Subscribe

81.రాయడం వచ్చుగానీ

ఆయుష్‌: అమ్మా! ఇవాళ నాకు బడిలో అక్షరాలు
రాయడం నేర్పించారు తెలుసా!

అమ్మ: వెరీ గుడ్‌! ఏం రాశావు?
ఆయుష్‌: ఏమోనమ్మా! నాకింకా చదవడం నేర్పలేదు కదా!!!

82.అందుకనే...

సందేహం: మీ ఆవిడ ఎప్పుడూ కోపంగా ఉంటుంది. ఎందుకు?

జవాబు: ఓసారి పొరపాటున ‘నువ్వు కోపంలో ఇంకా అందంగా
ఉంటావు డార్లింగ్‌’ అన్నాను. అప్పటి నుంచి అదే వరస!!!

83.త్వరగా... త్వరగా

సన్నీ, బన్నీ అడవిలో వెళ్తున్నారు. ఇంతలో ఓ ఎలుగుబంటి
వాళ్లని చూడనే చూసింది. చూసీ చూడగానే వెంటపడటం
మొదలుపెట్టింది. వెంటనే సన్నీ తన బ్యాగ్‌లో ఉన్న
రన్నింగ్‌ షూస్‌ తీసి వేసుకోవడం మొదలుపెట్టాడు.
బన్నీ: నీ తెలివి తెల్లారినట్టే ఉంది. రన్నింగ్‌ షూస్‌ వేసుకుని
పరిగెత్తితే మాత్రం ఎలుగుబంటి నిన్ను పట్టుకోలేదనుకుంటున్నావా!
సన్నీ: నేను షూస్‌ వేసుకుంది ఎలుగుబంటి కోసం కాదు....
నీకంటే వేగంగా పరిగెత్తడం కోసం

84.బహుమతి

హైవే మీద వస్తున్న ఓ కారుని ఆపాడు పోలీసాఫీసరు.
‘ఈ హైవే మీద అడుగుపెట్టిన లక్షో వాహనం మీది. అందుకే మీకు
వెయ్యి రూపాయలు బహుమతిగా ఇస్తున్నాం.
ఈ డబ్బుతో మీరేం చేస్తారు?’ అంటూ ఆసక్తిగా అడిగాడు.
‘వెంటనే డ్రైవింగ్‌ లైసెన్సుకి అప్లై చేస్తాను’
కంగారుగా చెప్పాడు కారు దిగిన రాంబాబు.
‘అయ్యో మీరు ఆయన మాటలు నమ్మకండీ. అసలే
తాగి ఉన్నారు’ అని సర్దిచెప్పబోయింది పక్కనే ఉన్న వాళ్లావిడ.
‘పోలీసులు ఆపుతారని భయపడే, కారు దొంగతనం
చేయొద్దని మొత్తుకున్నాను’ అని వెనకాల సీట్లోంచి అరిచింది చెవిటి ముసలమ్మ.
ఈ మాటలన్నీ విన్న పోలీసాఫీసరు బిత్తరపోయి
చూస్తుండగా కారు డిక్కీలోంచి ఒక గొంతు వినిపించింది-
‘కారు ఆగిపోయిందేంటీ? అంటే మనం బోర్డరు దాటేశామా!’

85.అనుభవం

ఓ పెద్దాయన పార్కులో నడుచుకుంటూ వెళ్తున్నాడు.
ఇంతలో ఆయనకి ఓ మాట్లాడే కప్ప కనిపించింది-
‘మీరు నన్ను ముద్దు పెట్టుకుంటే, అందమైన రాకుమారిగా మారిపోయి
మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను’ అంది కప్ప.
పెద్దాయన మాట్లాడకుండా కప్పని సంచిలో వేసుకుని
బయల్దేరాడు. ‘అదేంటీ. నేను అందమైన రాకుమారిలా
మారిపోతానని చెప్పాను కదా! ముద్దు పెట్టుకోవేం’ అని అడిగింది కప్ప.
‘చూడూ! ఈ వయసులో నాకు రాకుమారితో కంటే
మాట్లాడే కప్పతోనే బాగా కాలక్షేపం అవుతుంది.
నీకు ఎవర్ని ఏమడగాలో తెలియదా! ఇక నుంచీ నా సంచిలోనే ఉండి
కబుర్లు చెబుతూ ఉండు’ అని విసుక్కున్నాడు ఆ పెద్దాయన.

