Subscribe

91.విశ్రాంతి

డాక్టర్‌: మీ ఆయన చాలా నీరసంగా ఉన్నాడమ్మా.
ఆయనకి విశ్రాంతి అవసరం. ఇవిగో ఈ నిద్రమాత్రలు తీసుకోండి.

భార్య: మంచిది డాక్టర్‌. ఇవి ఆయన ఎప్పుడెప్పుడు వేసుకోవాలి

డాక్టర్‌: అబ్బే అవి వేసుకోవాల్సింది మీరే!
చెప్పానుగా ఆయనకి విశ్రాంతి అవసరం అనీ....

92.ఓ పరిశీలన

భర్త వేసిన జోకులకి కనుక భార్య నవ్వుతూ ఉంటే..
. ఇంట్లో అతిథులు ఉన్నట్లు లెక్క..

93.పెళ్లి - విడాకులు

నందు- ‘నేను ఇంక పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను.
మా ఇంట్లో ఉన్న చెత్తనీ, అంట్లనీ, మురికి
బట్టలనీ చూసీ చూసీ విసుగు పుట్టేసింది.’

చందు- ‘నేను ఇక విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాను.
మా ఇంట్లో ఉన్న చెత్తనీ, అంట్లనీ, మురికి
బట్టలనీ చూసీ చూసీ విసుగు పుట్టేసింది.’

94.గొడవ గొడవ

రవిచంద్ర హడావుడిగా బారులోకి అడుగుపెట్టాడు.
‘ఇక్కడ గొడవ మొదలయ్యేలోగా నాకో బీర్‌ తెచ్చిపెట్టు’
అని అంతే హడావుడిగా అడిగాడు. బీరు పూర్తయ్యాక మళ్లీ ‘ఇక్కడ గొడవ
మొదలయ్యేలోగా నాకో బీర్‌ తెచ్చిపెట్టు’ అని తొందరపెట్టాడు.
అలా ఓ ఐదారు బీర్లు కడుపులో పడ్డాయి.
రవిచంద్ర కంగారు చూసి బార్‌టెండరుకి చిరాకేసింది.
‘ఇదిగో బీర్లకి బీర్లు తాగేస్తున్నావు. ఇంతకీ నీ దగ్గర డబ్బులు
ఉన్నాయా లేవా?’ అని గట్టిగా అడిగాడు.
‘చూశావా ఇప్పుడు గొడవ మొదలవుతోంది’
అంటూ చొక్కా పైకి మడిచి నిలబడ్డాడు రవిచంద్ర.

95.అదీ విషయం

తండ్రి: నిన్నో చిక్కు ప్రశ్న అడుగుతాను. తారాజువ్వ
వెలిగించినప్పుడు ముందు వెలుతురు కనిపిస్తుంది.
తర్వాత శబ్దం వినిపిస్తుంది. ఎందుకలాగా!

గౌతం: ఆ మాత్రం తెలియదా డాడీ!
కళ్లు ముందు ఉంటాయి కాబట్టి,
వెలుతురు ముందు కనిపిస్తుంది. చెవులు వెనక
ఉంటాయి కాబట్టి, వాటికి శబ్దం చేరేందుకు కాస్త ఆలస్యం అవుతుంది.

96.సహకారం

నువ్వు గొప్ప డాన్సర్‌వే! కాకపోతే
ఆ రెండూ నీకు సహకరించడం లేదు.
ఏంటా రెండూ? నీ కాళ్లు

97.పిచ్చి నాకు కాదు

వైద్యుడు: నిన్నెందుకు పిచ్చాసుపత్రిలో చేర్చారు?

రోగి: నేను ఓ అయిదు వందల పేజీల పుస్తకాన్ని రాశాను.

వైద్యుడు: అందులో ఏముంది?

రోగి: మొదటి పేజీలో రాజుగారు గుర్రం మీద వేటకి
బయల్దేరతారు. చివరి పేజీకి అడవికి చేరుకుంటారు.

వైద్యుడు: మరి మిగతా పేజీలలో...

రోగి: గుర్రం ‘డిక్‌ చిక్‌ డిక్‌ చిక్‌’ అని నడుస్తూ ఉంటుంది.

వైద్యుడు: నీ మొహం! ఎవరైనా ఇదంతా చదువుతారా?

రోగి: పిచ్చి నాకు కాదు మీకు. ఓసారి అదంతా
వాట్సాప్‌లో పెట్టి చూడు. లక్షలమంది చదువుతారు.

98.చాలా ఫాస్ట్ గురూ

ఓ జపాను యాత్రికుడు ఇండియాకి వచ్చాడు.
ఊరంతా తిరిగి చూసేం దుకు ఓ కారెక్కి కూర్చున్నాడు.
ఆ కారు రోడ్డు మీద వెళ్తూ ఉండగా... దాని పక్క నుంచి
సర్రున ఓ హోండా బండి దూసుకుపోయింది. ‘
మా దేశంలో తయారైన బండి అది. చాలా చాలా ఫాస్టు!’
అని గర్వంగా చెప్పాడు జపాను మనిషి.
కారు ఇంకాస్త దూరం వెళ్లేసరికి, దాని పక్క నుంచి ఝామ్మని
ఓ టొయోటా కారు దాటుకుపోయింది. ‘మా దేశంలో తయారైన కారు
ఇది. చాలా చాలా ఫాస్టు!’ అని మరికాస్త గర్వంగా చెప్పాడు జపానాయన.
కాసేపటికి జపాను పెద్దాయన దిగాల్సిన చోటు రానే వచ్చింది.
‘రెండు వేల రూపాయలు ఇవ్వండి,’ అంటూ నిదానంగా చెప్పాడు టాక్సీ డ్రైవరు.
‘అదేంటి! అయిదు వందలకి మించదని అనుకున్నానే!’
ఆశ్చర్యంగా అడిగాడు జపాను పెద్దమనిషి.
‘నా మీటర్‌ మేడిన్‌ ఇండియా... చాలా చాలా ఫాస్టు’
తాపీగా చెప్పాడు డ్రైవరు.

99.పీహెచ్‌డీ

ఉమేష్‌- ఎన్నాళ్లయ్యింది నిన్ను చూసి! ఇప్పుడు ఏం చేస్తున్నావు?

సోమేష్‌- నేను పీహెచ్‌డీ చేస్తున్నాను.

ఉమేష్‌- వావ్‌ ఎందుకంత సిగ్గుప డుతూ చెబుతున్నావు.
నా చిన్ననాటి స్నేహితుడు పీహెచ్‌డీ చేస్తున్నాడని తెలిసి
నాకు చాలా గర్వంగా ఉంది. ఇంతకీ దేని మీద పీహెచ్‌డీ?

ఉమేష్‌- దేని మీదా కాదు. పీహెచ్‌డీ అంటే పిజ్జా హోం డెలివరీ.

100.సగం సగం

నేను లాటరీ గెల్చుకుంటే ఏం చేస్తావు?’ గోముగా అడిగాడు భర్త.
‘అందులో సగం తీసుకుని మా పుట్టింటికి వెళ్లిపోతాను’ చిరాగ్గా
చెప్పింది భార్య.
‘సరే ఇవాళ ఓ ఇరవై రూపాయలు గెల్చుకున్నాను.
పదిరూపాయలు తీసుకుని బయల్దేరు’ బాంబు పేల్చాడు భర్త.

Pagination Example

తదుపరి