Subscribe

సుమతీ శతకం


1.కరణము సాదై యున్నను
గరి మద ముడిఁగినను బాము గఱవకయున్నన్
ధరఁ దేలు మీటకున్నను
గరమరుదుగ లెక్కఁగొనరు గదరా సుమతీ!

భావం: కరణము మెత్తనితనము గలిగియుండినను, ఏనుగు మదము విడిచినను, పాముకరవకున్నను, తేలుకుట్టకుండిననుజనులు లక్ష్యముచేయరు.

2.ఇచ్చునదె విద్య, రణమునఁ
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులు
మెచ్చునదె నేర్పు, వాదుకు
వచ్చునదే కీడుసుమ్ము! వసుధను సుమతీ!

భావం: ధనము నిచ్చునదే విద్య, యుద్ధభూమిలో చొరబదునదే పౌరషము. గొప్ప కవులు గూడ మెచ్చు నట్టిదే నేర్పరి తనము, తగువునకు వచ్చుటయే చెరవు.

3.కడు బలవంతుండైనను
బుడమినిఁబ్రాయంపుటాలిఁ పుట్టిన యింటన్
దడ వుండనిచ్చె నేనియుఁ
బడుపుగ నంగడికిఁదానె బంపుట సుమతీ!

భావం: ఎంత బలవంతుడైనను, పడుచు పెండ్లామును ఆమె పుట్టింటి దగ్గర యెక్కువ కాల ముండనిచ్చిన యెదల, తానే యామెను వ్యభిచారిణీగా దుకాణమునకు పంపినట్లగును.

4.కసుగాయఁగఱచి చూచిన
మసలక తన యొగరు గాక మధురంబగునా?
పస గలుగు యువతు లుండఁగఁ
బసిబాలలఁబొందువాఁడు పశువుర సుమతీ!

భావం: పండిన పండు తినక, పచ్చికాయకొరికినచో వెంటనే వగరు రుచి తోచునుగాని, మధురమెట్లు గలుగునో; అట్లే యౌవనము గల స్త్రీ లుండగా పసి బలికలతో కూడినచో వికటముగా నుండును. చిన్న బాలికల పొందు గూడిన వాడు పశువుతో సమానుడు.

5.ధనపతి సఖుఁడై యుండియు
నెనయంగా శివుఁడు భిక్షమెత్తఁగవలసెన్
దనవారి కెంత గలిగిన
తన భాగ్యమె తనఁకుగాక తధ్యము సుమతీ!

భావం: ధన వంతుడైన కుబేరుడు స్నేహితుడై నప్పటికినీ ఈశ్వరుడు బిచ్చమెత్తుట సంభవించెను. కాబట్టి, తన వారికెంత సంపద యున్నను, తనకుపయోగపడదు. తన భాగ్యమే తనకు ఉపయోగించును.

6.తనవారు లేని చోటను
జన వించుక లేనిచోట జగడము చోటన్,
అనుమానమైన చోటను,
మనుజును ట నిలువఁదగదు మహిలో సుమతీ!

భావం: తన బంధువులు లేని తావునను, తనకు మచ్చికలేని తావునను, తనపై ననుమాన మయిన తావునను మనుష్యుడు నిలువ కూడదు.

7.తములము వేయని నోరును
వినుతులతో జెలిమి సేసి వెతఁబడు తెలివిన్
గమలములు లేని కొలకుఁను
హిమధాముఁడు లేని రాత్రి హీనము సుమతీ!

భావం: తాంబూలము వేసుకొనని నోరును, విరుద్ధమైన మతము గల వారితో స్నేహముచేసి విచారించు వివేకమును, తామరలు లేని సరస్సును, చంద్రుడు లేని రాత్రియును నీచ మయినవి.

8.తలపొడుగు ధనముఁబోసిన
వెలయాలికి నిజములేదు వివరింపంగాఁ
దల దడివి బాస జేఁసిన
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ!

భావం: తల పొడుగు, ధనము పోసినప్పటికినీ వేశా స్త్రీకి సత్యమాడుట లేదు. తల మిద చేయి వేసుకొని ప్రమాణము చేసినను వార కాంతను నమ్మరాదు.

9.తలమాసిన వొలుమాసిన
వలువలు మాసినను బ్రాణ వల్లభునైనన్
కులకాంతలైన రోఁతురు
తిలకింపఁగ భూమిలోన దిరముగ సుమతీ!

భావం: ఆలోచింపగా, భూమియందు, తలయు, శరీరము, బట్టలుమాసినచో పెనిమిటినైననూ (నుంచి స్త్రీలైనప్పటికిన్నీ) అసహ్యపడుట నిజము.

10.దగ్గర కొండెము సెప్పెడు
ప్రెగ్గడపలుకులకు రాజు ప్రియుఁడై మఱి తా
నెగ్గుఁ బ్రజ్జ కాచరించుట
బొగ్గులకై కల్పతరువుఁబొడచుట సుమతీ!

భావం: దగ్గర నున్న మంత్రి చెప్పు చాడీలను విని; రాజు యిష్టపడి; ప్రజలకు కీడు చేయుట అనునది; కోరిన కొరికల నిచ్చు చెట్టును బొగ్గులకై నరకుటతో సమానముగా నుండును.

11.కాదుసుమీ దుస్సంగతి
పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్,
వాదుసుమీ యప్పిచ్చుట
లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ!

భావం: దుర్జన స్నేహము కూడదు. కీర్తి సంపాదించిన తరువాత తొలగిపోదు. అప్పునిచ్చుట కలహమునకు మూలము. స్త్రీలకు కొంచెమైనను ప్రేమ ఉండును.

