పేజీ సంఖ్య - 51
తండ్రి మరియు కొడుకు
తండ్రి: "నువ్వు ఇన్ని ఏళ్ళు వచ్చి పెళ్ళి చేసుకోకుంటే ఎలా?"
కొడుకు లలిత్: "లైఫ్ లో ఎంజాయ్ చెయ్యాలని నా అభిలాష!"
డాక్టర్ మరియు వెంకట్
డాక్టర్: "ఇంతకూ మీకు మూర్ఛ ఎప్పుడు వచ్చింది?"
వెంకట్: "మా ఆవిడ షాపింగ్ కి వెళ్లొచ్చి చీరల బిల్లు నా చేతికిచ్చినప్పుడు!"
టాఫిక్ పోలీసు మరియు డ్రైవర్
టాఫిక్ పోలీసు: "సచ్చే డ్రైవర్?"
రోడ్ రోలర్ డ్రైవర్!
ఒలింపిక్ చాంపియన్ మరియు డాక్టర్
డాక్టర్: "మీకు జ్వరం నూటనాలుగు ఉంది!"
చాంపియన్: "వరల్డ్ రికార్డ్ ఎన్ని డిగ్రీలు డాక్టర్?"
రాము మరియు శ్యాములు
రాము: "ఈడియట్స్కి నేను దారి ఇవ్వను!"
శ్యాములు: "కానీ నేను ఇస్తాను!"
కవిత మరియు స్రవంతి
కవిత: "ఫోన్ గంటల తరబడి మాట్లాడేదానివి ఇవ్వాళ అరగంటే మాట్లాడి పెట్టేశావేం?"
స్రవంతి: "అది రాంగ్ నెంబర్!"
విలేఖరి మరియు రచయిత సుందర్రావు
విలేఖరి: "మీరు అనేక సమస్యల పైన నవలలు రాశారు కదా, కాని సమాజాన్ని పీడించే వరకట్న సమస్యపై రాయలేదేం?"
రచయిత సుందర్రావు: "కట్నం తీసుకొని పెళ్ళి చేసుకున్నాక, ఆ విషయంపై ఎలా రాయను?"
యమ ధర్మరాజు మరియు చిత్రగుప్తుడు
యమ ధర్మరాజు: "ఈమధ్య రావలిసిన పాపుల సంఖ్య తగ్గింది, ఏంటి సంగతి?"
చిత్రగుప్తుడు: "డాక్టర్లు స్ట్రయిక్ చేసారు, ప్రభూ!"
విడ్డూరపు డాక్టర్
పేషంట్: "ఈమధ్య చీమలు కుడుతున్నాయి!"
డాక్టర్: "మీకు షుగర్ వచ్చిందికదా?"
అప్పారావు మరియు వెంకట్రావు
అప్పారావు: "ఓ ఐదు రూపాయలుందా?"
వెంకట్రావు: "ఐదు రూపాయిలేనా, ఎక్కువ వద్దా?"
అప్పారావు: "ఎదుటి మనిషి స్తోమతను బట్టి అడుగుతాను!"