమ్మాయి: ఇడియట్‌, కాయిన్‌కి దారం కట్టి విసిరాను. కింద పడి శబ్దం రాగానే, పైకి లాగేసా!


అనుభవసారం

ఆనందం: భార్యాభర్తలు అంటే ఎవరు స్వామీ?

స్వామీజీ: జీవితాంతం భార్యను భయపెట్టాలని ప్రయత్నించి, భయపడుతూ బతికేవాడు భర్త. భయపడినట్టు నటించి, భర్తను భయపెట్టి బతికేది భార్య. భార్యాభర్తలంటే వీళ్లే నాయనా...


యాడ్స్‌లో జీవితం

కాలేజీ జీవితం జియో సిమ్‌ లాంటిది,

ప్రపంచమంతా మన చేతుల్లోనే ఉంటుంది.

బ్యాచిలర్‌ జీవితం ఎయిర్‌టెల్‌ లాంటిది,

అంత స్వేచ్ఛ ఎక్కడా ఉండదు.

ఎంగేజ్‌మెంట్‌ ముందు జీవితం ఐడియా లాంటిది,

ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది.

పెళ్లయ్యాక వొడాఫోన్‌,

ఎక్కడికెళ్లినా నెట్‌వర్క్‌ ఫాలో అవుతుంది.

పిల్లలు పుట్టాక బీఎస్‌ఎన్‌ఎల్‌,

అన్ని లెన్లూ ఎప్పుడూ బిజీగా ఉంటాయి.

ఓవరాల్‌గా ఇదీ జీవితమంటే!


దొందూ దొందే

హరి: నా భార్యకు వంట చేయడం బాగా వచ్చు. అయినా ఏ రోజూ వంట చేయదు.

గిరి: అయితే నువ్వు చాలా అదృష్టవంతుడివి.

హరి: ఎందుకని?

గిరి: నా భార్యకు వంట చేయడం అస్సలు రాదు. అయినా రోజూ వండి పెడుతుంది.


దూరాలోచన

‘‘పరీక్ష పాసయితే బైక్‌ కొనిస్తానని చెప్పా కదరా ... మరెందుకు ఫెయిలయ్యావు?’’ నిలదీశాడు తండ్రి.

‘‘టైమంతా బైక్‌ నేర్చుకోవడానికే సరిపోయింది డాడీ! చదవడానికి కుదర్లేదు’’ నిజాయతీగా చెప్పాడు కొడుకు.


Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -55

Responsive Footer with Logo and Social Media