12.నరపతులు మేరఁదప్పిన
దిర మొప్పగ విధవ యింటఁ దీర్పరియైనన్
గరణము వైదికుఁడయినను
మరణాంతక మౌనుగాని మానదు సుమతీ!

భావం: రాజులు ధర్మము యొక్క హద్దు తప్పినను; విధవాస్త్రీ ఇంటి యం ఏల్లకాలము పెత్తనము చేసినను, గ్రామకరణము పైదికవృత్తి గల వాడైనను ప్రానము పోవునంతటి కష్టము తప్పకుండా సంభవించును.

13.పగవల దెవ్వరితోడను,
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్,
దెగనాడవలదు సభలను
మగువకు మన సియ్యవలదు మహిలో సుమతీ!

భావం: ఎటువంటి వారితోనూ పగపెట్టుకొనరాదు. బీదతనము సంభవించిన తరువాత విచారింపరాదు. సభలలో మోమాటములేకుండ మాట్లాడరాదు. స్త్రీకి, మనసులోని వలపు తెలుపరాదు.

14.పలుదోమి సేయు విడియము
తలగడిగిన నాఁటి నిద్ర, తరుణులతోడన్
పొలయలుక నాఁటి కూటమి,
వెల యింతని చెప్పరాదు వినురా సుమతీ!

భావం: దంతములు తోముకొనినవెంటవే వేసుకొను తాంబూలమును, తలంటుకొని స్నానముచేసిననాటి నిద్రయును, స్త్రీలతో ప్రనయకలహమునాడు కూడిన పొందును. వీటి విలువ ఇంతయని చెపలేము సుమా.

15.పులిపాలు దెచ్చియిచ్చిన
నలవడఁగా గుండెగోసి యరచే నిడినన్
దలపొడుగు ధనముఁబోసిన
వెలయాలికిఁగూర్మిలేదు వినరా సుమతీ!

భావం: పులి పాలు తెచ్చినను, గుండెకాయను కోసి అరచేతిలో బెట్టినప్పటికినీ, తలేత్తు ధనముపోసినప్పటికినీ, వేశ్యాస్త్రీకి ప్రేమ ఉండుదు.

16.మానధనుఁడాత్మదృతిఁచెడి
హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్
మానెండు జలము లోపల
నేనుఁగు మెయిదాఁచినట్టు లెరుగుము సుమతీ!

భావం: అభిమానసంతుడు ధైర్యము తొలగి నీచుని సేవించుత కొంచెను నీళ్ళలొ ఏనుగు శరీరమును దాసుకొను విధముగా నుండును.

17.'రా, పొ'మ్మని పిలువని యా
భూపాలునిఁగొల్వ భుక్తి ముక్తులు గలపే ?
దీపంబు లేని యింటను
జే పుణికిళ్ళాడినట్లు సిద్ధము సుమతీ!

భావం: దీపములేని ఇంటిలోచేతిపట్టులాడిన పట్టుదొరకనియట్లే 'రమ్ము పొమ్ము 'అని ఆదరింపని రాజును సేవించుటవలన భూక్తిముక్తులుగల్గవు.

18.వెలయాలి వలనఁగూరిమి
గలుగదు మఱిఁగలిగెనేని కడతేరదుగా
బలువురు నడిచెడు తెరువునఁ
బులు మొలవదు మొలచెనేని బొదలదు సుమతీ!

భావం: పదుగురు నడిచే మార్గము నందు గడ్డి మొలవనే మొలవదు. ఒకవేళ కలిగినా, కడవరకు స్థరముగనుండదు. అట్లే వేశ్య ప్రేమించదు. ప్రేమించిననూ తుదివరకూ నిలువదు.

19.వెలయాలు సేయు బాసలు
వెలయఁగ నగసాలి పొందు, వెలమల చెలిమిన్.
గలలోఁన గన్నకలిమియు,
విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ!

భావం: వేశ్యా ప్రమాణములును, విశ్వ బ్రాహ్మణుని స్నేహమును, వెలమ దొరల జతము, కలలో చూచిన సంపదయు, స్పష్టముగానమ్మరాదు.

20.పొరుగునఁ బగవాఁడుండిన
నిర నొందఁగ వ్రాఁతకాడె యేలికయైనన్
ధరఁగాఁపు గొండెయైనను
గరణులకు బ్రతుకులేదు గదరా సుమతీ!

భావం: ఇంటి పొరుగున విరోధి కాపురమున్ననూ, వ్రాతలో నేర్పరియైనవాడు పాలకుదైననూ, రైతు చాడీలు చెప్పెడివాడైననూ కరణములకు బ్రతుకుతెరు ఉండదు.

21.వురికిని బ్రాణము కోమటి
వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనన్
గరికిని బ్రాణము తొండము
సిరికిని బ్రాణంబు మగువ, సిద్ధము సుమతీ!

భావం: పట్టణమునకు కోమటియు, వరిపైరునకు నీరును, ఏనుగునకు తొండమును, సిరి సంపదలకు స్త్రీయును ప్రానము వంటివి.

22.వరిపంట లేని యూరును
దొరలుండని యూరు, తోడు దొరకని తెరువున్,
ధరను బతిలేని గృహమును,
నరయంగా రుద్రభూమి యనదగు సుమతీ!

భావం: వరిపంటలేని యూరును, అధికారియుండని గ్రామమును, తోడు దొరకని మార్గమును, యజమానుడులేని ఇల్లును వల్లకాడుతో సమానము.

