పేజీ సంఖ్య - 52

అందరూ దేవుళ్లే!

అమృతం తాగిన వాడిని ‘దేవుడు’ అంటారు. విషం తాగిన వాడిని ‘మహాదేవుడు’ అంటారు. విషం తాగి కూడా... అమృతం తాగినట్టు ఆనందం నటించేవాడిని ‘పతిదేవుడు’ అంటారు.


వీర వాడకం!

‘మీరు టూత్‌బ్రష్‌ ఎంత కాలం వాడతారు’ అని ఓ డెంటిస్టు సర్వే చేస్తున్నాడు.

అమెరికన్‌... ‘ఒక నెల’ అని చెప్పాడు.

చైనీయుడు... ‘ఆరు నెలలు వాడతామ’ని అన్నాడు. ‘టూత్‌ బ్రష్‌ వాడడానికి ప్రత్యేకంగా ఓ కాలపరిమితి అంటూ లేదు. మామూలుగా అయితే పళ్లు తోముకోడానికి వాడతాం. తర్వాత జుట్టుకి రంగు వేసుకోవడానికి వాడతాం. ఆ తర్వాత ఆభరణాలూ అవీ తోమడానికి. ఇంకా బూరు మిగిలితే... మెషిన్లు, ఇంజన్‌లలో ఆయిల్‌ రుద్దడానికి... బూరు మొత్తం ఊడిపోయాక... లంగాలు, పైజమాలకి నాడాలు దూర్చడానికి వాడతాం...’ భారతీయుడి సమాధానం వినగానే స్పృహతప్పి పడిపోయాడా డాక్టర్‌.


మొత్తం ఎక్కేసింది!

‘ఆశ్చర్యంగా ఉందే! నీదీ, నీ భార్యదీ ఒకే బ్లడ్‌ గ్రూప్‌...’

‘నాకు తెలుసు డాక్టర్‌. ఒకటా... రెండా... ఇరవై ఏళ్ల నుంచి నా రక్తం పీలుస్తూనే ఉంది... మరి’


పాయింటేగా!

‘యుద్ధానికి వెళుతూ బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ వేసుకోకుండా దోమ తెర కట్టుకుని వెళుతున్నావేంటి?’

‘దోమలే దూరలేనప్పుడు... బుల్లెట్‌ ఎలా వెళ్తుంది! అందుకే కట్టుకున్నా’


బోర్డు చూసి రండి!

‘మా ఇంట్లో దోమలు విపరీతంగా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు’

‘ఓ పని చెయ్యి... ఇంటికి ‘టు-లెట్‌’ బోర్డు పెట్టు. దాంతో ఇల్లు ఖాళీగా ఉందనుకుని దోమలు

లోపలికి రావు’


ప్లేస్‌ మారినా...

‘‘ఈ డాక్టర్‌, గతంలో హోటల్లో

పనిచేసి ఉంటాడ్రా...’’

‘‘ఎందుకూ?’’

‘‘ఇంజక్షన్‌ చేయించుకుని డబ్బులు లేవంటే క్లినిక్‌లో టవళ్లూ, కర్టెన్లూ ఉతికించాడ్రా!’’


ఆడది- అనుమానం!

భార్య: నేను మీకోసం నోములూ, వ్రతాలూ ఏమీ చేయకపోయినా మీరెలా బాగుంటున్నారండీ?

భర్త: అంతా నా మంచితనమే పిచ్చిదానా!

భార్య: అదేం కాదు... మీకోసం ఇంకెవరో వ్రతాలు గట్రా చేస్తున్నట్టున్నారు. అది ఎవత్తో మర్యాదగా చెప్పండి.


తెలుగు- ఇంగ్లిష్‌

‘పచ్చడి తాగితే తెలుగు సంవత్సరం... పచ్చడయ్యేలా తాగితే ఆంగ్ల సంవత్సరం...’


ఉద్యోగి ఆవేదన!

‘ఏంటో వెధవ జీవితం... జీతం పెంచమంటే ‘అసలు నువ్వు ఏం పని చేస్తున్నావని’ అడుగుతారు. అదే సెలవు ఇమ్మంటే ‘నువ్వు చేయాల్సిన పని ఎవడు చేస్తాడ’0టారు...’’


అదీ సంగతి!

‘గుడిలో మగ పూజారులే ఎందుకు ఉంటారు స్వామీ?’

‘మీ ధ్యాస దేవుడి మీదే ఉండాలని... నాయనా!’


