Subscribe

నవ్వులే నవ్వులు.. 😂


1.పంపకాలు

చావుబతుకుల మధ్య కొట్టుకుంటున్న ఓ వ్యక్తి భార్యాపిల్లలను పిలిచి
చెప్పాడిలా. ముందు భార్యకి చెప్పాడిలా.

నువ్వు కూకట్‌పల్లిలో ఉన్న పది అపార్ట్‌మెంట్స్ తీసుకో!
పెద్దకొడుక్కి చెప్పాడిలా.
నువ్వు మియాపూర్‌లోని మూడుషాపింగ్ కాంప్లెక్సులూ, అక్కడి గుడీ తీసుకో!
రెండోవాణ్ణి పిలిచి చెప్పాడిలా.
నువ్వు ఎర్రగడ్డలోని రెండు గుళ్ళూ తీసుకో!
చిన్నవాణ్ణి పిలిచి చెప్పాడిలా.
నువ్వు మోతీనగరంతా తీసుకో!
కూతుర్ని పిలిచి చెప్పాడిలా.
నువ్వు కల్యాణ్‌నగర్లోని రెండు స్వీట్‌షాప్సూ తీసుకో!
చెప్పాల్సింది చెప్పి, చనిపోయాడతను. గమనించింది నర్స్. అడిగిందిలా.
మీ నాన్నగారు చాలా గొప్పవారిలా ఉన్నారే. సంపాదించిన ఆస్తి అంతటినీ పంచి మరీ పోయారు.
ఆస్తా పాడా! మాది పాలవ్యాపారం తల్లీ! పాలఖాతాలు అప్పజెప్పి
చచ్చూరుకున్నాడు అన్నారు పిల్లలు.

2.సంతోషం

సుబ్బారావు: సార్! మా ఆవిడ తప్పిపోయింది.

ఆఫీసర్: ఇది పోస్టాఫీసయ్యా! పోలీస్‌స్టేషన్ కాదు.

సుబ్బారావు: వెధవది! సంతోషంలో ఎక్కడకెళ్తున్నానో తెలియడం లేదు. సారీ సర్!.



3.మిక్సీ

భార్య: ఎక్కడ ఉన్నారు?

భర్త: ఇంట్లోనే డార్లింగ్!

భార్య: నమ్మమంటారా?

భర్త: నమ్మాలి డియర్!

భార్య: అయితే మిక్సీ ఆన్ చెయ్యండి చూద్దాం.

భర్త: చూడయితే!

    మిక్సీ ఆన్ చేశాడు భర్త
    డుర్ర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్‌‌ర్...

భార్య: ఓకే డియర్! ఐ లవ్ యు.

        మర్నాడు మళ్ళీ..

భార్య: ఎక్కడ ఉన్నారు?

భర్త: ఇంట్లోనే డార్లింగ్!

భార్య: నమ్మమంటారా?

భర్త: నమ్మాలి డియర్!

భార్య: అయితే మిక్సీ ఆన్ చెయ్యండి చూద్దాం.

భర్త: చూడయితే!

    మిక్సీ ఆన్ చేశాడు భర్త
    డుర్ర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్‌ర్‌‌ర్...

భార్య: ఓకే డియర్! ఐ లవ్ యు.

      ఆ మర్నాడు...
    ఆఫీస్ నుంచి భార్య ఫోన్ చెయ్యలేదు. నేరుగా ఇంటికి వచ్చింది.
    ఏడేళ్ళకొడుకు ఆడుకుంటూ ఒంటరిగా కనిపించాడు.

చిన్నూ! డాడీ ఇంట్లో లేరా? కనిపించడం లేదు?

కొడుకు: ఏమో మమ్మీ! పొద్దున్నే మిక్సీపట్టుకుని బయటికెళ్లారు.



4.గ్రుడ్లు

ఆ కోళ్ళఫారం యజమాని మహాక్రూరుడు. ఫారంలోని కోళ్ళను ఓ రోజు ఇళా హెచ్చరించాడు. రేపు పొద్దునకల్లా తలా రెండు గుడ్లు పెట్టాలి.
పెట్టకపోతే కోసుకుంతింటా. తెల్లారింది. కోళ్ళఫారానికి వచ్చి చూశాడు యజమాని.
కోళ్ళన్నీ రెండు రెండు గుడ్లు పెట్టాయి. ఒకటి మాత్రం ఒకటే గుడ్డుపెట్టింది. ఏవే ! బలిసిందా? ఒకటే పెట్టావు? కసిరాడు యజమాని.
వణకిపోయింది కోడి. వణకిపోతూ అన్నదిలా. ఆ ఒకటి కూడా కోసుకుని నన్ను తింటావన్న భయంతో పెట్టా. నేనసలు పుంజుని అని గొల్లుమంది ఆ కోడి.