23.వీడెము సేయని నోరును
చేడెల యధరామృతంబుఁజేయని నోరున్
బాడంగరాని నోరును
బూడిద కిరవైన పాడు బొందర సుమతీ!

భావం: తాంబూలము వేసికొననట్టియు, చెప్పిన మాట మరలాలేదని పల్కునట్టియు, పాటపాడుట తెదియనట్టిదియు అగునోరు, బూడిదమన్ను పోయునట్టి గుంటాతో సమానము.


24.లావుగలవాని కంటెను
భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ!


భావం: కొండ అంతటి ఏనుగును మావటివాడెక్కి లోబరుచుకొనునట్లే లావు కలిగిన వాడికంటెను, నీతిగల్గినవాడు బలవంతుడగును.

25.పెట్టిన దినముల లోపల
నట్టడవులకైన వచ్చు నానార్ధములున్
బెట్టని దినముల గనకఁపు
గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ!

భావం: పూర్వజన్మమున తాను దాన మిచ్చిన ఫలకాలమం దరణ్య మధ్య నున్నప్పటికినీ సకల పదార్ధములు కలుగును. పూర్వ జన్మమున దానమియ్యకున్నచో తాను బంగారుకొండ నెక్కినను ఏమియు లభించదు.

26.వఱదైన చేనుదున్నకు
కఱవైనను బంధుజనుల కడ కేఁగకుమీ,
పరులకు మర్మము సెప్పకు,
పిఱికికి దళవాయితనముఁబెట్టకు సుమతీ!

భావం: వరద వచ్చే పొలమును వ్యవసాయము చేయకుము, కరువు వచ్చినచొ చుట్టముల కరుగకుము. ఇతరులకు రహస్యము చెప్పకుము. భయము గలవాడికి సేనా నాయకత్వము నీయకుము.

27.బంగారు కుదువఁబెట్టకు
నంగడి వెచ్చము లాడకు,
సంగరమునఁ బాఱిపోకు, సరసుడవైతే
వెంగలితోఁ జెలిమివలదు వినురా సుమతీ!

భావం: బంగారము తాకట్టుపెట్తకుము. యుద్ధమునందు పారిపోకుము దుకాణము నందు వెచ్చములు అప్పు తీయకుము. అవివేకితో స్నేహము చేయకుము.

28.తలనుండు విషము ఫణికిని
వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
తలతోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!

భావం: తల యందు పామునకు, తోక నందు తేలునకును విషముండును, కాని, దుర్మార్గులకు తల, తోక యను నియమము లేక, శరీరమందంతటను విషముండును.

29.కనకపు సింహాసనమున
శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము కట్టిన
వెనుకటి గుణమేల మాను వినురాసుమతీ!

భావం: కుక్కను బంగారపు గద్దెమీద కూర్చుండజేసి మంచి ముహూర్తమున పట్టాభిషేకముచేసిననూ, దానికి సహజమయిన యల్పగుణముమానదు అట్లే, నీచుడగువానిని యెంత గౌరవించినను, వాని నీచగుణము వదలడు.

30.శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనుల నౌరాయనగా
ధారాళమైన నీతులు
నోరూరగ జవులుబుట్ట నుడివెద సుమతీ!

భావం: సుమతీశతక కారుడు 'సుమతీ' అని సంబోధన చేసి బుద్ధిమంతులకు మాత్రమే నీతులను చెప్పెదనని తెలిపినాడు. లోకములోనీతి మార్గమును ఆచరించి బోధించిన శ్రీరాముని అనుగ్రహము పొందిన వాడనై లోకులు మెచ్చుకొను నట్టి మరలమరల చదువ వలెను అనే ఆశకలుగునట్లుగా వచించుచున్నాను.

31.అప్పుగొని చేయు విభవము
ముప్పున బ్రాయంపుటాలు, మూర్ఖుని తపమున్
ద ప్పరయని నృపురాజ్యము
దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ!

భావం: అప్పులు చేసి ఆడంబరములు చేయడం ముసలితనములో వయసులొనున్న భార్య ఉండటం మూర్ఖుని తపస్సు. తప్పొప్పులను గుర్తించని రాజ్య పరిపాలన ముందు ముందు భయం కరమైన కష్టమును కలిగించును.

32.ఆకలి యుడుగని కడుపును
వేకటియగు లంజపడుపు విడువని బ్రతుకున్,
బ్రా కొన్న నూతి యుదకము
మేకల పాడియును రోత మేదిని సుమతీ!

భావం: కడుపునిండని తిండి, గర్భము దాల్చికూడ అంజరికము మానని భొగము దాని జీవితము, పాచిపట్టిపాడయిన బాలినీరు, మేక కలిచ్చేపాడి రోతకలిగిస్తాయి.

33.ఉత్తమగుణములు నీచున
కెత్తెఱుగున గలుగనేర్చు నెయ్యడలన్ దా
నెత్తిచ్చి కఱగబోసిన
నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ!

భావం: బంగారముతో సమానముగా తూచి కరగించి కడ్డీలుగ పోసినప్పటికీ ఇత్తడి బంగారముతో సమానముకాదు. అదేవిధముగా నీచుడెంత ప్రయత్నించిన ఉత్తమ గుణములను పొందలేడు.

34.ఉపకారికి నుపకారము
విపరీతముగాదుసేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక జేయువాడె నేర్పరి సుమతీ!

భావం: ఊపకారము చేసిన వానికి తిరిగి ఉపకారము చేయడం గొప్పవిషయం కాదు. కీడు చేసిన వాని తప్పులు లెక్కపెట్టకుండ ఉపకారము చేయుటే తెలివైనపని.

