పేజీ సంఖ్య - 05
పని.. పని.. పని
ఆవిడ కిరాణా షాపుకి వెళ్లి ఆవాలు, జీలకర్ర, మెంతులు,
ధనియాలు, గసగసాలు అన్నీ పావు కిలో చొప్పున ఒకే
కవర్లో వేసి కట్టమని చెప్పింది.
‘అన్నీ కలిపేయాలా!
ఎందుకలా? ఏదన్నా కొత్త వంటకం ట్రై చేస్తున్నారా’
అని అడిగాడు షాపు వాడు.
‘వంటకమా పాడా! మా అత్తయ్యగారు ఓ వారం పాటు ఇంట్లో
ఉండటానికి వస్తున్నారు. ఇవన్నీ ఇచ్చి వేరు చేయమని
అడిగితే ఇక నా జోలికి రారు కదా!’ అని మూతి విరుచుకుంటూ
బదులిచ్చింది సూర్యకాంతమ్మగారి కోడలు
మగబుద్ధి
బస్టాండులో ఉన్న ఆ యువకుడి అందం చూసి, ఓ అమ్మాయికి
మతిపోయింది. వెంటనే దగ్గరకి వెళ్లి- ‘నువ్వంటే నాకిష్టం.
అలా కాఫీకి వెళ్దాం వస్తావా!’ అని అడిగింది.
ఆ మాటలకి అబ్బాయి అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు.
‘ఇదంతా వయసు వల్ల కలిగే ఆకర్షణ. ముందు కెరీర్ మీద దృష్టి పెట్టు.
అప్పుడు నాకంటే మంచివాడు దొరుకుతాడు’ అని చెప్పాడు.
కాగితంపై ఏదో రాసి...
‘ఇందులో మంచి సూక్తులు ఉన్నాయి. వెళ్లి చదువుకో’ అంటూ
ఓ పేపరు చేతిలో పెట్టాడు. ఇంటికెళ్లాక దాన్ని చూసిందా అమ్మాయి-
‘పిచ్చిదానా! వెనకే ఉన్న నా భార్యని నువ్వు చూసినట్టు లేదు.
రేపు సాయంత్రం ఈ నెంబరుకి ఫోన్ చెయ్!
కాఫీకి వచ్చేస్తాను’ అని రాసి ఉంది
గురి తప్పిన వరం
ఓ 70 ఏళ్ల ముసలావిడ హాస్పిటల్లో ఉంది.
‘భగవంతుడా నన్ను ఎలాగైనా బతికించు’ అంటూ తెగ ప్రార్థించింది.
ఇంతలో ఆమెకు దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ‘
నువ్వు ఇంకో 30 ఏళ్లు కచ్చితంగా బతుకుతావు.
నాది హామీ!’ అంటూ వరం ఇచ్చాడు. తను
ఇంకా బతుకుతానన్న ఆనందంలో ముసలావిడ రోజూ
చక్కగా మేకప్ వేసుకోవడం మొదలుపెట్టింది.
కానీ నెల రోజులకే స్వర్గానికి చేరుకుంది.
‘మోసం! నేను ఇంకో 30 ఏళ్లు బతుకుతానని హామీ ఇచ్చావు కదా!’
అని స్వర్గంలో ఉన్న దేవుడితో
తగవు పెట్టుకుంది. ముసలావిడ వంక చూసిన
దేవుడు నాలుక కరుచుకున్నాడు.
‘అరే నువ్వా! సారీ. మేకప్ ఎక్కువ కావడంతో
గుర్తుపట్టలేదు’ అంటూ పక్కకి తప్పుకున్నాడు.
ఆరోగ్య రహస్యం
డాక్టర్: ఓ పెగ్గు విస్కీతో నీ జీవితంలో అయిదు నిమిషాలు
క్షీణించిపోతుంది. అదే నవ్వుతో పదినిమిషాల ఆయుష్షు
పెరుగుతుంది.
