పేజీ సంఖ్య - 03

తలరాత

ఆ తల్లి తన కూతురిని చెడామడా తిడుతోంది. ‘నీకు బుద్ధుందా! వారం రోజుల్లో
ఆ డాక్టరుతో పెళ్లి పెట్టుకుని, వీధి చివర మందుల షాపు వాడితో తిరుగుతావా!’
‘అంతా నా తలరాత మమ్మీ! ఆయన రాసిన ప్రేమలేఖలు చదివించుకోవడానికి
మందుల షాపతని దగ్గరకి వెళ్లాల్సి వస్తోంది’ వాపోయింది కూతురు.

ఏమున్నట్టు?

నీ జేబులో అయిదు పదిరూపాయల నోట్లు ఉన్నాయి.
వాటిలో నాలుగు పోతే జేబులో ఏమున్నట్టు?
‘ఏమున్నట్టు? జేబులో చిల్లున్నట్టు!

రుజువు

ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్లో పనిచేసేందుకు ఇంటర్వ్యూకి వెళ్లింది జూలీ.
‘ఇంతకు ముందు నేను ఫలానా హోటల్లో ఐదేళ్లు పనిచేశాను సర్‌!’ అని గొప్పగా చెప్పింది.
‘నువ్వు అక్కడ పనిచేశావని చెప్పడానికి రుజువేంటి!’ అడిగాడు యజమాని.
‘రుజువులు లేకేం! మా ఇంట్లో ఉన్న చెంచాలన్నీ అక్కడివే!’
అనేసి నాలుక కరుచుకుంది.

ప్రతిఫలం

ఆ టీచరుగారు చింటూకి మంచిబుద్ధులు నేర్పుతున్నారు...
‘నువ్వు పొరపాటున ఓ పెద్దాయన కాలు తొక్కితే ఏం చేస్తావు?’ అడిగారు టీచర్‌.
‘వెంటనే సారీ చెబుతాను’ చెప్పుకొచ్చాడు చింటూ.
‘గుడ్‌! నీ ప్రవర్తనకు మెచ్చుకుని ఆ పెద్దాయన చాక్లెట్‌ ఇస్తే ఏం చేస్తావు?’ సాగతీసింది టీచర్‌.
‘వెంటనే రెండో కాలు తొక్కుతాను’ తడుముకోకుండా చెప్పాడు చింటూ.

ముందు... తర్వాత

ఆటోవాలా: సార్‌! ఘోరం జరిగిపోయింది. బ్రేకులు పనిచేయడం లేదు.
ఇప్పుడేం చేయడం.
ప్రయాణికుడు: ముందు మీటర్‌ ఆపెయ్‌.
తర్వాత సంగతి

ఆలస్యం

‘నాలుగు ఇంజన్లలో ఒక ఇంజన్‌ పాడైంది. విమానం ఓ గంట ఆలస్యం అవుతుంది’
అంటూ ఎనౌన్స్‌మెంట్‌ వినిపించింది.
‘ఇంకో ఇంజన్‌ కూడా పాడైంది. విమానం ఇంకో గంట ఆలస్యం అవుతుంది’
కాసేపటికి మరో అనౌన్స్‌మెంట్‌ వచ్చింది.
‘మూడో ఇంజన్‌ కూడా పాడైంది. మరో గంట ఆలస్యమవుతుంది. క్షమించాలి’ అంటూ
ఇంకో అనౌన్స్‌మెంట్‌.
కాసేపటికి ‘నాలుగో ఇంజన్‌ కూడా పాడైంది...’ అని వినిపించగానే ‘ఛీఛీ
ఇంకో గంట ఆలస్యం’ అని విసుక్కున్నాడు పరమేశం.

మందు జాగ్రత్త

‘నేను మందు కొట్టిన రోజు చాలా జాగ్రత్తగా ఉంటాను. చప్పుడు చేయకుండా ఇంటికి వెళ్లి
, మారు మాటాడకుండా అన్నం తిని, బుద్ధిగా స్నానం చేసి మంచం ఎక్కుతాను.
అయినా నా భార్య పసిగట్టేస్తుంది.’ అంటూ వాపోయాడు జగన్నాధం.
‘నేను మందు కొట్టిన రోజు తిక్కతిక్కగా ఉంటాను
. అందుకే నా భార్య పసిగట్టలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు రాజనాల.

భర్త మనోగతం

వంటేం చేస్తున్నావు (ఆకలేసి చస్తోంది)
చీర బాగుందే (ఎన్ని డబ్బులు తగలేశావో!)
నాకు నిద్ర వస్తోంది (ఇక మీ పుట్టింటి కబుర్లు ఆపేయవా ప్లీజ్‌)
సాయంత్రం లేట్‌గా వస్తాను (ఫుల్లుగా మందు కొట్టి వస్తా)
ఏమనుకుంటున్నావ్‌ నేనంటే (నువ్వు కూడా తీసిపారేస్తే ఎలా!)
మీ నాన్నగారు ఎలా ఉన్నారు (డబ్బులేమైనా మిగుల్తున్నాయా?)

రంగు పడాలి

ఎలక్షన్లలో ఓటు వేయడానికి బయల్దేరాడు వీరబాహు.
ఓటు వేశాడు. వేలి మీద ఇంకు పూయించుకున్నాడు.
‘ఈ మరక నీళ్లతో కడిగితే పోతుందా’ ఆసక్తిగా అడిగాడువీరబాహు
. ‘పోదు’ బదులిచ్చాడు ఎలక్షన్‌ ఆఫీసరు.
‘పోనీ సబ్బుతో రుద్దితే’... ‘పోదుగాక పోదు’
‘వారమైనా పోదా’... ‘ఒకోసారి నెలైనా పోదు’
‘బాబ్బాబు ఆ రంగేదో కాస్త నా జుత్తుకి కూడా పూయరా
? వారం రోజుల్లోనే నా హెయిర్‌ డై పనిచేయకుండా పోతోంది.’

ఇంకెవరు

అధికార పక్షంలో ఉన్న నాయకుడు, ప్రతిపక్షంలో ఉన్న
నాయకుడు.... ఇద్దరూ ఓ మునిగిపోతున్న పడవలో ఉన్నారనుకుందాం. ఎ
వరు బతికిపోతారని మీరు అనుకుంటున్నారు? జనం!

Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య - 03

Responsive Footer with Logo and Social Media