35.ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడ దదియెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్పవసించు విధంబు గదరా సుమతీ!

భావం: ఎప్పుడు కూడ తన తప్పులను వెదకే అధికారిని కొలువ రాదు. తనను చంపటానికి ప్రయత్నించు పాము పడగ నీడన కప్ప నిలబడటానికి ప్రయత్నించకూడదు. ఈ రెండుకార్యములు కష్టమును కలిగించును.

36.ఒక యూరికి నొక కరణము
నొక తీర్పరియైనదక నొగి దఱుచైననౌ
గకవికలు గాకయుండునె
సకలంబును గొట్టుపడక సహజము సుమతీ!

భావం: ఒక గ్రామమునకు ఒక కరణమును, ఒక న్యాయాధికారియునుగాక, క్రమముగా యెక్కువ మంది యున్నచో నన్ని పనులు చెడిపోయి చెల్లాచెదురు గాక యుండునా? (ఉండవు.)

37.వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!

భావం: ఎవ్వరు చెప్పిననూ వినవచ్చును. వినగానే తొందర పడక నిజమో అబద్ధమో వివరించి తెలిసికొనినవాడే న్యాయము తెలిసినవాడ.

38.తన కోపము తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టం‌బౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ!

భావం: తన యొక్క కోపము శత్రువువలె బాధయును, నెమ్మది తనము రక్షకునివలె రక్షనయును, కరున చుట్టమువలె ఆదరమును, సంతోషము స్వర్గమువలె సుఖమును, దుఃఖము నరకమువలె వేదనను కగించునని చెప్పుదురు.

39.మాటకు ప్రాణము సత్యము
కోటకు ప్రాణంబు సుభటకోటి ధరిత్రిన
బోటికి ప్రాణము మానము
చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!

భావం: మాతకు సత్యమును; కొటకు మంచి భటుల సమూహమును, స్త్రీకిసిగ్గును, ఉత్తరమునకు చేవ్రాలు(సంతకము) జీవములు(ప్రాణమువలె ముఖ్యమైనవి.)

40.సిరి తా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి తా పోయిన పోవును
కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!

భావం: సంపద కలుగునపుడు కొబ్బరి కాయలోనికి నీరువచ్చు విధముగానే రమ్యముగా కలుగును. సంపదపోవునపుడు ఏనుగు మ్రింగిన వేలగపండులోని గుంజు మాయమగు విధముసనే మాయమయిపొవును.

41.కరణముల ననుసరింపక
విరిసంబున దిన్నతిండి వికటించు జుమీ
యిరుసున గందెన బెట్టక
పరమేశ్వరుబండియైన బాఱుదు సుమతీ!

భావం: కందెన లేనట్లయితే ఏ విధముగా దేవుని బండియైన కదలదో అదే విధముగా కరణానికి ధనమిచ్చి అతనికి నచ్చినట్లు నడవకున్నట్లయితె తన స్వంత ఆస్తికే మోసమువస్తుంది.

42.అక్కరకు రాని చుట్టము,
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమునcదా
నెక్కిన బాఱని గుఱ్ఱము,
గ్రక్కున విడువcగవలయcగదరా! సుమతీ!

భావం: సమయమునకు సహాయముచేయని చుట్టమును, నమస్కరించి ననూ వరములీయని దైవమును, యుద్ధములో తానెక్కగా పరుగెత్తని గుర్రమును వెంటనే విడువ వలయును.

43.అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరనుcగొల్చి మిడుకుట కంటెన్.
వడిగల యెద్దులcగట్టుక
మడి దున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతీ!

భావం: అడిగిన జీతమీయని ప్రభువును సేవించి కష్తపడుట కన్న, వడిగల యెద్దులను గట్టుకొని పొలము దున్నుకొని జీవించుటయే మేలు.

44.అడియాస కొలువుcగొలువకువ,
గుడిమణియము సేయcబోకు, కుజనుల తోడన్
విడువక కూరిమి సేయకు
మడవినిడిcదో డరయ కొంటి నరుగకు సుమతీ!

భావం: వ్యర్ధమైన యాశగల కొలువును, దేవాలయము నందలి యధికారము, విడువకుండా చెడ్డవారితో స్నేహమును, అడవిలో తోడులేకుండక ఓంటరిగా పోవుటయును తగినవికావు. (కనక, వాటిని మానివేయవలెను.)

45.అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుcడున్,
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ!

భావం: అప్పులిచ్చు వాడను, వైద్యుడును, యెడతెగక కుండా నీరు పారచుండెడి నదియును, బ్రాహ్మణుడును ఇవియున్న వూరిలో నివసింపుము. ఇవిలేని వూరును ప్రవేశింపకుము.

46.అల్లుని మంచితనంబును,
గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్,
బొల్లున దంచి బియ్యము,
దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ!

భావం: అల్లుడు మంచిగా నుండుట, గొల్ల విద్వాంసుడౌట, ఆడుది నిజము చెప్పుట, పొల్లున దంచిన బియ్యము, తెల్లనికాకులును లొకములోలేవని తెలియవలయును.

47.ఆcకొన్న కూడె యమృతము,
తాcగొంకక నిచ్చువాcడె దాత ధరిత్రిన్,
సో కోర్సువాcడె మనుజుcడు,
తేcకువగలవాడె వంశ తిలకుcడు సుమతీ!

భావం: ఆకలిగా నున్నప్పుడు తిన్న యన్నమే అమృతము వంటిది. వెనుక ముందు లాడక నిచ్చువాడే దాత, కష్తములు సహించువాడే మనుష్యుడు, ధైర్యము గలవాదే కులమునందు శ్రేష్ఠుడు.

