పేజీ సంఖ్య - 07
వెళ్లొచ్చా
టీచర్: నేను అడగబోయే ప్రశ్నకి ఎవరైతే మొదట
జవాబు చెబుతారో, వాళ్లు ఇంటికి వెళ్లిపోవచ్చు.
ఇంతలో ఒక ఈల వినిపించింది.
టీచర్: ఎవర్రా ఆ ఈల వేసిందీ!
చింటూ: నేనే మేడం. మీ ప్రశ్నకి జవాబు చెప్పినట్లేగా.
ఇక నేను ఇంటికి వెళ్లొచ్చా?
తెలుసా
రాజు: రెండు కళ్లూ మూసుకున్నా కూడానాకు కనిపిస్తుంది తెలుసా!
రాణి: వావ్! ఏం కనిపిస్తుంది?
రాజు: ...... చీకటి.
ఇద్దరూ ఇద్దరే
పరమానందం తన మిత్రుడితో కలిసి క్రికెట్
మ్యాచ్ చూసేందుకు వెళ్లాడు. మ్యాచ్ మొదటి
ఓవర్లోనే ఆటగాడు సిక్స్ కొట్టాడు.
పరమానందం: వాహ్... భలే గోల్ కొట్టాడు కదూ!
మిత్రుడు: నీ మొహం. అది గోల్ కాదు సిక్స్.
గోల్‌ని క్రికెట్‌లో కొడతారు!!!
ఉక్రోషం
జనం- పాపం ఎందుకతన్ని కొడుతున్నారు?
వీరబాహు - కొట్టాలా? కొయ్యాలా? ఇతను మా ఆవిడ
మనసులో లేనిపోని ఆశలు కల్పిస్తున్నాడు.
జనం - ఎవరతను? ఏంచేశాడు?
వీరబాహు - నేను పోతే ఎంత లాభమో మా ఆవిడకి
చెబుతున్నాడు. ఎంత బీమా ఏజంటైతే మాత్రం....
ఓ పరిశీలన
అడుక్కుతినేవాడంటే సమాజానికి ఎంత అభిమానం!
అందరూ ‘ముందుకి వెళ్లమని’ ప్రోత్సహించేవారే!!
పగ... పగ... పగ
ఒక పెద్దాయన రోజంతా పార్కులో కూర్చుని కనిపించేవాడు.
‘రోజూ ఇక్కడ కూర్చోవడం వల్ల ఏంటి
లాభం!’ అని అడిగాడుఓ పేరయ్య.
పెద్దాయన: నేను కూర్చునీ కూర్చునీ పగ తీర్చుకుంటున్నాను
పేరయ్య: ఎవరి మీద
పెద్దాయన: కాలం నా జీవితాన్ని నాశనం చేసింది.
అందుకని నేను ఇప్పుడు కాలాన్ని నాశనం చేస్తున్నాను
అవసరమా!
సుబ్బారావు: జడ్జిగారూ! మా ఆవిడ నుంచి
విడాకులు కావాలంతే!
జడ్జి: కారణం!
సుబ్బారావు: ఓ ఏడాది నుంచి ఆవిడ నాతో
మాట్లాడటమే లేదు.
జడ్జి: ఇంకోసారి ఆలోచించుకో! అంత ప్రశాంతమైన
కాపురం నీకెక్కడా దొరకదు.
అలవాటు
వెంగళాయ్ తన ఆరునెలల పిల్లవాడికి పుట్టినరోజు
చేస్తున్నాడు.
‘అదేంటి! ఇంకా ఏడాది నిండకముందే పుట్టినరోజు
చేస్తున్నారు’ అని అడిగారు ఇరుగుపొరుగు.
‘పెద్దయ్యాక వాడిని ఇంజనీరు చెయ్యాలనుకుంటున్నాను.
అందుకే ఇప్పటి నుంచి సెమిస్టరు విధానం అలవాటు
చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు వెంగళాయ్
కమింగ్ సూన్
వార్త- ఆ హీరోగారి వెయ్యో చిత్రం విడుదల అవుతోంది.
పోస్టరు మీద ఇంతెత్తు హీరో బొమ్మ ముద్రించి
, దాని కింద ‘కమింగ్ సూన్’ అని రాశారు.
దాన్ని ఊరంతా అంటించారు. అయినా
హీరోగారు అలిగారు. కారణం....
పనిలో పనిగా.... ‘కమింగ్ సూన్’ పోస్టరుని
శ్మశానంలో కూడా అతికించేశారు.
అదే.. వస్తుందిలే!
హరి: మా ఓనరు చనిపోయాడు. అంతా ఒకటేఏడుపు. కానీ నాకేమో నవ్వొస్తోంది.
ఎవరన్నా చూస్తే బాగోదు కదా!
గిరి: ఓస్ అంతేనా! మీ ఓనరు మళ్లీ
తిరిగొచ్చినట్లుగా ఊహించుకో. ఏడుపు అదే తన్నుకొస్తుంది.