86.స్పోకెన్‌ ఇంగ్లిష్‌

భార్య: ఏమండీ! మిమ్మల్నే! డిన్నర్‌ చేద్దురుగాని రండి.

భర్త: నీ ఇంగ్లిష్‌ ఏడ్చినట్లే ఉంది.
ఇది మధ్యాహ్నం. ఇప్పుడు తినేదాన్ని లంచ్‌ అంటారు.
రాత్రి తినేదాన్ని డిన్నర్‌ అంటారు.

భార్య: మీ తెలివి మండినట్లే ఉంది. నిన్న
రాత్రి మిగిలిందే ఇప్పుడు పెడుతున్నాను.

87.అదీ విషయం

టీచర్‌: క్లాసుకి ఎందుకింత ఆలస్యం అయ్యింది?

చింటూ: ఒకాయన ఐదొందల నోటు కోసం వెతుక్కుంటున్నాడు మేడం.

టీచర్‌: గుడ్‌! నువ్వు ఆయనకి వెతకడంలో సాయం చేశావన్నమాట!

చింటూ: అబ్బే లేదు. ఆ ఐదొందల నోటు మీద నిలబడి ఉన్నాను.

88.సహకారం

నువ్వు గొప్ప డాన్సర్‌వే! కాకపోతే ఆ రెండూ
నీకు సహకరించడం లేదు.
ఏంటా రెండూ? నీ కాళ్ళు

89.అదే రేటు

ఓసారి బాబూరావు జిలేబీల దుకాణానికి వెళ్లాడు.
అక్కడ ఓ పావుకిలో జిలేబీ గుటుకూ గుటుకూ తినేశాడు.
డబ్బులు అడిగితే మాత్రం ఖాళీ జేబు చూపించాడు.
షాపు వాడికి ఒళ్లు మండిపోయింది. ‘ఈ వెధవకి ఓ
నాలుగు దెబ్బలు తగిలించి అవతలికి గెంటెయ్‌!’
అని నౌకరుకి పురమాయించాడు. నౌకరు ఓ నాలుగు దెబ్బలు
వేసి బాబూరావును దుకాణంలోంచి తోసేశాడు.

బాబూరావు లేచి నిలబడ్డాడు. ఒంటికి అంటిన మట్టిని
జాగ్రత్తగా దులుపుకుంటూ మళ్లీ దుకాణంలోకి అడుగుపెట్టాడు.
‘ఇప్పుడిచ్చిన రేటుకే ఓ అరకిలో జిలేబీ పార్సిల్
‌ కట్టివ్వరా!’ అని ఆశగా అడిగాడు.

90.కలగాపులగం

సుందరం మొట్టమొదటిసారి ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్లోకి
అడుగు పెట్టాడు. ఓ టేబుల్‌ దగ్గర కూర్చుని భయంభయంగా టీ
ఆర్డర్‌ చేశాడు. వేడి నీళ్లు, టీ పొడి, పాలు, పంచదార..
అన్నీ ఒక పళ్లెంలో పెట్టుకొని, సుందరం ముందు ఉంచాడు సర్వరు.
ఓ పావుగంట పాటు తంటాలు పడి ఎలాగోలా టీ చేసుకుని తాగాడు సుందరం.

‘ఇంకా ఏమన్నా తీసుకురమ్మంటారా సర్‌!’
అని అడిగాడు సర్వరు. సుందరం
తటపటాయిస్తూ- ‘బిర్యానీ తినాలని ఉంది కానీ....
ఇప్పుడు వద్దులే! నాకు బిర్యానీ వండుకోవడం
రాదుకదా!’ అంటూ బయల్దేరిపోయాడు.

Pagination Example

తదుపరి