48.ఇమ్ముగcజదువని నోరును,
'అమ్మా' యని పిలిచి యన్న మడుగని నోరున్,
దమ్ములcమబ్బుని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!

భావం: ఇంపుగా చదువని నోరును, 'అమ్మా'యని పిలిచి అన్నమడుగని నోరును, ఎన్నడునూ తాంబూలము వేసుకొనని నోరును, కుమ్మరిమన్నుకై త్రవ్విన గుంటతో సమానము.

49.ఉడుముండదె నూఱేండ్లునుc
బడియుండదె పేర్మిcబాము పదినూఱేండ్లున్
మడుపునcగొక్కెర యుండదె
కడునిలcబురుషార్దపరుcడు గావలె సుమతీ!

భావం: ఉడుము నూఱేండ్లును, పాము వెయ్యేండ్లును, కొంగ మడుగులో బహు కాలమును జీవించును. కాని, వాటివలన ప్రయోజన మేమి? మంచి పనులయంద అసక్తిగలవాడుండిన ప్రయోజనమగును.

50.ఉపమింప మొదలు తియ్యన
కపటంబెడ నెడను, జెఱకు కైవతినే పో
నెపములు వెదకునుcగడపటc
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ!

భావం: పోల్చికొని చూడగా, చెఱకు గడ మొదలు తియ్యగా నుండి నడుమ తీపితగ్గి చివరకు చప్పబడునట్లే, చెడు స్నేహము మొదట యింపుగాను, నడుమ వికటముగానూ చివరకు చెరువు గలిగించునదిగనూ యుండును.

51.ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తా నొవ్వక
తప్పించుక తిరుcగువాcడు ధన్యుcడు సుమతీ!

భావం: ఏ సమయమునకు ఏది తగినదో, అప్పటికి ఆ మాటలడి, ఇతరుల మనస్సులు నొప్పింపక, తాను బాధపదక, తప్పించుకొని నడచుకొనువాడే కృతార్ధుడు.

52.ఎప్పుడు సంపద గలిగిన
నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్
దెప్పులుగc జెఱువు నిండినc
గప్పలు పదివేలుచేరుcగదరా సుమతీ!

భావం: చెఱువులొ తెప్ప లాడునట్లు నీరు నిండుగా నున్నచొ, కప్ప అనేకములు చేరును. అట్లే భాగ్యము గలిగినప్పుడే చుట్టములు వత్తురు.

53.ఒల్లని సతి నొల్లని పతి
నొల్లని చెలికాని విడువ నొల్లనివాడే
గొల్లండుcగాక ధరలో
గొల్లడును దొల్లడౌనె చుణమున సుమతీ!

భావం: ఇష్టపడని భార్యను, విశ్వాసములేని యజమానుని, ఇష్తపడని స్నేహితుని, విడచుత, కిష్టపడనివాడే గొల్లవాని, గొల్ల కులము నందు పుట్టిన మాత్రమున గొల్లకాడు.

54.ఓడలcబండ్లును వచ్చును
ఓడలు నా బండ్లమీcద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడగబడుcగలిమిలేమి వసుధను సుమతీ!

భావం: ఓడలమీద బండ్లును, బండ్లమీద ఓడలును వచ్చును. అట్లే ఐశ్వర్యము వెంట దారిద్ర్యమును, దారిద్ర్యము వెంట ఐశ్వర్యమును వచ్చుచుండును.

55.కమలములు నీరు బాసినc
గమలాప్తు రశ్మిసోకి కమలిన భంగిన్
దమతమ నెలవులు దప్పినc
దమ మిత్రులే శత్రులౌట తధ్యము సుమతీ!

భావం: కమలములు తమ స్థానమగు నీటిని వదలిన యెడల తమకు మిత్రుడగు సూర్యని వేడి చేతనే వాదిపోవును. అట్లే, ఎవరుగాని తమ తమ యునికినట్లు విదిచినచో తమ స్నేహితులే విరోధు లగుట తప్పదు.

56.కారణములేని నగవునుc
బేరణమునులేని లేమ పృధివీ స్ధలిలోc
బూరణములేని బూరెయు
వీరణములులేని పెండ్లి, వృధరా సుమతీ!

భావం: కారనములేని నవ్వును, రవికలేక స్త్రీయును, పూరణములేని బూరెయును, వాయిద్యములు లేని పెండ్లియును గౌరవములేక యుండును.

57.కులకాంతతోcడ నెప్పుడుc
గలహింపకు, వట్టితప్పు ఘటియింపకుమీ
కలకంఠకంఠి కన్నీ
రొలికిన సిరి యింటనుండ నొల్లరు సుమతీ!

భావం: భార్యతో ఎప్పుడూ జగడమాడరాదు, లేనితప్పులు మొపరాదు. పతివ్రతయైన స్త్రీ యొక్క కంటినీరు ఇంట పడినచో, ఆ ఇంటి యందు సంపద వుండబోదు.

58.కూరిమిగల దినములలో
నేరము లెన్నcడునుc గలుగనేరవు, మఱి యా
కూరిమి విరసంబైనను,
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!

భావం: స్నేహము గల దినములలో ఎన్నడునూ తప్పులు కనబడవు. ఆ స్నేహము విరోధమైనచో ఒప్పులే తప్పులుగా నగపడుచుండును.

59.కొంచెపు నరు సంగతిచే
నంచితముcగ గీడువచ్చునది యెట్లన్నన్
గించిత్తు నల్లి కఱచిన
మంచమునకుc బెట్లు వచ్చు మహిలో సుమతీ!