వాట్‌ ఎన్‌ ఐడియా!

‘‘ఏంటే పద్మా... ఉదయాన్నే దోమల బ్యాటుతో ఏం చేస్తున్నావ్‌!’’

‘‘ఏం లేదు ఉమా... బియ్యంలో పురుగులు పడితేనూ, దోమల బ్యాటుతో జల్లెడ పడుతున్నా. పురుగులన్నీ చచ్చి, బియ్యం మాత్రం కిందకి వస్తాయని!’’


ఉద్యోగం రాకపోతే!

ఇంటర్వ్యూ అధికారి: మేము అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలు చెప్పినా... నీకు ఉద్యోగం రాలేదనుకో! ఏం అనుకుంటావ్‌.

సుబ్బారావు: పిచ్చివాళ్లతో కాలక్షేపం బాగుందని... అనుకుంటా.


మందు - మతిమరుపు

‘‘రాత్రి ఫుల్లుగా తాగి, లేటుగా వెళ్లినందుకు మా ఆవిడ తలుపు తీయలేదు. రోడ్డు మీదనే పడుకున్నా’’

‘‘తెల్లారిన తర్వాత తీసిందా?’’

‘‘లేదు రా... తాగింది దిగింది! అప్పుడు గుర్తుకొచ్చింది. నాకసలు పెళ్లే కాలేదని... తాళంచెవి నా జేబులోనే ఉందని!’’


యాక్షన్‌ - రియాక్షన్‌...

‘సర్‌... ప్లీజ్‌ సెండ్‌ యువర్‌ పాన్‌ డిటైల్స్‌’ (మీ పాన్‌ వివరాలు పంపండి) అని బ్యాంకు సిబ్బంది నుంచి చిట్టిబాబుకి మెసేజ్‌ వచ్చింది. టకా టకా టైప్‌ చేసి సమాధానం పంపించాడు చిట్టిబాబు. అంతే... ఆ మెసేజ్‌ చూసి మూర్ఛబోయారు బ్యాంకు సిబ్బంది... ఇంతకీ దాంట్లో ఏముందంటే...‘‘ఆకు... వక్క... సున్నం... కాసింత జర్దా!’’


ఎవరి కారణాలు వారికుంటాయ్‌...

‘నాన్నా... నన్ను స్కూల్లో దింపడానికి రోజూ మీరే ఎందు

కొస్తారు? మా ఫ్రెండ్స్‌ను దింపడానికి వాళ్ల అమ్మలే వస్తారు కదా..!’

‘అందుకే... రా! రోజూ నేను వచ్చేది...’


రేటుని బట్టి మర్యాద!

భార్య: ఏమండీ... కారు

తాళాలివ్వండి.. కిడ్డీ పార్టీకి వెళ్లాలి.

భర్త: పక్కనే కదే! కారెందుకు...

భార్య: 5 లక్షల కారులో వెళితే,

మర్యాద పెరుగుతుంది... అందుకని!

భర్త: అవునా... ఇదిగో ఈ పది రూపాయలు తీసుకో. 50 లక్షల బస్సులో వెళ్లు. మర్యాద భయంకరంగా పెరుగుతుంది.


సోషల్‌ ట్రెండు!

‘మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది. కాని గుర్తుకు రావట్లేదు. ఫేస్‌బుక్‌లో ఉన్నారా?’

‘లేను...’

‘వాట్సా్‌పలో ఉన్నారా?’

‘లేను’

‘పోనీ ట్విట్టర్‌లో గానీ... స్కైప్‌లో గానీ ఉన్నారా...’

‘లేను... లేను... లేను!’

‘మరి...’

‘మీ ఇంటి మేడ మీద రెండేళ్లుగా అద్దెకు ఉంటున్నా...’


ఏం చేయాలి!

సిటీలో పుట్టిపెరిగిన అమ్మాయికి, పల్లెటూరి

అబ్బాయితో పెళ్లి జరిగింది. అత్తారింటికి వెళ్లిన మొదటిరోజు... గేదెకి గడ్డి వేయమని పంపారు అత్తగారు.

గేదె నోట్లో నురగ చూసి, వెనక్కి వచ్చేసింది కోడలు...

అత్త: ఏమయిందమ్మా...

గడ్డి వేయలేదా?

కోడలు: అది ఇంకా బ్రష్‌ చేసుకుంటోంది అత్తయ్యా!


చెప్పే తీరు తెలీదా!

