పేజీ సంఖ్య - 54
పరువుగల భర్త
సుబ్బారావు: అదేంట్రా ఇక్కడిన్ని కుర్చీలు ఉండగా, అలా నించొని తింటున్నావు?
వెంకట్రావు: వద్దులేరా... నిలబడే తింటాను. భార్య సంపాదిస్తుంటే, కూర్చొని తింటున్నాడని అందరూ అనుకుంటారు.
తగ్గిపోయిందిలే!
భర్త: గుండెల్లో నొప్పిగా ఉంది. వెంటనే ఆంబులెన్స్‌కి ఫోన్ చెయ్యి!
భార్య: హా... మీ మొబైల్ పాస్‌వర్డ్ చెప్పండి త్వరగా...
భర్త: ఇప్పుడు కాస్త తగ్గినట్టుందిలే... పర్లేదు!
ఆన్ ద వే
‘‘ఇంకా ఎదురుచూడడం నా వల్ల కాదు ... నేను తాగేస్తాను..’’ అంది రెండు తాబేళ్లలో ఒకటి.
వెంటనే ‘‘ఇలాగైతే ... నేను సోడాకోసం వెళ్లను పోండి’’ అనే మాట వినిపించింది, కొంచెం దూరంలో ఉన్న రాయి పక్కనుంచి.
మరో మార్గం లేదు
డాక్టర్: ఇదిగోమ్మా... నీ ఒంట్లో రక్తం చాలా తక్కువగా ఉంది. ఇకపైన రోజూ కనీసం పది గ్లాసుల నీళ్లు తాగాలి.
పేషంట్: సారీ డాక్టర్ ... నేను తాగలేను.
డాక్టర్: ఏ.. ఎందుకు తాగలేవు?
పేషంట్: మా ఇంట్లో నాలుగు గ్లాసులే ఉన్నాయి డాక్టర్!
మిస్టర్ కంగార్రావు
తనకు అందిన ఇన్విటేషన్ కార్డులో ‘పార్టీకి వచ్చేవాళ్లు టై కట్టుకుని రావడం తప్పనిసరి!’ అని రాసి ఉండడం చూసి, టై కొనుక్కుని మరీ కట్టుకెళ్లాడు సుబ్బారావు. పాపం... పార్టీకి వెళ్లి, అందర్నీ చూశాక అర్థమైంది. టైతో పాటు డ్రెస్ కూడా వేసుకోవాలని!
ఇరకాటంలో సుబ్బారావు
‘‘మా ఆవిడేమో ‘ఇంకోసారి తాగారో నా మీద ఒట్టు’ అంటుంది. నా దోస్తులేమో ‘నువ్వు తాగలేదో...
వదిన మీద ఒట్టే’ అంటారు... ఎలా చచ్చేది నేను...’’
అదీ సంగతి!
‘‘చెప్పండి... ఏంటి మీ సమస్య?’’
‘‘నా శరీరంలో ఎక్కడ ముట్టుకుంటే అక్కడ నొప్పి పెడుతోంది డాక్టర్!’’
‘‘అంటే... క్లియర్‌గా చెప్పండి’’
‘‘నా భుజాన పట్టుకుంటే నొప్పి పెడుతోంది, మోకాలుని పట్టుకున్నా నొప్పిగా ఉంటోంది, అరికాళ్లని ముట్టుకున్నా నొప్పి అనిపిస్తోంది.’’
‘‘అర్థమైంది మీ సమస్య.’’
‘‘ఏంటి డాక్టర్?’’
‘‘మీ చూపుడువేలికి దెబ్బ తగిలింది...’’
ఒక విద్యార్థి ప్రార్థన
బోడి సలహా
‘‘ఎండకాలం రాబోతుంది. ముందు జాగ్రత్త చర్యగా వడదెబ్బ తగలకుండా ఉండడానికి ఓ చిట్కా చెప్పు.’’
‘‘కర్మా బార్‌ను నీటిలో కరిగించి తాగండి. అందులో వంద నిమ్మకాయల శక్తి ఉంది.’’
నీ తిక్క తగ్గలేదింకా!
ఆనంద్: నమస్తే మాస్టారూ .. బాగున్నారా? గుర్తుపట్టారా! నేనండీ, మీ దగ్గర చదువుకున్న ఆనందాన్ని.
టీచర్: వోర్నీ... నువ్వటోయ్! గుర్తొచ్చింది. ఏ ప్రశ్నడిగినా తల తిక్కగా జవాబులు చెప్తూ ఉండేవాడివి. అవును ... ఇప్పుడేం చేస్తున్నావోయ్?