దేవదాసు: అందుకే కదా! నేను ఫెగ్గుకీ
ఫెగ్గుకీ మధ్య నవ్వుషుంటాను!!! హ.. హ.. హ!
నిస్వార్థం
కొందరు మతం కోసం గొడవపడుతుంటారు...
మరికొందరు డబ్బు కోసం గొడవపడుతుంటారు...
ఇంకొందరు కులం పేరుతో గొడవ పడుతుంటారు...
ఒక్క భార్యాభర్తలు మాత్రమే...
నిస్వార్థంగా దేనికో తెలియకుండానే గొడవ పడుతుంటారు.
బారులో తోడు
వీరసింగుడు బార్లో కూర్చుని తెగ తాగాడు. తాగీతాగీ
పక్కన కనిపించిన మనిషితో మాట్లాడటం మొదలుపెట్టాడు.
వాళ్లిద్దరూ ఒకే ఊరి నుంచి వచ్చారనీ, ఒకే కాలేజీలో
చదువుకున్నారనీ తేలింది. ఆ సంతోషంలో రెండో మనిషి బిల్లు
కూడా వీరసింగుడే కట్టి బయల్దేరాడు. ‘ఇప్పటికైనా అర్థమైందా!
బార్లో అద్దాలు పెట్టడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో?’
అంటూ కొడుక్కి హితబోధ చేశాడు బారు ఓనరు.
కష్టమే
ఎప్పుడూ చేపల మార్కెట్లాగా ఉండే ఆఫీసులో ఆ రోజు
శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ‘ఇవాళ ఎందుకింత
నిశ్శబ్దంగా ఉంది?’ ఆశ్చర్యంగా తన పీఏని అడిగాడు ఆఫీసరు.
‘ఇవాళ ఆఫీసులో అందరూ వచ్చారండీ. ఇంక ఎవరి
గురించి మాట్లాడుకుంటారు పాపం!’ బదులిచ్చాడు పీఏ.
కొక్కొరొక్కో
ఓ పిచ్చాసుపత్రి. అందులో ఓ హాలు. అక్కడ పదిమంది
పిచ్చివాళ్లు ‘కొక్కొరొక్కో’ అంటూ కోడిలాగా అరుస్తున్నారు.
పదకొండో వ్యక్తి మాత్రం నిశ్శబ్దంగా ఓ మూల
కూర్చుని ఉన్నాడు. ఆ మనిషిని చూసి డాక్టరుగారు ముచ్చటపడిపోయారు.
‘వాళ్లంతా అరుస్తున్నా నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావంటే
నీకు పిచ్చి తగ్గిపోయినట్లుంది. వెంటనే నిన్ను
డిశ్చార్జ్ చేసేస్తాను’ అన్నారు డాక్టరు.
‘ఉష్! నోర్ముయ్. గుడ్డుపెడుతున్న కోడితో
మాట్లాడకూడదని నీకు తెలియదా!’ అని కసురుకున్నాడు పదకొండో మనిషి!
చెప్పను పో!
‘ఏడిశావ్! అమ్మాయిలు ఎప్పుడూ వాళ్ల వయసు చెప్పరనితెలియదా!’
‘సరే! అయితే నీ ఈమెయిల్ అడ్రస్ చెప్పు!’
‘వనజచి1998ఃమెయిల్.కామ్ !!!’
మోసం!
చిన్ను: నేను టీసీని బోల్తా కొట్టించాను తెలుసా!మిన్ను: ఎలా?
చిన్ను: నన్ను టీసీ టికెట్ అడగ్గానే పరుగు లంకించుకున్నాను
రైలు ఆ చివర నుంచి ఈ చివర వరకు పరుగు తీయించాను.
చివరికి ఎప్పటికోకానీ తను నన్ను పట్టుకోలేకపోయాడు.
మిన్ను: మరి ఎలా బోల్తా కొట్టించావు!
చిన్ను: నా దగ్గర టికెట్ ఉందిగా!!!