భార్య టూర్‌కి వెళుతూ... ప్రాణప్రదంగా పెంచుకుంటున్న తన పిల్లిని జాగ్రత్తగా చూసుకోమని భర్తకి చెప్పింది.

మరుసటి రోజు ఫోన్‌ చేసి పిల్లి క్షేమ సమాచారాలడిగింది.

భర్త: పిల్లి చనిపోయింది...

భర్త: అవును నిజమే... సారీ!

భార్య: సరే... మా అమ్మ ఎలా ఉంది?

భర్త: ఇంటి పైకప్పు మీద ఆడుకుంటోంది...!


ఐతే ఒకే...

అమెరికాలో కరెంటు పోతే, వాళ్లు కరెంట్‌ ఆఫీస్‌కి ఫోన్‌ చేస్తారు.

జపాన్‌లో కరెంటు పోతే వాళ్లు మొదట ఫ్యూజ్‌ చెక్‌ చేస్తారు.

అదే మనదేశంలో కరెంట్‌ పోతే పక్కింట్లో చెక్‌ చేస్తాం...

‘‘ఓహో... అందరింట్లో పోయిందా... ఐతే ఓకే...’’


కొత్త సామెత!

హెల్మెట్‌, భార్యా రెండూ ఒక్కటే... వీటిని నెత్తిన పెట్టుకున్నంత సేపు ప్రాణాలు పదిలం!


ఆడు మగాడ్రా బుజ్జి!

నిజమైన ధైర్యసాహసి ఎవరు???

అర్థరాత్రి దాకా తప్ప తాగి, ఇంటికొచ్చి తలుపు తడితే... చీపురతో ప్రత్యేక్షమైన భార్యను చూసి ఏ మాత్రం బెదరకుండా...

‘‘ప్రియా... నువ్వింకా ఇల్లు ఊడుస్తూనే ఉన్నావా? కాస్త రెస్ట్‌ తీసుకో... బంగారం! అలసిపోయావేమో!!!’’ అనేవాడు.


తిండి తేడా!

బ్రహ్మచారికి, పెళ్లయినవాడికి తేడా ఏంటి?

బ్రహ్మచారి ఏది పడితే అది తింటాడు. పెళ్ళైనవాడు ఏదిపెడితే అదే తింటాడు.


రక్తసంబంధం

‘‘ఒరేయ్‌ చంటీ... భూమికి, చంద్రుడికి ఉన్న సంబంధం ఏంటి చెప్పు?’’

‘‘అన్నాచెల్లెళ్లు సార్‌...’’

‘‘అన్నాచెల్లెళ్లా... ఎలారా?’’

‘‘భూమిని భూమాత... అంటాం, చంద్రుడిని చందమామ అంటాం... ఇద్దరూ అన్నాచెల్లెళ్లే కదా సార్‌!’’


ఆపద - ఆత్మ

వర్షం పడుతుండగా ఇంటివైపు వడివడిగా అడుగులు వేస్తూ వెళ్తున్నాడు అప్పారావు...

ఇంతలో... ‘‘అక్కడే ఆగిపో... నీ ముందున్న చెట్టు పడబోతుంది...’’ అంటూ ఎవరో అరిచినట్టు అనిపించి, ఆగిపోయాడు.

వెనక చూస్తే ఎవరూ లేరు కానీ నిజంగానే చెట్టు పడిపోయింది. ఆశ్చర్యపోతూనే ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కబోతుంటే... ‘‘వద్దు... ఎక్కకు, ఆ ఆటోకి యాక్సిడెంట్‌ అవుతుంది...’’ అని వినిపించి, ఆగిపోయాడు.

ఇంతలో మరెవరో ఆ ఆటో మాట్లాడుకున్నారు. అది కదిలి, కదలగానే ఓ కారు వచ్చి కొట్టేసింది.

అప్పారావు మరింత ఆశ్చర్యపోతూ... ‘‘నన్నింతగా రక్షిస్తున్నావు.. ఎవరు నువ్వు?’’ అని అడిగాడు.

‘‘నేను అశరీరవాణిని’’ అంటూ సమాధానం వచ్చింది.

‘‘ఇంతలా నా క్షేమం కోరేవాడివైతే నేను పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఎక్కడ చచ్చావ్‌... వచ్చి రక్షించాలని తెలియదా??’’ అంటూ ఏడవడం మొదలెట్టాడు అప్పారావ్‌.


Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -52

Responsive Footer with Logo and Social Media