ఆనంద్: మీతో మాట్లాడుతున్నానండీ..!
అర్థం చేసుకోరూ!
‘‘హైద్రాబాద్‌కి ఫస్ట్ బస్ ఎన్ని గంటలకి?’’
‘‘ఉదయం 5 గంటలకి.’’
‘‘దానికి ముందు ఏమీ లేవా?’’
‘‘ఉన్నాయి ... రెండు పెద్ద హెడ్‌లైట్స్!’’
దొందూ దొందే!
ఆలోచించి కట్టవలసినవి రెండు.
ఒకటి ఇల్లు, రెండోది తాళి.
ఆలోచించకుండా కడితే మొదటిది అప్పులపాలు చేస్తుంది.
రెండోది తిప్పలపాలు చేస్తుంది.
నాకూ ఉంది ఓ ఆఫీసు
ఫోన్ బిల్లు చూసి, బిత్తరపోయిన బడ్జెట్ పద్మనాభం, ఇంట్లో వాళ్లని పిలిచి ఎవరెన్ని కాల్స్ చేశారని నిలదీశాడు.
కొడుకు: నేను ఆఫీస్ ఫోన్ మాత్రమే వాడతాను.
భార్య: ఫోన్ అవసరముంటే మా మేనేజర్‌గారి అకౌంట్లోనే చేస్తా!
కూతురు: నా కాల్స్‌కి ఆఫీసే పే చేస్తుంది.
ఇంటి పనిమనిషి (సిగ్గుపడుతూ) : మీరంతా ఆఫీసుల్లోనే ఫోన్లు చేస్తున్నారు కదా! అని నేను ఈ ఫోన్ వాడుతున్నా. మరి నా ఆఫీస్ ఇదే కదా అయ్యగారు..!
మొబైల్ బాబా సందేశం...
బాబా: పుట్టడం, చావడం మీ చేతుల్లో ఉండదు. మీ గర్ల్‌ఫ్రెండ్ ఉంటుందో, హ్యాండ్ ఇస్తుందో మీ చేతుల్లో లేదు. కాబోయే భార్య మిమ్మల్ని
ఎలా చూసుకుంటుందో కూడా మీ చేతుల్లో లేదు...
శిష్యుడు: మరి మా చేతుల్లో చివరి వరకూ ఉండేది ఏంటి బాబా?
బాబా: మీ మొబైల్ మాత్రమే!
కంగారబ్బాయ్
సుబ్బారావు పెళ్లి చూపులకెళ్లాడు.
‘‘మా అమ్మాయి ఇంకా చదువుకుంటాను అంటోందండీ!’’
అన్నాడు అమ్మాయి తండ్రి.
‘‘అవునా... పర్వాలేదు. చదువుకోమనండి. మేం ఓ గంట
తర్వాత వస్తాం...’’
అంటూ హడావిడిగా లేచి బయల్దేరాడు సుబ్బారావు.
కరెక్టే కదా!
ఎడిటర్: ఇదేంటయ్యా! మినిష్టర్ సుబ్బరంగా బతికే ఉంటే, మినిష్టర్ కన్నుమూత అని శీర్షిక పెట్టావ్?
విలేకరి: మినిష్టర్‌గారి కుడి కంటికి ఆపరేషన్ అయితే, దానికి ప్లాస్టర్ వేసి మూసేశారు. అందుకే ‘మినిష్టర్ కన్నుమూత’అని పెట్టాను. కరెక్టే కదా సార్..!
తాతయ్య దీవెన
భాస్కర్: మా తాతయ్య దీవెన చాలా పవర్‌ఫుల్ రా!
విజయ్: అవునా... ఏలా?
భాస్కర్: చిన్నప్పుడు మా తాత నువ్వు పదిమందికి అన్నం పెట్టేంత గొప్పవాడివి అవుతావంటే
ఏమో అనుకున్నా.... ఇప్పుడు
అదే చేస్తున్నా!
విజయ్: అవునా... ఇంతకీ ఏం చేస్తున్నావు?
భాస్కర్: క్యాటరింగ్ బాయ్‌గా.
చలికి వందనం!
పురుషులందరూ చాలా ఒద్దికగా చేతులు కట్టుకుని నడుస్తున్నారు.
అమ్మాయిలు నిండుగా బట్టలేసుకుంటున్నారు.
వేడిగా తినాలని త్వరగా భోజనాలు చేసి, ముసుగు కప్పుకుంటున్నారు.