భావం: చిన్ననల్లి కరిచినచో మంచమునకే విధముగా దెబ్బలు కలుగునో, అట్లే నీచునితో స్నేహము చేసినచో కీడు కలుగును.

60.చింతింపకు కడచిన పని
కింతులు వలతురని నమ్మ కెంతయుమదిలో
నంతఃపుర కాంతులతో
మంతనముల మానుమిదియె మతముర సుమతీ!

భావం: జరిగిపోయిన పనికి విచారింపకుము. స్త్రీలు ప్రేమింతురని నమ్మకము. రాణి వాస స్త్రీలతో రహస్యా అలొచనములు చేయకుము. ఇదియే మంచి నడవడి సుమా.

61.చీమలు పెట్టినా పుట్టలు
పాముల కిరువైన యట్లు పామరుcడుదగన్
హేమంబుcగూడcబెట్టిన
భూమీశుల పాలcజేరు భువిలో సుమతీ!

భావం: చీమలు పెట్టిన పుట్టలు పాములకు నివాసమయిన విధముగానే లోభి దాచి ధనము రాజుల పాలగును.

62.చేతులకు తొడవు దానము,
భూతలనాథులకుc దొడవు బొంకమి ధరలో
నీతియె తోడ వెవ్వారికి
నాతికి మాలంబు తొడవు నయముగ సుమతీ!

భావం: చేతులకు దానము; రాజుల కబద్ధ మాడకుండుటయును; ధరణిలో నెవ్వరికైనను న్యాయము; స్త్రీకి పాతివ్రత్యమును అలంకారము.

63.ననుభవింప నర్ధము
మానవపతి జేరు గొంత మఱి భూగతమౌ
గానల నీగలుగూర్చిన
తెనియ యొరు జేరునట్లు తిరముగ సుమతీ!

భావం: నిజముగా తేనెటీగలు అడవులలో చేర్చి ఉంచిన తేనె ఇతరలకు యెట్లు చేరునొ; అట్లే తాము భోగింపక దాచియుంచిన ధనముకొంత రాజులకు చేరును. మరికొంత భూమి పాలగును.

64.ధీరులకుc జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్
గౌరవమును మఱి మీcదట
భూరిసుఖావహము నగును భువిలో సుమతీ!

భావం: కొబ్బరిచెట్టుకు నీరుపోసినచో శ్రేష్టమైన నీరుగల కాయలను యిచ్చును. అట్లే బుద్ధిమంతులకు జేసిన ఉపకారము మర్యాదయును, తరువాత మిక్కిలి సుఖములను గల్గించును.

65.నడువకుమీ తెరువొక్కటc
గుడువకుమీ శత్రునింట గూరిమితోడన్,
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!

భావం: మార్గము నందు ఒంటరిగా నడవకుము, పగవాని ఇంటి యందు స్నేహముతో భూజింపకుము. ఇతరుల ధనమును మూట గట్టకము ఇతరుల మనస్సు నొచ్చునట్లు మాటలాడకుము.

66.నయమున బాలుం ద్రావరు
భయమునను విషమ్మునైన భక్షింతురుగా
నయమెంత దోసకారియొ
భయమే చూపంగవలయు బాగుగ సుమతీ!

భావం: మంచితనమువల్ల పాలను సహితము త్రాగరు. భయపెట్టుట చేత విషము నైనను తిందురు. కావున భయమును చక్కగా చూపించ వలయును.

67.నమ్మకు సుంకరి, జూదరి,
నమ్మకు మగసాలి వాని, నటు వెలయాలిన్,
నమ్మకు మంగడివానిని,
నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ!

భావం: పన్నులు వసూలు చేయువానిని, జూదమాడు వానిని, కంసాలిని, భోగము స్త్రీని, సరుకులమ్మువారిని, ఎడమచేతితో పనిచేయువానిని, నమ్మకుము.

68.నవ్వకుమీ సభలోపల
సవ్వకుమీ తల్లిదండ్రి నాధులతోడన్,
నవ్వకుమీ పరసతులతో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!

భావం: సభలోపలను, తల్లిదండ్రులతోడను, అధికారుల తోడను, పరస్త్రీ తోడను, బ్రాహ్మణా శ్రేష్టులతోడను పరిహాసము లాదకుము.

69.పతికడకుc, తనుc గూర్చిన
సతికడకును, వెల్పుcకడకు, సద్గురు కడకున్
సుతుకడకును రిత్తచేతుల
మతిమంతులు చనరు, నీతి మార్గము సుమతీ!

భావం: నీతి ప్రవర్తన గలవారు, రాజు దగ్గరకును, తనను ప్రేమించిన భార్య దగ్గరకును, దేవుని సముఖమునకును, గురువు కడకును, కుమారుని దగ్గరకును వట్టి చేతులతో వెళ్ళరు.

70.పరసతి కూటమిc గోరకు,
పరధనముల కాసపడకు, పరునెంచకుమీ,
సరిగాని గోష్టి చేయకు,
సిరిచెడి చుట్టంబుకడకు జేరకు సుమతీ!

భావం: పరసతుల పొందు గొరకుము. ఇతరిఉల భాగ్యమున కాసపడకుము. పరుల తప్పు లెంచకుము. తగనటువంటి ప్రసంగము చేయకుము. ఐశ్వర్యము కొల్పోయిన కారణముగా బంధువుల వద్దరు వెళ్ళకుము.