5.పేరు

ఒక పిల్లకోడి, తల్లికోడిని అడిగిందిలా.

అమ్మా! మనుషులు పుట్టగానే పేర్లు పెట్టుకుంటారు కదా,
మరి మనకెందుకు పుట్టగానే పేర్లు పెట్టరు?

మనకి పుట్టగానే పెట్టరు. చచ్చింతర్వాత పెడతారు. చికెన్‌టిక్కా,
చికెన్‌చిల్లీ, తందూరిచికెన్, చికెన్‌మలై, చికెన్ కడాయి..చెప్పింది
తల్లికోడి.

6.కస్టమర్ కేర్

హలో కస్టమర్ కేరా..?
అవునండీ.. చెప్పండి.. మీకు నేను ఏ విధంగా సహాయపడగలను..?
మావాడు sim కార్డు మింగేశాడ్సార్..
అయ్యయ్యో..! నేనేం చేయ్యాలో చెప్పండి..?
ఆ sim కార్డులో బేలన్సింకా వంద రూపాయలు ఉంది సార్..!
ఉంది.. నన్నేం చేయమంటారు..?
ఏం లేదు.. నాదో చిన్న డౌటు.. మా వాడు కానీ మాట్లాడితే.. ఆ బ్యాలెన్స్ కట్ కాదు కదా..!

7.సవాలుకు సై...

‘నేను హెలికాప్టరుతో భయంకరమైన విన్యాసాలు చేస్తాను. అయినా కూడా
కిమ్మనకుండా నా వెనకే కూర్చున్నవారికి లక్ష రూపాయలు’ అని
ప్రకటించాడు
ఒక పైలెట్‌. ఆ సవాలుకు సిద్ధపడిందో కుర్ర జంట.
హెలికాప్టర్‌ ఎగిరింది. గిరగిరా గాల్లో గింగిరాలు తిరిగింది.
అయినా
వెనక సీట్లోంచి సౌండ్‌ లేదు. చివరికి
పైలెట్‌కి విసుగుపుట్టి వాహనాన్ని నేల మీదికి దింపాడు. వెనక్కి తిరిగి
చూస్తే భర్త ఒక్కడే ఉన్నాడు. ‘అయ్యయ్యో... మీ ఆవిడేది!’ అని కంగారుగా
అడిగాడు పైలెట్‌. ‘ఇందాకే పడిపోయింది. అరిస్తే...
పందెం ఓడిపోతామని... అలాగే కూర్చుండిపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

8.అందుకే మరి

పోలీస్: అర్ధరాత్రివేళ కార్లో స్పీడుగా ఎక్కడికి వెళ్తున్నారు?

అరవింద్: మద్యపానం, దాని దుష్ఫలితాల మీద ఉపన్యాసం వినేందుకు వెళ్తున్నా సార్.

పోలీస్: నేనేమైనా పిచ్చోడిలాగా కనిపిస్తున్నానా... ఇంతరాత్రి పూట అలాంటి ఉపన్యాసం ఇచ్చేదెవరు?

అరవింద్: మా ఆవిడ...



9.డబుల్‌ ట్రబుల్‌

‘ఏమోయ్‌... ఇది విన్నావా? మగవాళ్ల కంటే ఆడవాళ్లు రెట్టింపు
మాట్లాడతారట!’
‘అందులో విశేషం ఏముంది? మీకు ఏ విషయాన్నయినా రెండుసార్లు చెప్పాల్సి వస్తుంది కదా!’

10.అజమాయిషీ

కన్నబాబుకి విమానాశ్రయంలో బిల్‌గేట్స్‌ కనిపించాడు. వెంటనే అతని
దగ్గరకు వెళ్లి... ‘‘సార్‌! నాకోసం ఓ క్లయింట్‌ వస్తున్నాడు. ఆ
సమయంలో మీరు నా దగ్గరకు వచ్చి ‘బాగున్నావా కన్నా!’ అని అడిగితే నా
పరపతి పెరిగిపోతుంది’’ అని ప్రాధేయపడ్డాడు. అతను కోరినట్లుగానే
క్లయింట్‌తో మాట్లాడుతుండగా బిల్‌గేట్స్‌ వచ్చి ‘బాగున్నావా కన్నా!’
అని అడిగాడు. వెంటనే కన్నబాబు ‘బుద్ధి లేదూ. క్లయింట్‌తో
మాట్లాడుతుంటే విసిగిస్తావా. ఫో అవతలికి’ అనేశాడు!!

Pagination Example

తదుపరి