రోడ్లపై సంచారం తగ్గి, ట్రాఫిక్ తిప్పలు తగ్గాయి.
ఫ్యాన్లు, ఏసీలూ వేయకుండా కరెంట్ ఆదా చేస్తున్నారు.
భవిష్యత్తులో నివాళి
పాపం చాలా మంచివాడు. ఎప్పుడూ ఆన్‌లైన్‌లోనే ఉండేవాడు.
అడిగినవాళ్లందరి పోస్టులకి, లేదనకుండా లైక్ కొట్టేవాడు.
చాలా హుందాగా కామెంట్స్ పెట్టేవాడు.
పాపం తన పోస్టులకి ఎవ్వరినీ ట్యాగ్ కూడా చేసేవాడు కాదు.
ఎవరైనా వారి పోస్టులకి ట్యాగ్ చేసినా, ఒక్కమాట కూడా అనేవాడు కాదు.
పాపం జీవితాంతం ఒక్క ఫేస్‌బుక్ అకౌంట్ మీదే బతికాడు.
ఆయన మరణం సోషల్ మీడియాకు తీరని లోటు.
కీలెరిగి వాత
భర్త: 30 ఏళ్ల నుంచీ నిన్నే చూస్తుంటే బోరు కొడుతోంది కాంతం. వెరైటీ కోసం ఇంకో పెళ్లి చేసుకుంటే బాగుంటుందోయ్!
భార్య: మీ మాట నేనెప్పుడు కాదన్నానూ .. బాహుబలి లాంటి పెళ్లికొడుకును చూడండి.
చిట్కా
‘‘నా మొహం మరీ జిడ్డుగా అవుతోంది ... ఏ సబ్బు వాడినా లాభం ఉండట్లేదు’’.
‘‘విమ్ బార్ వాడి చూడు ... అది దాగి ఉన్న జిడ్డు మరకలను కూడా తొలగిస్తుందట’’.
చేసుకున్నవారికి ..
‘‘దేవుడా అమ్మాయిలందరూ అందంగా, వినయంగా ఉంటారు. మరి భార్యలు అలాగే ఎందుకుండరు?’’ అడిగాడు భక్తుడు.
‘‘పిచ్చివాడా ... అమ్మాయిలని నేను సృష్టించాను. వాళ్లను భార్యలుగా మీరు చేసుకున్నారు. అనుభవించండి’’ చెప్పాడు దేవుడు.
వంద మార్గాలు
‘‘దానిలో ఒక కప్పు పెరుగు వేసి గుజరాతీ దద్దోజనం అని చెప్పి పెట్టేసెయ్. మొన్న నేనూ ఇలాగే వాట్సాప్ చూస్తూ పులిహోరలో ఉప్పుకి బదులు పంచదార వేశా.. మిఠాయి రంగు కలిసి మీ నాన్నకి భైరవస్వామి ప్రసాదం అని పెట్టేశా’’ సలహా ఇచ్చింది తల్లి.
ఆ మాత్రం తెలీదా?
భర్త మీద కోపంతో బట్టలు సర్దుకుంటోంది భార్య.
భర్త: ఏం చేస్తున్నావు?
భార్య: నేను మా అమ్మవాళ్ల ఇంటికెళ్తున్నా!
కాసేపటికి భర్త కూడా బట్టలు సర్దుకోసాగాడు.
భార్య: మీరేం చేస్తున్నారు?
భర్త: నేను కూడా మా అమ్మవాళ్ల దగ్గరకెళ్తున్నా!
భార్య: మరి పిల్లల సంగతి!
భర్త: నువ్వు మీ అమ్మ దగ్గర, నేను మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు పిల్లలు మాత్రం ఎక్కడుంటారు .. వాళ్లమ్మ దగ్గరే!
అంతం కాదిది .. ఆరంభం
సడెన్‌గా అర్ధరాత్రి 2 గంటలకు భర్తను నిద్రలేపి -
భార్య: ఈగ సినిమాలో సమంత పేరేమిటి?
భర్త: బిందు
భార్య: మన పక్క ప్లాట్‌లో ఉండే కవిత, ప్లాట్‌లో
దిగి ఎన్ని రోజులయింది?
భర్త: గురువారం వస్తే 2 సంవత్సరాలు పూర్తి .. అయినా అర్ధరాత్రి నిద్రలేపి ఏమిటీ నాన్‌సెన్స్?
భార్య: నిన్న నా పుట్టినరోజు... (నిశ్శబ్దం!!)
క్విజ్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఉతుకుడు ప్రోగ్రామ్ మొదలైంది.