71.పరుల కనిష్టము సెప్పకు
పొరుగిండ్లకుc బనులు లేక పోవకు మెపుడున్
బరుc గలిసిన సతి గవయకు
మెరిcగియు బిరుసైన హయము నెక్కకు సుమతీ!

భావం: ఇతరులకు యిష్టముగానిదానిని మాట్లాదబొకుము పనిలేక ఇతరుల ఇండ్ల కెన్నడుగా వెళ్ళకుము. ఈతరులు పొందిన స్త్రీని పొందకుము. పెంకితనము గలిగిన గుఱ్ఱము నెక్కకుము.

72.పర్వముల సతుల గవయకు,
ముర్వీశ్వరు కరుణ నమ్మి యుబ్బకు మదిలో,
గర్వింపc నాలి బెంపకు,
నిర్వాహము లేనిచోట నిలువకు, సుమతీ!

భావం: పుణ్య దినము లందు స్త్రీలను పొందకుము. రాజు యొక్క దయను నమ్మి పొంగకుము. గర్వించు నట్లుగా భార్యను పోషింపకుము. బాగుపడలేనిచోట యుండకుము.

73.పాలను గలసిన జలమును
బాలవిధంబుననె యుండు బరికింపంగా,
బాలచవిc జెరుచు, గావున
తాలసుcడగువానిపొందు వలదుర సుమతీ!

భావం: పాలతో గలిపిన నీరు పాల విధముగానే యుండును. కాని శోధించిచూడగా పాలయొక్క రుచిని పోగొట్టును. అట్లేచెడ్దవారితోస్నహము చెసిన మంచి గుణములు పోవును. కావున, చెడ్డావారితో స్నేహము వద్దు.

74.పాలసునకైన యాపద
జాలింపబడి తీర్చదగదు సర్వజ్ఞువకున్
దే లగ్ని బడగ బట్టిన
మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ!

భావం: అన్నియును తెలిసిన వాడయినను; తేలు నిప్పులొ బడినపుడు విచారమునొంది, దానిని రక్షించుటకై పట్టుకొన్నచొ, అది మేలు నెంచక కుట్టును. అట్లే, దుర్జనునకు కీడు వచ్చినప్పుడు జాబితో రక్షించినచో వాడు తిరిగి కీడు చేయును.

75.పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని గనుకొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొదుర సుమతీ!

భావం: తండ్రికి కుమారుడు పుట్టగానే పుత్రుడు గల్లుట వలన వచ్చు సంతోషము గలుగదు. ప్రజలు ఆ కుమారుని జూచి మెచ్చిన రోజుననే ఆ సంతోషము కలుగును.

76.పెట్టిన దినముల లోపల
నట్టడవులకైన వచ్చు నానార్థములున్
బెట్టని దినములc గనకపు
గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ!

భావం: పూర్వ జన్మమున తాను దాన మిచ్చిన ఫలకాలమం దరణ్య మధ్య నున్నప్పటికినీ సకల పదార్ధములు కలుగును. పూర్వ జన్మమున దానమియ్యకున్నచొ తాను బంగారుకొండ నెక్కినను ఏమియు లభించదు.

77.పొరుగునc బగవాడుండిన
నిరనొందcగ వ్రాcతకాcడె యేలికయైనన
ధరగాcపు గొండెయైనను
గరణులకు బ్రతుకులేదు గదరా సుమతీ!

భావం: ఇంటి పొరుగున విరోధి కాపురమున్ననూ, వ్రాతలొ నేర్పరియైనవాడు పాలకుడైననూ, రైతు చాడీలు చెప్పెడి వాడైననూ కరణములకు బ్రతుకుతెరు వుండదు.

78.బంగారు కుదవc బెట్టకు
నంగడి వెచ్చము లాడకు,
సంగరమునc బాఱిపోకు, సరకుడవైతే
వెంగలితోc జెలిమివలదు వినరా సుమతీ!

భావం: బంగారము తాకట్టుపెట్టకుము. యుద్ధమునందు పారిపోకుము దుకాణము నందు వెచ్చములు అప్పు తీయకుము. అవివేకితో స్నేహము చేయకుము.

79.బలవంతుcడ నాకేమని
బలువురతో నిగ్రహించి పలుకుటమేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేతcజిక్కి చావదె సుమతీ!

భావం: బలము కలిగిన పాము ఐనప్పటికినీ చలి చీమలచేత్ బట్టుబడిచచ్చును. అట్లే దాను బలవంతుడనే గదా అని అనేకులతొ విరోధ పడెనేని తనకే కీడు వచ్చును.

80.మండలపతి సముఖంబున
మెండైన ప్రధానిలేక మెలగుట యెల్లన్
గొండంత మదపుటేనుcగు
తొండము లేకుండినట్లు తోచుట సుమతీ!

భావం: కొండంత ఏనుగునకు తొండములేనిచో ఎట్లునిరర్ధకమొ, అట్లే రాజుయొక్క సముఖన సమర్ధతగల మంత్రిలేనిచో రాజ్యము నిరర్ధకము.

81.మాటకుc బ్రాణము సత్యము,
కోటకుc బ్రాణంబు సుభట కోటి, ధరిత్రిన్
బోటికిc బ్రాణము మానము,
చిటికిc బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!

భావం: మాతకు సత్యమును; కొతకు మంచి భటుల సమూహమును, స్త్రీకిసిగ్గును, ఉత్తరమునకు చేప్రాలు (సంతకము) జీవనములు

82.మానధను డాత్మధృతి చెడి
హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్
మానెండు జలము లోపల
నేనుగు మెయిదాచినట్టు లెరుగుము సుమతీ!

