51.భవిష్యవాణి

ముగ్గురు జ్యోతిషులు ఒకచోట కలుసుకున్నారు.
‘వచ్చే ఏడాది విపరీతమైన వరదలు వస్తాయి.
వాటిని తల్చుకుంటేనే చెమటలు పడుతున్నాయి’
అంటూ భవిష్యవాణి పలికాడు ఒక జ్యోతిషుడు.
‘అవును వచ్చే ఏడు ఎండలు కూడా చాలా తీవ్రంగా
ఉండబోతున్నాయి. ఊహించుకుంటేనే వడదెబ్బ కొడుతోందనుకో’
అంటూ బడాయికి పోయాడు రెండో జ్యోతిషుడు.
‘కంగారుపడకండి! వచ్చే ఏడాదికి మీరు ఇద్దరూ ఉండరు’
అంటూ భరోసా ఇచ్చాడు మూడో జ్యోతిషుడు.

52.అపార్థం

ఆ హైవే మీద వాహనాలన్నీ సర్రు సర్రున
దూసుకుపోతున్నాయి. కానీ సుబ్బారావు కారు మాత్రం
పది కిలోమీటర్ల స్పీడులోనే నడుస్తోంది. ‘ఎందుకంత
నిదానంగా వెళ్తున్నారు?’ అని అడిగాడు చెక్‌పోస్టు
దగ్గర ఉన్న పోలీసు.
‘రోడ్డు పక్కనే 10 అన్న బోర్డు కనిపించింది.
అది స్పీడ్‌ లిమిట్‌ ఏమో అనుకుంటున్నాను’
వివరించాడు సుబ్బారావు.
‘భలేవారే! అది హైవే నెంబరు. మీరు దాన్ని స్పీడ్‌
లిమిట్‌ అని పొరపాటుపడ్డారు’ అని నచ్చచెప్పాడు పోలీసు.
ఇంతలో కారు వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు ముసలమ్మలు బిక్కచచ్చిపోయి కనిపించారు. ‘ఎందుకని మీరంతగా భయపడిపోయి కనిపిస్తున్నారు’ అంటూ ఆసక్తిగా అడిగాడు పోలీసు. ‘ఇందాకే మేము 150 నెంబరు హైవే నుంచి వచ్చాం’ అంటూ భోరుమన్నారా బామ్మలు.

53.పరమార్థం

లెక్చరర్‌: ప్రతి మగవాడి విజయం వెనుకా ఒక
స్త్రీ ఉంటుంది. దీన్ని బట్టి మీకేం తెలుస్తోంది?
స్టూడెంట్‌: ఈ చదువులన్నీ కట్టిపెట్టి, ఓ మంచి
అమ్మాయిని వెతకాలని అర్థం అయ్యింది.

54.ఎడబాటు

జైలర్‌: నీకు మరణశిక్ష విధించేలోగా ఎవరైనా ఒక
వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ఎవరు కావాలి?
ఖైదీ: నా భార్యని పిలిపించండి!
జైలర్‌: అదేంటి, నీకు తల్లికంటే భార్యే ఎక్కువైందా?
ఖైదీ: అబ్బే అదేం లేదు. మళ్లీ జన్మంటూ ఉంటే,
పుట్టిన వెంటనే నా తల్లిని చూస్తాను. కానీ వచ్చే
జన్మలో మా ఆవిడని చూడాలంటే 21 ఏళ్లు ఆగాలి కదా!!!

55.ఉపాయం

చిన్ను: నేను ఏ ఆయుధమూ వాడకుండా
పులిని చంపగలను.
మిన్ను: అసాధ్యం. లక్షరూపాయలు పందెం!
చిన్ను: ఎందుకు కుదర్దు. ఓ సీసాడు సైనేడు
మింగి పులి ముందు పడుకుంటే సరి.
అది ఫుడ్‌ పాయిజనింగ్‌తో చచ్చిపోతుంది.

56.ఏమో మరి!

బార్య: నాకేమన్నా జరిగితే...
భర్త: అంతమాట అనకు. నేను పిచ్చివాడిని అయిపోతాను.
భార్య: అంటే రెండో పెళ్లి చేసుకోరా?
భర్త: ఏమో పిచ్చివాళ్లు ఏమైనా చేయొచ్చు కదా!!!

57.లాస్ట్‌ ఛాన్స్‌

ఆశారావ్‌: నాకు పిల్లులు ఫుట్‌బాల్
‌ మ్యాచ్‌ ఆడుతున్నట్టు కలలు వస్తున్నాయి.
డాక్టర్‌: మరేం ఫర్వాలేదు! ఈ టాబ్లెట్‌ వేసుకో.
ఇవాల్టి నుంచి నీకు ఆ కల రావడం ఆగిపోతుంది.
ఆశారావ్‌: మీరేమీ అనుకోనంటే, ఈ టాబ్లెట్‌
రేపు వేసుకోవచ్చా! ఇవాళ ఫైనల్‌ మ్యాచ్‌ ఉంది.

58.నాలుగోవాడే!

గోపాలరావు: నాకు నలుగురు కొడుకులు. వాళ్లలో ముగ్గురు
చక్కగా డిగ్రీ పాసయ్యారు. నాలుగోవాడే ఉత్త మొద్దు.
ఏ పనీ చేతకాక కూలిపనికి కుదిరాడు.
నాగభూషణం: ఛీ ఛీ! అలాంటివాడిని ఏం చేసినా పాపం
లేదు. వాడిని ఇంట్లోంచి తరిమెయ్యకపోయావా!
గోపాలరావు: అలా ఎలా కుదురుతుంది.
మా అందరినీ పోషిస్తోంది వాడే కదా!!!

59.ఆలస్యం

‘డార్లింగ్‌! మనం ఫంక్షన్‌కి ఆలస్యం అయినట్టున్నాం’
‘ఎలా చెప్పగలుగుతున్నారు’
‘ఫంక్షన్‌కి వెళ్లినవాళ్లంతాఎదురొస్తున్నారు’
‘మీ మొహం! ముందా కారుని రాంగ్‌ వేలో తోలడం ఆపండి’

60.పాలసీ మేటర్‌

ప్రయాణికుడు: నువ్వు నా జేబులో చెయ్యెందుకు పెట్టావు?
శేఖర్‌: అబ్బే! ఊరికనే. అగ్గిపెట్టె తీసుకుందామనే!
ప్రయాణికుడు: ఆ మాటే నన్ను అడగొచ్చు కదా!
శేఖర్‌: నేను ముక్కూమొహం తెలియనివారితో
మాట్లాడను బాబూ!

Pagination Example

తదుపరి