Subscribe

పేజీ సంఖ్య - 08

సందిగ్ధం

భార్య: ఏమండీ! మన వంటింట్లోకి దొంగ దూరాడండీ!
నేను చేసిన బిర్యానీ కూడా తినేశాడని అనుమానంగా ఉంది!
భర్త: అయితే మనం ఇప్పుడు
పోలీసులని పిలవాలా? ఆంబులెన్సుని పిలవాలా?

అకౌంట్‌ క్లోజ్‌

బ్యాంక్‌ మేనేజర్‌: అకౌంట్‌ క్లోజ్‌ చేయాలనుకుంటున్నారా! ఎందుకలా!
వీరబాహు: నిన్న రాత్రి ఎవరో నన్ను హత్య చేసినట్లు కల వచ్చింది.
మేనేజర్‌: దానికీ అకౌంటుకీ ఏంటి సంబంధం?
వీరబాహు: ‘మీ కలలను నిజం చేస్తాం’ అని కదా మీ స్లోగన్‌.

సంతోషించక

‘సిగ్గు లేదూ! వందకి అయిదు మార్కులు వచ్చినా
పళ్లికిలిస్తున్నావు?’
‘ఖాళీ పేపర్‌కి అయిదు మార్కులు వేస్తే
సంతోషపడరా ఏంటి మేడం!’

మళ్లీ మొదలా!

మురళి: డిగ్రీలో మళ్లీ ఫెయిలయ్యానురా! ఆ బాధతో
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను కానీ ఆగిపోయాను.

రవి: గుడ్‌. నీకు గుండె ధైర్యం ఎక్కువే!

మురళి: ధైర్యమా పాడా! వచ్చే జన్మంటూ ఉంటే
మళ్లీ ఎల్‌కేజీ నుంచి చదవాలి కదా!!!

ప్రేమకి ఎన్ని అర్థాలో

ఎనిమిదేళ్ల పిల్లవాడు: ఐ లవ్యూ మమ్మీ.
తల్లి: ఐ లవ్యూ టూ కన్నా!
పదహారేళ్లప్పుడు: ఐ లవ్యూ మమ్మీ.
తల్లి: సారీ బాబూ! నా దగ్గర డబ్బులు లేవు.
ఇరవై నాలుగేళ్లకి: ఐ లవ్యూ మమ్మీ.
తల్లి: ఎవర్రా అదీ... ఎక్కడుంటుందీ!
ముప్పై రెండేళ్లు: ఐ లవ్యూ మమ్మీ.
తల్లి: నేను అప్పుడే చెప్పానా! ఆ పిల్లని చేసుకోవద్దని.
నలభై ఏళ్లు వచ్చాక: ఐ లవ్యూ మమ్మీ.
తల్లి: చూడూ! నేను ఏ పేపరు మీదా సంతకం పెట్టేది లేదు.

కాదనగలరా?

టీచర్‌: ఈ ప్రపంచంలో అన్నిటికంటే
ప్రాచీనమైన జంతువు ఏది?
చందు: జీబ్రా
టీచర్‌: ఎందుకని అలా అనిపించింది.
చందు: ఎందుకంటే జీబ్రా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో
ఉంటుంది కాబట్టి!!!

ఏర్పాట్లు

స్నేహితుడు: ఇంకో రెండు రోజుల్లోనే పెళ్లి కదా!
ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి?
పెళ్లికొడుకు: భేషుగ్గా జరుగుతున్నాయి. నా రెండు సిమ్‌లూ
తీసి కాలువలో పారేశాను. ఫోను ఫార్మాట్‌ చేశాను.
లాప్‌టాప్‌లో ఉన్న ప్రైవేటు ఫోల్డరుని డిలీట్‌ చేసేశాను.
ఫేస్‌బుక్‌ నుంచి బయటకి వచ్చేశాను. వాట్సాప్‌ని వదిలించుకున్నాను.
ఇక పెళ్లికి నేను సిద్ధం.

పాజిటివ్‌ యాటిట్యూడ్‌

‘మా తాతగారు నాకోసం యాభై లక్షలు
వదిలిపెట్టి చనిపోయారు తెలుసా!’
‘అదేమంత గొప్ప విషయం! మా తాతగారు నా కోసం
ప్రపంచాన్నే వదిలిపెట్టి చనిపోయారు తెలుసా!!’

అక్కడి దాకా వెళితే....

గిరిబాబు: డాక్టర్‌! మా ఆవిడ మెమరీ కార్డు మింగేసింది.
అందులో మ్యూజిక్‌ ఫోల్డరులో ఉన్న పాటలన్నీ పాడుతోంది.
డాక్టర్‌: మరీ మంచిది. ఇందులో బాధపడాల్సింది ఏముంది?
గిరిబాబు: రేపో మాపో! వీడియో ఫోల్డర్‌ ఓపెన్‌ అయితే
ఏం జరుగుతుందా అనీ.....

నిజమే!

భార్య: మీరు ఎంత అమాయకులండీ! ఎవరైనా
మిమ్మల్ని వెధవాయిని చేసేయగలరు.
భర్త: నిజమే! ఆ విషయాన్ని ముందు
కనిపెట్టింది మీ నాన్నే!

Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య - 08

Responsive Footer with Logo and Social Media