భావం: అభిమానసంతుడు ధేర్యము తొలగి నీచుని సేవించుత కొంచెము నీళ్ళలో ఏనుగు శరీరమును దాసుకొను విధముగా నుండును.

83.మేలెంచని మాలిన్యుని,
మాలను, నగసాలెవాని, మంగలిహితుగా
నేలిన నరపతి రాజ్యము
నేల గలసిపోవుగాని నెగడదు సుమతీ!

భావం: ఉపకారము తలపొయవి పాపాత్ముని, మాలను, కంసాలిని, మంగలిని వీరలను స్నేహితులుగా చేసుకున్న రాజుయొక్క రాజ్యము నశించునే గాని వృద్ధి పొందరు.

84.రూపించి పలికి బొంకకు,
ప్రపగు చుట్టంబు కెగ్గు పలుకకు, మదిలో
గోపించు రాజుc గొల్వకు
పాపపు దేశంబు సొరకు, పదిలము సుమతీ!

భావం: రూఢి చేసి మాట్లాడిన తరువాత అబ్ధమాడకుము. సహాయముగా నుండు బంధువులకు కిడు చేయకుము. కోపించే రాజును సేవింపకుము. పాపాత్ము లుండెడి దేశమునకు వెళ్ళకుము.

85.వఱదైన చేను దున్నకు
కఱవైనను బంధుజనులకడ కేగకుమీ,
పరులకు మర్మము సెప్పకు,
పిఱికికి దళవాయితనము బెట్టకు సుమతీ!

భావం: వరద వచ్చే పొలమును వ్యవసాయము చేయకుము, కరువు వచ్చినచొ చుతముల కరుగకుము. ఇతరులకు రహస్యము చెప్పకుము. భయము గలవాడికి సేవా నాయకత్వము నీయకుము.

86.వరిపంటలేని యూరును,
దొరలుండని యూరు, తోడు దొరకని తెరువున్,
ధరను బతిలేని గృహమును,
నరయంగా రుద్రభూమి యనదగు సుమతీ!

భావం: వరిపంటలేని యూరును, అధికారియుండని గ్రామమును, తోడుదొరకని మార్గమును, యజమానుడులేని ఇల్లును వల్లకాడుతో సమానము.

87.వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపcదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుcడెపో నీతిపరుcడు మహిలో సుమతీ!

భావం: ఎవ్వరు చెప్పిననూ వినపవచ్చును. వినగానే తొందర పడక నిజమో అబ్ధమో వివరించి తెలిసికొనినవాడే న్యాయము తెలిసినవాడ.

88.సరసము విరసము కొఱకే
పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే
పెరుగుట విరుగుట కొఱకే
ధర తగ్గుట హెచ్చు కొరకె తథ్యము సుమతీ!

భావం: హాస్యము లాడుట నిరోధము గల్గుటకే, మిక్కిలి సౌఖ్యములనుభవించుట పెక్కు కష్తముల నొందుటకే, అధికముగా పెరుగుట విరుగుతకొరకే, ధర తగ్గుట అధికమగుత. నిజమగు కారణము లగును.

89.సిరిదా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరిదాcబోయిన బోవును
కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!

భావం: సంపద కలుగునప్పుడు కొబ్బరి కాయలొనికి నీరువచ్చు విధముగానే రమ్యముగా కలుగును. సంపదపోవునపుడు ఏనుగు మ్రింగిన వెలగపండులోని గుంజు మాయమగు విధముసనే మాయమయిపోవును.

90.స్త్రీలయెడల వాదులాడకు
బాలురతోc జెలిమిచేసి భాషింపకుమీ
మేలైన గుణము విడువకు
ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!

భావం: ఎన్నడును స్త్రీలతో వివాదములాడకుము, బాలురతో స్నేహము చేసి మాటలాడకుము, మంచి గుణములు వదలకుము; పాలించు యజమానుని దూషింపకుము.

91.తన కోపమే తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌc
తన సంతోషమె స్వర్గము
తనదుఖఃమె నరక మండ్రు, తథ్యము సుమతీ!

భావం: తన యొక్క కోపము శత్రువు వలె భాధయును, నెమ్మది తనము రక్షకునివలె రక్షయును, కరున చుట్టమువలె ఆదరమును, సంతోషము స్వర్గములవలె సుఖమును, దుఃఖము నరకమువలె వేదనను కల్గించునని చెప్పుదురు.

92.దగ్గర కొండెము సెప్పెడు
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మఱి తా
నెగ్గు బ్రజ కాచరించుట
బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీ!

భావం: దగ్గర నున్న మంత్రి చెప్పు చాడీఈలను విని; రాజు యిష్టపడి; ప్రజలకు కీడు చేయుట అనునది; కోరిన కోరికల నిచ్చు చెట్టును బొగ్గులకై నరకుటతో సమానముగా నుండును.

93.త్రిగలవాని రాజ్యము
మంత్రము సెడకుండ నిలుచుc దరుచుగ ధరలో
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపుంగీ లూడినట్లు జరుగదు సుమతీ!

భావం: మంత్రి యున్న రాజు యొక్క రాజ్యము, కట్టుబాటు చెడిపోకుండా జరుగును. మంత్రి లేని రాజు యొక్క రాజ్యము కీలూడిన యంత్రము వలె నడువదు.

94.లావుగల వానికంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాc డెక్కినట్లు మహిలో సుమతీ!

భావం: కొండ అంతటి ఏనుగును మావటివా డెక్కి లోబరచుకొనునట్లే లావుగలిగిన వాడికంటెను, నీతిగల్గినవాడు బలవంతుడగును.